ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-3

9వ శతాబ్ది మొదట్లో రష్యన్ రచయితలకు జర్మన్ సాహిత్యకారులతో పరిచయమేర్పడి కాల్పనికవాదం ప్రవేశించింది ..ఇందులో వాసిలీ యాన్డ్రీ విచ్ జకోస్కి -1783-1852 మొదటివాడు .ఇంగ్లిష్ రచయితలైన  బైరన్ ,స్కాట్ లనుకూడా యితడు పరిచయం చేశాడు .ఈ యుగ సాహిత్య౦ అంతా అలేగ్జాండర్  సెర్జియో విచ్ పుష్కిన్ -1799-1837 రచనలతో పరమ వైభవం పొందాయి .లుస్లాన్ అండ్ లయుడ్ మిల్లా ‘’అనే ఈతనికావ్యం కల్పనా చమత్కృతిలో విశిష్ట స్థానం పొందింది .లయ సరళత శైలీ త్రివేణీ సంగమంగా సాగింది .’’ఇవ్జినీ వన్ ఈజిన్ ‘’.అనేది ఉత్తమోత్తమకావ్యం .ప్రేమించి సర్వస్వం అర్పించటానికి సిద్ధమైన  ఒక అమాయిక బాలికను కాదని చివరికి ఆమె వేరోకడిని పెళ్ళాడి నా,క ఆమెశీలాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన మూర్ఖ యువకుడు నాయకుడు .పాత్ర పోషణా కల్పనా అసమానాలు .వచనం లోనూ కొత్త వొరవడి సృష్టించి గొప్ప రచనలు చేసి పండించాడు పుష్కిన్..మరికొందరు ప్రముఖులు –యాన్ టన్ అబ్రమో విచ్ డెల్విగ్-1798-1831,నికోలాయ్ మైకలో విచ్ యూజికోవ్ .ఈ యగ కడపటి రచయిత-మైకేల్ యూరి విచ్ లేర్మన్ టోవ్-1814-41.బీదవాడిని కధానాయకుడిగా తీసుకొని అతనిపై లోకానికున్న నిరసన చిత్రించి బాగా ప్రసిద్ధి పొందాడు .

  విప్లవ యుగం -1837-1917—పుష్కిన్ తర్వాత కవులకు గేయకావ్యాలపై ఆసక్తి తగ్గింది .కొత్త విజ్ఞాన శాస్త్ర భావనలకు ఊతం బాగా వచ్చింది వాస్తవిక వచనంపై ఆసక్తి పెరిగింది .దీనితో నవల వికసించింది 20వ శతాబ్దిలో రష్యా లో వచ్చిన  సాఘిక ,ఆర్ధిక విప్లవం రచనలలో ప్రతిఫలించాయి .ఈయుగ తొలి ప్రసిద్ధ రచయితలు -ఇవాన్ సార్జివిచ్ తర్జినీవ్ -1818-83.,నికోలాయ్ వాసిలోవిచ్ గోగోల్ .యూరోపియన్ సంస్కృతిని రష్యాలో ప్రవేశపెట్టినవాడు తర్జి నీవ్.ఇతడి 6నవలలో –తండ్రులు –పిల్లలు ,అనే పేరున్న నవల గొప్పది .దేవుదినికాదని సర్వం సైన్సు అని హేతువాదాన్ని నమ్మి అశాస్త్ర నియమాలను ప్రతిష్ట చేయటానికి ప్రయత్నించి విఫలుడైన బ్జరోవ్ అనే యువకుడు నాయకుడు .వెట్టి చాకిరీ చేసే వ్యవసాయ కూలీల దుర్భర జీవితాలను  ‘’క్రీడాకారుని స్మృతులు ‘’నవలగా రాశాడు .క్రిందితరగతి ఉద్యోగస్తుల లంచగొండి తనాన్ని హాస్యం తో మేళవించి ,వ్యవస్థాగత లోసుగుల్ని బయటపెట్టినవాడు గోగోల్ .బానిసల జీవితాలను మనో ప్రవృత్తులను  అద్భుతంగా  ఆవిష్కరించాడు .ఇతని సమకాలికుడే అలెగ్జాండర్ ఇవనో విచ్ గన్ చెరోవ్.ఇతని ‘’ఓబ్లామావ్ ‘’నవల లో అపూర్వ ప్రజ్ఞ కనబరచాడు  .ఈ యుగ సాహిత్య చక్రవర్తి కౌంట్ లియో టాల్ స్టాయ్ .-1828-1910.ఇతని వార్ అండ్ పీస్ నవల ఉత్క్కృస్టం అన్నాకేరీనీనా కూడా ప్రసిద్ధమైనదే చిన్నకథలూ విరివిగా రాశాడు ..ఎందరికో యితడు ఆదర్శప్రాయుడు .ఫాదర్ డాస్టో విస్కీ -1921-81.బీదల జీవితాలను గొప్పగా చిత్రించాడు .మానసిక వికృ  తులను చిత్రించటం లో ఘనాఘనుడు .సైకాలజీ ఫిలాసఫీ కలగలుపుగా గొప్పనవలలు రాశాడు .క్రైం అండ్ పనిష్ మెంట్,నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్ ,దిఇడియట్ మొదలైన నవలలు గొప్పవి .నవీన నవలారచనకు మార్గదర్శి అయ్యాడు .దార్శనికుడు అంటారు .చాలామంది రచయితలున్నా టాల్ స్టాయ్ ,డాస్టో  విస్కీ అనే మర్రిమానుల కింద ఎదగలేకపోయారు .వీరి రచనలన్నీ 1880కి ముందే వచ్చాయి .తర్వాత పెద్దగా గొప్ప రచనలు రాలేదు .

