ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

33-పెరూ వియన్ సాహిత్యం

ఇంకాన్ సామ్రాజ్యకాలం వచ్చిన కళ  ఎవరికీ తెలియదు .మధ్య ఆ౦డీనియన్ కాలం లో ఈనాడు పిలువబడే పేరు నికారుగ్వా ,బొలీవియా ,చిలి దేశాలలో వచ్చిన సాహిత్యం మాత్రం మౌఖిక వ్యాప్తిచెందింది .ఈకాల సాహిత్యం లో క్వేచువా భాషలో వచ్చిన గేయాత్మక  ‘’హరావిక్ కవిత్వం ‘’,రెండవది పురాణ కవిత్వమైన ‘’హేల్లిస్ కవిత్వం ‘’.ఈ కవిత్వం లో  ఆనాటి నిత్యకృత్య వ్యవహారాలను ‘’హరావేక్ ‘’అనేకవి గానం చేస్తే తరతరాలకు వ్యాపించాయి .జానపద గాధలు ఆండీయన్ ప్రపంచ పుట్టుక,గిట్టుక ,వ్యాప్తి  గురించి చెప్పేవిగా ఉండేవి .ఇవన్నీ ఈనాటికీ సజీవంగా ఉండటానికి ‘’ఇంకా గార్సిలసో ‘’వంటి మేగజైన్లె ముఖ్యకారణం .ఇవే క్వేచువా కవిత్వం ,గుయామన్ పోమా డిఆయల్సా మైదాలజి కవిత్వం లను వెతికి వెలుగు లోకి తెచ్చాయి .వీటిని కవిత్వంగా గుర్తి౦చ టానికి చాలాకాలం పట్టింది .1905లో జోస్ డి లా ఆగేరో ప్రకటించిన దానిప్రకారం స్వతంత్ర పెరు సాహిత్యం ప్రి హిస్పానిక్ సంప్రదాయానికి చెందింది కనుక పెద్దగా లెక్కలోకి రాదనీ ,కొత్తదనం లేనిదని అన్నాడు .ఆతర్వాత 20వ శతాబ్దం లో విశ్లేషకులు అతని భావాలను తప్పుపట్టి ప్రి హిస్పానిక్ సాహిత్య విలువలను గుర్తించి మహోపకారం చేశారు .ప్రి హిస్పానిక్ సాహిత్య మిత్స్,లెజెండ్స్ లో కొన్ని ముఖ్యమైన వాటిని తెలుసుకొందాం –అడాల్ఫో వీన్ రిచ్-తర్మాప్ పచ్చా హువారే ,జార్జి బసాడ్రే-లా లిటరియా ఇన్కా,జోస్ మేరియా ఆర్గెడస్  -హోరాచి వ్రాతప్రతిని చేసిన అనువాదం ,మార్టిన్ లీన్ హార్డ్ –లా వోజ్ య్సు హోఎల్లా,ఆంటోనియో కార్లేజో పోలార్ –ఎస్క్రిబిర్ ఎన్ ఎల్ ఎయిర్ ,ఎడ్మ౦డో బెండజు-లిటరేచర్ క్వేచువా .

