ప్రపంచ దేశాల సారస్వతం
55- తుర్కేమెనిస్తాన్ దేశ సాహిత్యం
కరోనా సోకని 14వ దేశం తుర్కెమెనిస్తాన్ మధ్య ఆసియాలో కాస్పియన్ సముద్రం ,కారకుం ఎడారి తో చుట్టబడి ఉంటుంది .నీసా, మెర్వ్ లలో పురాతత్వ వస్తువులు ఎక్కువ .రాజధాని అష్కబాత్ సోవియట్ స్టైల్ లో నిర్మించబడింది .సుమారు 60లక్షల జనాభా .కరెన్సీ –తుర్కేమెనిస్తాన్ మనత్ .నేరాలు తక్కువ టూరిస్ట్ లకు ఇబ్బంది ఉండదు .ఆయిల్ ,నేచురల్ గాస్ ఆర్ధిక వనరు .విచ్చలవిడి మద్యపానం ఉండదు .ఎలెక్ట్రికల్ పవర్ ఎడారులు ,వ్యవసాయభూములున్నాయి .ఫ్రీ విద్యుత్తూ సరఫరా ఉంటుంది అందుకే ఇంట్లో స్టవ్ లు 24గంటలూ మండుతూనే ఉంటాయి అగ్గిపెట్టె ఖర్చులేకుండా .రాజ ధానిలో బిల్డింగులు చాలాభాగం ఖాళీ గా ఉంటాయి ,ఈ దేశం లో ‘’డోర్స్ ఆఫ్ హెల్’’టూరిస్ట్ స్పాట్ .ఆర్మీనియన్లు అజెరిస్ మొదలైన జాతుల వారుంటారు .సున్ని ముస్లిం లు ఎక్కువ.పూర్వం కారవాన్ రూట్ సిల్క్ రోడ్ మీదుగా చైనాకి ఉండేది .1881రష్యన్ సామ్రాజ్యం వశం చేసుకొన్నది .మధ్య ఆసియాలో బోల్షేవిక్ ఉద్యమానికి పట్టుగొమ్మగా నిలిచింది .సోవియట్ యూనియన్ విచ్చిత్తి తర్వాత 1991లో స్వతంత్ర దేశమైంది .ప్రపంచం లో గాస్ రిజర్వ్ ఎక్కువగా ఉన్న దేశాలలో నాల్గవస్థానం లో ఉంది .ఇక్కడ మానవహక్కులకు రక్షణ ఉండదు .సమాచార వ్యవస్థపై నిషేధం ఎక్కువ .అతి డ్రై ప్రదేశం .గ్రీన్ హౌస్ గాస్ ఎమిషన్లు వాతావరణ కాలుష్యం చేస్తున్నాయిక్కడ .ప్రత్తి పంటఎక్కువ ఇదీ ,గాస్ ఈ దేశ ఆర్దికాన్ని నిలబెడుతున్నాయి .ప్రజలకు నేచురల్ గాస్ ,కరెంట్ ,నీర్ ఉప్పు సబ్సిడీ రేట్లకు దొరుకుతాయి .మధ్య ఆసియా దేశాలలో విద్యుత్ పవర్ ప్లాంటులు అత్యధికంగా ఉన్న దేశం .దినపత్రికలు మేగజైన్లు ఎక్కువే
సెకండరి లెవెల్ వరకు సార్వత్రిక విద్య తప్పనిసరి .విభిన్నమైన ఆర్కి టేక్చర్ కనిపిస్తుంది అడల్ట్ లిటరసి రేట్ 99.7
తుర్కేమినిస్తాన్ సాహిత్యం –టర్క్ మెన్ ప్రజలు రాసిన వ్రాత సాహిత్యం ఉన్నది .కివాన్స్ బుఖావంస్ ,పెర్షియన్లపాలన లో ఉండటం వలన వారెవ్వరూ ఇక్కడి సాహిత్యాన్ని భద్రపరచలేదు. పూర్వ సాహిత్యం మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెందింది .కొద్దిభాగం మాత్రమె బార్డ్స్ అంటే భక్షీస్ లు వ్రాత ప్రతులను జాగ్రత్త చేశారు .17,18శాతాబ్డులలో టర్క్ మెన్ లు ఖ్వారేజం అంటే ఇవాల్టి తుర్కేమేనిస్తాన్,ఉజ్బెకిస్తాలకు వలసవచ్చారు .