ప్రపంచ దేశాల సారస్వతం
50-సోమోవా దేశ సాహిత్యం
కరోనా సోకని తొమ్మిదవ దేశం సమోవా 1997దాకా వెస్ట్ సమోవా అని పిలువబడేది .ఇందులో రెండు ముఖ్య ఐలాండ్ లు సవాయ్ ,ఉపోలు ఉన్నాయి .ఇక్కడ 3,500 ఏళ్ళ క్రితమే లాపిటా ప్రజలు ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .రాజధాని ఎపియా. ఇక్కడ యునిటరి పార్లమెంటరి డెమోక్రసీ,12అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లతో ఉంది .కామన్ వెల్త్ లో సభ్యతవమున్న దేశం .పడమటి సమోవా యుఎన్ వో లో చేరి అమెరికన్ సమోవాతో సహా మొత్తం ఐలాండ్ ల సమూహ౦ ‘’నేవిగేటర్ ఐలాండ్స్ ‘’గా పిలువబడుతున్నాయి .1962స్వతంత్రం పొందకపూర్వం దేశం నూజిలాండ్ అధీనం లో ఉండేది .18వ శతాబ్దిలో వేల్స్ హంట్ కోసం నౌకలురావటం తో ఆర్దికానికి బాగా తోడ్పడింది .1830లో క్రిస్టియన్ మిషనరీ ఇక్కడ కాలుపెట్టింది .జర్మన్లకు కూడా ఈ దీవులపై వ్యామోహం కలిగి ఉపోలు చేరి కోప్రా ,కోకా బీన్స్ ప్రాసెసింగ్ మొదలుపెట్టింది .క్రమంగా అమెరికా ఇక్కడ కు చేరి ,స్థావరాలను దక్కించుకొని అమెరికన్ సమోవా అయింది .బ్రిటన్ కూ కన్నుపడి బ్రిటిష్ వాణిజ్యరక్షణకు సైన్యం పంపింది.స్థానికుల మధ్య చిచ్చురగిలి 8ఏళ్ళు యుద్ధాలు చేసుకొంటే మూడు దేశాలూ ఆయుధాలు సరఫరా చేసి వినోదించాయి .1889లో వార్ షిప్ లను ఎపియా హార్బర్ కు పంపగా మార్చి 15 ప్రళయ భయంకర తుఫాను వచ్చి ఆ మూడు దేశాల యుద్ధనౌకలు మునిగిపోయి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ సమసింది .1898లో మళ్ళీ సివిల్ వార్ వచ్చి ,జర్మని బ్రిటన్ అమెరికా లు ఎవరిది ఆదిపత్యమో తేల్చుకోవటానికి సిద్ధపడ్డాయి .’’ప్రిన్స్ తను’’కు విధేయులైన సైన్యానికి రెబెల్స్ కు యుద్ధం జరిగి రెబెల్స్ ఓడిపోయారు అమెరికా బాంబుల వర్షం కురిపించిస్వాధీనం చేసుకోగా అమెరికన్ సమోవా ఐంది .మొదటి ప్రపంచయుద్ధం లో జర్మన్ సైన్యం దాడి చేసి స్వాధీనం చేసుకొని జర్మన్ సమోవా అయింది .యుద్ధం ముగిశాక 1962దాకా న్యూజిలాండ్ అధీనం లో పాలన సాగింది .ఇలా అన్ని దేశాలవారూ సమోవా తో ఆటాడుకోన్నారు .1962లో స్వతంత్రం పొంది ,1997దేశం పేరును పడమటి సమోవా కాకుండా సమోవా గా రాజ్యాంగ సవరణ చేసి౦దిప్రభుత్వం .21వ శతాబ్దిలో మోటారిస్ట్ లకోసం డ్రైవింగ్ రోడ్లు ఏర్పాటు చేశారు .సిడ్నీకి 21గంటల కాలం వెనక్కు ఉండే ఈ దేశం 2011 డిసెంబర్ లో అకస్మాత్తుగా కాలెండర్ లో డిసెంబర్ 30 ని రద్దు చేసి ‘’ఇంటర్ నేషనల్ డేట్ లైన్ ‘’లో పడింది .2017లో న్యుక్లియర్ ఆయుధాలు తయారు చేయరాదని తీర్మానించింది .దేశమతం క్రిస్టి యానిటి .జనాభా సుమారు 2లక్షలు .అధికారభాష ఇంగ్లిష్ తోపాటు సోమోవాన్ ..ఇక్కడ ఈక్విటోరియల్ క్లైమేట్ ఉంటుంది .కరెన్సీ –సమోవన్ టాలా.
