ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం
కోస్టా రికన్ సాహిత్యం లో 19వ శాతాబ్దిచివర ప్రచురింపబడిన రచనల వరకు 5 సాహిత్య కాలాలున్నాయని (లిటరరీ పీరియడ్స్ )పరిశోధన చేసిన ఆల్వరో కొసేడా సోటోఅనే ప్రొఫెసర్ చెప్పాడు .వీటిని అక్కడ’’ జనరేషన్స్’’అంటారు .ఇవి నిజంగా సాహిత్య దృష్టి తో ఉన్న జేనరేషన్స్ మాత్రం కావు .అవి-
1-ఒలింపస్ జనరేషన్(1890-1920) –ఈకాలం లో జాతీయ స్పూర్తితో కూడిన రచనలు ఎక్కువగా వచ్చాయి .ఆరచయితలు –మాన్యూల్ ఆర్గేల్లా మోరా ,మాన్యూల్ డి జీసస్ జిమెంజ్ ,పియో విన్క్విజ్ ,రాబర్టోబ్రేనెస్ మేసేన్ ,ఆక్వేల్లో ఈకే వార్రియా ,రికార్డో ఫెర్మెండేజ్ గార్దియా ,కార్లోస్ గాగిని ,మాన్యూల్ జెంజలేజ్ జేలెడాన్.
2-రిపెర్టరి జనరేషన్(1920-40)-దీనికీ మాగజైన్ ‘’రిపర్టోరియో అమెర్రికానో డిజాక్విన్ గార్సియా మోన్గే’’కు లింకు ఉంది .ఈ కాలం లో లిబరల్ ఆలిగార్కిక్ పాలనలో సంక్షోభం ఏర్పడి,నూతనభావాలు ,శైలి అంటే గ్రోటోస్కో స్టైల్ భయంకర ,భీభత్స హాస్యం ,పారడి,వ్యంగ్యం విజ్రుమ్భించాయి . ఈ రచయితలు –జాక్విన్ గారిక్ మంగే ,ఒమర్ డెంగో,కార్మెల్ లైరా ,మేరియో సాంచో ,మాక్స్ జిమెంజ్.
3-ది40 స్ జనరేషన్ (1940-1960)-ఈ పీరియడ్ సోషల్ డెమోక్రసీ ఏర్పడింది .ప్రశ్నించటం సమాధానం రాబట్టటాలు జరిగాయి .అనేక సాంఘిక సంస్కరణలు అమలయ్యాయి .కొత్త రాజ్యాంగ స్పూర్తి కలిగింది .రచయితలు సాంఘిక సమస్యలు, భూమిపంపిణి,బహుళజాతి కార్పో రేషన్ల పై రచనలు చేశారు .ముఖ్య రచయితలు-జోస్ బాసిలో అకునా ,ఐజాక్ ఫెలిపి అజోఫీఫా ,ఫేబియన్ డోబెల్స్,కారియోస్ లూయీ ఫల్లాస్ ,జాక్విన్ గిటేర్రెజ్,జూలియన్ మార్కేనా ,యోలాండో ఒరియామునో ,జోస్ మారిన్కానాస్ ,కారియో లూయీ సేన్జ్,కారియోస్ సాల్వజార్ హీర్రేరా ,మోసెస్ విన్సేంజి .
4-ది అర్బన్ జనరేషన్(1960-80)-ఈకాలంలో ఆధునికత , యాంత్రికత చోటు చేసుకొన్నాయి .కనుక నగర జీవితమే అందరికీ కథా వస్తువైంది .రచయితలు –ఆల్బర్టో కానాస్ ,జార్జి చార్పెంటియర్,డేనియల్ గాలేగోస్ ,వర్జీనియా గ్రట్టర్,కార్మెన్ నరంజో ,ఈనిక్ ఓడియో ,శామ్యూల్ రోవెన్స్కి,జోస్ లేనాన్ సాన్చెజ్,లారియానో ఆల్బాన్ ,జూలిఎటా డోబుల్స్ ,జార్జి డెబ్రవో,ఆల్ఫాన్సో చేజ్.
5-డిజెన్చాంట్ మెంట్ జనరేషన్(1980నుండి ఇప్పటి వరకు )-ఈకాలం లో కోస్టా రికా లో కొత్త సాహిత్యం పురుడు పోసుకొన్నది .ఆదినుంచి వస్తున్న సాహిత్యాన్ని నెట్టేసి, వాస్తవికత ప్రవేశించి నేలవిడిచి స్వారి చేసే రచనలు పూర్తిగా మారిపోయి యదార్ధ సంఘటనలకు జీవం పోసి రచనలు చేశారు .ఒకే రకమైన శైలికి స్వస్తి చెప్పి విభిన్నమైన శైలులలో కవిత్వం రచనలు ఆవిర్భవించాయి
20వ శతాబ్దిలో ఆధునికత ప్రవేశించి జీవన విదానాలలో పెను మార్పులు వచ్చాయి .రోబెన్ డోరియో కోస్టారీకాలోనే స్థిరపడి కవిత్వం ,వ్యాసాలురాసి ప్రచురించాడు .ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో కాకుండా కోస్టా రికాలో మోడర్నిజం కు పెద్దగా ఆకర్షణ లేదు .1965తర్వాత పుట్టినకవులు తమ రచనలను 1990తర్వాత మాత్రమె ప్రచురించారు .వీరిలో జువాన్ ఆన్టిలియాన్,మారికో మోలినా డేల్గడో,మొదలైనవారున్నారు .
