ప్రపంచ దేశాల సారస్వతం
40-గ్రీన్ లాండిక్ సాహిత్యం
ప్రపంచం లోనే అతిపెద్ద ఐలాండ్ గ్రీన్ లాండ్ ఆర్కిటిక్ –అంటార్కిటిక్ సముద్రాలమధ్య ,కెనడియన్ ఆర్కెటిక్ అర్చిపెలగో కు తూర్పున ఉంటుంది .డెన్మార్క్ దేశం లో అటానమస్ ప్రాంతం గ్రీన్ లాండ్ .భౌగోళికంగా ఉత్తర అమెరికాకు చెందినా,రాజకీయ ,సాంస్కృతిక విషయాలలో యూరప్ తో సంబంధం కలిగి ఉంటుంది .ఇక్కడి మెజారిటీ ప్రజలు ‘’ఇనూట్ ‘’జాతికి చెందినవారు .వీరి పూర్వీకులు అలాస్కా నుంచి ఉత్తర కెనడాద్వారా ఇక్కడ ప్రవేశించి సెటిలర్స్ అయ్యారు.ఎక్కువ జనాభా ఆగ్నేయ తీరం లో ఉంటారు .మిగిలిన చోట్ల చెల్లా చెదురుగాకనిపిస్తారు . 5మునిసిపాలిటీలు ఉంటాయి.వీటిలో చేరని రెండు ప్రాంతాలు నార్త్ ఈస్ట్ గ్రీన్ లాండ్ నేషనల్ పార్క్ ,తూలే ఎయిర్ బేస్..రెండోది డెన్మార్క్ అధీనం లో ఉన్నా ,పాలన అంతా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చూస్తుంది .దేశం లో మూడు వంతులు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది .జనాభా సుమారు 56వేలు .ప్రపంచం లో అత్యల్ప జనసాంద్రత ఉన్న దేశం .మూడోవంతు జనం ‘’పెద్ద సిటి ‘’నూక్’’ లో నివశిస్తారు .ఇక్కడ జన జీవితం సుమారు 4,500ఏళ్ళ నుంచే ఉన్నది .నార్స్ మెన్ ఇక్కడ మొదట ప్రవేశించారు .ఎస్కిమో సంస్కృతీ ఇక్కడ ఎక్కువ .1979లో డెన్మార్క్ దేశం గ్రీన్ లాండ్ కు స్వాతంత్ర్యం అంటే ‘’హోమ్ రూల్ ‘’ఇచ్చింది .
ఇక్కడ గడ్డ కట్టిన ఐస్ ఒక తీరం నుంచి మరోతీరానికి ప్రయాణం చేస్తుంది .ఈ ఐస్ షీట్ పై అయిదు పరిశోధక బృందాలు స్థావరాలు ఏర్పాటు చేసుకొన్నాయి .1950వరకు ఒకే ఒక రేడియో స్టేషన్ ఉండేది .2003లలో 35మీటర్ల పొడవు ,15మీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న ఐలాండ్ ను కనుక్కొన్నారు .గ్రీన్ లాండ్ లో 700ల జీవజాతులున్నాయి అంటే బయో డైవర్సిటి ఎక్కువ .యూరోపియన్ వైట్ బిర్చ్ చెట్లు, గ్రీన్ లాండ్ డాగ్స్,ఫంగి మాస్ ,గ్రీన్లాండ్ షీప్ ,గోట్ రీన్ డీర్ గుర్రాలు అధికం .
గ్రీన్లాండ్ లో సోషల్ డెమోక్రాటిక్ వ్యవస్థ ఉన్నది .ఆర్ధికం అంతా ఫిషింగ్ వల్లనే వస్తుంది .ఖనిజ సంపదా ఎక్కువే .రూబి డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు .విద్యుత్ ఆయిల్ డీజెల్ ప్లాంట్స్ వల్ల ఉత్పత్తి అవుతుంది .హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణమూ జరుగుతోంది .ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం కూడా రవాణాకు ఉపయోగపడుతోంది .
గ్రీన్ లాండిక్ అనబడే ఎస్కిమో భాష-ఎల్యూట్ ను, డేనిష్ భాషను ఇక్కడ మాట్లాడుతారు .గ్రీన్ లాండిక్ భాషను అధికారభాష చేశారు .సుమారు పదిశాతం మాత్రమె డేనిష్ మాట్లాడుతారు .డెన్మార్క్ లో లాగా నే ఇక్కడ విద్యా వ్యవస్థ ఉంటుంది .పదేళ్ళ ప్రైమరీ విద్య కంపల్సరి .హైస్కూల్ యూని వర్సిటి చదువుకు అవకాశాలున్నాయి .యూని వర్సిటి ఆఫ్ గ్రీన్లాండ్ అనే ఏకైక యూని వర్సిటి ఉన్నది .