ఈ దేశంలో చిన్నపిల్లలకు మీసిల్స్ అంటే ఆటలమ్మ,తట్టు చిన్నమ్మవారు బాగా సోకుతుంది పిల్లల మరణాలూ ఎక్కువే.16వ ఏడు వరకు విద్య ఉచితం కంపల్సరి .ప్రైమరీ విద్య 6ఏళ్ళు మిడిల్ స్కూల్ 2ఏళ్ళు తర్వాత 8ఏళ్ళసెకండరిలో చేరటానికి నేషనల్ ఎక్సాం రాసి పాసవ్వాలి .ఏడాదికో సారి ఫీజుకట్టాలి .సమోవాలో యూనివర్సిటి ఉంది.
ఈ దేశం అత్యంత ప్రాచీన పోలీ నేషనల్ దేశం .సంస్కృతీ 3వేలఏళ్ళనుంచి ఉన్నది .మైదాలజిలో ఎందరో దేవతలుంటారు .సంప్రదాయం బాగా పాటిస్తారు .క్రికెట్ ,నెట్‌బాల్ బాగా ఆడుతారు .రగ్బీ లీగ్ ఉన్నది . పశ్చిమ ఫసిఫిక్ దేశాలలో అత్యంత స్థిరమైన ఆర్ధిక స్థితి ఉన్న దేశం .దేశం లో సుదూర ప్రాంతాలు భాగాలు వెనకబడి బీదరికం లో ఉంటాయి .నేరాలుతక్కువ .ప్రజలు సహాయకారులు .ఈదేశాన్ని ‘’క్రేడిల్ ఆఫ్ పోలినేషియా’’అంటారు .అందమైన ప్రకృతి దృశ్యాలు ఆకర్షణ . కల్చర్ అందం బీచెస్,వాటర్ ఫాల్స్ ,ఫారెస్ట్ హైక్స్ , ఆహారం ,ప్రశాంతత ,వైల్డ్ అండ్ మెరైన్ లైఫ్ ,సైజ్ ,మొదలైన నవ విధ ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి .
