ప్రపంచ దేశాలసారస్వతం 53- తజకిస్తాన్ సాహిత్యం
కరోనా సోకని పన్నెండవ దేశం తజకిస్తాన్ మధ్య ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ ,చైనా ,కుర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ల మధ్యలో ఉంటుంది ఎత్తైనపర్వతాలు హైకింగ్ ,క్లైమ్బింగ్ కు ఆకర్షణ .క్రీపూ 500 నాటికీ ఆకెమెనిడ్ సామ్రాజ్యంలో ఉండేది .క్రీ పూ 150లో యుజి ట్రైబులు ఉండేవారు .సిల్క్ రోడ్ దీనిగుండా ఉండి,చైనా పరిశోధకులకు అనువుగా ఉండేది .క్రీ శ 4వ శతాబ్దిలో ఇక్క బౌద్ధం ,క్రైస్తవం జోరాస్ట్రిజం ,మొదలైన మతాలు ఉండేవి .8వ శతాబ్దంలో అరబ్బులు ఇస్లాం నెలకొల్పారు .కారా ఖనిడ్ ఖనాటే యుద్ధం లో ఆక్రమించి ఆవంశం 999నుంచి 1211వరకు పాలించింది .13శతాబ్ది మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్ ఆ తర్వాత మధ్య ఆసియా అంతా వశం చేసుకొని పాలించాడు .మంగోల్ సామ్రాజ్య విచ్చిత్తి తర్వాత చగాటే ఖనాటే వశమైంది .తామర్లేన్ ‘’తిమురిడ్’’డైనాస్టి ఏర్పరచి 14వ శతాబ్ది దాకా ఏలారు .18వ శతాబ్దిలో ఎమిరేట్ ఆఫ్ బుఖారా ,కనాటే ఆఫ్ ఖోఖండ్ సంయుక్తపాలన నడిచింది . బుఖారాఎమిరేట్ 20వ శాతాబ్దిదాకా ఉన్నది .19వ శతాబ్దిలోనే రష్యన్ సామ్రాజ్యభాగమైంది .
రాజధాని దుషాంబె.భాష రష్యన్ ,కరెన్సీతజకిస్తానీ సోమోని .91లక్షల జనాభా .1991లో స్వతంత్ర దేశం అయింది .వెంటనే 1992నుంచి అయిదేళ్ళు సివిల్ వార్ జరిగింది .తర్వాత 1994లో ఏమ్మోలి రెహ్మాన్ ప్రెసిడెంట్ అయ్యాడు .నియంతలా ప్రవర్తించాడు .ఇక్కడి ప్రజలు తజికి లు .మతాతీత రాజ్యమైనా ఇస్లాం అనుసరించేవారు తొంభై శాతం పైనే .సుమారు 50శాతం రేవిన్యు ఇమ్మిగ్రంట్ వల్లనే వస్తుంది .ప్రస్తుతపాలన అవినీతిమయం ,రోడ్డురైలు విమాన సర్వీసులే ప్రయాణానికి .2009లెక్కలప్రకారం మిలియన్ పైనే జనం రష్యాలో పనిచేస్తున్నారు .70శాతం స్త్రీలు సంప్రదాయబద్ధంగా గ్రామాలలో ఉంటారు .ప్రజాభాష తజకిస్తాన్ .జీవితకాలం 66ఏళ్ళు .పిల్లలు పోలియో వ్యాధితో బాధపడతారు .బీద దేశమైనా సోవియెట్ రష్యా చలువతో అక్షరాస్యత శాతం 99.8.12 ఏళ్ళ ప్రైమరీ సెకండరి విద్య ,నిర్బంధ విద్య ఉన్నా 25శాతం ఆడపిల్లలు ప్రైమరీ ని బీదరికం వలన పూర్తి చేయలేకపోతున్నారు ,సాంప్రదాయ రేజిలింగ్ కు చెందిన ‘’గుష్టి గిరి ‘’ఇక్కడి ప్రత్యేక క్రీడ .పోలోలాగా గుర్రాలపై కూర్చుని ఆడే’’ బుజ్హాషి ‘’ఇంకో ప్రత్యేక ఆట .ఫుట్ బాల్, రగ్బీ క్రికెట్ కూడా ఆడుతారు .
