పేరడీ గీతం
కరోనా ఓ కరోనా ఓ కరోనా
కోవిదా కోవిదా ఓ కోవిదా
నీపై యెంత ద్వేషం పెంచుకొన్నానో
ముక్కు మాస్కు నడుగు మూతి ముసుగు నడుగు చెబుతాయీ –కరోనా ఓ కరోనా
నీపై ఎంత యెంత పగ రగులుతోందో ఈ చేతుల్ని అడుగు ఇకనైనా
చేతులు ముఖానికి తాకినా ,మూతీ ముక్కుకు చేర్చినా
ఒడిలో వాలిపోయి వినాశనం తెస్తున్నావు
జాలీ నాలీ లేని కోవిదా ఓహో కోవిదా
చిరుగాలి, సెలయేరు చూసి ఎన్నాళ్లై పోయిందో
ఇంట్లో మగ్గి మగ్గి మాడిపోయే జనాలనడుగు
చేయి తాకితే చాలు భస్మాసుర హస్తమై
ప్రళయం సృస్తిస్తున్నావు కరోనా ఓ కరోనా
మల్లె పూల వాసనలు చూసి కలవరి౦చి ఎంతకాలమైనదో
తుమ్ముల్లో దగ్గుల్లో దాగి దాగి ఉండి
ఆవులింతలో పేట్రేగి పోయి పోయి
ఆయువు హరిస్తున్న కరోనా ఓ కరోనా
తడి తగిలితే చాలు దావానలమై కోరలు చాస్తున్నావు
నిట్టూర్పులకూ దూరం చేసి నిండా
ము౦చు తున్నావు కోవిదా ఓ కోవిదా
ఎదలో రాసిన రేఖలు నుదుటి రాతలై నులిమేస్తుంటే
లక్షలాది జనం ప్రపంచమంతా నీ కోరలకు ఆహుతై
క్షణాలలో క్షితి బాసి పోతూ నిస్సహాయులైపోతుంటే
కొన ఊపిరులతో మరణం అంచున అల్లాలాడుతుంటే
కనికరం లేని కరోనా కనిపించకుండా పారిపో ,పారిపారి పో ఇకనైనా
జాలిలేని కోవిదా మళ్ళీ ముఖం చూపకు ఎప్పటికైనా మరెప్పటికైనా
నోట్-అక్బర్ సలీం అనార్కలి సినిమా లో’’ సిపాయీ –హసీనా ‘’పాటకు నా స్వేచ్చా పేరడీ
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-20-ఉయ్యూరు