ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2
యోహన్ క్రిస్టోప్ గొట్జ్ షెట్జ్-1700-1766 తో 18వ శతాబ్ది జర్మన్ సాహిత్యం మొదలైంది సాహిత్యం లో శైలి,రూపం తో నియమబద్ద రచన చేశాడు .విషాదాంత నాటకాలలో హాస్యం కూడా జతకలిపాడు తర్కానికి అధిక ప్రాదాన్యం ఇచ్చాడు తరువాత రచయితలపై ఇతని ప్రభావం జాస్తి ..ఇదికాదు అని భావుకతకు ప్రాదాన్యమిచ్చాడు గొట్టిలీబ్ క్లోవ్ స్టోక్-1724-1803.ఇతని ఇతిహాస మహాకావ్యం ‘’మేసియా ‘’లో భావన ,తొట్రుపాటు ఎక్కువ .విన్క్మేన్ మొదలైనవారు గ్రీకు సాహిత్యం షేక్స్పియర్ సాహిత్యం ప్రచారం లోకి తెచ్చాడు .కావ్యకళ కు జీవం పోశాడు రేస్సింగ్ .హంబుర్గి షెడ్రమటుర్జీ-1769లో జర్మన్ నాటకరంగాన్ని సమీక్షించాడు 1766 ఇతడు ఉత్తమ సౌందర్య మీమాంస గ్రంథం’’లయోమాన్ ‘’రాశాడు .ఇదే గోథే,షిల్లర్ ల కావ్య సృష్టికి పునాది అయింది మిస్ సారా సాంప్సన్ -1755,మినా ఫర్ బార్న్స్ హెల్మ్-1767,ఎమిలియా గలోటి-1772,నాథన్ డేర్ వైజ్ -1779 అనే నాటకాలురాశాడు హంబుర్గి .ఆధునిక యుగానికి ఇవే రాచబాట వేశాయి 18వ శతాబ్దం లో వ్యక్తిత్వం ,కల్పనా ,భావుకత , అనుభూతుల మేళవింపు తో వచ్చినకవిత్వమే ఆధునిక కవిత్వం . హేర్డర్ కవి ‘’ స్టుర్మ్ ఉండ్ డ్రాంగ్’’అనే ఆందోళన లేపాడు .దీనితో బుద్ధికి ప్రాధాన్యమిచ్చియా౦త్రికత ను వదిలేసి ,జానపద గీతాల పై దృష్టి కల్పించాడు .ఈ సమయంలో చాలా విదేశీ సాహిత్య గ్రంథాలు జర్మన్ భాషానువాదం పొందాయి .
జర్మన్ దేశీయ సాహిత్యాకాశసూర్యుడు యోహాన్ ఉల్ఫ్ గ్యాంగ్ గోథే -1749-1832.సాత్విక భావాలకు ప్రాణం పోసి గోథిక్ కళను ,స్టెన్, షేక్స్పియర్ రచనలను అధ్యయనం చేసి ,తార్కికబుద్ధికన్నా ప్రతిభ మేలు అని భావించి చిరస్మరణీయ కవితా సృష్టి చేశాడు .’’గొయట్స్ ఫన్ బర్లి షెన్గెన్’’అనే నాటకాన్ని రాశాడు .దీనిలో నూతనభావుకత ,కల్పనా సామర్ధ్యం పుష్కలం .మధ్యయుగం లోకి ‘’ఫాస్ట్ ‘’కథకు ఆకర్షితుడైనాడు .ప్రాపంచిక సుఖాలకోసం మెఫిస్టో ఫెలిస్ భూతానికి తన ఆత్మను అమ్ముకొన్న ఫాస్ట్ చివరికి నరకం చేరటం వృత్తాంతం ,ఫాస్ట్ ఆశయం ఆత్మ తృప్తి .అందుకే భూతానికి దాసుడయ్యాడు .మొదటిభాగం అద్భుత కవిత్వం కల్పనా చమత్కృతి భావుకత వెల్లి విరుస్తుంది గోథే రచనలో .రెండవభాగ౦ పై 30ఏళ్ళు దృష్టి పెట్టి రాసి , తన ప్రతిభా సామర్ధ్యాన్ని అంతా ఒలకబోసి భేష్ అనిపించాడు .ఈ మధ్యలో ఒక భగ్న ప్రేమికుడి ఆత్మహత్య తెలిపే ‘’వేర్తెర్క్ లెయిడన్’’నవల రాశాడు .వీటి తర్వాత క్లౌవిగో ,ఎగ్మండ్ నాటకాలు ,విజేల్మ్ మైస్టర్అనే నవలా ,అనేక గేయాలూ రాసి ,జర్మన్ సాహిత్యానికే కాక ఐరోపా సాహిత్యానికీ మార్గదర్శి అయ్యాడు .