ప్రపంచ దేశాల సారస్వతం
39-సౌత్ జార్గియన్ సాహిత్యం
దక్షిణ అట్లాంటిక్ లో సౌత్ జార్జియా ఐలాండ్ ఉన్నది .ఇక్కడ ‘’గ్రిట్వికన్’’అనే సేటిలర్స్ ఉంటారు . సౌత్ సాండ్ విచ్ దీవులు దీనికి సమీపం లో ఉంటాయి .దీన్ని 1675లో ఆంథోని డి లారోచ్ అనేలండన్ మర్చంట్ మొదట చూశాడు .అందుకని దీనికి’’ రోచ్ ఐలాండ్స్’’ అనే పేరొచ్చింది .తర్వాత 1756లో కమ్మర్షియల్ స్పానిష్ షిప్ ‘’లియాన్ ‘’వారు చూశారు .ఇక్కడ ‘’సీల్స్’’ బాగా విస్తృతంగా లభించటం తో 1786నుంచి 1991 వరకు వాటిని పట్టి ఎగుమతిచేసేవారు .1775లో ‘’జేమ్స్ కుక్’’ ఇక్కడికివచ్చి కాలుమోపాడు .ఇది బ్రిటిష్ సామ్రాజ్య భాగం లోనిది అని ప్రకటించి,జార్జి రాజుపేరిట ‘’జార్జియా ‘’అని నామకరణం చేశాడు .1843నుంచి బ్రిటన్ రాజుల అధీనంలోకి వచ్చింది .అప్పుడే సాండ్ విచ్ ఐలాండ్స్ నుకూడా ఆయన కనుక్కొన్నాడు
1882-83లో జర్మన్ ఎక్స్పెడిషన్ షిప్ ఇంటర్నేషనల్ పోలార్ యియర్ ఇక్కడ రాయల్ బే లో లంగరు వేయబడింది .ఇక్కడి ఆదాయం అంతా ‘’వేలింగ్ ‘’,ఫిషింగ్ వల్లనే వస్తుంది .కరెన్సీ పౌండ్ . ఈ రెండు ఐలాండ్స్ లోనూ పర్మనెంట్ సెటిలర్స్ ఉండరు .దీన్ని ‘’పీచ్ స్టేట్’’అనీ అంటారు .పీకాన్స్ ,పీనట్స్ ఉత్పత్తి బాగాఎక్కువ .ఇక్కడి ఉల్లిపాయలు తియ్యగా ఉండటం ఒక ప్రత్యేకత .ఈ ఐలాండ్స్ ను ‘’అంటార్కిటిక్ ఒయాసిస్ ‘’ అనీ ‘’గాలాపగాస్ ఆఫ్ ది పోల్స్ ‘’అనీ అంటారు .కారణం పెంగ్విన్స్ ఎక్కువగా ఉండటం .’’గాడ్ ఫర్బిడెన్ ఐలాండ్ ‘’అనీపేరుంది .’’ఫస్ట్ గేట్ వె ఆఫ్ అంటార్కిటికా ‘’అనీ ‘’లోన్లీ ప్లానెట్ ‘’అనీ అంటారు .ఇక్కడి కొమ్ముల” రీన్ డీర్ ”ప్రత్యేక జంతువు .
ఇక్కడి సాహిత్యం అంతా వేల్స్ వేట గురించే ఎక్కువ .బాస్ బెర్గ్ జాన్ –ది షార్ వేలింగ్ స్టే షన్స్,ఇలియట్ జి ఏ –వేలింగ్ ఎంటర్ ప్రైజ్ ,హార్డీ ఏ –గ్రేట్ వాటర్స్ ,హార్ట్ ఐ –పెస్కా ఐడాన్ ఎల్లిస్ ,వేలింగ్ ఇన్ దిఫాక్ లాండ్ ఐలాండ్స్ ,హెడ్ లాండ్ ఆర్ కే.-దిఐలాండ్ ఆఫ్ సౌత్ జార్జియా ,షాకిల్టన్-సౌత్ హీ నే మాన్ రాశారు .
ఇంతకంటే సాహిత్య విషయాలేవీ లభ్యం కాలేదు . దీనితో దక్షిణ అమెరికా దేశాల సాహిత్యం అంటే లాటిన్ అమెరికా దేశాల సాహిత్యం అంతా రాశాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-20-ఉయ్యూరు