కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు
మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్
మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా
మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు
కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా
మీ- మరి కింద పారేస్తున్నావెందుకు
కా –మన నాయకుడూ రాష్ట్రం చేస్తున్న ఒక్కొక్కతప్పుకూ హైకోర్టు మొట్టికాయలు వేసినప్పుడల్లా ఒక్కొక్క గింజ కిందపడేస్తానన్న మాట .
మీ –అదేదో సినిమాలో రామారావుకృష్ణుడు వేషం లో పళ్ళెం లో వక్కలు లెక్కపెడుతూ కింద పడేస్తున్న సీను లా ఉంది నీ పని .హాయిగా వక్కలే పెట్టుకొని ఆయనలా ఏరిపారేయ్యచ్చుగా
కా –సడేలే సంబడం .పావుకిలో నాలుగొందలు. దానికి అంతడబ్బు ఎందుకు దండగ అని ఈ ఉపాయం పన్నా
మీ- నీ బుర్ర మహా సూక్ష్మ౦ వదినా .వందా అయ్యాక ఏమౌతుంది ?
కా –ఆ సినిమాలో ఏమైందో అదే అవుతుందని నమ్మకం .ఇప్పటికి 62 గింజలు ఏరిపారేశాను
మీ-సరేకానోదినా.కరోనా మహమ్మారి ఇంతలా విరుచుకు పడిం దేంటి
కా –అవునొదినా .
మీ- ఎక్కడికీ కదలటానికి మెదలటానికీ లేని అష్ట దిగ్బంధం అయింది వెధవ జీవితం
కా –నాకూ అలానే అనిపించింది కానీ ,చాలా మేళ్ళుకూడా చేసిందని పించింది నాకైతే
మీ-ఆ మాట అంటే జనం ఊరుకోరేమో వదినా .అయినా ఎందుక లా అన్నావ్
కా –మన ప్రధాని నాలుగు రోజులకోసారి ,బయల్దేరి అరడజను దేశాలు తిరిగి వచ్చే వాడు .ఇప్పుడు కదలటానికి వీల్లేకుండా పోయి౦ది కదా .వేలకోట్లు ప్రజాధనం సేవ్ అయి౦ది కదా .అరగంటకో సారి లాల్చీ చొక్కాలు టర్బన్ మార్చే అవసరం లేదుకదా దర్జీ ఖర్చు ఇస్త్రీ ఖర్చు ఆదాకాలేదా
మీ –అవునుస్మీ .భలే ఆలోచిస్తావు నువ్వు వదినా .ఇంకా ?
కా –మార్చి నుంచి ఇక్కడి వేడి తట్టుకోలేక ఏదో ఒక మిషతో చల్లని దేశాలకు ఫామిలీలతో సహా తుర్రుమనే మంత్రుల ,ప్రజాప్రతినిధుల టూర్ల ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా తగ్గింది కదా
మీ –అవునుస్మా –మన నాయకుడి సంగతి ?
కా –యాత్రలపెరుతో రోడ్లమీదకొచ్చి బుగ్గలుగిల్లి ముద్దులు పెట్టె సీన్లు కట్ చేసి వాళ్ళ ను కాపాడింది కదా కరోనా
మీ –అవునొదినోయ్.పాపం బాబు బయటికి రావటం లేదు కదా
కా -70 ఏళ్ళు అలుపెరుగని ప్రజాజీవితం లో అలసి పోయాడు .కాసింత విశ్రాంతి కలిగించి౦ది కాదా కరోనా
మీ –నిజమే ,ఇంకా