తన జీవిత చరిత్రను ‘’డిష్ టుంగ్ ఉండ్ వర్ హిట్’’అంటే ‘’కవిత్వం –సత్యం ‘’పేరిట రాసి ప్రచురించాడు .. మహాకవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకం చదివిన జర్మన్ నాటక కథ ,విమర్శకుడు దార్శనికుడు గోధే ఆనందం తో నృత్యం చేశాడని ‘’దివి ని భువి ని కలిపిన మహత్తర నాటకం ‘’అని శ్లాఘి౦ చాడు ‘’అని 3-3-14 న అమెరికాలోని హూస్టన్ లో గోథేరాసిన ‘’ఫాస్ట్ ‘’నాటకం చదివి దాన్ని గురించి చెబుతూ ఉపోద్ఘాతంగా నేను రాసిన మాటలివి .జర్మని ఎయిర్ పోర్ట్ ఫ్రాంక్ ఫర్ట్ లో ఒక రెస్టారెంట్ కం బార్ లో గోథే విగ్రహాన్ని చూసి పులకించి ఫోటోలు తీశాను .అంతటి మహారచయితకు బార్ లో విగ్రహం ఏమిటని ఆశ్చర్యపోయాను కూడా .
గోథే సమకాలికుడు షిల్లర్ -1759-1805’’డీ రాబర్ ‘’-దొంగలు నాటకంలో సంప్రదాయబద్ధ సాంఘిక మర్యాదలను విమర్శించాడు .ఇతడి ‘’ఫీస్కో ‘’నాటకం ప్రజాదరణ పొందలేదు కాని ‘’కబలే ఉండ్ లీబే ‘’కుట్ర –ప్రేమ నాటకం లో ఆత్మానుభూతి ,యదార్ధ పాత్ర చిత్రణ ,ఆవేగం అంటే తొట్రుపాటు ఉన్నాయి .డాన్ కార్లోస్ పద్య నాటికలో స్వంత చరిత్ర కొంత జోడించాడు .జర్మనీలో జరిగిన 30ఏళ్ళ యుద్ధం చరిత్ర ,వాల్లెన్ స్టెన్,డీ జంగ్ ఫ్రన్ ఫన్ ఆర్లియన్స్ ,విలేలం టేల్అనే మూడు ఉత్తమనాటకాలూ ,గేయాలూ రాశాడు .అన్నిటిలో శబ్ద శ్రావ్యత లావణ్యం ,లయ మూర్తీభవించి ఉన్నాయి .
నూతన భావుకత హొయల్ డెర్లిన్ కవి కవిత్వం లో ఉన్నది -1770-1843.చివర్లో ఉన్మాదం వచ్చే ముందు రాసిన గేయాలు మనసుకు ఆర్ద్రత కలిగిస్తాయి .మానవాతీత కథలు రాశాడు హోఫ్మన్-1776-1822.యక్ష,కిన్నెర గాథలు రాసి పండించాడు టీక్ కవి-1773-1853.కొన్ని మంచినాటకాలూ రాశాడు .ష్లె గెల్ సోదరులు నవ్య యుగ సాహిత్య ,నాటక సాహిత్యాలను సమీక్షిస్తూ రచనలు చేశారు .కొన్ని అనువాదాలూ చేశారు .బ్రెంటానో-1778-1842లో రాసిన కథలు తరువాతకవులకు కావ్య వృత్తాలైనాయి .చాయా, రహస్య వాదాలు రిక్టర్ -1763-1825 రచనలలో కనిపిస్తాయి నోవాలిన్ కవి -1772-1901-కవిత్వం లో రహస్య,ప్రతీక వాదాలున్నాయి .,లాలిత్యం మాధుర్యం తో .మధ్యే మార్గం లో గొప్ప పద్యాలురాశాడు యూసుఫ్ ఫన్ ఐచెన్ డోర్ఫ్-1788-1857..ఈయుగ ఉత్తమ నాటకకర్త హేన్రిష్ ఫన్ క్లైస్ట్ -1777-1811.నిరాశ నిండి ఉన్న ఇతని నాటకాలలో ఫ్రింజ్ ఫీడ్రిష్ ఫన్ హో౦ బర్గ్ శ్రేష్టమైనదని భావిస్తారు .
సశేషం
నృసింహ జయంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-20-ఉయ్యూరు
గోథే చిత్రం కవిత