  పెరు దేశాన్ని స్పెయిన్ దేశం దాడి చేసి ఆక్రమించినప్పుడు కొంత సాహిత్య సృజన జరిగింది 1532 నవంబర్ 15నుంచి ఈకాలం కజామార్కా లో ప్రారంభం .అప్పుడే చివరి ఇన్కా రాజు అలాహులాల్పా ను లోబరచుకొని ఇన్కా సామ్రాజ్యాన్ని సర్వ నాశనం చేసింది  స్పెయిన్ .ఈకాలపు సాహిత్యం ప్రకృతి పైనే ఎక్కువగా వచ్చింది .క్రానికల్స్ లో ఇవి భద్రపరచారు .ఫ్రాన్సిస్కో కార్రిలియో అనే క్రానికలర్  ఈకాలపు క్రానికల్స్ ను గ్రూపులుగా విభజించాడు .మొదటి గ్రూపు క్రానికల్స్ విజయ విశేషాలున్నవి .వీటిని సైనికులు రచయితలే ఎక్కువగా రాశారు .ఇవి 1532-35కాలానివి .వీరి ఉద్దేశ్యం ప్రజలను నాగరికం చేయటం ,యదార్ధ విశ్వాసం కల్పించటం .అజ్ఞాత వ్యక్తులరచనలుకూడా ఉన్నాయి. తర్వాత వాట్ని ధ్వంసం చేశారు .ఫ్రాన్సిస్కో జేరేజ్ ప్రభుత్వ అధికార క్రానికలర్ ‘’దినెరేటివ్ ఆఫ్ ది కాంక్వెస్ట్ ఆఫ్ పెరు ‘’క్రానికల్ రాశాడు .దీన్ని న్యు కాస్టిల్లీ అంటారు .ఫ్రే గాస్పార్ డికార్వజార్ అనే స్పానిక్ క్రానికలర్ అమెజాన్ నదుల పుట్టుపూర్వోత్తరాలపై విస్తృతంగా1541-42లోరాశాడు .ఇవికాక ఇంకా ముగ్గురు -మిగుల్ డి ఎస్టిల్లె,క్రిస్తోబార్ డిమోలినా ,పెడ్రో సీజ్ డి లేనాన్ లు పెరువార్తలు ,అక్కడి ప్రజలు ,ఆచార వ్యవహారాలగురించి చాలా వివరాలతో రాశారు .అజ్ఞాత రచయితల క్రానికల్స్ లో మేస్టిజో క్రానికల్స్ ,ఇన్కారాజుల రక్తపిపాస,ఆన్డియన్ ప్రపంచ వినాశనం  మొదలైన విషయాలను వివరించారు .గువమాన్ పోమా 1179పేజీల తో స్పెయిన్ రాజు 3వ ఫిలిప్ కు ఒక అర్జీ పంపి  ఆదర్శ ప్రపంచం గురించి రాసి పంపాడు .అధికారుల ఆగడాలు ప్రీస్ట్ ల దౌర్జన్యాలు తెలియజేస్తూ కాలనీ ప్రభుత్వ దుశ్చర్యలను ఎండ గట్టాడు .

  ఆధునిక సాహిత్యం –పెట్రార్క్ రాజును అనుకరించటం గ్రీకు రోమన్ మైథాలజీల విజ్రు౦భణ,పై ఏవగింపు పై సాహిత్య సృజన జరిగింది .లిమాలో అకాడేమియా అంటార్కిట సాహిత్య గ్రూప్ 16,17శతాబ్దాలలో ఏర్పడింది . ఈ అకాడేమియాలో ఫ్రాన్సిస్కో డిఫెగువేరా,డియాగోమెక్సియ డి ఫెర్మా౦గిల్ ఉన్నారు. అజ్ఞాతకవులను ‘’క్లారిండా’’అనీ ,అమరిల్లిస్ అనీ అన్నారు.తర్వాత నియోక్లాసిక్ కవులైన మాన్యూల్ ఎస్సేన్సియో సేగురా ,ఫెలిపే ఫార్డోయ్ అలియాగా మొదలైన వారు మంచికవిత్వం 19వ శతాబ్ది చివరివరకు రాశారు .19వ శతాబ్దిలో రోమా౦టిజం వచ్చి,కార్లోస్ ఆగస్టోసాల్వేర్రి ,జోస్ అర్నాల్డోమార్క్వెజ్ లు ఈ భావంతో గొప్పకవిత్వం రాశారు .వర్ణనాత్మక వచనరచన కూడా ప్రారంభమైంది .మాన్యూల్ అసేన్సియో సేగుర ,రికార్డోపాలమా మొదలైనవారు ఈ ప్రక్రియలో నిష్ణాతులు .ఆధునికకవులు – మాన్యూల్ గొంజేజ్ ప్రాడా,జోస్ సాంటోజ్ కోకానో .మహిళలుమాత్రం రియలిజం ,నేచురలిజం మార్గం పట్టారు .వీరిలో గువానా మాన్యులా గొర్రెట్టి,తెరెసా గొంజాలెజ్ డిఫాన్నింగ్,క్లోరిండామట్తో డిటర్నర్,మెర్సిడెస్కాబెల్లెరో డి కార్బో నేరా ఉన్నారు .