తజకిస్తాన్ సాహిత్యం –క్రీశ 6-8శతాబ్దాలవరకు మౌఖిక సాహిత్యమే తరతరాలుగా వ్యాప్తి చెందింది. ఇవి ఒర్ఖోనో స్క్రప్ట్ లో దొరికాయి .17వ శతాబ్దిలో కవులు లేక బార్డ్స్ సృజన శీలనలేనివారు ధిరావ్స్ ,సృజన ఉన్నవారు ఆఖిన్స్ గా విభాజి౦పబడ్డారు .ఆధునిక సాహిత్యం లో ఘనుడు అబాయ్ ఖ్వానాబులే -1845-1904 రచనలన్నీఖఝాక్ అంటే ‘’బుక్ ఆఫ్ వర్డ్స్ ‘’లో ఉన్నాయి .ఇందులో వేదా౦తరచనలు కవిత్వం ,రష్యన్ కాలనీ సామ్రాజ్యంపై విమర్శ ఉన్నాయి .ఇక్కడి సాహిత్య పత్రికలు – ఏక్వాప్ మరియు ఖ్వజ్హాక్ లు ఆరబిక్ లిపిలో 1911-15మధ్య పనిచేసి గొప్ప సాహిత్య సేవ చేశాయి .
తజకిస్తాన్లోపుట్టిన రష్యన్ రచయిత ఆండ్రీ వోలోస్ రష్యన్ బుక్ ప్రైజ్ పొందాడు .ఇతని ‘’కమింగ్ బాక్ టు పంజ్రుడ్’’రచనకు ఈ ప్రైజ్ వచ్చింది .మిర్జో తురుసున్ జోడా గొప్ప రష్యన్ కవి .తజిక్ అకాడెమి ఆఫ్ సైన్స్ లో సభ్యుడు ,సోవియట్ యూనియన్ రైటర్స్ సభ్యుడుకూడా ,తజకిస్తాన్ నేషనల్ హీరో గా గుర్తింపు పొండాడు .ఇతని బొమ్మతో కరెన్సీ ముద్రించారు .రుడాకి కవిని ‘’ఆడం ఆఫ్ పోఎట్స్ ‘’అంటారు .రోజియా ఒజోడ్ కవయిత్రి రష్యాపాలనలోఉండేది. దేశస్వాతంత్ర్యంకోసం పోరాడింది .రెండవ ప్రపంచ యుద్ధకాలం లోనే కవిత్వం రాయటం మొదలుపెట్టి దేశభక్తి కవిత్వం రాసింది క్వహ్రమోని ఒడిల్-అంటే జస్ట్ చాంపియన్ ,మహాబ్బత్ కా వతన్-అంటే లవ్ ఫర్ దికంట్రీ,గులిస్తోని ఇషక్ అంటే దిరోజ్ గార్డెన్ ఆఫ్ లవ్ ,అజ్వోడియో,అంటే ఫ్రం ది గోల్డెన్ వాలీ ,ఇక్బాల్ –అదృష్టం అనే కవితా సంపుటులు ప్రచురించింది .బోజోర్ సోబిడ్—కవి రాజకీయనాయకుడు .నవలాకారుడు .జబోని మొదరి-మాతృభాష లో ఆ దేశ చరిత్ర తెలిపాడు .సెక్యులరిజం పై గొప్ప కవిత్వం రాశాడు .మహమ్మద్ షకూరి –మేధావి ,పర్షియన్ భాషాకవి .తజికి –పర్షియన్ నిఘంటు నిర్మించాడు .ఇరాన్స్ ఎటర్నల్ ఫిగర్ అవార్డ్ ,తజకి పర్షియన్ అకాడేమీలశాశ్వత సభ్యుడు.
జలాలుద్దీన్ మహమద్ రూమి 13వ శతాబ్ది పర్షియన్ కవి.మేధావి తత్వజ్ఞుడు .లియాక్ షేర్ ఆలి –క్లాసిక్ పర్షియన్ కవిత్వ రచయితా .ఫిరదౌసి ఉమర్ ఖయ్యాం ల ప్రభావం ఎక్కువ .అతని రచనా సంపుటులు ఇరాన్ లో పబ్లిష్ అయ్యాయి .టేమోర్ జుల్ఫికరో-నాటక,నవలారచయిత .ఇవాన్ బునిన్ అవార్డ్ గ్రహీత .అతని గోల్డెన్ లెటర్స్ ఆఫ్ లవ్ కు ఈ బహు మతి వచ్చింది ,గిలాన్ అండ్ నొరోన్ ఆన్ దిషిప్ యార్డ్ ఆఫ్ వాటర్ నవల రాశాడు .అబ్డూ మాలిక్ అబ్దుల్లా జనోబ్ –తజకిస్తాన్ ప్రధాని .
కరోనా చిహ్నాలు ముందే గ్రహించి తజకిస్తాన్ మొదట్లోనే జాగ్రతలు తీసుకొని ఫిబ్రవరిలోనే బార్డర్లు మూసేసి ,ఇతరదేశాలకు వెళ్ళవద్దని ప్రజ లనుహెచ్చరించి ,మార్చి 15 ఎమర్జన్సీ విధించి,షాపింగ్ వినోదం విద్యాలయాలు మూసేసి ప్రజాసంరక్షణ చేసింది కనుక కరోనా కాలుపెట్టలేకపోయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-20-ఉయ్యూరు