ప్రపంచ దేశాల సారస్వతం
42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం )
సామ్యవాద యుగం -1918 నుంచి –ఈ యుగం లో సాహిత్యం సామాజిక ప్రగతికే అంకితమైంది .విప్లవనేత వ్లాడిమిర్ లెనిన్ ,అతని అనుచరుడు ట్రాట్ స్కి.’’సాహిత్యం –విప్లవం ‘’రాసిన ట్రాట్ స్కి సోషలిస్ట్ సోసైటీ నిర్మాణానికి సాహిత్యం చేసే తోడ్పాటు ను వివరించాడు .ఆనాడు విప్లవభావాలు లేని రచయితలకు ఆడరణ లేదు .విప్లవాభిమాన రచయితలు ‘’పొవుట్చకి’’అంటే ‘’శక్తికొద్దీ సహకరించే వారు అనే పేరుతొ సంఘాన్ని ఏర్పాటు చేశారు .దీనితర్వాత శ్రామిక నవలా రచయితల సంఘం ఏర్పడి వారి రచనలు ప్రజామోదం బాగా పొందాయి .ఈ వర్గ రచయితలు-ఏటం వేస్లి,ఫడ సెరికి సేమోనాన్ ప్రముఖులు .శ్రామికులు ఉత్పత్తి పెంచటం లో ,పనిలో శ్రద్ధ లపై ఈ రచనలు వచ్చాయి .’’నా జన్మభూమి ‘’అన్న వేసిలీ రచన -1926 బహుళ ప్రచారమైంది .ఇతనికంటే పెద్దవాడైన ఇలియా ఎలెన్ బెర్గ్ విశ్వ విఖ్యాతి నార్జించిన బహు గ్రంథ రచయిత..రచనకు గొప్ప సార్ధక్యం తెచ్చి ప్రపంచ ప్రసిద్ధిపొందినవాడు –బోరిస్ పాస్టర్ నాక్-1890-1960..మానసిక సంఘర్షణనలను చిత్రించటం లో ఇతనికి ఇతడే సాటి .ఇతని ‘’డాక్టర్ జివాగో ‘’ప్రపంచ ఉత్తమ గ్రంథం గా వన్నెకెక్కింది .దీనికి 1958లో నోబెల్ ప్రైజ్ పొందాడు .ఐతే నాటి సోవియెట్ రష్యా సమాజం తనకు నచ్చకపోవటం వలన ప్రైజ్ ను తీసుకోవటానికి నిరాకరించాడు .
20వ శతాబ్ది ప్రసిద్ధ 10 మంది రష్యన్ రచయితలు –అలేగ్జాండర్ సోల్జేనిట్స్కి .ఇతని గులాగ్ ఆర్చ్ పెలాగో ,ఒన్ డే ఇన్ దిలైఫ్ ఆఫ్ ఇవాన్ డేనిసో విచ్ ‘’నవలలు సుప్రసిద్దాలు .వ్లాడిమిర్ నబకోవ్-ఎంటోమాలజిస్ట్ ..ఇతని ‘’లోలిత ‘’నవల జగత్ ప్రసిద్ధం .క్లాసిక్ గా గుర్తింపు పొందింది .7 నేషనల్ బుక్ అవార్డ్ అందుకొన్న అరుదైన రచయిత.మైకేల్ బుల్గకోవ్ –డాక్టర్ రచయిత నాటక కారుడు .సోవియట్ రష్యా సమాజం పాలనపై వ్యంగ్య రచనలు చేశాడు .మాస్టర్ అండ్ మార్గరిట ‘’నవల సుప్రసిద్ధమైనది .ఇవాన్ బునిన్ –రష్యన్ సాహిత్యం లో మొదటి నోబెల్ పొందినవాడు .వాస్తవికత కు అద్ద౦ పట్టాడు కవికూడా .అతని ఆటోగ్రాఫ్ ఐన ‘’ది విలేజ్ అండ్ డ్రై కాలీ’’బాగా పేరు పొందింది .