ప్రపంచ దేశాల సారస్వతం
44-లెసెతోవియన్ సాహిత్యం
కరోనా వైరస్ మహమ్మారి సోకని మూడవ దేశం లెసెతోవా కింగ్డం దక్షిణాఫ్రికా సరిహద్దు లో ఉంది.దీనితోపాటు వాటికన్ సిటి సాన్ మేరినో లున్నాయి .ఇతర మూడు దేశాల సరిహద్దు ఉన్న ఏకైక రాజ్యం .రాజధాని మసేరు.ఒకప్పుడు బ్రిటిష్ క్రౌన్ బ్రాస్టో లాండ్ లో ఉండేది .స్వతంత్రం 4-10-1966పొందింది .20లక్షల జనాభా .యుఎన్ ,కామన్ వెల్త్ ,ఆఫ్రికన్ యూనియన్ లలో సభ్య దేశం .’’సెసోతో భాష మాట్లాడే ప్రజలు ‘’అని ఆదేశ౦ పేరుకు అర్ధం .ఇక్కడి ప్రజలను ‘’సాన్ ‘’అంటారు .వారి ప్రత్యేకమైన ‘’రాక్ ఆర్ట్ ‘’అక్కడి పర్వత ప్రదేశాలన్నిటిపైనా కనిపిస్తుంది
ఒకప్పుడు బసౌటోలాండ్ గా పిలువబడిన లెసెతో దేశం మోషోయి షో రాజుపాలన లో 1822లో ఏక రాజ్యమైంది .తర్వాత బ్రిటిష్ ,డచ్ కాలనీల పోరాటాలలో 1785లో బ్రిటిష్ వశమైంది .కేప్ కాలని నుంచి’’ ట్రెక్ బోయర్ లు ‘’వచ్చి స్థిరపడ్డాడు .1869నుంచి 1966వరకు బ్రిటిష్ పాలనలో ఉన్నది .1966లో స్వాతంత్ర్యం పొంది ‘’కింగ్డం ఆఫ్ లెసోతో ‘’అయింది .పార్లమెంట్ ఉన్న మొనార్కి దేశం .న్యాయవ్యవస్థ చాలా స్వతంత్రంగా ఉంటుంది .2010లో చేసిన టెస్ట్ లవలన నాలుగవ వంతుజనాభాకు హెచ్ ఐ వి .పాజిటివ్ ఉన్నట్లు తేలింది .అధిక నిరుద్యోగం ,ఆర్ధిక దివాలా బలహీనమైన కరెన్సీకూడా ఈ దేశానికి శాపాలు .ఎత్తైన దేశం కనుక సంవత్సరమంతా చల్లగా ఉంటుంది .స్నో కూడా పడుతుంది .ఎన్నో సార్లు వర్షాభావ పరిస్థితులేర్పడి ,చిన్నకమతాలపై ఆధారపడి జీవిస్తారు .2007లో30ఏళ్ళలో ఎప్పుడూ రాని తీవ్రమైన కరువు తో దేశం అల్లకల్లోలమై యుఎన్ వో దేశం లో ఎమర్జెన్సి ప్రకటించమని సలహా ఇచ్చింది .ప్రపంచ దేశాలు మానవతా భావంతో సాయం అందించి ఆదుకొన్నాయి .పల్లెలు వదిలి పట్టణప్రాంతాలకు, సౌత్ ఆఫ్రికాకు వలస పోవటం ఇక్కడ సహజం
లలెసోతా దేశం లో 339 జాతుల పక్షులున్నాయి .క్రూర జంతువులూ పాములు పాలిచ్చే జీవజాలం తోపాటు ఇక్కడి’’ తెల్లతోక ఎలుక’’ ప్రత్యేకం .ఆల్పైన్ వనాలు జాస్తి .వనౌషధాలో ఎక్కువే .ఇక్కడి సహజ వనరులలో పుష్కలమైన నీరు ,వజ్రాలు మరో ప్రత్యేకత .లేట్సేంగ్,మోతే లిఖో బాంగ్ మొదలైన చోట్ల డైమండ్ లు ఉత్పత్తి అవుతాయి .2014లో 300 మిలియన్ డాలర్ల ఖరీదైన 24వేల కారట్ల వజ్రాలు ఇక్కడ తయారయ్యాయి .దీనితో క్రమక్రమ౦గా ఆర్ధికాభి వృద్ధి చెందుతోంది దేశం .కరెన్సీ పేరు ‘’లోటి’’.ఇది దక్షిణాఫ్రికా ,నంబియా స్వాజిలాండ్ మొదలైన దగ్గర దేశాలలో చెల్లుబాటు అవుతుంది .
