ప్రపంచ దేశాల సారస్వతం
36-పరాగ్వేనియన్ సాహిత్యం
పరాగ్వే దేశం లో ప్రాచీనకాలం నుంచి గాలి ,వెదురు ఫ్లూట్ లు , గంటలు ,ఈలలు మాత్రమె సంగీత సాధనాలుగా ఉపయోగించారు .మొదటి స్పానిష్ సెటిలర్స్ కాలం లో గిటార్ ,హార్ప్ వంటి సంగీతపరికరాలు వాడారు .వీరి ప్రాచీన సంగీతం పోల్కా .సంగీతరూపకాలు ,జానపద పాటలు.వీటిలోనే వీరిపూర్వ సంస్కృతీ సాహిత్యం కనిపిస్తాయి .20వశతాబ్దిలో లిరిక్ ప్రవేశించి,పూర్వపు హిస్పానిక్ సంప్రదాయానికి భిన్నమైన మార్గం ఏర్పడింది .
పరాగ్వే మధ్యతరగతి ప్రజలు తమ సంప్రదాయాన్ని మార్చుకోవటానికి ఇష్టపడరు .అర్జెంటీనా ,బ్రేజిల్ సంప్రదాయాలనే కొనసాగించటం వారికిష్టం . గోడపత్రికలే వారికి శరణ్యం. ‘’సేర్వా౦టేజ్ ప్రైజ్ ‘’పొందిన పరాగ్వేనియన్ రచయితా ఆగస్టో రో బోస్టర్స్ చిత్ర౦ఉన్న పోస్టర్ ను అందులో ఆయన గేయాలను లైట్ స్థంభాలకు వేలడ దీసి ,ఆయన గురించి తెలుసుకొనే ప్రచారం చేశారు .లాస్ కాన్గోస్ డీ రో బోస్తోస్ కధానికా సంపుటి సమకాలీన సాహిత్యానికి పనోరమ లాగా కనిపిస్తుంది .
పరాగ్వేనియన్ రచయితలలో ముఖ్యులు అగస్టో రోవా బోస్టోస్ -1917-2005,గాబ్రియల్ కసాస్సియ -1907-80,జువాన్ సిల్వనో గొడాయ్-1850-1926,హీరిబ్ కంపోస్ సెర్వేర-1905-1953,రోక్ వల్లెజోస్-1943-2006 మొదలైనవారు .ఈదేశం అత్యంత బీద దేశం .రోమన్ కేధలిక్ మతస్తులు ప్రజలు .35శాతం ప్రజలు దుర్భర దారిద్యం లో మగ్గుతున్నారు .కాని భూభాగం అత్యంత సుందరమైనది .కాని సాహిత్యంలో మంచి సంస్కృతి కనిపిస్తుంది .ఇక్కడ పుస్తకం రాసి ప్రచురించటం,మార్కెట్ చేయటం బ్రహ్మప్రళయమే అవుతుంది .కనుక ఇక్కడి రచయితలు తమ రచనలను సంపన్న దక్షిణ అమెరికా దేశాలైన అర్జంటినా ,బ్రెజిల్, మెక్సికో లలో ప్రచురించుకొంటారు .
ఈదేశం గర్వించే రచయిత అగస్టో రోవా బోస్టోస్- గొప్పనవలాకారుడు .ఆయన రచనలలో ఆ దేశ చరిత్ర సా౦ఘిక సమస్యలు రాశాడు .అతని రాచకీయ భావాల వలన రచనలన్నీ ఆ దేశం లోకాక బయటి దేశాలలో ముద్రించుకోవాల్సి వచ్చింది .ఆయన రచనలలో అత్యంత ప్రాముఖ్యమైనవి –యో ఎల్ సుప్రీమో -1989.ఈయనకే ‘’ప్రీమియో మిగెల్ సేర్వాన్టేజ్’’అనే ప్రిస్టీ జియస్ ప్రైజ్ వచ్చింది .
గాబ్రియల్ కసస్సియో -ను ‘’ఫాదర్ ఆఫ్ మోడరన్ లిటరేచర్ ‘’అంటారు .ఈయన ‘’యూని వర్సి డాడ్ నేకియోనల్ డీ అసుంసియాన్ ‘’లో లా చదివి గ్రాడ్యుయేషన్ తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు .స్థానికపత్రికలు చాలా వాటిలో రాస్తూ తర్వాత ఫిక్షన్ రచయిత అయ్యాడు.ఇతని ప్రఖ్యాత నవలలు హోమ్బ్రెస్ ముజేరాస్ ఫాంటోకస్ -1930,లా బబోసా -1952,లా ల్లాగా -1963,లాస్ హుర్టాస్-1981.చివరిది మరణానంతర ప్రచురణ .కొంతకవిత్వం నాటకాలు కూడా రాసాడు .