ఇక్కడిమతం షమానిస్టిక్ అనే ఇంసూట్ వారిమతమే .వీరి పురాణాలలో పగతీర్చుకొనే దేవతలు ,వేళ్ళు లేని జలదేవతలు కనిపిస్తారు .వీరే వేల్ వేట సీల్స్ వేట ను రక్షిస్తారని నమ్మకం .మొదటి నార్సే కాలనీ వారు నార్సే గాడ్స్ ను పూజించారు .కాని ఎరిక్ దిరెడ్ అనే వాడి కొడుకు క్రిస్టియన్ మతం తీసుకొని నార్వే వెళ్లి అక్కడినుంచి మిషనరీలను పంపిమతవ్యాప్తి చేశాడు .ఇప్పుడు ప్రొటెస్టెంట్ మతం ఎక్కువ .ఇక్కడ ఆత్మహత్యల శాతం బాగా ఎక్కువ .మత్తుపానీయం తాగే వారి శాతమూ ఎక్కువే .ఎయిడ్స్ వ్యాదికూడా అత్యధికం .నిరుద్యోగతా ఎక్కువే .
ఇప్పుడు స్కాండినేవియన్ కల్చర్ ఇక్కడ చోటు చేసుకొన్నది .మ్యూజిక్ కల్చర్ కూడా మొదలైంది .ఫుట్ బాల్ ఆట కు కేంద్రం .వీరి ముఖ్యాహారం ‘’సువాసాట్ ‘’అనే సముద్ర జంతువుల మాంసం .సాల్ట్ ,పెప్పర్ వాడుతారు .మాంచి రుచికరమైన కాఫీ ఇక్కడి మరో ప్రత్యేకత .తారురోడ్లు ఎక్కువకను కార్లుకూడా ఎక్కువే .
గ్రీన్ లాండిక్ మొదటి నవల ‘’రిప్ వాన్ విన్కిల్ ‘’.మతయ్యాస్ స్టార్చ్ అనే ప్రీస్ట్ ‘ది’గ్రీన్ లాండర్స్ డ్రీమ్స్ ‘’రాసి శతాబ్దం క్రిందట ప్రచురించాడు .’’మా చుట్టూ అందమైన ప్రకృతి ,మేము చిన్నచిన్న గుడిసెలలో ఉంటాం వేట మా వృత్తి ‘’అంటారు .చాలాతక్కువమంది రచయితలే ఉంటారు .ఇతరదేశాలలో ముద్రణపొందిన రచనలు ఇక్కడి నేటివ్ భాషలోకిఅనువాదం పొంది వస్తాయి .పెద్ద లైబ్రరీలు అయిదు , కొన్ని పుస్తకాల షాపులు ఉన్నాయి .డేనిష్ రచయితల రచనలే ఇక్కడ ఉంటాయి .నార్డిక్ క్రైం నవలలకు గిరాకీ ఎక్కువ .వెయ్యి కాపీలు అమ్ముడైతే అదే బెస్ట్ సెల్లర్ ఇక్కడ.
27ఏళ్ళ గ్రీన్ లాండిక్ రచయిత నివిలాక్ కోర్నేలిసన్ ఇక్కడి సాహిత్య చరిత్ర తిరగరాశాడు ఆతను రాసిన ‘’హోమో సెపైన్స్ ‘’నవల 2014లో పబ్లిష్ అయి ,’’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ‘’ప్రక్రియతో 5ప్రధాన పాత్రలతో21వ శతాబ్ది గ్రీన్ లాండిక్ కల్చర్ ను ప్రతిబిబించేట్లు రాశాడు .ముఖ చిత్రంకూడా అద్భుతంగా ఉంటుంది .ఇతడే ఇప్పుడు టాప్ నవలాకారుడు .200పేజీలలో ‘’క్రిమ్సన్ ‘’అనే నవలరాసిన సారా డీటం మంచి పేరుపొందింది నవలలో ఆప్రజల సెక్స్ ,హింస మొదలైనవాటిని అత్యద్భుతంగా చిత్రించింది .నూతన రచయితలూ ఇప్పుడు ఆదేశ సాహిత్యాన్ని బాగా తీర్చి దిద్దుతున్నారు .వీరిలో జేస్సిక్లేమన్ ,జులి హెడెన్ హార్డెన్ బెర్గ్ ,కట్టి ఫ్రడరిక్సన్ వున్నారు.’’దిఇండిజినస్ పీపుల్ ఆఫ్ నార్దేర్న్ యూరప్ ‘’వంటి మంచిపుస్తకాలు వచ్చాయి .’’గ్రీన్ లాండిక్ లిటరరి అవార్డ్ ‘’లుబాలసాహిత్య ,యువ సాహిత్య రచయితలకు అందించి ప్రోత్సహిస్తున్నారు .బుక్స్ ఫ్రం గ్రీన్ లాండ్స్ ,రైటర్స్ ఫ్రం గ్రీన్లాండ్ పుస్తకాలూ లభిస్తున్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-20-ఉయ్యూరు