ప్రపంచ దేశాల సారస్వతం
45-మైక్రో నేషియా సాహిత్యం
కరోనా బారి పడని అయిదవ దేశం మైక్రో నేషియ .మైక్రో నేషియా అంటేనే చిన్న చిన్న దీవుల సమూహం అని అర్ధం .దీన్ని ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అంటారు .పడమటి ఫసిఫిక్ సముద్రంలో వేలాది ఐలాండ్స్ ఉన్న దేశం .తూర్పున పోలినేషియా ,దక్షిణాన ఐలాండ్ మలనేషియా లతో సాంస్కృతిక సంబంధాలున్న దేశం .జనాభా చాలాభాగం ఆస్ట్రో నేషియన్లు .ఓషియానిక్ రియలం లో ఇది భాగం .నాలుగు ఆర్చిపెలాగో లున్నాయి అవే కరోలిన్ ఐలాండ్స్ ,గిల్బర్ట్ ఐలాండ్స్ ,మారియానా ఐలాండ్స్ ,మార్షల్ ఐలాండ్స్ .ఎన్నో మిలియన్ల సంవత్సరాలక్రితమే ఇక్కడ మానవ ఆవాసం ఉన్నది .1521నుంచి మాత్రమే స్పానిష్ షిప్ లు మారియానాస్ లో కాలు పెట్టిన దగ్గర్నుంచి యూరోపియన్ ల సంపర్కం ఏర్పడింది .20వ శతాబ్దిలో ఈ దేశం అంతా అమెరికా ,జర్మని ,బ్రిటిష్ ఎంపైర్ లమధ్య మూడు విదేశీ గ్రూపులుగా విభజన చెందింది .21వ శతాబ్దిలో మైక్రోనేషియాలో ఉత్తర మారియానా ఐలాండ్స్ తప్ప మిగిలిన ఐలాండ్స్ స్వతంత్ర రాస్ట్రాలయ్యాయి .మొత్తం ఒకలాక్ష 13వేల జనాభా. చేపల వేట ,ఎగుమతి ఇక్కడి ముఖ్య ఆదాయం .టూనాపంట కూడా ఆర్దికానికి తోడ్పడుతోంది .కోరల్ రీఫ్స్ చూడటానికి వచ్చే స్కూబా డైవర్స్ ,వాల్ డైవ్స్,సంకేన్ షిప్స్ చూసే జనం ఇక్కడి అట్రాక్షన్ .సర్ఫింగ్ కోసం విపరీతంగా టూరిస్ట్ లు వస్తారు .బికినీ డైవింగ్ మరో ప్రత్యేకత. ఇక్కడి తెగలలో కరోలియన్ ,కామోర్రో ,చౌకీస్ ,కేపింగ్ ,నౌరువాన్ లు ఉంటారు .దాదాపు అంతా మైక్రోనేషియాన్ భాషలనే మాట్లాడుతారు .ఇవే మార్శల్లెస్,గిల్బెర్టేస్ ,కొశ్రియన్,నౌరువాన్ .ఉపభాషా కుటుంబ౦ ట్రూపిక్-లో 11రకాల పోనాపెలిక్ భాషలుంటాయి .అమెరికన్ డాలర్ ఇక్కడి కరెన్సీ .యూరోపియన్లు ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడ కుక్కలు,పందులు లేవు .ఫ్రూట్ బాట్స్ అనే పాలిచ్చే జంతువులూ ఇక్కడ ఉంటాయి .ఇక్కడి జనం వక్కలతో తమలపాకులు పెప్పర్ కలిపి తాంబూలం బాగా నముల్తారు . స్టోన్ కార్వింగ్ ఎక్కువ.’’స్టోన్ మని బ్యాంక్ లు ‘’ఇక్కడి మరో విశేషం .ఆడవారు ఇక్కడివంటరి ఐలాండ్స్ లో తిరగటం క్షేమంకాదు .నేరాలెక్కువకనుక జాగ్రత్తపడాలి .కుక్క మాసం తినని మంచి జనం ఇక్కడివారు .సరిహద్దులను పక్కాగా మూసెయ్యటం వలన ఇక్కడికి టూరిస్ట్ లను అనుమతించకపోవటం తో కరోనా వైరస్ ఇక్కడికి చేరలేదు .
