ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత ప్రఖ్యాతుడు.మహిళాకవులలో జువానా డిల్బార్బారో ,డేల్మిరా ఆగస్టిన్ కవిత్వంలో చరిత్ర సృష్టించారు .ఇందులో రెండవ ఆమె స్పానిష్ అమెరికన్ సెంటిమెంట్ ను ఆయుగం అంతా రగిల్చి చిరస్థాయి సాధించి బహు ప్రఖ్యాతురాలైంది సాహిత్యలోకం లో .ఎమిల్లో ఫ్రుగొని , ఏమిల్లో ఒరైబ్ లను డిస్టిన్గ్విస్ట్స్ లిరిసిస్ట్ లుగా కీర్తి పొందారు .
వచనం ,ఫిక్షన్ రాసిన ఉరుగ్వేనియన్ రచయితలు –జువాన్ కార్లోస్ ఒనెట్టి,కార్లోస్ మార్టినేజ్మొరెనో,ఎడ్యురార్డో గలీనో ,ఫెలిస్ బెర్టో హెర్నాన్డేజ్,మేరియో బెనేడెట్టి,టొమాస్ డి మట్టోస్,మారిషియో రోసెన్ కాఫ్,జార్జి మాజ్ ఫడ్.
షార్ట్ స్టోరి రచయితలలో హోరాసియో క్విరోగా కు అద్భుత రచనా శక్తి ఫాలోయింగ్ తోపాటు పాప్యులారిటి ఉన్నది .కాన్ స్టాన్షియో సి విగిల్ మాత్రం అందరి ప్రేమాభిమానాలు పొందిన బాలసాహిత్య రచయిత.జార్జి లూయీ బోర్జెస్ సాంస్కృతిక రంగం లోనూ , ఉరాగ్వే చరిత్ర లో నిష్ణాతుడు .ఫేమస్ ధియేటర్ రైటర్ గా ఫ్లారెన్సియో సాన్చేజ్ లబ్ధ ప్రతిస్టుడు.
ఎక్కువ మంది రచయితలు ఉత్తర ఉరుగ్వేలో ఉన్న రాజధాని మాంటే విడియోకు చెందినవారే .ఎడ్యుర్డో గెలీనో జర్నలిస్ట్ రచయితా ,నవలాకారుడు మాత్రమేకాక ‘’ గ్లోబల్ సాసర్స్ ప్రి ఎమినేంట్ మాన్ ఆఫ్ లెటర్స్ ‘’గా ప్రఖ్యాతుడు .’’లాటిన్ అమెరికన్ లెఫ్ట్ లిటరరీ జైంట్’’కూడా .ఇతని ప్రఖ్యాత రచనలు –లాస్ వెనాస్ అబిర్టాస్ డి అమెరికా లాటినా ,మేమోరియా డెల్ ఫ్యూగో మొదలైనవి .3-9-1940లో రాజధానిలో పుట్టి ,13-4-2015చనిపోయాడు .అతని కొన్ని సూక్తులు –ది వాల్స్ ఆర్ ది పబ్లిషర్స్ ఆఫ్ దిపూర్ ,’’దిచర్చ సేస్ ది బాడి ఈజ్ సిన్,సైన్స్ సేస్ దిబాడి ఈజ్ ఎ మెషిన్,అడ్వేర్తిజింగ్ సేస్-ది బాడి ఈజ్ ఎ బిజినెస్ ,దిబాడి సేస్-ఐ యాం ఎ ఫీస్టా-అంటే పండుగ సంబరం .
మేరియో బెనేడెట్టి –‘’జనరేషన్ ఆఫ్ 45’’గ్రూప్ రచయిత,మహా మేధావి ,రాజకీయ సాంఘిక సమస్యల విశ్లేషకుడు .1956లో ‘’పొయేమాస్ డి లా అఫిసిన –ఆఫీస్ పోయెమ్స్ అనే కవితా సంపుటి వెలువరించి అర్బన్ బ్యూరోక్రాట్ ల వింతపోకడలను ఎండగట్టాడు .అతనికవితలు –గ్రీన్ కంట్రి విత్ ట్రా౦ కార్స్ ‘’బాగా పాప్యులరయ్యాయి .