ప్రసిద్ధ కోస్టారికన్ రచయితలు –రాబర్టోబ్రేనెస్ మేసేన్ –ఎల్ యెన్ సైలేన్సియో కవితలను ,కార్మెన్ లైరా –క్వెంటోస్ డిమి టియా పంచిత,మమితా యునాయ్ మొదలైన నవలలు రాసిన కార్లోస్ ఫలాస్ ,ఎల్ సిటోడి లాస్ ఎబ్రాస్ నవలారచయిత ఫేబియన్ డోబెస్,సీమా డెల్ గోజో కవితా సంపుటి కర్త –ఐజాక్ ఫెలిపి అజోఫీఫా మొదలైనవారు
ఒకే ఒక కవితా సంపుటి ‘’అలాస్ యెన్ ఫూగా ‘’ తెచ్చిన జోస్ లియాన్ సాన్సేజ్ ,లా ఇస్లా డి లాస్ హోమ్బ్రెస్సోలోస్ నవలకూడా రాశాడు .1970-80కాలం లో రోడాలఫో ఏరియస్,జార్జి ఆర్రియో ,అన ఇస్తాని మొదలైన రచయితలున్నారు .
టాప్ నైన్ బుక్స్ –1-ఇట్ ఈజ్ ఎవెరిమంకిఫర్ దెం సేల్వెస్-వనేస్సా వుడ్స్ –అడవిమనుషుల శృంగారం పై రచన -2-ఓరో-సిజియా జైక్ 3-గ్రీన్ ఫోనిక్స్ –విలియం ఎల్లెన్ 4-మంకీస్ ఆర్ మేడ్ ఆఫ్ చాకోలేట్స్-జాక్ ఈవింగ్ 5-కోస్టా రికా –ఎ ట్రావెలర్స్ కంపానియన్ –ఆస్కార్ ఆరిస్ 6-ది డెవిల్స్ డీప్-మైకేల్ వాల్లెస్ 7-ది సెంట్ ఆఫ్ జేడ్-డీడీ టార్సియో,8-జురాసిక్ పార్క్ అండ్ లాస్ట్ వరల్డ్ –మైకేల్ క్రిక్టన్ 9-ది యియర్ ఆఫ్ ఫాగ్ –మైకేల్లిరిచ్ మాండ్ .
ప్రపంచ ప్రసిద్ధ కోస్టారికన్ రచయితలు –మాన్యుల్ ఆర్గేల్లో ,జాక్విన్ గార్సియా మోన్గే,గార్మేన్ లైరా ,గార్మేన్ నరెంజో ,కార్లోస్ లూయీ ఫల్లాస్ .
కోస్టా రిక మధ్య అమెరికాలో వర్షారణ్య దేశం .కరేబియన్ ,పసిఫిక్ సముద్రాల అంచున ఉంటుంది .రాజధాని సాన్ జో. సాంస్కృతిక కేంద్ర౦ గోల్డ్ మ్యూజియం కు .అనేకమైన బీచ్ లకు నిలయం .భూభాగంలో ఇకవంతు అభయారణ్యమే .వన్యమృగ నిలయం .స్పైడర్ మంకీలకు ప్రసిద్ధి .రోమన్ కేధలిక్ మతానికి నిలయం .స్పానిష్ భాష ప్రజలభాష .భోజనం నేటివ్ అమెరికన్ స్పానిష్ ,ఆఫ్రికన్ వంటకాలు తింటారు .1936లో సమ్మర్ ఒలింపిక్స్ లో ఈ దేశం పాల్గొన్నది .ఫుట్ బాల్ ఇక్కడి ముఖ్యమైన ఆట .బేస్ బాల్ కూడా బాగా ఆడుతారు.97శాతం ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడుతారు .హైస్కూల్ వరకు విద్య ఫ్రీ .కోస్టారికా యూనివర్సిటి ‘’మెరిటోరియస్ యూనివర్సిటిగా ‘’గుర్తింపు పొందింది .టూరిస్ట్ లపాలిటి స్వర్గధామం .టూరిజం వలన ఆదాయం ఎక్కువ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-4-20-ఉయ్యూరు