ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

35-గయనీస్ సాహిత్యం

గయాన దేశపు సాహిత్యమంతా దాదాపు ఇంగ్లిష్ భాషలో వ్రాయబడిందే .ఇక్కడి రచయితలంతా ఇతర దేశాలకు వలసపోయారు .సర్ వాల్టర్ రాలీ 16 వశతాబ్దిలో రాసిన ‘’ది డిస్కవరీ ఆఫ్ దిలార్జ్ రిచ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపైర్ ఆఫ్ గయానా ‘’అనేది ఆదేశ సాహిత్యం లో మొట్టమొదటిదిగా భావిస్తారు .ఈ దేశానికిగ్రేట్  గోల్డెన్ సిటీలు ఐన మనోవా ,ఏమర్నా ,ఆరోమయ ,మరియు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను తెలియ జేసే రచన అది .తొలితరం గయనీస్ రచయిత ఎడ్గార్ మిటిహోల్జర్,’’కోరంటైన్ థండర్’’ను 1941లో రాశాడు .ఇతని రచనలలో అక్కడి జాతులమధ్య సంబంధాలు ముఖ్యంగా యూరోపియన్ నాన్ యూరోపియన్ గయనీయుల మధ్య విభేదాలను వివరించాడు .

  ‘’టు సర్ విత్ లవ్’’నవలా రచయిత ఇ.ఆర్ .బ్రేయిత్ వైట్,’’పాలస్ ఆఫ్ ది పీకాక్

‘’రచయిత విల్సన్ హార్రిస్ ప్రసిద్ధులు ఇద్దరి రచనలు 1959,60లలో ప్రచురణ పొందాయి .తర్వాత జాన్ కారీ ,రాయ్ హీత్ లు దిమర్డరర్,ది జార్జి టౌన్ ట్రయాలాజి,దిషాడో బ్రైడ్ రాశారు .మైకేల్ గిల్కెస్ నాటక రచయిత.1980నుండి కొత్తతరం రచయితలు  వచ్చి సాహిత్యాన్ని సంపన్నం చేశారు. వారిలో –బెరైల్ గిల్ రాయ్ ,జాన్ అగార్డ్,గ్రేస్ నికోలస్,సాసనరైన్ పెర్సూద్,తోపాటు ‘’ది టేల్స్ ఆఫ్ గయనీస్ వర్నాక్యులర్ ‘’బార్నీ సింగ్ ఉన్నారు .

    గయనీస్ గ్రేట్ పోయేట్ గా మార్టిన్ కార్టన్ ను పేర్కొంటారు .గొప్ప నాటక రచయితగా మైకేల్ అబ్బెన్ సెట్స్ గుర్తి౦పు పొందాడు .ఇతని నాటకాలు ఇంగ్లాండ్ బుల్లితెర పైకూడా ప్రదర్శితాలు .ఇతని ‘’ఎంపైర్ రోడ్ ‘’ ను   బిబిసి 1978నుంచి 79వరకు ప్రదర్శించింది .విన్సెంట్ రోత్ రెండుభాగాలుగారాసిన జ్ఞాపకాలు –ఎ లైఫ్ ఇన్ గయానా (య౦గ్ మాన్స్ జర్నీ ),లేటర్ ఇయర్స్ గా ముద్రించాడు .ఇటీవలికాలం లో పాలిన్ మెల్విల్లీ ‘’ది వెంట్రి లాక్విస్ట్స్ టేల్’’,ది మైగ్రేషన్ ఆఫ్ ఘోస్ట్స్ అనే ఫిక్షన్ రాశాడు .ఊన్యా కె౦పడూ1998లో బక్స్టన్ స్పైస్ ,టైడ్ రన్నింగ్ రాస్తే ,షరోన్ మాస్-మారేజియబుల్ ఏజ్ 1999లో  పీకాక్ డాన్సింగ్ 2001లో ,ది స్పీచ్ ఆఫ్ ఏంజెల్స్ 2003లో రాసి ప్రచురించాడు .

అందరిని ప్రభావితం చేసే మేధావి రచయిత  వాల్టర్ రోడ్నీ1972లో ‘’హౌ యూరప్ అండర్ డెవలప్డ్ ఆఫ్రికా ‘’రాయటమే కాక గొప్పయాత్రా సాహిత్యాన్నీ సృష్టించాడు .అతని ‘’పాన్ ఆఫ్రికనిజం ‘’ అనే విజన్ గొప్పది .అధోజగత్ సహోదరుల పక్షాన్ని కాపుకాసిన రచయితకూడా .1974లో గయానాకు తిరిగి వచ్చి ప్రతిపక్ష ఉద్యమానికి ఊపిరులూదాడు  .దురదృష్టవశాత్తు ఈ మహానుభావుడిని 1980లో హత్య చేశారు .

