ప్రపంచ దేశాల సారస్వతం
48-ఉత్తర కొరియన్ సాహిత్యం
కరోనా తాకని ఏడవ దేశం ఉత్తరకొరియా ఉత్తర ఆసియాలో ,కొరియన్ పెనిన్సులా కు ఉత్తరాన ఉన్నది .పయోన్ గ్యాంగ్ రాజధాని .రెండున్నర కోట్ల జనాభా .కరెన్సీ-నార్త్ కొరియన్ వన్.1910లో జపాన్ వశపరచుకొని ,రెండవ ప్రపంచయుద్ధం ఆతరవాత 1945 సోవియెట్ అధీనం లోని ఉత్తర కొరియా,అమెరికా అధీనం లోని దక్షిణ కోరియాగా విభజన చెందింది .రెండిటిని కలిపే ప్రయత్నాలు విఫలంకాగా నార్త్ కొరియా పీపుల్స్ రిపబ్లిక్ ,దక్షిణకోరియాతో 1950నుంచి మూడేళ్ళు యుద్ధం –అదే కొరియా యుద్ధం చేసి ,చవరికి రెండూ ఒకా ఒడంబడికకు వచ్చినా శాంతి చేకూరలేదు .ఉత్తరకొరియా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాలు ఏర్పరుస్తుంది .కాని అవి ఉత్తుత్తి ఎన్నికలు అని బయటిలోకం భావిస్తుంది.కిం వంశపాలనే ఇక్కడ .1994వచ్చిన భయంకర కరువు నాలుగేళ్ళు బాధించింది .దాదాపు నాలులక్షల పాతికవేల జనాభా చనిపోయారు .1956ఇతరదేశాలనుంచి విముక్తిపొంది స్వతంత్ర దేశం అయింది .వెంటనే ఆర్ధిక వృద్ధికోసం తీవ్రప్రయత్నాలు చేసి సాధించింది .1992లో అంతర్యుద్ధం నెమ్మదిగా మొదలై ,రెండవ కిం ఆరోగ్యం తగ్గటంతో కిం జాంగ్ అనేక పాలనాపరమైన బాధ్యతలు తీసుకొని ,రెండవకిం చనిపోతే మూడేళ్ళు సంతాపం సంవత్సరాలుగా ప్రకటించి కిం జాంగ్ నాయకుడిగా ప్రకటించుకొన్నాడు .న్యూక్లియర్ ఆయుధాల తయారీ తగ్గించాడు .తనపాలసికి ‘’సొంగుం ‘’అంటే ము౦దు మిలిటరి ‘’గా చెప్పాడు .1990లో విపరీతమైన వరదలతో దేశం పంటలు తీవ్రంగా నష్టపోయాయి .1996లో యు యెన్ వో సహాయం తో బయటపడింది.201లో జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ,దక్షిణ కొరియా ‘’సన్ రైజ్ పాలసి ‘’ని నిరసించి,ఉత్తరకొరియా ను ‘’రోగ్ స్టేట్’’గా భావించాడు .ఇరాక్ లాగా దెబ్బతినకూడదని నార్త్ కొరియా పవర్ఫుల్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకొన్నది .ఒబామా ప్రెసిడెంట్ అయ్యాక చాలా స్ట్రాటజిక్ గా ఆదేశం తో మసిలాడు.కింగ్ జాం చనిపోయాక 2011లో అధికారం కొడుకు కిం జాంగ్ ఉన్ కు దక్కింది. హైడ్రోజెన్ బాంబులు అమెరికా పైకి దూసుకు వెళ్ళే మిసైల్స్ తయారు చేయించాడు .ట్ర౦ప్ అధ్యక్షుడయ్యాక మళ్ళీ రెండు దేశాలమధ్యా టెన్షన్ పెరిగింది.