హయ్యర్ లెవెల్ చదువు నేర్పే విద్యా సంస్థలు చాలా ఉన్నాయి .13ఏళ్ళలోపు వారంతా తప్పక చదువుకోవాల్సిందే .ఉత్తర మారియానాకాలేజి లో ఉన్నతవిద్య నేరుస్తారు .న్యాయవ్యవస్థ సరిగా ఉండదు .సంగీతం నాట్యం బాగా ఉంటాయి .వెయిట్ లిఫ్టింగ్ పైఅభి రుచి ఎక్కువ .
సాహిత్యం –ఇక్కడి సాహిత్యం ఓషియానియన్ సాహిత్యం .ఇది ఇతర దేశాలకు భిన్నంగా ఒంటరిగా వృద్ధి చెందింది .మతచిహ్నాల వాడకం ఎక్కువ .మొదటి సారిగాదేశీయ మైక్రో నేషియన్ రచయితలు కవిత్వం చిన్న కధ , సృజనాత్మక వ్యాసం కబుర్లు నాటక భాగాలు ఒక చోట చేర్చి ప్రదర్శించారు .70మంది రచయితలూ ,వందరకాల ,13దేశీయ భాషల సంకలం తెచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .వీటిలో వైవిధ్యం సముద్రమంతా ,లోతు మారియాన ట్రెంచ్ అంత అని ఇక విశ్లేషకుడు చెప్పాడు .వీటిలో ఆరిజిన్ ,రెసిస్టింగ్ ,రిమెంబరింగ్ ఐడె౦టిటీస్ ఐ వాయేజేస్ ,ఫామిలి ,న్యు మైక్రోనేషియా విభాగాలున్నాయి .ఈ మొత్తం సంకలననానికి ‘’ఇండిజెనస్ లిటరేచర్ ఫ్రం మైక్రో నేషియా’’అనే పేరు పెట్టారు .
ఈ ఫెడరేషన్ కవులలో ఏమిలిషేర్ కిహ్లేంగ్ అనే కవయిత్రి మొదటిసారిగా మొదటికవిగా తనఇంగ్లిష్ కవితా సంపుటి 2008లో ‘’మై ఊరోస్ ‘’ముద్రించింది .క్రియేటివ్ రైటింగ్ లో హవాయ్ యూనివర్సిటి మాస్టర్ డిగ్రీ హోల్డర్ .ఫసిఫిక్ స్టడీస్ లో పిహెచ్ డి –అంశం –పోహిమ్పియాన్ స్కర్ట్స్.దీన్ని ఎత్నికాగ్రఫీ పోయెట్రి అన్నారు .ఆమె తీసుకున్న డ్రెస్ అంశం పోహ్నేపియాన్ స్త్రీలు ధరించేది .2009లో గువాం యూని వర్సిటి ప్రొఫెసర్ ఒకప్రకటన చేస్తూ –గువాం ,పాలూ మెరియానా ఐలాండ్స్ నౌరు ,కిరిబాతి మొదలైన ప్రాంతాల రచయితల రచనలకు ప్రచురిస్తామనితెలియ జేసి ప్రోత్సాహం కల్పించాడు .కేహ్లింగ్ ఒక్కరుమా త్రమే మైక్రోనేషియాలో కవి
చరిత్ర రచనలో మొదటి చరిత్రకారుడు లుఎలేన్ బెర్నార్ట్ -1866-1946.రచనపేరు ‘’ది బుక్ ఆఫ్ లుఎలిన్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-20-ఉయ్యూరు