56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్
ఉయ్యూరు హైస్కూల్ లోనూ, ఇంటిదగ్గర ప్రయివేట్ లోనూ నాకు శిష్యు రాలు ,నన్ను ఆత్మీయంగా మామయ్యా అని పిలిచే ,గోసుకోండ రామచంద్రుడు రుక్మిణమ్మల పెద్దకూతురు భ్రమరాంబ ఇవాళ ఉదయం 8-30కి ఫోన్ చేసి ”మామయ్యా నేనెవరో కనుక్కో ”అంది గుర్తుపట్టలేక పోయాను చాలా ఏళ్ళు అయ్యాయి కనుక .నెమ్మదిగా క్లూస్ ఇచ్చింది .దాన్నిబట్టి ”అమ్మా భ్రమరాంబా ”అనగానే పట్టరాని సంతోష0 తో ”నీతో మాట్లాడాలనిపించింది మామయ్యా .అందుకు ఫోన్ చేశాను .”అన్నది ”చాలా సంతోషం అమ్మా మీ అత్తయ్య తో మాట్లాడు .”అని చెప్పి సెల్ ఇచ్చా నాకు పనులు ఉండటం వలన .వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ”అత్తయ్యా !మామయ్యతో ఎప్పుడు మాట్లాడటం కుదురుతుంది ”అని అడిగిందట .’ఉదయం 9నుంచి 10లోపు మధ్యాహ్నం 12 తర్వాత సాయంత్రం నాలుగు తర్వాత ”అని చెప్పింది
మళ్ళీ ఫోన్ చేస్తుందేమోఅని ఎదురు చూసి రాత్రి 7 కు నేనే ఫోన్ చేశా వాళ్ళఅబ్బాయి అనుకుంటా లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మకిస్తే మాట్లాడింది .గలగలా మాట్లాడటం ఆ అమ్మాయికి అలవాటు .పాతఃవిషయాలన్నీ గుర్తు చేసుకొన్నది ట్యూషన్ విషయాలు నేను ఎప్పుడూ వేళాకోళం ఆడే సంగతులు , నేను సంగీతం సాధన చేసే విషయం నవ్వుతూ గడగడా చెప్పింది .కల్మషం లేని పిల్ల . వాళ్ళ ఆయన టీచర్ గా వినుకొండలో పని చేసేవారు చనిపోయి 4 ఏళ్ళు అయిందని చెప్పింది బాధపడ్డాం .ఇద్దరు మగపిల్లలు ఓక ఆడపిల్ల ట .ఆ అమ్మాయి ఒకే ఒక్క తమ్ముడువాసు ఉయ్యూరులోనే ఉంటాడు వాళ్ళ ఇంటికి వస్తే మా ఇంటికీ వచ్చి వెడుతుంది ఎప్పుడూ . దాదాపు పదేళ్లు అయి ఉంటుంది చూసి .వాళ్ళనాన్న అమ్మా కూడా చనిపోయారు ఉయ్యూరులో .వాళ్ళ అమ్మ రుక్మిణమ్మ నన్ను ”తమ్ముడూ !”అని ఎంతో ప్రేమగా పిలిచేది .భర్త కెసీపి స్టోర్స్ లో పని చేసి రిటైరయి నీలగిరి కాఫీ స్టోర్స్ పెట్టి కాలక్షేపం చేశాడు వాళ్ళబ్బాయి అదే పనిలో ఉండేవాడు స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకొని ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు . ఇవన్నీ గుర్తుకొచ్చాయి .
భ్రమరాంబను ”నా సెల్ నంబర్ నీకుయెలా తెలుసు ?”అని అడిగా ..”మామయ్యా రోజూ పేస్ బుక్ లో నీ పుస్తక పరిచయం లైవ్ చూస్తున్నాను .నీతో మాట్లాడాలని పించి అందులో నీ సెల్ నంబర్ ఉంటె పొద్దున్న మాట్లాడా .నాకు ఎంతో సంతోషంగా ఉంది .మా వాళ్లందరికీ ”మా మామయ్యా మాట్లాడుతున్నాడు చూడండి చెప్పి వాళ్ళూచూసేట్లు చేస్తున్నాను .బాగా చెబుతున్నావు మామయ్యా .చాలా బాగా నచ్చింది నాకూ మా పిల్లలకు .ఎప్పుడైనా అటువైపువస్తే వినుకొండ ర0డి నువ్వూ అత్తయ్యా కూడా ”అన్నది పిచ్చ ఆప్యాయతతో .ఇలా ఇదివరకు చాలాసార్లు రమ్మంది కానీ .ఎప్పుడూ వెళ్ళలేదు మూడు సార్లు త్రిపురాంతకం వెళ్లినా భ్రమరాంబ గుర్తుకు రాలేదు .డిసెంబర్ లో వెళ్లాం .ఆమె సెల్ నంబర్ కూడా మా దగ్గరలేకపోవటం అసలే అప్పటికే రాత్రి సుమారు 7అవటం వలన కుదరలేదు . ఈసారి అటువేస్తే తప్పక కుండా వస్తామని ఆమె ఉయ్యూరు వస్తే కనిపించి వెళ్ళమని చెప్పాం ఇద్దరం .సరే నంది .ఇంతటి ఆత్మీయతా అభిమానం ఉన్నవాళ్లు అరుదుగా ఉంటారు ఆ అరుదైన మేనకోడలు మా భ్రమరాంబ ..
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-20 -ఉయ్యూరు
—