కా – రాజధాని అమరావతి అక్కడే ఉండాలన్న ఉక్కు ధ్యేయంతో ఎవ్వరూ పట్టించుకోకపోయినా 127రోజులు గా చేస్తున్న ఉద్యమం కరోనాలోనూ వారి మనో ధైర్యాన్ని దేబ్బతీయకపోవటం అభినదనీయం .వారి జోలికి కరోనా రాకపోవటమే వారికి విజయం సిద్ధిస్తుందనే నమ్మకం కలిగిస్తోంది .వారంతా సురక్షితంగా ఉండాలని, త్వరలోనే ఆశయ సాధన జరుగుతుందని ఆశిద్దాం .గంటకో జీవో మార్చే వారికి పరాభవం తప్పదు మీనాక్షీ
కా –అన్నిరకాల ప్రయాణాలు లేవు కనుక యాక్సి డెంట్లు లేవు జనమరణాలు లేవు .ఇంతకంటే ఏంకావాలి
మీ-వినోదాలు బంద్ కదా వదినా
కా –సినిమా క్లబ్బు పబ్బు అన్నీ బంద్ అవటం తో ఆడపిల్లల ,స్త్రీల మానప్రాణాలు రక్షి౦ప బడలేదా .అవునా కాదా నువ్వే చెప్పు
మీ –అవునవును అంతా నిజమే .ఇదివరకు ఎక్కడ చూసినా జనప్రవాహమే .ఇప్పుడా గోల లేదు
కా –ఎస్ .ప్రతిదీ మితిమీరితే అనర్ధమే మిగిలేది .హాయిగా ఇంటి పట్టున ఉంటూ కుటుంబంతో కాలక్షేపం చేసే తీరిక లభించింది కరోనా లాక్ డౌన్ వలన
మీ- మనం సరే దేవుళ్ళకు కూడా ఫుడ్ కట్ కదా
కా –పాపం దేవుళ్ళకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారు భక్తులు .ఇరవైనాలుగు గంటలూ దర్శనాలే ,ప్రసాదాలే .సమస్త లోకాలను పాలించే వారికి కాసింత అయినా విశ్రాంతి వద్దా ?అలా లేక పొతే వారి మానసిక స్థితి ఏమౌతుంది .పాలన సవ్యంగా చేయగలరా ?ఇదీ వారిపాలిటి వరమే . మనమూ తీర్ధ యాత్రలపేరుతో వేలాది రూపాయలు ఖర్చు చేసే పని లేకుండా పోయింది .ప్లాస్టిక్ వాడకమూ తగ్గింది
మీ-చక్కగా చెప్పావు కామాక్షి వదినా .వాతావరణమూ కాలుష్య రహితమవటానికి బాగా తోడ్పడిందికరోనా
కా –అవును పర్యావరణ స్పృహ కలిగించింది .జీవావరణ ,ప్రకృతి పరిరక్షణపై దృష్టి ఏర్పడటానికి సాయం చేసింది .మనచుట్టూ పచ్చని ప్రకృతి ఉంటేనే, మనజీవితాలూ పచ్చగా భద్రంగా ఉంటాయి వదినా
మీ –కరోనా లాక్ డౌన్ వలన ఆర్ధికం ఏమౌతుంది
కా –కుదేలౌతుంది ఖాయం .కాని ఒక గుణ పాఠం నేర్పింది .మాటలు చప్పట్లు ,కొవ్వొత్తులతో జీవితాలు బాగు పడవు అనే ఎరుక కలిగించింది .మన ఆర్ధికం ఎంత డొల్లగా ఉందో విస్పష్టంగా చూపించింది .చేతులుకాలాక ఆకులు పట్టు కోవద్దు అనీ బోధించింది
మీ –అంటే ?సరిగ్గా అర్ధమయెట్లుచెప్పోదినా
కా –మన ఆస్పత్రులు యెంత అధ్వాన్నంగా,ఉన్నాయో వాటికోసం మన ప్రభుత్వాలు యెంత తక్కువ డబ్బు కేటా ఇస్తోందో,రోగుల నిష్పత్తిని బట్టి డాక్టర్లు ,నర్సులు మందులు పరికరాలు లేకపోవటం మనల్ని వెక్కిరిస్తున్నాయి .రిసెర్చ్ మీద దృష్టి ముందు చూపు లేకపోవటాన్ని ఎత్తి చూపింది కరోనా
మీ –అలా అంటా వేమిటి వదినా .మన దేశానాయకుడు ప్రక్క దేశాలనే మట్టి గరిపిస్తుంటే ?
