ప్రపంచ దేశాల సారస్వతం
మనవి-ప్రపంచమంతా కరోనా వైరస్ తో విలవిలలాడుతూ గిజగిజ తన్నుకొంతుంటే ,కరోనా పేరే తెలీని, సోకని 16 దేశాలున్నాయట .వాటినీ ఆదేశ ప్రజలను అభినందిస్తూ ,వాటి గురించి ,ఆ దేశాల సాహిత్యాన్ని గురించి ఇప్పుడు వరుసగా తెలియ జేసే కార్యక్రమం మొదలు పెట్టాను .ఆ దేశాలే కామరోస్ ,కిరబాది మొదలైనవి .
యూనియన్ ఆఫ్ కామరాస్ దేశం హిందూ మహా సముద్రం లో ఉత్తర చివరనమొజాంబిక్ చానల్ దగ్గర ఆఫ్రికా తూర్పు తీరం లోని ఐలాండ్ .రాజధాని మొరోని .సున్నిమతస్తులు .ఆరబ్ లీగ్ లో సభ్యత్వమున్న దేశం .ఆరబ్ ప్రపంచంలో ఈ దేశం ఒక్కటే దక్షిణార్ధ గోళం లో ఉన్నది .అగ్నిపర్వత భయం జాస్తీగా ఉన్న దేశం .భాష కామరోనియన్ లేక’’ షికోమోరి’’ .కామరోనియాన్ భాష –బంటూ భాషాజన్యం .అరెబిక్ ,లాటిన్ లిపులు వాడుతారు ఫ్రెంచ్ కూడా అధికారభాషగా ఉన్నది ఆరబిక్ తోపాటు.30ఏళ్ళ రాజకీయ పోరాటం చేసి 1975లో స్వతంత్రం పొందింది .ఇక్కడ ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది .కామరాస్ అడవులు దట్టంగా వ్యాపించి మంచి వర్షాలనిస్తాయి.ఫెడరల్ ప్రభుత్వం అధికారం .ఇస్లామిక్ చట్టాలే అమలౌతాయి .మగవారైనా ఆడవారైనా అనైతిక సెక్స్ కు అర్హులుకారు .జనాభాసుమారు పది లక్షలు .ఇక్కడ ఎత్నిక్ గ్రూపులు ఎక్కువ .జనసామాన్యభాష కామోరియన్.లక్షమంది జనాలకు 15మంది డాక్టర్లే ఉంటారు .45శాతం ప్రజ దారిద్ర్య రేఖకు కిందే ఉంటారు .
చదువులన్నీ ఖురానిక్ స్కూల్స్ లోనే జరుగుతాయి .టీచర్ ట్రయినింగ్ తక్కువకనుక విద్యా వ్యవస్థ బాగుండదు ,వసతులు చాలాతక్కువ .పూర్వం యూని వర్సిటి చదువులకోసం ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేది .స్త్రీలు చీర లాంటి డ్రెస్ వేసుకొంటారు .మగాళ్ళు కలర్ ఫుల్ లాంగ్ డ్రెస్ వాడుతారు .పెళ్ళిళ్ళు రెండురకాలు .1-లిటిల్ మారేజ్ 2-గ్రాండ్ మారేజ్ .మొదటిది చట్టబద్ధమైన సింపుల్ మారేజ్ .ఖర్చు తక్కువ .వరకట్నం పెద్దగా ఉండదు .ఈ పెళ్లి గ్రాండ్ మారేజ్ దాకా చెల్లుబాటౌతుంది .గ్రాండ్ మారేజ్ లో హంగూ ఆర్భాటం నగలు నట్రా పెద్దకట్నం లతో ఆర్భాటంగా 15రోజులు చేస్తారు .గ్రాండ్ మారేజ్ కి దాదాపు లక్ష డాలర్లు ఖర్చు చేస్తారు ఇందులో మూడవవంతు మాత్రమె పెళ్ళికూతురు వాళ్లఖర్చు .మిగిలింది వరుడు తాలూకు వారే భరిస్తారు .కామరన్ ఐలాండ్స్ లో ఇది సోషల్ స్టేటస్ కు చిహ్నం .ఇంతఖర్చా అనే వారూ ఉన్నారక్కడ .ప్రభుత్వ దినపత్రిక ‘’అల్ వతన్’’
మారుమూల దేశం అనిపించినా భద్రతా బాగానే ఉంటుంది.కొమొరియన్ ఆర్చి పెలగో లో ఉండటం వలన అగ్ని పర్వత భయం ఎక్కువ .కానీ ‘’పెర్ ఫ్యూమ్డ్ ఐలాండ్స్ ‘’అంటారు .కారణం వనౌషధుల సువాసన ,అందమైన ప్రకృతి పరిసరాలు.అందుకే నెమో ఇక్కడ కరోనా రావటానికి భయపడి ఉంటుంది .అంటే వనౌషధ మహాత్మ్యం కరోనాకు’’నో ఎంట్రి ‘’అన్నదన్నమాట .
