ప్రపంచ దేశాల సారస్వతం
52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం
కరోనా సోకని పదకొండవ దేశం సాలోమన్ ఐలాండ్స్ సుమారు 900ల దీవుల సముదాయం .దక్షిణ ఫసిఫిక్ లో ఉంటుంది .అతిపెద్ద ఆర్చి పెలగాన్ ఐలాండ్ .రాజధాని హోనియారా గుడల్సనల్ ఐలాండ్ లో ఉంటుంది .సాంప్రదాయ వృత్తి కళలకు పెట్టింది పేరు.1568లో స్పానిష్ నేవిగేటర్ అల్వరో డిమెండానా మొదట ఇక్కడికి వచ్చిన యూరోపియన్ .1893లో దక్షిణ దీవులను బ్రిటిష్ ప్రోటెక్ట రేట్ కిందకు తెచ్చారు .రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ అమెరికా కామన్ వెల్త్ దేశాల సైన్యాలమధ్య భీకరపోరాటం జరిగి ‘’బాటిల్ ఆఫ్ గార్డి యసనల్ ‘’పేరుతో పిలువబడింది .1975లో దీవులపేరును ‘’దిసోలోమన్ ఐలాండ్స్ ‘’గా మార్చారు .తరవాత ఏడాది స్వతంత్రం పొంది ది తీసేసి సోలోమాన్ ఐలాండ్స్ అని మాత్రమె ఉంచుకొన్నారు .రెండవ ఎలిజబెత్ పాలనలో గవర్నర్ జనరల్ అధికారం నడుస్తుంది .2007లో భారీ భూకంపాలు ,సునామీ వచ్చి తీవ్ర నష్టం కలిగించింది .ఈదేశం యుఎన్ వో ,కామన్ వెల్త్ ,ఫసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఐఎం ఎఫ్ మొదలైనవాటిలో సభ్యత్వ౦ ఉంది .విద్య నీరు పారిశుధ్యం,స్త్రీలు గృహ హింస లను మానవ హక్కుల సంఘం రక్షిస్తుంది .హోమో సేక్సువాలిటి నిషిద్ధం .ఇక్కడ ఈక్విటోరియల్ క్లైమేట్ ఉంటుంది .ఇక్కడి రెయిన్ ఫారెస్ట్ లు ఈకో రీజియన్ లో ఉన్నాయి .230కి పైగా ఆర్కిడ్ రకాలున్నాయి .క్షీరదాలు తక్కువే .అగ్నిపర్వత భయాలు ఎక్కువ .మంచి నీరు దొరకటం కష్టం .పారిశుద్ధ్యంకూడా పెద్ద సమస్య .అభి వృద్ధిలో బాగా వెనకపడింది .వ్యవసాయం ఫిషింగ్ మాత్రమె ఆదాయాలు పెట్రోలియం సరుకులు దిగుమతి చేసుకోవాలి .కలప ఈ దీవుల కు వరం .ఎగుమతి బాగా అవుతుంది. అందువలన అడవుల నిర్మూలనం బాగా జరిగి ఇప్పుడే మేల్కొన్నారు .కోప్రా కోకా పామాయిల్ పండించి ఎగుమతి చేస్తారు .సీసం జింక్ నికెల్ గోల్డ్ గనులున్నాయి .డైవింగ్ కోసం టూరిస్ట్ లు బాగావస్తారు .కరెన్సీ-సోలోమన్ ఐలాండ్స్ డాలర్ 1977నుంచి అమలులో ఉంది అంతకుముందు ఆస్త్రేలియన్ డాలర్ ఉండేది .పునరుత్పాదక శక్తి కేంద్రాలున్నాయి.
సుమారు 2శాతం ప్రజలుమాత్రమే ఇంగ్లిష్ మాట్లాడగలరు .సోలోమన్ పిజి ఇక్కడి మాతృభాష.74ఇతరభాషలు ఉంటె వాడకం లేక 4భాషలు అంతరించాయి .మతం –క్రిస్టియానిటి..ప్రజల జీవితకాలం 66ఏళ్ళు .అందమైన జుట్టు ఉన్నవారు 10శాతం ఉంటారు .ఇక్కడ విద్య తప్పని సరికాదు అందువలన 60శాతంపిల్లలే బడికి వెడతారు .ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధపెట్టి కొన్ని చర్యలు అమలు చేసి పెంచింది .సంస్కృతిలో భిన్నత్వం కనిపిస్తుంది .గృహ హింస ,సెక్సువల్ వయోలెన్స్ చాలా ఎక్కువ .2014లో ఫామిలి ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చి కొంత నివారించారు .సాలోమన్ స్టార్ అనే ఏకైక దినపత్రిక ఉన్నది .ఈ దీవుల బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ రేడియో నిర్వహిస్తుంది .టివి సిగ్నల్స్ అందటం కష్టం .మలనేషియన్ మ్యూజిక్ ఇక్కడ విశేషం .ఫుట్ బాల్,రగ్బీ బీచ్ సాసర్ ఆడుతారు.
