ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

43-కిరబటిన్ సాహిత్యం

కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణం .బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం 1979లో పొంది సావరిన్ అయింది .ఫసిఫిక్ కమ్యూనిటిలో సభ్యత్వం పొందింది .మొదట్లో ఆస్ట్రోనేషియన్స్ ఇక్కడ వలసవచ్చి స్థావరం ఏర్పరచుకొన్నారు .వీరిది క్రీ పూ ౩౦౦౦ –నుంచి క్రీశ 30౦౦ వరకు ఓషియానిక్ భాష.తర్వాత సమోవా టోంగామొదలైన చోట్లనుంచి సెటిలర్స్ వచ్చారు .వారిలో వారు పెళ్ళిళ్ళు చేసుకొని సంస్కృతి పెంచుకొన్నారు .సముద్రయానం చేసే మెటనీషియా వాసులు  నల్లగా పొట్టిగా చిక్కు జుట్టుతో ఉండేవారు. ఇక్కడ మొదట్లో చేరారని చరిత్ర.వీరినే తర్వాత ఆస్ట్రో నేషియన్లు గుర్తించారు.

  క్రీశ 1300లో ఇక్కడసామోస్ లో  నర మాంసం భక్షకులను నిషేధించటం వలన వారు ఇక్కడినుంచి బయటకు వలస వెళ్ళిపోగా ,బహుళజాతి సమాజం ఇక్కడ అభి వృద్ధి చెందింది .15వ శతాబ్దిలో ఉత్తర ఐలాండ్స్ వారికీ ,మధ్య దక్షిణ ఐలాండ్స్ వారికి పాలన విషయాలలో తగవు లేర్పడి ,అంతర్యుద్ధాలు సాగి ,యూరోపియన్ల రాక తో వారి ఆయుధాలు మందుగుండు సామగ్రితో స్థానిక వనరులఆక్రమణపై పోరాటాలు సాగి రక్తం ఏరులై ప్రవహిచింది .కిరబటి అతని సైన్యం పొందిన ఆయుధ సామగ్రివల్ల ఎదురులేక పెత్తనం చెలాయించాడు .17,18శతాబ్దాలలో యూరోపియన్ షిప్ లు ఇక్కడికి వచ్చి దక్షిణ ,ఉత్తర పసిఫిక్ తీరాలకు నౌకామర్గాలేర్పరచి కాలనీ ప్రభుత్వాలు స్థాపించాయి .తర్వాత స్థానికపౌరుల పోరు ఫలితంగా స్వయం పాలన ఇచ్చి ,తర్వాత 1979జులై 12న సార్వభౌమాధికారం ఇచ్చేశారు .టేబురోరో టిటో1994 లో ప్రెసిడెంట్ అయ్యాడు .2012లో సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఫిజి నుంచి 2,200 హెక్టార్ల భూమిని కిరబటి ప్రభుత్వం కొన్నది .చాల దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోన్నది .ఇక్కడి పోలీస్ వ్యవస్థ చట్టాల అమలుకు సాయపడుతుంది ,దేశాన్ని మొత్తం 3 ఐలాండ్ గ్రూపులుగా –గిల్బర్ట్ ఐలాండ్స్ ,ఫోనిక్స్ ఐలాండ్స్ ,లైన్ ఐలాండ్స్ గా విభజించి పాలన సాగిస్తున్నారు .

  దేశంలో సముద్రమట్టాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి .నేలలో ఉప్పు శాతం ఎక్కువ .వాతావరణం ఆరోగ్యకరం కాదు .ఫాస్ఫేట్ నిక్షేపాలు ఎక్కువ దానికోసం మైనింగ్ బాగా జరుపుతారు .సహజంగా కొబ్బరి ,పాండనస్ చెట్లు విపరీతం .దేశం స్వతంత్రం పొందేనాటికే ఫాస్ఫేట్ నిక్షేపాలు అయిపోయాయి .కనుక ప్రపంచం లో అభివృద్ధిలో బాగా వెనకబడిన దేశం అయింది .ఆస్ట్రేలియన్స్ ,టైవాన్ దేశాలు  ,వరల్డ్ బ్యాంక్ బాగా ఆర్ధిక సాయమందిస్తున్నాయి .ఇక్కడ రెండు ఎయిర్ లైన్స్ మాత్రమె వినియోగం లో ఉన్నాయి .

 ఇక్కడి ప్రజలు ఓషియానిక్  భాష ఐన ‘’గిల్బెర్టీస్’’మాట్లాడుతారు .ఈ దేశానికి బ్రిటిష్ కెప్టెన్ ధామస్ గిల్బర్ట్ పేరుమీద ‘’గిల్బర్ట్ ఐలాండ్స్ ‘’అని కూడా పిలుస్తారు .అధికారభాష ఇంగ్లిష్ .రాజధాని తరోవా బయట ఇంగ్లిష్  మాట్లాడరు .ఈ రెండు భాషల్ని కలగాపులగం చేసి మాట్లాడుతారు .ముఖ్యమతం క్రైస్తవం .సగటు జీవనప్రమాణం 60ఏళ్లు.వండని సముద్ర ఆహరం తినటంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువ .లక్షమందికి 23మంది డాక్టర్లే ఉన్నారు.విషాహారం తినటం తో జబ్బులెక్కువ . ప్రాధమిక విద్య ఉచితం తొమ్మిదేళ్ళవరకు .మిషన్ స్కూల్స్ రద్దు చేసి ప్రభుత్వమే స్కూల్స్ నిర్వహిస్తోంది .ఉన్నతవిద్య ఫిజీలో చదువుతారు .కిబాటి యూనివర్సిటి ఏర్పడింది .