  ఫసిఫిక్ యుద్ధ సంక్షోభం తర్వాత పెరులో మోడర్నిజం ప్రవేశించింది. జోస్ సాన్తోజ్ కోకానో,జోస్ మేరియా ఈగురెన్ దీనిలో ప్రసిద్ధులు .నవలలు నాన్ ఫిక్షన్ కూడా రాశారు .ప్రముఖ సోషలిస్ట్ ఎస్సెయిస్ట్ జోస్ కార్లోస్ మారియాటేగు అవంట్ గార్డె ఉద్యమకారుడు .చిన్న చిన్న గ్రూపులు కూడా వచ్చాయి .1950లో అర్బన్ రియలిజం వచ్చింది .జులియో రేమాన్ రేబెయ్రో ,నాటక రచయితసెబాస్టియన్ సల్జార్ బాండి దీనిలో ముఖ్యులు.రియలిజం లో మేరియో వర్గాస్ ల్లోసా ప్రసిద్ధుడు .నారేటివ్ టెక్నిక్లో ప్రసిద్ధుడు ఆల్ఫ్రెడోబ్రిస్ ఈకేంక్ .కవిత్వం లో సుప్రసిద్ధులు –ఎమిల్లో అడాల్ఫో వెస్ట్ ఫాలెన్ ,జార్జి ఎ డ్యు ర్డోఎలేల్సన్ కార్లోస్ జర్మన్ బెల్లి ,కార్మిన్ ఆలీ .

  సమకాలీన రచయితలలో జైంబెయ్లి ముఖ్యుడు అతని ‘’టెల్ నో వన్’’నవల ప్రఖ్యాతమై సినిమాగా తీశారు .యువ రచయితలలో  ఫెర్నాండో ఇవాస్కి ,ఇవాన్ ధే,ఆస్కార్ మాల్కాకార్లోస్ యుషి మిటోవగైరా ఉన్నారు .బాలసాహిత్యాన్ని ఫ్రాన్సిస్కో ఇజ్క్వేర్డోరియాస్ ,,కారియోలా కార్వల్లో డినునేజ్ వగగైరాలు  రాశారు .బాలసాహిత్యం లో పరిశోధనలు చేసిన వారూ ఉన్నారు .వీరిలో మేరియా రోస్టోవిస్కీ ప్రముఖుడు .పెరూవియన్ ఫేబుల్స్ ను అనలైజ్ చేసినవారూ ఉన్నారు .

  దక్షిణ అమెరికా లో పెరు దేశం  అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రాంతం లో ఉన్నది .ఆండీస్ ప  ర్వతాలు ఇక్కడ ప్రసిద్ధి ,ఇక్కడి మచ్చు చుచ్చు ప్రాంతం ,ఇన్కాలోయ ,మొదలైనవి యాత్రాస్తలాలు .కరెన్సీపేరు’’ సోల్’’.ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం పెరు.స్పానిష్ క్వేచ్చు భాషలు ప్రభుత్వ భాషలు .ఆన్డిస్ పర్వత తూర్పుభాగాన అనేక భాషలు మాట్లాడుతారు .వీరిది రోమన్ కేధలిక్ మతం .ఇక్కడి అక్షరాస్యత శాతం  2007 లెక్కలప్రకారం 92.9  .సెకండరీ స్థాయి వరకు విద్య కంపల్సరి .కొత్త ప్రపంచంలో అత్యున్నత విద్యకు పెరు పేరెన్నికగన్నది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.