క్రిస్టినా పెర్రి రోసి –ఉరుగ్వే నవలా ,కవిత్వ, అనువాదకు రాలుమరియు కధకురాలు .1960తర్వాతి తరం రచయిత్రులలో అగ్రశ్రేణికి చెందింది .37కు పైగా రచనలు చేసింది .12-11-1941 న పుట్టి౦ది.క్రియేటివ్ ఆర్ట్స్ కు ఫెలోషిప్ పొందింది .’’ఇవోహే ‘’అనే పేరుతో మూడు కవితా సంపుటాలు ప్రచురించింది.’’ స్టేట్ ఆఫ్ ఎక్సైల్’’గా ఒకటి ఇంగ్లిష్ లోకి అనువాదం అయింది
హిరాసియో క్విరోగా –నాటకరచయిత నవలాకారుడు కవి ,కధకుడు .అడవి బాగ్రౌండ్ గా చాలా కధలురాశాడు 31-12-1878పుట్టి 19-2-1937 చనిపోయాడు .హిస్టో రియాస్ డి అమర్ ,డి లాకురా ఇడిమ్యూర్టో మొదలైనవి రాశాడు .
డేల్మిరా అగస్టిని -20వ శతాబ్ది కవయిత్రి 24-10-1886 పుట్టి 6-7-1914చనిపోయింది .కవితా సంపుటి ప్రచురించింది .ఎల్ అల్బారో బ్లాంకో ,కా౦ టోస్ డి లా మనానా మొదలైనవి ఆమె రచనలు .
ఫెలిస్ బెర్తో హెర్నా౦ డేజ్-రచయితా పియానిస్ట్ .కథారచయిత .సినిమాలు తీశారు కధలను .20-10-1902పుట్టి 13-1-1964చనిపోయాడు .పియానోకథలు రాసి ఉత్తేజితులను చేశాడు
జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ –ఎపిక్ పోయేట్ .జాతీయ కవిగా గుర్తింపు పొందాడు 28-12-1855పుట్టి 3-11-1931 మరణించాడు .’’తబారే ‘’అనే జాతీయ కవిత్వం రాశాడు .’’హైం ఆఫ్ ది ట్రీ’’అనే ఇతని స్పానిష్ కవిత అనేక లాటిన్ అమెరికన్ దేశాల కవితగా ప్రసిద్ధి చెందింది
కార్మెన్ పోస్సడాస్-13-8-1953పుట్టి దిలాస్ట్ రిజార్ట్ ,కివిరచనలద్వారా ప్రసిద్ధమైంది ఈమె నవలలను సినిమాలుగా తీశారు
మారికో రోజెన్ కాఫ్ -30-6-1933లో పుట్టాడు .’’దిలెటర్స్ దట్ నెవర్ కేమ్’’ మీడియోముండో మొదలైన రచనలద్వారా ప్రసిద్ధి చెందాడు .ఇతని ఎల్ రేగ్రేసో డెల్ గ్రాన్ టులెక్ నవల సినిమా తీశారు .తనజైలు జీవితాన్ని ‘’ట్వెల్వ్ యియర్ నైట్ ‘’గా రాశాడు ‘
ఉరుగ్వే దేశం బీచ్ లైన్ కోస్ట్ గా సుప్రసిద్ధం .కరెన్సీ-పేసో ఉరుగ్వే .అధికారభాష స్పానిష్ .అత్యధిక సంపన్న దేశాలలో ఒకటి .స్థూల జాతీయాదాయం చాలా ఎక్కువ .అసమానత తక్కువ .పేదరికాన్ని రూపుమాపిన దేశం ఉరుగ్వే .వైన్ ఇండస్ట్రి కి ప్రసిద్ధి .సురక్షిత దేశం .మధ్యతరగతి ప్రజలే 60శాతం ఉంటారు .స్పానిష్ తోపాటు ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .2017లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం -98.62.యూనివర్సిటి విద్యదాకా ఫ్రీ .ఒకేఒక యూనివర్సిటి ఉన్నది .బడి గంటలు -4నుంచి 7.30గంటలే .క్వాలిటి ఎడ్యుకేషన్ ఇక్కడి ప్రత్యేకత .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-4-20-ఉయ్యూరు