ప్రపంచ దేశాల సారస్వతం
34-వెనిజులియన్ సాహిత్యం
ఈ దేశ సాహిత్యం ప్రీ హిస్పానిక్ కాలం లోని మిత్స్ కు సంబంధమున్న మౌఖిక సాహిత్యమే .ఇప్పటికీ వాటిని ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో లాగా వేనిజులాకథలు గాథలుగానే చెప్పుకొంటారు .స్పానిష్ దండయాత్ర వారి సంస్కృతీ ,సాహిత్యాలపై పెద్ద ప్రభావం చూపింది .స్పానిష్ కాలనైజర్లు రాసిన మొదటి వ్రాత ప్రతి నే వేనేజులియన్ సాహిత్యంగా పరిగణిస్తారు .ఇందులో క్రానికల్స్ ,ఉత్తరాలు వగైరా ఉన్నాయి .
వెనెజులా ప్రధమ రచయిత ఆండ్రెస్ బెల్లో.19వ శతాబ్దిలోకన్జర్వేటివ్ లకు లిబరల్స్ కు మధ్యజరిగిన అనేక యుద్ధాలతర్వాత ప్రత్యెక దేశం గా ఏర్పడినప్పటినుంచి వారి సాహిత్య ఆవిర్భావం ప్రారంభమైంది .1881లో వెనెజులా హీరోయికా పుస్తకాన్ని ఎడ్యురార్డా బ్లాంకో ఆదేశ స్వాతంత్ర్య సమరం ,స్వాతంత్ర్య సిద్ధి పై రాశాడు .
పెట్రోలియం ఇచ్చిన బూమ్ వలన వెనెజులా దేశం లో 20వ శతాబ్దిలో ఆధునికత నగరీకరణం ఏర్పడి ఆర్ధికంగా దేశం అభి వృద్ధి చెందింది .అప్పటి గొప్ప రచయితలలో టేరేసా డి లా పార్రా ,రోములో గాల్గోస్ ,ఆర్తురోఉస్లర్ పీట్రి,సాల్వడార్ గార్మెండియా ఉన్నారు .గాల్లిగోస్ 1929లో రాసిన ‘’డోనా బార్బరా ‘’నవల ‘’అత్యధిక ప్రచారం ఉన్న లాటిన్ అమెరికన్ నవలగా 1974లో గుర్తింపు పొందింది .1948ప్రభుత్వం ‘’నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ‘’ను ఏర్పాటు చేయగా ఉల్సార్ పెట్రి ఒక్కరు మాత్రమె యాభై ఏళ్ళకాలం లో రెండు సార్లు ఆ ప్రైజ్ ను అందుకున్న ఘన రచయితగా పేరు పొందాడు .
రఫెల్ కార్డనాస్,యూజినో మోంటేజోలు ఐదారు 20వ శతాబ్ద౦ నుంచి 21వ శతాబ్ది ప్రారంభం వరకు ప్రముఖ కవులు .మరికొందరు వెనెజులా రచయితలు –ఆల్ఫ్రెడో అర్మాస్ అల్ఫోన్జో ,రాఫెల్ అర్రాజ్ లుక్కా ,రాఫెల్ మేరియా బరల్ట్ ,రోములో బెటన్ కోర్ట్ ,కార్లోస్ బ్రాంట్ ,అలీసియా ఫెల్లిచ్ ,ఆస్కార్ ఏన్స్ ,హంబర్టో టేజేరా.వగైరాలు చాలామ౦ది ఉన్నారు .
దక్షిణ అమెరికాలో ఉత్తరాన వినేజులాదేశం ఉన్నది .ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మ .కరోబియన్ తీర ప్రాంతాలలో ట్రాపికల్ రిసార్ట్ ఐలాండ్స్ ఉన్నాయి .రాజధాని కారకాస్ .రాజకీయ అవినీతి ,ఆహార,ఆరోగ్య సమస్య ,కంపెనీలమూత ,నిరుద్యోగం ,ఉత్పత్తి క్షీణత ,మానవహక్కుల అతిక్రమణ ,అధికార దాహం అక్కడ సర్వ సాధారణం .ఆర్ధిక స్థితి కట్టడి చేయలేని నాయకత్వం ,ఆయిల్ పైనే అన్నిటికీ ఆధారపడటం వలన వాళ్ళ సమస్యలు పెరిగేవేకాని తగ్గేవికావు .అది సురక్షిత దేశం కాదు .ప్రపంచ ఆయిల్ రిజర్వ్ అత్యధికంగా ఉన్న దేశం వెనెజుల .ఒక లక్షమంది ముస్లిం లు జనాభాలో 4శాతంగా ఉన్నారు .స్పానిష్ ఇక్కడి అధికార భాష .వయ్యు,పియరోరా వారో ,మొదలైన భాషలుకూడా ప్రజలు మాట్లాడుతారు .దక్షిణ అమెరికాకు స్పానిష్ కాలనీ ప్రభుత్వం నుంచి విముక్తికలిగించిన వీరుడు సైమన్ బోలివర్ వేనేజులాలోనే పుట్టాడు .4మాత్రమె పబ్లిక్ హాలిడేలు.కుటుంబాలు అత్యంత సఖ్యతతో ఉండటం ప్రత్యేకత .వెనెజుల ఆతిధ్యం మై మరపిస్తుంది .మత స్వేచ్చ ఉన్నది .మెజార్టీ ప్రజలు రోమన్ కేధలిక్కులు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-4-20-ఉయ్యూరు
—