  1987గయానా ప్రెసిడెంట్ డెస్మాండ్ హొటే’’గయనా ప్రైజ్ ఫర్ లిటరేచర్ ‘’ఏర్పరచగా  ,ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కవిత్వం నాటకం లో ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి అందజేస్తున్నారు. ఈ ప్రిస్టీజియస్ పురస్కారం పొందినవారిలో –విల్సన్ హార్రిస్ ,ఫ్రెడ్ డిఅగుయర్,డేవిడ్ డెబి డీన్,గోకర్ణం సుఖదేవ్ ,పాలిన్ మెల్విల్లీ ,ఇయాన్ మాక్ డొనాల్డ్,సిరిల్ డెబి డీన్,రాల్ జాన్సన్ లు ఉన్నారు .పోయెట్రిలో ప్రైజ్ విన్నర్స్ –ఫ్రెడ్ డిఆగురిల్ గ్రేస్ నికోలస్ ,ఇయాన్ మాక్ డోనాల్డ్ ఉన్నారు మాజిక్ రియలిజం ఇక్కడ  వేరూనింది

 గయానా ప్రైజ్ ఫర్ ‘’కరేబియన్ లిటరేచర్ ‘’ కూడా ఏర్పరచి ఫిక్షన్ పోయెట్రి డ్రామాలకు అందిస్తున్నారు .ఈ ప్రైజులు గర్వకారణంగా చిరస్మరణీయంగా ఉన్నాయని అందరూ భావిస్తూ అభిన౦దిస్తున్నారు  .ఇక్కడి కళా సంస్కృతుల అభి వృద్ధికి ఈ ప్రైజులు అత్యంత ప్రోత్సాహకంగా ఉన్నాయి .ఇక్కడి అరవాక్ ,కారిబ్ క్రాఫ్ట్ లకు విపరీతమైన క్రేజ్ ఉంది.

 కరేబియన్ సముద్రం లో  బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో గయానా ఒక ఐలాండ్.ఇక్కడి ‘’వైట్ పౌడర్డ్ సాండ్ బీచ్ ‘’ లు యాత్రాస్తలాలు .సముద్రాలు కొండలు నదులు,లోయలు ఇక్కడి అందాలకు ప్రతీకలు .గయానాలో క్రిస్టియానిటి తోపాటు హిందూఇజం కూడా ఉండటం విశేషం .25శాతంహిండువులు ,7శాతం ముస్లిం లు ఉంటారు .సెంట్రల్ జార్జి టౌన్ లో ‘’వైదిక్ మందిరం ‘’ఉన్నది .శివ విష్ణువులను ఆరాధిస్తారు .హిందూ పండగలు ఉత్సాహంగా జరుపుకొంటారు .ఆర్యసమాజం ఇక్కడ ఉన్నది .సంస్కరణలు తెచ్చింది .ఇక్కడి ముస్లిం లు అహ్మదీయ మతానికి చెందినవారు .1970 నుంచి హిందూ ముస్లిం పండుగలకు ప్రభుత్వం సెలవులు అంటే పబ్లిక్ హాలిడేస్ ప్రకటించింది .6వ ఏడాది నుంచి 16వరకు ఇక్కడ ఫ్రీ కంపల్సరి విద్య అమలులో ఉంది .కా౦ప్ర హెన్సివ్ విద్యకు అత్యధిక శ్రద్ధ ప్రభుత్వం తీసుకొంటోంది .

ఒకప్పుడు అత్య౦త పేదదేశమైన   గయాన ఇప్పుడు అభి వృద్ధి చెంది జిడిపి రేటు 2025కు 300నుంచి 1000 శాతంగా ఉంటుందని అంచనావేశారు .ఆయిల్ నిక్షేపాలు ఈ దేశానికి గొప్పవరం . .త్వరలోనే ప్రపంచం లో అత్యంత సంపన్న దేశం అవుతుందని ఊహ .

  1831వరకు డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కాలనీల ప్రభుత్వాలతో అణచి వేయబడిన దేశం ,1966స్వాతంత్ర్యం పొందింది .కాని ఆఫ్రికన్ లు ,ఇండియన్ లవలన ఎక్కువ టెన్షన్ కు లోనైంది .దీనితో రాజకీయ అస్తిరత్వం తోపాటు విపరీతమైన కరప్షన్ కోరలు సాచి అభివృద్ధికి బ్రేకులు వేశాయి .2015లో ఆర్మీ జనరల్ డేవిడ్ గ్రాన్జర్ ఎన్నికలలో గెలిచి అవినీతి, జాతుల వైరాన్ని అణచేశాడు .జాతీయ సమైక్యత సాధించాడు .తర్వాతమాత్రమే ఆర్ధికంగా వృద్ధిచెందింది .అన్ని వనరులున్నా అల్లుడినోట్లో శని లాగా పేదరికం లో కొట్టుమిట్టాడింది .ఇప్పుడిప్పుడే  నవ శకం వస్తోంది .శుభం భూయాత్ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.