జుడాన్ సిల్వనో గోడాయ్-ఈ దేశపు1800 యుద్ధానంతర రాజకీయ నాయకులలో ముఖ్యుడు .యవ్వనం లో అర్జెంటీనా లో చదివి పెరాగ్వేలో ప్రవేశించాడు .దేశ పునర్నిర్మాణానికి ఎన లేని సేవ చేశాడు .రాజకీయంగా ప్రత్యర్ధి హత్యకు కారణం అయ్యాడనే అవినీతి మరకను అంటించుకొని దేశం నుంచి బహిష్కరి౦ప బడ్డాడు.నియంతృత్వ ప్రభుత్వ పోకడలను తీవ్రంగా విమర్శించేవాడు .అనేక రచనలు చేశాడు అందులో –మొనోగ్రాఫియాస్ హిస్టారికాస్ ,లా మురటే డెల్మారిస్కల్ లోపెజ్
మరో రచయిత- హెరిబ్ కంపోస్ సెర్వేరా- పెరుగ్వియన్ కవులలో ప్రధమ స్థానం పొందినవాడు .వామపక్షభావ ప్రేరేపితుడు .నిర్మొహమాటంగా ప్రభుత్వ దమననీతి, అవినీతులను విమర్శించేవాడు .కనుక తానేస్వయంగా దేశం దాటి బయటికి ఒకటి రెండుసార్లు వెళ్ళాడు .ఒకే ఒక కవితా సంపుటి –సెనిజా రెమిడియా-ను 1950లో ప్రచురించాడు .మరనణా నంతరం రెండవ కవితా సంపుటి –హోమ్బ్రే సీక్రెటో ప్రచురితమైంది .
రోక్ వల్లెజోస్-ఫోరెన్సిక్ సర్జన్ గా ‘’ హైకోర్ట్ ఆఫ్ జస్టిస్’’లో జీవితం ప్రారంభించి ,రచయితగా, కవిగా స్థిరపడ్డాడు .సాంఘిక రాజకీయాలపై నిష్పాక్ష పాతంగా రాయటానికి ఏర్పడిన ‘’60 జనరేషన్ ‘’గ్రూప్ లో ముఖ్యుడు .అతని ప్రముఖ రచనలు –లాస్ ఆర్కాన్జేలస్ ఎబ్రియోస్-1964,టీమ్పో బలాడియో-1988.
పరాగ్వే చిన్న బీద దేశమైనా ఇప్పటికీ సాహిత్యాన్ని సృష్టిస్తూనే ఉండటం గమనార్హం .అర్జెంటీనా ,బ్రెజిల్ బోలీవియా ల మధ్య ఉంటుంది .గడ్డి పరచుకొన్న చిత్తడి నేలలమయం .రాజధాని పరాగ్వే రివర్ ఒడ్డునున్న అసుంసియాన్ .ఈ దేశాన్ని ‘’హార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా ‘’అనీ ‘’లాండ్ ఆఫ్ వాటర్ ‘’అనీ అంటారు ,నావికా దేశం .ప్రపంచంలో చాలాప్రాంతాలు సముద్రానికి చేరుకోవటానికి దూరంగా ఉంటె ఈ దేశం ‘’లార్జెస్ట్ నావెల్ పవర్ ‘’గా ప్రసిద్ధి .నేరాలు ఘోరాలు హి౦సాదౌర్జన్యాలు ,దొంగతనాలు ,మనీ లాండరింగ్ ,అవినీతి పోలీసు వ్యవస్థ ఈ దేశం పాపాలు,శాపాలు .తూర్పున తడిగాలి ,పడమట పొడిగాలి ఇక్కడి ప్రత్యేకత.ఇక్కడి భాషలు- స్పానిష్ ,గువరాని .ఇవే అధికారభాషలుకూడా.ప్రక్క దేశాలతో నిరంతరం యుద్ధాలు చేయటం వల్ల దేశ భూభాగాన్నే కాక ,మగవారినీ చాలామందిని పోగొట్టుకొన్న దేశం .1930లో బోలీవియాతో జరిగిన చాకో వార్ లో గెలిచి మళ్ళీ భూభాగాన్ని రాబట్టుకోన్నది .2016లెక్కలప్రకారం అక్షరాస్యత శాతం -94.6.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-20-ఉయ్యూరు