నార్త్ కొరియాలో కాన్టి నెంటల్ ,ఓషియానిక్ క్లైమేట్లు ఉంటాయి .మంచుతుఫాన్లు వస్తాయి .వేసవిలో విపరీతమైన వేడి ,చలికాలం లో బాగా చల్లదనం ఉంటుంది .జీవనప్రమాణం 70ఏళ్ళు .అంటువ్యాధులు ఎక్కువే .టిబి, మలేరియా హెపాటిటిస్ ఎక్కువే .ప్రజలందరికి ప్రభుత్వం మంచినీరు నిరంతరంగా సరఫరా చేస్తుంది పరిశుభ్రత పాటిస్తారుజనం .2008లెక్కలప్రకారం అందరూ అక్షరాస్యులే .సెకండరి స్థాయి వరకు ఫ్రీ కంపల్సరి విద్య .గ్రాడ్యుయేట్ విద్యకు యూని వర్సిటిలలో చదవక్కరలేదు .మిలిటరీ సర్వీసస్ ,వ్యవసాయ క్షేత్ర విధులు చేస్తే చాలు .భాష కొరియన్ భాష .దీన్ని వీరు ‘’కల్చర్డ్ లాంగ్వేజ్’’ అంటారు .ఇంగ్లిష్ రష్యన్ చైనీస్ భాషలూ మాట్లాడుతారు .దేశాన్ని మతరహిత దేశం చేశారు .అయినా బౌద్ధ కన్ఫ్యూషియన్ మత ప్రభావం సంస్కృతిలో కనిపిస్తుంది .పరిశ్రమలవలన ఆదాయం లభిస్తుంది .సైన్స్ ,టెక్నాలజీ లకు ఆదరణ ఎక్కువ .సోషలిస్ట్ రియలిజం తో విజువల్ ఆర్ట్స్ ఉంటాయి .జానపద సంగీతం తోపాటు పాప్ మ్యూజిక్ కూ స్థానం ఉంటుంది .
ఉత్తరకొరియా సాహిత్యం –ఇక్కడి ప్రజలకు రష్యన్ సాహిత్యం పై మోజు లేదు కానీ మాక్జిం గోర్కీ రచనలు బాగా ఇష్టం .1945-50కాలం లో ఇక్కడ సాహిత్యానికి నాంది జరిగింది .కిం 2 విదేశీ సాహిత్యాన్ని నిరసి౦చగా దేశీయ సాహిత్యం ప్రారంభమైంది .హాన సొరయా కొరియన్ ఎత్నిక్ సాహిత్యం సృష్టించాడు .1986కస్పాన్ ఫాక్షన్ ఇంసిడెంట్ తో ప్రజలవద్ద పుస్తకాలన్నిటినీ లాగేసుకొన్నారు .వీటిలో టాల్స్టాయ్,గోర్కీ ,డాస్టో విస్కి ,రచనలేకాక చైనా గ్రీక్ జర్మని ఫిలాసఫీ పుస్తకాలు కూడా కనపడకుండా చేశారు .మార్క్స్ పుస్తకాలు అరుదుగా లైబ్రరీలలో ఉంటాయి .రాజకవి జాంగ్ జింగ్ సంగ్ చెప్పినదానిప్రకారం కిం-2కాలం లో నవలారచన బాగా జరిగింది .నవలాకారులకు దేశంలోనే విశిష్టమైన పురస్కారాలు లభించాయి .ఆరాజు చరిత్ర కు ఆనవలలే ఆధారం .రాజుకూడా నవలలు రాయటమేకాదు గోప్పపాఠకుడు కూడా .1994అతడు చనిపోయాక నవలస్థానం కవిత్వం ఆక్రమించింది .దీనికి కారణం ఆర్ధిక సమస్య మాత్రమేకాక పేపర్ ఖరీదు బాగా పెరిగిపోవటం కూడా .దీనితో ‘’డియర్ లీడర్ ‘’ఘనకార్యాలు ఒకే పేజీఉన్న దినపత్రికలో వచ్చేవి .చిన్నకవితలకు ప్రోత్సాహం పెరిగి పెద్ద ఎపిక్ కవిత్వం ఆరుగురు కవులకు అదీ రాజాస్థాన కవులకే పరిమితమైంది .కవిత్వమే రాజకీయ ప్రాపగా౦డా కు చేయూతయింది .రష్యా చైనీస్ లలోకి ఇక్కడి రచయితలైన రికి యాంగ్ -1895-1984,హాంగ్ మియాంగ్ హు -1888-1968,హాన్ సోర్యా-1951 నవలలు అనువాదం పొందాయి .