కా –మనం చెప్పినట్లు చేసే సైన్యం ఉ౦ది కనుక ఏదో హడావిడి దాడి చేసి ఎన్నికలముందు వోట్ల పంట రాల్చుకొంటున్నారు .రోగాలు మనకు చెప్పిరావు .వాటిని ఊహించే సామర్ధ్యమూ మన సైంటిస్ట్ లకూ మనం కల్పించం .అందుకే కరోనా ఒక ఝలక్ ఇచ్చి అందర్నీ ‘’సావదాన్ ‘’చేసింది
మీ-పండగలు ,జనాలతో పూసుకోటాలు రాసుకోటాలు ,ఎవరో ఇచ్చినవి ఎవరిపేరుతోనో మూక జన సమావేశాల్లో జాతరలాగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రాజాప్రతినిధులు మంత్రులే చేయటాలు పంచటాలు ,మత ప్రార్ధనలు వారిని అనుమంతి౦చటాలు,వారివల్ల కరోనా వ్యాప్తి అయి కొంప మునిగే దాకా హోమ్ శాఖ నిర్లిప్తంగా ఉండటం ఇవన్నీ ఏ ప్రభుత్వమూ చేయరాని పనులుకదా వదినా
కా –నువ్వూ బానే ఆలోచిస్తున్నావే వదినా ధాంక్స్ .ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నకవి మాట మనం నిజం చేస్తున్నాం .మనం ఆచరించకుండా ప్రవచనాలు చేస్తాం
మీ-అసలు కరోనా సమస్యే కాదన్నవారు ఇప్పుడు గగ్గోలు పెడుతుంటే ఆశ్చర్యంగా ఉంది
కా –కరెక్ట్ వదినా .పారా సెట్ మాల్ బ్లీచింగ్ పౌడర్ , ఫినాయిల్ చాలు అని ఉద్బోధించి ప్రజలను జోకొట్టి మభ్యపెట్టిన నాయకులవల్లనే ఇంత వ్యాప్తి జరిగింది .నిజాయితీగా లెక్కలుతెలియ జేయకపోవటం ,కక్కుర్తిగా కిట్లు కొని లాభాలు పండించుకోటం,గంటకో అబద్ధం చెప్పి దబాయించటం అడిగినవాడి పై కేసులు పెట్టటం డ్యూటీ సక్రమంగా చేసే డాక్టర్లు మందులు పరికరాలు సేఫ్టి మెజర్స్ లేవని అడిగితె సస్పెండ్ చేయటం ఆటవికమే .తగిన ఫలితం అనుభవిస్తారు .
మీ-మానవత్వం పరిమళించాల్సిన చోట దానవత్వం రాజ్యమేలటం మన దురదృష్టం చేతులారా వోట్లేసి అంటించుకొన్న అరిష్టం
మీ-ఈ మధ్య పొత్తులు చెడినట్లు వార్తలు వస్తున్నాయి ?
కా –కావాలని అన్నిరకాల అబద్ధాలు రిగ్గింగులు ఎన్నికలకమీషన్ చేత దొంగ దెబ్బలు ఇటియెం మెషిన్ల తో దాగుడు మూతలు ,నోట్ల మూటలపంపకాలతో వంచనా శిల్పం తో దగ్గరుండి గెలిపించి ,ఇప్పుడు తమనే లెక్క చేయకపోతే గురివింద సామెత గుర్తుకొచ్చింది ఢిల్లీ పాలకులకు .సర్వతోముఖంగా అభి వృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చేజేతులా సర్వ నాశనం చేసి అపకీర్తి మూటకట్టుకొన్న దాని ఫలితమే ఇది .తమదాకా వచ్చేదాకా ఎవరికీ తెలియదుకదా .ఇప్పుడు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణల వర్షం, తిట్ల దండకం కాణీపాకం ప్రమాణాల దాకా వచ్చారు .తిలాపాపం తలాపిడికెడు. అనుభవించాల్సిందే వదినా
మీ –నీ దగ్గరకు రావటం తో నా మససు శాంతపడింది వదినా .చెప్పుకోటానికి ఎవరూ లేరు .అందుకే వచ్చి నిన్ను విసిగించాను .
కా –అదేమిటి మీనాక్షి వదినా.నాలుగు మంచి సంగతులు మాట్లాడుకొన్నాం .మంచి జరగాలని కోరుకున్నాం.తప్పులు సవరించుకోమని సూచించాం .అంతేగా
మీ –అంతేగా అంతే మరి కామాక్షి వదినా ఉంటాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-20-ఉయ్యూరు
.
—