ప్రపంచ దేశాల సారస్వతం 31-నికారుగ్వన్ సాహిత్యం

పోస్ట్ కొలంబియన్ నికారుగ్వా లో మొట్టమొదటి రచనగా ‘’ఎల్ గూగునేస్’’ గా భావిస్తారు .ఇదేసంగీత నృత్యనాటక సమాహారమైన లాటిన్ అమెరికా నికారుగ్వా జానపద సాహిత్యం .దీన్ని 16వ శతాబ్ది అజ్ఞాత కవి రాశాడు .అదే పశ్చిమార్ధగోళం లోని రచన .అది మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెంది 1942లో మొదటిసారిగా పుస్తక రూపం లో ప్రచురింపబడింది

  ఇక్కడ మోడరనిస్మో అనే స్పానిక్ –అమెరికన్ సాహితీ ఉద్యమ౦ 19వ శతాబ్ది మలి దశలో బయల్దేరి ‘’రూబెన్ డేరియో’’ కవి చేత విస్త్రుతమైనది .ఈకవినే ‘’ఫాదర్ ఆఫ్ మోడర్నిజం ‘’అని గౌరవంగా పిలుచుకొంటారు .ఇందులో మూడు స్రవంతులు –రొమా౦టిజం ,సింబాలిజం ,పార్నస్సియనిజం కలిసి ఉన్నాయి .మనోభావాలు ,పాషన్లుఅంటే భావా వేశాలు ఏకస్వరాలనే హార్మనీలు ,దృష్టి అంటే విజన్ లు ,లయలు అన్నీ మహా విశిష్టంగా ,అద్భుత శైలీ విన్యాసాలతో  వాచ్య సంగీతంగా ఇందులో దర్శనమిస్తాయి .ఈ ఉద్యమ౦ ఫిలిప్పీన్స్ తో సహా   స్పానిష్ భాష మాట్లాడే దేశాలన్నిటిలో విస్తృత వ్యాప్తి చెంది,ప్రభావం కలిగించింది .కళాభిరుచి సౌందర్యారాధన లకు ఉద్దీపనకలిగించింది .

   ఈ మోడర్నిస్మో ఉద్యమమే నికారుగ్వా బాహ్య ప్రపంచం పై అత్యంత ప్రభావం చూపింది .ఇదే అసలు సిసలు లాటిన్ అమెరికా సాహిత్యంగా ముద్రవేసుకొన్నది .ఇందులో సౌందర దృష్టి ఎక్కువగా ఉన్నాకూడా కొందరు కవులు సమకాలీన సంఘం పై రచనలు చేశారు సమస్యలు చర్చించారు .20వ శతాబ్దం వచ్చేసరికి కవిత్వ౦ అంతా రాజకీయమయమైపోయింది .దీనికి కారణం చిలియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ పాబ్లో నెరూడా కవి ప్రభావమే .అతన్ని అనుసరించి కవిత్వం రాసినకవి ఎర్నేస్టో కార్డినల్.

  గ్రనాడా –నికారుగ్వా లో1927-29లో ప్రారంభమైన ‘’వాన్ గార్డియా’సాహిత్య ఉద్యమం ను జోస్ కార్నెల్ ఉర్టేకో కవి ప్రారంభించాడు .1931లో ప్రచురితమైన మానిఫెస్టో ప్రకారం ‘’to initiate a struggle to get the public attention through artistic expressions, intellectual scandal, and aggressive criticism”.[4]

  ఈ ఉద్యమం అనేక యూరోపియన్ సాహిత్య ఉద్యమాలపై ప్రభావం చూపి ‘’సర్రియలిజం ‘’ఆవిర్భవానికి కారణమైంది .వాన్ గార్దియా సాహితీ ఉద్యమం ఆధునిక నూతన ఆలోచనలకు విషయాలకు ,ముఖ్యంగా షాకింగ్ నవలలకు దారి చూపింది .

నికారుగ్వన్ రచయితలో కవులు రచయితలూ వ్యాసకర్తలు జర్నలిస్ట్ లు ,విమర్శకులు మొదలైన వారున్నారు .వారిలో కొందరు –క్లారిబెల్ అల్జీరియా ,ఏమిలో ఆల్వరేజ్ లిజార్జా ,మొన్టాల్వన్,జూన్ బీర్ ,గికోకొండా బిల్లి ,యోలాన్దాబ్లాంకో ,ఏర్నేస్టో కార్డినల్,కార్లీ గేటాన్,జాక్విన్ పాసోస్ ,ఆర్టేన్ సియు ,డైసి జమోరా వగైరా .హిస్టరీ ఆర్కి టేక్చర్ లకు ప్రసిద్ధమైన ‘’గ్రనడా ‘’లో ‘’అంతర్జాతీయ పోయెట్రి ఫెస్టివల్ ‘’2005నుంచి జరుగుతోంది .అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన కవులను సాదరంగా ఆహ్వానించి ఈ ఫెస్టివల్ జరుపుతారు .దీనిలో నికారుగ్వన్ సింగర్స్ కమ్మగా పాటలు కచేరీలతో వీనుల విందు చేస్తారు ‘

  నికారుగ్వా దేశం పసిఫిక్ సముద్రం కరేబియన్ సముద్రాలమధ్య ఉన్న సెంట్రల్ అమెరికన్ దేశం .ఇక్కడి సరస్సులు బాగా ఆకర్షిస్తాయి .అగ్నిపర్వతాలకూ నిలయమే .అందుకే ‘’లాండ్ ఆఫ్ లేక్స్ అండ్ వాల్కనోస్ ‘’అంటారు .రాజధాని మానాగువా  .సెంట్రల్ అమెరికాలో అత్యంత పేద దేశం .దీనికంటే కోస్టారికా సురక్షిత ప్రాంతం .దాదాపు అందరూ రోమన్ కేధలిక్ మతస్తులు .ఇక్కడి ‘’మాకువా ‘’అనే డ్రింక్ ప్రసిద్ధం ఈ దేశం లోని వేడిని తట్టుకొవటానికి ఇది తప్పని సరి ,ఫ్రైడ్ రైస్ ,ఉల్లిపాయ,స్వీట్ పెప్పర్,బీన్స్ ఎక్కువ గా ఆహారం .మాంసం తప్పని సరి .భాష –స్పానిష్ తో సహా అన్నీ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-20-ఉయ్యూరు

— 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.