సోలోమన్ సాహిత్యం –ఇండిజినస్ ఫసిఫిక్ ఐలాండర్ లిటరేచర్ ఏర్పడ్డాక మాత్రమె ఇక్కడ రచన 1960లో ప్రారంభమైంది 1968లో సువా లో సౌత్ ఫసిఫిక్ యూని వర్సిటి వచ్చాక ఇక్కడి సాహిత్యకారులలో రాయాలనే ఉత్సాహం వచ్చింది .సృజనరచన కోర్సులు వర్క్ షాప్ లు నిర్వహించారు .1973లో యూనివర్సిటిలో ఆర్ట్స్ అసోసియేషన్ ఏర్పడ్డాక కవిత్వం చిన్న కథలుఫసిఫిక్ ఐలాండ్స్ మంత్లి లో ప్రచురింపబడ్డాయి .1974లో సొసైటీ’’ మన ‘’అనే ప్రచురణ సంస్థ ఏర్పరచి ,1976లో ‘’మన జర్నల్ ‘’కూడా నడిపారు .మొదటిసారిగా సోలోమన్ ఐలాండ్స్ పోయెట్రి జర్నల్ లో ప్రచురించి ప్రోత్సహించింది .ప్రముఖ రచయితలుగా జాన్ సవునానా ,సెలో కులగోలు గుర్తింపు పొందారు .
స్త్రీ రచయితా–జులి మాకిని –జూలో సిప్పో గా ప్రసిద్ధురాలు .కవి రచయిత ,స్త్రీ హక్కు ఉద్యమకారిణి .సివిలైజ్డ్ గర్ల్ ,ప్రేయింగ్ పేరెంట్స్ కవితాసంపుటులు వెలువరించింది .యూనివర్సిటి లో చదివి మొట్టమొదటి ఉమెన్ రైటర్స్ వర్క్ షాప్ నిర్వహించింది .ఆ దీవులలో ఆడవారు పడే హింస నుండి విముక్తికోసం శ్రమించింది .అనేక చోట్ల మహిళాహక్కులకోసం ప్రదర్శనలు నిర్వహించింది .గిజో ఫామిలి సపోర్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయించింది .2017లో ‘ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్’’ ను అమెరికా సెక్రెటరి ఆఫ్ స్టేట్ నుంచి పొందింది .70మంది స్పూర్తి మహిళలలో ఒకరుగా గుర్తింపు పొందింది ‘
జర్నలిస్ట్ లలో వాల్టర్ నలన్గువ –మీడియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ .ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ న్యూస్ .బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ లో కరెంట్ అఫైర్స్ ఇంచార్జ్
నవలారచయిటలలో రెక్స్ ఫోర్డ్ ఒరటోలా ‘’దిటు టైం రిసరక్షన్ ‘’నవలారచయిత .ఫేసెస్ ఫ్రం సోలోమన్ ఐలాండ్ విలేజ్ అనే స్టోరి కలెక్షన్ తెచ్చాడు .రచనలో ఆధునిక ,సంప్రదాయ సంస్కృతీ వైరుధ్యం పై దృష్టిపెట్టాడు.
చైనా లో ప్రారంభమైన కరోనా వైరస్ తమ దేశాలకు రాకుండా సోలోమన్ ఐలాండ్స్ ముందు జాగ్రత్తగా బార్డర్లు మూసి ట్రావెల్ పై నిర్బంధాలు విధించి వైరస్ సోకకుండా చేసింది అక్కడ వెంటి లెటర్స్ ,ఇంటెన్సివ్ కేర్ బెద్స్అవసరం కలగలేదు .లాక్ డౌన్కూడా ముందే ప్రకటించి ప్రజారోగ్యానికి ప్రాముఖ్యమిచ్చిన దేశం సోలోమన్ ఐలాండ్స్ .soloman aislands ‘
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-20-ఉయ్యూరు