  పాటలు డాన్స్ సంగీతం బాగా ఇష్టం ప్రజలకు .కామన్వె ల్త్ గేమ్స్ లో పాల్గొంటుంది .వెయిట్ లిఫ్టింగ్ అభిమానం. ఫుట్బాల్ టీం ఉంది .సముద్ర పక్షులకు గొప్ప ఆవాసభూమి స్కూబా డైవింగ్ ,వరల్డ్ క్లాస్ ఫ్లై ఫిషింగ్ ఎక్కువ .విహార యాత్రకు అనువైనదికాదు.అసలామాట నే విని ఎరుగరు అక్కడి జనం. దాన్ని పలకటం కూడా రాదు.నాలుగు అర్ధగోళాలలో  స్తబ్దుగా ఉండే దేశం ఇది .ఉద్యోగకల్పన ,సంప్రదాయ నైపుణ్యానికి స్పందనలేకపోవటం ,  ఇంటర్నల్ మైగ్రేషన్ ,వనరులను విపరీతంగా వాడుక ,స్త్రీలకూ ప్రోత్సాహం లేకపోవటం ,అప్పులలో కూరుకు పోవటం ,కుటుంబ నియంత్రణ కు మతం  అడ్డుఅవటం తో  జనాభా పెరగటం ,ఆహార పదార్ధాలకు దిగుమతులపై ఆధారపడటం కిరబాటి దేశానికి గొప్ప శాపాలు .అందుకే ఎవరూ ఇక్కడికి వచ్చి ఉండటానికి సాహసం చేయకపోవటం ఒకరకమైన వరం కూడా .ఇక్కడ నారకత వ్యామోహం వెర్రి తలలు వేసి ఆటవికంగా మారకపోవటం వలన కరోనా కన్య కు ఈ ఐలాండ్స్ పై దృష్టి సోకలేదు  కన్నెత్తి అయినా చూడలేదు .

  కిరబాటి సాహిత్యం –కిరబాటి కవులలో ఒక్కరే టేరెసియా సీల్వాకనిపిస్తోంది .1969లోపుట్టి 2017మరణించింది . .ఆఫ్రికన్ –అమెరికన్ స్కాలర్ .ఫసిఫిక్ స్టడీస్ లో  దిట్ట .ఫిజిలోని సమకాలిక సమస్యలపై పరిశోధించింది .ఫసిఫిక్ వ్యవహారాలలో ఆరితేరింది. ఆమె సలహా అందరికి శిరోధార్యం .తనమార్గదర్శి ఎపెలి హావోఫా అన్న ‘’ We sweat and cry salt water, so we know that the ocean is really in our blood”అన్నమాటలు ఆమెకు స్పూర్తి .2009ఏప్రిల్ గార్డియన్ పత్రిక ఆమెను ‘’కిరబాన్ నేషనల్ ఐకాన్స్ లో ఒకరు ‘’అని ఘనంగా శ్లాఘించింది .పసిఫిక్ ఐలాండ్స్ సంస్కృతి పై మహత్తర పరిశోధన చేసిన మహిళా మూర్తి అన్నది ఒరిగాన్ యూని వర్సిటి.2010లో మెకాలే లెక్చర్ అవార్డ్ పొందింది .2014లో ఫసిఫిక్ పీపుల్స్ అవార్డ్ అందుకొన్నది .మొదటి ఫసిఫికా అవార్డ్ కూడా దక్కింది .విద్యాబోధనలో విద్యార్ధులకు క్రియేటివ్ ఇంటర్ ప్రిటేషన్ కు గొప్ప అవకాశం కల్పించింది .ఆమె రచనలలో కొన్ని –వాట్ మేక్స్ ఫిజి వుమెన్ సోల్జర్స్ ,న్యూడిటి,బికినీస్ అండ్ ఆదర్ ఫసిఫిక్ నేషన్స్.కవిత్వం లో- నీ నిమోనా అంటే సెర్చింగ్ ఫర్ ఐ కన్ సీ ఫిజి ,విస్సోని హీరేనేకో రియల్ నేటివ్స్ టాక్ ఉన్నాయి .

 రచనలు చేసినవారు ముగ్గురే కనిపిస్తున్నారు 1-అబురేటిటకాయివో2తెరేసియా,తియాల్వా 3-కీనా టిటో.వీరిలో అబురేటియో-పొలిటీషియన్,ఆకడేమీషియన్.ఒకప్పుడు లైన్ అండ్ ఫోనిక్స్ గ్రూప్స్ కు మంత్రిగా ఉన్నాడు .ఇతని రచన –కంట్రోల్ –ఇ టాకు టే కమిటాన బాగా పేరుపొందింది .మూడవ రచయిత కీనాటితో కిరబాటి రిపబ్లిక్ ఫస్ట్ లేడీ –సంస్కృతీ ,పరిరక్షణపైచాలా ప్రసంగాలు చేసింది .తరతరాల సంస్కృతిని కాపాడమని స్త్రీలను ఉద్బోధించింది .ట్రడిషన్-ఎన్శేంట్ గిల్బార్టేస్ సొసైటి ‘’పుస్తకాని కో ఆధర్ కూడా .తెరేషియా గురించి ముందే తెలుసుకొన్నాం .

  ఈ దేశ ప్రముఖ పుస్తకాలు –అకెకేరియా-టోని,జీన్ విన్కాప్,ఎ టోల్పాలిటిక్స్ –రచయితల సముదాయం ,సి౦ డ్రిల్లాస్ ఆఫ్  ది ఎంపైర్ .మేనేజి మెంట్ ఆఫ్ ది మెరైన్ రిసోర్సెస్ –రోనిటిటీ వాకి,టేల్స్ ఆఫ్ కిరబాటి-కాటియామై బార్నికి ,కేబెటీటకే మై బొంరికి అండ్ మేరియా మై  బువోటా మొదలైనవి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.