ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో17-5-20 శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమంగా ఈక్రింది విధంగా నిర్వహింపబడుతుంది .
15-5-20 శుక్రవారం –ఉదయం -5గం.కు మన్యుసూక్తం తో స్వామివార్లకు అభిషేకం అనతరం నూతనవస్త్రదారణ
ఉదయం 6గం-లకు గంధ సిందూరం తో ప్రత్యేక అర్చన .ఉదయం 7గం.లకు తీర్ధ ప్రసాద వినియోగం
16-5-20-శనివారం –ఉదయం 6గంనుంచి 7గం వరకు –నాగ వల్లీ ( తమలపాకులు)పూజ -7గం.లకు తీర్ధ ప్రసాద వినియోగం
17-5-20-ఆదివారం –వైశాఖ బహుళ దశమి –శ్రీ హనుమజ్జయంతి
ఉదయం -6గం.నుంచి -7గం.వరకు –మామిడిపండ్లు ,వివిధ ఫలాలతో ప్రత్యేక అర్చన మరియు బంతిపూలతో అలంకరణ
ఉదయం -7గం నుండి 8గం వరకు –శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల శాంతి కల్యాణం
ఉదయం -8గం.లకు –తీర్ధ ప్రసాద వినియోగం
ముఖ్య గమనికలు -1-పై మూడురోజులలో ఆలయ ధర్మకర్తల ,కుటుంబ సభ్యుల ,ఆలయ నిర్వాహకుల పేరిట మాత్రమే పూజలు నిర్వహింప బడుతాయి. ఇతరులెవ్వరి పేరుతోనూ అర్చన జరుగదు .దీనికోసం ఎవరూ రుసుము చెల్లించ వద్దు.
2-భక్తులు అత్యంత క్రమశిక్షణతో తప్పకుండా సా౦ఘిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి మాత్రమే స్వామి వార్లను దర్శింఛి సహకరించవలసినదిగా కోరడమైనది .
గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త -5-5-20 -ఉయ్యూరు