ఇక్కడి తెగలు దాదాపు 90శాతం బంటూ భాష మాట్లాడేవారు .క్రిస్టియన్ మతావలంబకులే .ఆఫ్రికా దేశాలో ఎక్కువ అక్షరాస్యతా శాతం 75 ఉన్న దేశం లిసోతో.3శాతం ప్రజలు మాత్రమె ఇంటర్ నెట్ వాడుతారు .నేషనల్ సెక్యూరిటి కౌన్సిల్ ఏర్పడి ప్రజారోగ్యం సంరక్షిస్తోంది .ఫ్లూట్ లాంటి ‘’లెకోలులో ‘’ఇక్కడి సంగీత వాయిద్యం .వీరి జాతీయగీతం ‘’లెసోతో మా తరతరాల దేశం ‘’తో మొదలౌతుంది .ఆహారపు అలవాట్లలో ఆఫ్రికా, బ్రిటిష్ విధానాలు ఉంటాయి .ఆడవారు స్వయంగా వంట చేసి వడ్డించటం సంప్రదాయం .పశువులపెంపకం బాగా ఉంటుంది . లెసోతో లో చైల్డ్ లేబర్ ఇప్పటికీ ఉంది .డయాబెటేస్ వ్యాధి ఎక్కువ .రేప్ లలో టాప్-92శాతం .60శాతం స్త్రీలు సెక్స్ వయోలెన్స్ బాధితులే .నేరాలూ ఘోరాలూ ఎక్కువే .ఇన్ని ఉన్నా సురక్షిత దేశం అని పేరుపొందింది .జిడిపి 1222డాలర్లు .అయినా నవనాగరకత కు దూరం గా ఉన్న దేశం కనుక ,ఎయిడ్స్ వ్యాధి ఎక్కువ ,ఆడవారు సెక్స్ హింసా బాధితులూ ,అతిపెదరికం ,దుర్భిక్షం కరువుకాటకాలు ,చైల్డ్ లేబర్ ఉండటం తో కరోనా ఇక్కడకాలు పెట్టటానికి బయపడి ఉంటుంది .అందుకే ఆదేశం హాయిగా ఉ౦ది ఉన్నదానితో సంతృప్తి చెందుతూ .
లెసోతో సాహిత్యం –బంటూ నాయకులు పూర్వతరాలవారి పాటలు పాడుకొనేవారు .వీటికి ‘’లితోకోఆఫ్ లెసోతో ‘’అనిపేరు .మోసోతో ఒకకవి .పాటలలో గొప్ప లయ ఉంటుంది .గొప్ప ఊహాశక్తి ఉన్నపాటలు .
రచయితలలో మొరోసి అఖిన్ బారే1945-2020,ధామస్ మోఫోలో -1876-1948,కరోలిన్ నిసేలి సెంగ్ మోజ్మనో హాల్పో, మోఫో మస్తెపో నితున్య ఉన్నారు .వీరు ఇంగ్లిష్ లోనే రాసినా సాహిత్యం అందుబాటులో లేదు .మోపోలో 1931లో ‘’చకా ‘’అనే ప్రసిద్ధ నవల సేసోతో భాషలో రాశాడు .ఇది జులు అనే చక్రవర్తి రాజు కథ –20వ శతాబ్ది ఆఫ్రికా సాహిత్య 12 బెస్ట్ బుక్స్ లో ఇది ఒకటి .ఇంగ్లిష్ లోకి రెండు సార్లు తర్జుమా అయింది .మోఫోలో ఆఫ్రికా అతిపూర్వ సాహిత్యకారులలో ఒకడు .లేసోతాలో ఖోజనే లో పుట్టాడు .మిషనరీ బడులలో చదివి టీచర్ సర్టిఫికేట్ పొందాడు ,మాన్యుస్క్రిప్ట్ రీడర్ గా ఉద్యోగించాడు .అప్పుడే మొదటిరచన మొయేటి ఓయు బోచబెలా –అంటే’’ ది ట్రావెలర్ ఆఫ్ ది ఈస్ట్ ‘’రాశాడు .ఇదిఒక యువ సేసోతో యాత్రికుని కథ అతన్ని క్రిష్టియానిటి రక్షించిన ఇతి వృత్తం .దీని విజయం ప్రేరణతో ఉపాధ్యాయులు రచన ఉద్యమం ప్రారంభించారు .1910లో ‘’పిట్సేంగ్’’రాశాడు ఇందులో మతం చేతిలో మోసపోయిన యువకుడి జీవితం ఆవిష్కరించాడు .ఇది ఆనాడు పెద్ద సంచలనే తెచ్చింది .
‘’ఇఫ్ మౌన్టేన్స్ స్పోక్’’రచన మాట్స్ ఎలిసో మొట్స్ఓయన్ రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-20-ఉయ్యూరు