సమోవియన్ సాహిత్యం –ప్రి అండ్ పోస్ట్ కలోనియల్ కాలం లో సాహిత్యం మౌఖికం .వీటిలో సోలో, జీనియాలజీలు ,మైథాలజి, జానపద గాథలు ,పాటలు ఉంటాయి .వీటిని జర్మన్ సైంటిస్ట్ అగస్టిన్ క్రెమర్ మొదట సంకలించగా ,ఇంగ్లిష్ మిషనరీ సైంటిస్ట్ ధామస్ పావెల్ 19వ శతాబ్దిలో ,ఎథ్నో మ్యూజికాలజిస్ట్ రిచర్డ్ మోయ్లె 20వ శతాబ్దిలో రికార్డ్ చేసి ముద్రించాడు .1960లో మాత్రమే వ్రాత లో సాహిత్యం వచ్చింది . మొదటి ఫసిఫిక్ ఐలాండర్ ఆల్బర్ట్ వెండిట్ 1973లో ‘’సన్స్ ఫర్ ది రిటర్న్ హోమ్’’నవల రాసి ప్రచురించాడు .తర్వాత చాలానవలలు రాశాడు .2001లో ఇతని సాహిత్యకృషికి ‘’ఆర్డర్ ఆఫ్ న్యూజిలాండ్ ‘’అవార్డ్ పొందాడు .మొదటి సౌత్ ఫసిఫిక్ రైటింగ్ ‘’లాలీ ‘’కి సంపాదకత్వం వహించాడు .సౌత్ ఫసిఫిక్ ఆర్ట్ సోసైటీఏర్పడి ఐలాన్డర్స్ సాహిత్యం ముద్రించింది .1976లో ‘’మన ‘’సాహిత్య జర్నల్ వచ్చింది .సమోవా అబ్జర్వర్ న్యూస్ పేపర్ స్థాపించిన కవి సవీయా సవానో మాలిఫా ,ఆర్టిస్ట్ మల్లెటోవా వాన్ రీచీ తమరచనలు సొసైటీ ద్వారా ముద్రించారు .కవులు సపావు రూపరేక్ పెటాజ ,ఈతి సాగాలు ప్రసిద్ధులు .ప్రధాని తజూటువాటుపా సమసేసే అనేక బిరుదులూ పొంది సమోవన్ కల్చర్ ,ట్రెడిషన్ పై చాలా రచనలు చేశాడు .నేషనల్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ ఎమ్మా క్రుసే వాయ్ గొప్పకవి రచయిత .డా.సీనావాయ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ,విమర్శకకవి రచయిత, పరిశోధకురాలు ‘’వెస్టర్న్ పోలినేషియా కాలనిజం’’ పై పిహెచ్ డి చేసింది ‘’లవోని రైన్స్’’కవితా సంపుటి రాసింది .సినవైనా గబ్బార్డ్ అమెరికన్ సమోవా ఫలీటు ప్లేస్ పై అధ్యయనం చేసింది .
సియాఫిగెల్ నావలిస్ట్ ,కవి ‘’వేర్ వుయ్ వన్స్ బిలాంగ్‌డ్’’అనే నవల కామన్ వెల్త్ ప్రైజ్ పొందింది .’’గర్ల్ ఇన్ ది మూన్ సర్కిల్ ,పోర్ట్రైట్ ఆఫ్ ఎ య౦గ్ ఆర్టిస్ట్ ఇన్ కాంటెం ప్లేషన్’’మొదలైన నవలలు ,కవితా సంపుటులు వెలువరించింది .కొత్తతరం రచయితలూ ఆమెస్పూర్తి .ఇతర కవయిత్రులలో టుసిఎట్ అవియా ,సెరీనా సుసిటాలమార్ష్ ,నవలారచనలో లాని వెండిట్ య౦గ్ ఉన్నారు ‘’.కోకోనట్ మిల్క్’’ కవితా సంపుటి డాన్ టలుపామాక్ ముల్లిన్ అనే అమెరికన్ సమోవా రచయిత రాశాడు ,విక్టర్ రోడ్జేర్,కియానా రివేరా బ్రియాన్ ఫాటా నాటకాలు కూడా రాశారు .జెన్ని బెన్నెట్ టూనో నెటో రాసిన షార్ట్ స్టోరి కలెక్షన్ కు 2018కామన్ వెల్త్ ప్రైజ్ వచ్చింది .
మార్చి 21 నే సమోవా ప్రభుత్వం సరిహద్దులు మూసేసి ,ఎమర్జెన్సి ప్రకటించి కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడింది .అంతకు ముందే చిన్నపిల్లలకు సోకే ‘’మీజిల్స్ ‘’ను పూర్తిగా అరికట్టేసింది .అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది .విద్యాసంస్థలను మూసేసింది ,మీటింగ్ లను రద్దు చేసింది .అంత తెలివిగా ప్రజా రోగ్యం కాపాడింది కనుకనే సమోవా దేశం లో కరోడా కరోనా కాలుపెట్ట లేకపోయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-20-ఉయ్యూరు