వీరితో పాటు ఈకాలపు సుప్రసిద్ధ రచయితలైన టాల్ స్టాయ్ ,డాస్టో విస్కీ ,గోగోల్ ,చెకోవ్ ,టర్జెనేవ్,పుష్కిన్ మొదలైనవారి గురించి ముందే తెలుసుకొన్నాం .10ప్రసిద్ధ నవలలు –యుజిన్ ఒన్ జీన్ –పుష్కిన్ ,దిహీరో ఆఫ్ అవర్ టైం-మైకేల్ లేర్మనెంటో,ఫాదర్స్ అండ్ సన్స్ -టుర్గెనోవ్ ,దిబ్రదర్స్ కర్మజోవ్ –డాస్టో విస్కీ ,డాక్టర్ జివాగో –బోరిస్ పాస్టర్ నాక్ ,దిక్వయట్ ఫ్లొస్ డాన్-మైకేల్ షుల్కొవ్,లైఫ్ అండ్ ఫేట్-వాసిలి గ్రాస్ మన్,వన్ డే ఇన్ దిలైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసో విచ్-అలేగ్జాండర్ సోల్జెన్ ట్సిన్,దిఫనరల్ పార్టి-లియుడ్ మిలా ఉలిత్సయ .
21వ శతాబ్ది గొప్ప రచయితలలు- లియుడ్ మిలా ఉలిత్సయ,వేరాపోలోనో జోకోవ,బోరిస్ ఆకునిన్ ,మైకేల్ షిష్కిన్ ,డిమిట్రిగ్లుకోవ్ స్కి ,తాత్యాన టాల్ స్టాయ
21వ శతాబ్ది గొప్పరచనలు,రచయితలు –లుయుడ్ మిల ఉలిట్సయ –అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత్రి .మొదటినవల ‘’సోనేచ్కా ‘’.సమకాలీన రష్యన్ రచయితలలో మిక్కిలి పాప్యులరాటి పొందింది .వీరా పోలోజ్ కోవా -5వ ఏటనే కవిత్వం రాసింది .2008లో మొదటికవితా సంపుటితో పేరుపొందింది .బోరిస్ అకునిన్ –డిటెక్టివ్ నవలారచయిత.ఎన్నెన్నో అపరాధ పరిశోధకనవలలతో ప్రసిద్ధి పొందాడు .మైకేల్ షిషిస్కిన్-మూడు రష్యన్ లిటరరీ అవార్డ్ లు పొందాడు .సాహిత్యం లో పుష్కిన్ వారసుడుగా గుర్తింపు పొందాడు .డిమిట్రి గ్లూకో విస్కీ –సైన్స్ ఫిక్షన్ రచనలతో ఉర్రూత లూగించాడు .మెట్రో -2033అనే ఇతని పోస్ట్ అపోనోపలిప్టిక్ నవల మాస్కో మెట్రో పై రచన .దీనితోపాటు మెట్రో 2034,మెట్రో 2035 స్సేక్వేల్స్ రాశాడు.తాత్యానా టోల్ స్టాయ-టాల్ స్టాయ్ కి బహుదూరపు చుట్టరికం ఉన్నరచయిత్రి .టర్గెనోవ్ కు బంధువు .సర్రియలిజం రచయిత్రి .నేబకోవ్ తో ఈమె రచనలు పోలుస్తారు .
సాహిత్య నోబెల్ ప్రైజ్ విన్నర్స్ –ఇవాన్ బునిన్ -1933,బోరిస్ పాస్టర్ నాక్ -1958మైకేల్ షలోకోవ్ -1965,అలేగ్జాండర్ సోల్జేన్ ట్సిన్- 1970,జోసెఫ్ బ్రాడ్ స్కి-1987,
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-20-ఉయ్యూరు
—