ఉజ్బెక్ ఖాన్ షేర్ ఘాజి ఆనాటి టర్క్ మెన్ కవి ‘’అండలీబ్’’కు పోషకుడు . ఇతడు స్థానిక చాగటాయ్ భాషలో కవిత్వం రాశాడు . టర్కీకవిఆలీ షెర్ నవాయ్ రాసిన గజల్స్ కు చాగటాయ్ భాషలో అనువదించాడు . టర్క్ మెన్ ఎపిక్ కావ్యం ‘’దేస్టాన్’’ను ఇస్లామిక్ విధానంలో రాశాడు .పర్షియన్ కవి రషీద్ ఆల్దిన్ రాసిన జామీ ఆల్ తవారఖ్ ,మధ్యయుగ కవి ఇమాద్ ఆల్ దిన్నేసిమి రాసిన నేసిమి లలో ఆ దేశ సాంస్కృతిక విషయాలు తెలుస్తాయి
18వ శతాబ్ది మధ్యలో టర్క్ మెన్ జాతీయ సాహిత్యానికి బీజాలుపడ్డాయి .1753లోవాజీ ఆజాద్ ,1756లోబెహిస్తామే రచనలు సున్నీమత విషయాలతో వచ్చాయి మక్తూం ఖ్వాలి 800 కవితలు రాశాడు .వీటిలోఎక్కువభాగం జానపదాలు .వీటిని ఘోస్గి అంటారు .షాహ్ బెబ్దే –ఖివా చదివి గుల్ బుల్బుల్ ,షహ్ బెహ్రాం అనే ప్రసిద్ధ కావ్యాలు రాశాడు .దేస్తాన్ రీతిలో రాసినవాడు మఘ్ రుపి-యూసఫ్ అహమాద్ ,ఆలి బెక్ బోలి బెక్ రాశాడు .1770లో జరిగిన తిరుగుబాటు నూ కవిత్వీకరించాడు .19వ శతాబ్దిలో మారుట్ తాలిబి తనపాక్షిక జీవిత చరిత్ర ‘’దాస్తాన్ తాలిబి వ సుఖ్ భేజ్మాల్ రాస్తే ,సెయిట్ నాజర్ సెయిది లిరిక్ శైలిలో జానపదాన్ని పండించాడు .19శతాబ్దిలో దేశాన్ని రష్యా ఆక్ర మి౦చాకకోద్దిపాటి కవిత్వం వచ్చినా అది భక్షీలఖాతాలోకే వెళ్ళింది
మహిళలలో అన్నా సోల్టాన్సేలడోన్నా కేకిలోవా –సోవియట్ యుగ కవయిత్రి .కమ్యూనిస్ట్ పార్టీ సేవాకర్త రచయత్రి ,కస్టడీలో ఉంటూ కూడారచనాలు చేసి 30ఏళ్ళకే చనిపోయింది
భకర్ గుల్ కేరిమోవా –కవిత్వం, ఫిక్షన్ రాసింది .1983లో ఆమె రాసిన చిన్నకథల సంపుటి వెలువడింది .1988లో కవితా సంపుటి ముద్రించింది
సోనా యజోవా –ప్రజాకవిగా గుర్తి౦పు పొందింది. కవిత్వం లో దేశభక్తి ,ప్రేమ ఉంటాయి
జర్నలిస్ట్ లలో అన్నాకుర్బాన్ అమంఖిలేవ్ ,గోజల్ నురజిఎవా అక వేల్సేపార్ మొదలైనవారున్నారు .
పురుషకవి అమన్ కెకిలోవ్ ఒక్కడే సోవియెట్ తర్కమేన్ పోయేట్
ఖోద్జకోలి నర్లీవ్ –స్క్రీన్ ప్లే రైటర్,నటుడు కూడా .గోల్డెన్ ప్రైజ్ నామినేషన్ అందుకున్నాడు
ప్రపంచమంతా కరోనావైరస్ తో తల్లడిల్లుతుంటే తుర్కేమిస్తాన్ మాత్రం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు బ్రహ్మాండమైన సైకిల్ రాలీ నిర్వహించింది .కానీ కరోనా వైరస్ కేసులు జీరో అని ప్రకటించింది .చైనాకు ఇతర దేశాలకు విమానసర్వీసులు రద్దు చేసింది .అయినా దేశంలో ప్రజాజీవితం యధాప్రకారం సాగుతూనే ఉన్నది .ఎవరూ మాస్కులు ధరించటం లేదు విందులూ వినోదాలు పెళ్ళిళ్ళూ అన్నీ మామూలే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-5-20-ఉయ్యూరు