21వ శతాబ్దిలో 2006లో ‘’వర్డ్స్ వితౌట్ బార్డర్స్ ‘’సంస్థ నలుగురు నార్త్ కొరియన్ రచయితల రచనలను ఇంగ్లిష్ లోకి అనువదించింది .కథాసాహిత్యమూ వచ్చింది .బియుంగు చోన్ రాసిన ‘’ఫాలింగ్ పర్మిషన్స్’’ కొరియా విభజనపై ఎమోషనల్ సఫరింగ్ కవిత .పునరేకీకరణ కావాలన్న ఆశ ఉంటుంది .2002లో హాంగ్ సియోక్ జంగ్ నవల ‘’హ్వాన్గిని ‘’2004మన్హే లిటరరీ ప్రైజ్ పొందింది .దీని నేపధ్యం 16వ శతాబ్ది .దీన్ని సౌత్ కొరియా మొదటిసారిగా నార్త్ కొరియన్ రచయితకు ఇచ్చిన ప్రైజ్ .రచనలపై సెన్సార్ షిప్ ఉండటం తో రచయితలూ ఇతర దేశాలలో తమరచనలు ముద్రిస్తున్నారు .
7-ప్రముఖ పుస్తకాలు -1-దియక్యుజేషన్-చిన్నకథల సంపుటి .రచన బంది .క్రూర పాలనలోనూ మానవత్వం ఉన్న మహిళకథ కంట తడిపెట్టిస్తుంది 2-హౌ ఐ బికేం నార్త్ కొరియన్ –క్రిస్ లీ .అజ్ఞాతవాసంలో గడిపిన ముగ్గురి గురించి కన్నీటి వ్యధ 3-యువర్ రిపబ్లిక్ ఈజ్ కాలింగ్ యు –కిం యాంగ్ హా –కేపిటలిజం కమ్యూనిజం లలో ఉన్న లోపాలను తెలిపేది 4-ది ఆర్ఫాన్ మాస్టర్స్ సన్-ఆడం జాన్సన్ –మాజిక్ రియలిజం సెటైర్ తో ఉన్నరచన పులిట్జర్ ప్రైజ్ పొందింది 5-వితౌట్ యు దేరీజ్ నో అజ్-సుకి కిం – బాంబులకు బదులు మంచి భావాలు నాటమని చెప్పటానికి వచ్చిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కిం ఈ దేశం లో ఫెన్సింగ్ దగ్గర దయనీయ స్థితిలో అనేకకస్టాలు పడిన బాదధామయగాథ6-నథింగ్ టు ఎన్వి-ఆర్డినరి లైవ్స్ ఇన్ నార్త్ కొరియా –బార్బరా డేమిక్ –కొంజ్హిన్ సిటి కరువు తో అల్లాడి పోవటం ప్రజల బాధామయ జీవితాలను వర్ణించే రచన 7-ఎ రివర్ ఇన్ డార్క్ నెస్-వన్ మాన్ ఎస్కేప్ ఫ్రం నార్త్ కొరియా –మషాజి ఇషికవా -1958లో కిం2 సంగ్ –ఇతర దేశాలలో ఉన్న ప్రజలను భూలోకస్వర్గమైన నార్త్ కొరియాకు రమ్మని ఆహ్వానిస్తే ,ఇషికివ తండ్రి స్పందించి కుటుంబంతో ఇక్కడికి రాగా ఇషికివ త్వరలోనే అక్కడ ‘’ఆలోచన కు మాత్రం స్వేచ్చ లేదని ‘’,ఉన్నదంతా సూడో రిలిజియస్ కల్ట్ అనీ గ్రహించి ,36ఏళ్ళు ప్రభుత్వ పొలాలలో ఆడవా చాకిరి చేస్తూ భయంకర దుర్భర జీవితం గడిపి ,చివరికి విసిగి వేసారి ధైర్యంతో ‘’యాలూ రివర్ ‘’ఈదుకొంటూ దాటి చైనా చీకట్లో చైనా చేరి చివరికి జపాన్ లో స్థిరపడిన యదార్ధ గాథ.ఇవ.న్నీ ఉత్తరాకోరియాను అర్ధం చేసుకోవటానికి ఉపయోగ పడే రచనలే
ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయటం ,నకిలీ సరుకులు అమ్మటం ,దొంగనోట్ల ముద్రణ ,టెర్రరిజం నార్త్ కొరియాలో నిషిద్ధం .2017నుంచి అమెరికా టూరిస్ట్ లకు ప్రవేశం లేదు .ఇన్ని రెస్ట్రిక్షన్ లు ఉంటె ఉత్తరకొరియలోకి కరోనా ప్రవేశించే సాహసం చేయక తోక ముడిచి వారి ప్రాణాలను కాపాడింది .
సశేషం
అక్షయ తృతీయ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-20-ఉయ్యూరు