  రాజకీయ నైరాసశ్యమూ ఒకకారణమే .ఇలాంటి అంధకార యుగం లో దీపంలాగా మెరిశాడు ఆంటాన్  పవలోవిచ్ చెకోవ్ .హాస్య శైలితో కథలు నవలలు రాసి గిలిగింతలు పెట్టాడు .పేదల ఇక్కట్లే ఇతని కథలు చప్పట్లు కొట్టించాయి .అనన్య సదృశ కథా శిల్పం ఇతని సొమ్ము .నాటకాలూ రాశాడు. చిన్నకథలకు పెద్ద పీటవేశాడు .’’మాస్టర్ ఆఫ్ ది మోడరన్ షార్ట్ స్టోరీస్ ‘’అంటారు ఇతని ప్రభావం పడనీ ఆధునికయుగ రచయిత లేనేలేడు .ఈయుగ రచయితలంతా ఆకాలపు అశాంతిని రచనలలో ప్రతిఫలింప జేశారు .కానీ పరిష్కారం చూపించినవారెవరూ లేకపోయారు .ఈ లోటు తీర్చిన మహానుభావుడే మాక్జిం గోర్కీ -1869-1939.గోర్కీ అంటే ప్రజలు అని అర్ధం .మార్క్స్ సిద్ధాంతాలను సామాన్యులకు అర్ధమయే భాషలో రచనలలో చెప్పాడు .బోల్షెవిక్ లు రష్యాను చీకట్లోకి తోసేస్తున్నారని ఎదురు తిరిగాడు ఇతడి ‘’అమ్మ ‘’నవల విశ్వవ్యాప్త కీర్తి నార్జించింది .సోషలిస్ట్ రియలిజం కు ఆద్యుడు .నాటకాలూ రాశాడు

   ఈకాలం లోనే ‘’ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ –కళకళకోసమే ఉద్యమం కూడా వచ్చింది.దీనిలో ముఖ్యుడు డిమిట్రి సేర్జియోవిచ్ మెర్జ్ కోవిస్కి .ఇతడి క్రైస్ట్ అండ్  యాన్టి  క్రైస్ట్ ‘’నవల ప్రముఖం..చివరికి ఇతడూ మార్క్స్ తీర్ధమే పుచ్చుకొన్నాడు .1917 రష్యన్ విప్లవానికి ముందు కొద్దికాలం పద్యం రాజ్యమేలింది .నికోలాయ్  స్టెవెనో విచ్ గుమిలేవ్ -1886-1921,భార్య అన్నా అఖ్మోతవా కావ్యాలు రాశారు .తర్వాత మహా విప్లవం వచ్చి ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయి సాంఘిక రాజకీయ ఆర్దికాలలో పెనుమార్పులు వచ్ఛి సాహిత్యం లోనూ చోటుచేసుకొన్నాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.