కామరోనియన్ సాహిత్య కారులలో మహమ్మద్ అహమ్మద్ చమంగా ముఖ్యుడు .లింగ్విస్ట్ ,పరిశోధకుడు రాజకీయవేత్త ,ప్రొఫెసర్ .స్వాహిలి , అరెబిక్ భాషలు చదివి మడగాస్కర్ ఫ్రాన్స్ లు పర్యటించి అనుభవాలతో ‘’షికోమోరి’’అనే వ్రాత ప్రతి సృష్టించి అందులో వ్యాసాలూ రాశాడు .తర్వాత తనపరిశోదనను 1991లో ముద్రించాడు .ప్రస్తుతం పారిస్ లో’’ నేషనల్ డెస్ లాంగ్వేజెస్ ఎట్ సివిలిజేషన్స్ ఓరియ౦టల్స్’’లో బోధన చేసి కామరోస్ యూని వర్సిటి ఏర్పడ్డాక ఇక్కడే ప్రొఫెసర్ గా ఉన్నాడు .
స్త్రీరచయితలలో కోరాల్లి ఫ్రీ ,తౌహ్ఫాట్ మౌహ్తరే,ఫైజా సోయి యూసఫ్ ఉన్నారు .కోరాల్లీ నర్సింగ్ డిప్లోమాచేసి, వృత్తిలో ఉంటూ రచనలు చేసింది .ప్రస్తుతనివాసం స్విట్జర్లాండ్ .కవిత్వం తోపాటు నవలలూ రాసింది .ఇంగ్లిష్ ,స్పానిష్ లలో దిట్ట .టౌలోసి,పావూ యూని వర్సిటీలలో చదివింది .ఫ్రెంచ్ ,జర్మన్ భాషలలో నవలలు కవిత్వమా రాస్తూనే ఉన్నది .ఆమె రచనలు-లా పెరు డెస్ కొమరిస్ ,లాట్రే కోటే డీ లోషియన్,లి జర్నల్ డే మాయా కాన్ఫిడెన్స్ డున్ చాట్ .మౌహతారే అనేక దేశాలలో నివసించింది ఇక్కడపుట్టినా .సేర్బార్న్ నుంచి ఫారిన్ లాంగ్వేజెస్ లో డిప్లోమాహోల్డర్.వచన రచయితలో రెండవ స్థానం .కవిత్వమూ రాసింది .’’ఆమెస్ సస్పెండిస్’’అనే తననవలా సంపుటి 2011లో వెలువరించింది .ఆమె వ్యాసాలూ అనేక పత్రికలలో వచ్చాయి .ఫైజా యూసఫ్ –జర్నలిస్ట్ ,నావలిస్ట్ .ఆమె నవల ‘’ఘిజ్జా ‘’2015లో వచ్చింది .ఆల్ వతన్ పత్రిక సంపాదకురాలుకూడా .తనరచనలకు తగిన పురస్కారాలూ పొందింది.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-20-ఉయ్యూరు