రేడియో బావగారి కబుర్లు -5

రేడియో బావగారి కబుర్లు -5

బావగారు 2-బ్రహ్మమోక్కడే పరబ్రహ్మమోక్క డే –బుద్ధం శరణం గచ్చామి –నమస్కారం బావగారూ

బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధుడిని వెంట తెచ్చారు బాగుంది

2-ఆవిశేషాలు తెలుసుకోవాలనే తాపత్రయం బావగారు సెలవీయండి

1-పరమానందంగా .ముందు అన్నమాచార్య గురించి చెబుతాను .అన్నమయ్య కడపజిల్లా తాళ్ళపాక లో పుట్టాడు .తండ్రివరకు అక్కడ శివాలయ పూజారులు .తర్వాత ఈయన తిరుమలవెల్లి అక్కడ వైష్ణవం తీసుకొన్నాడు .అన్నమయ్య తల్లి లక్కమా౦బ తో   ‘’మాడుపూరి మాధవ స్వామి ‘’మాట్లాడేవాడట .అదీ ఆమె భక్తి .సంతానం కోసం ‘’తిరు వేమ్గాముడైయ్యా ‘’కు సేవ చేసింది .కలలో స్వామి సాక్షాత్కరించి ‘’బిరుదు గజ్జియల కటారం ‘’ఇచ్చాడు .అందుకే అన్నమయ్య ‘’నందక అంశం ‘’లో పుట్టాడు అని అంటారు అన్నమయ్య తాతకు ‘’చింతలమ్మ ‘’దేవత ఒక సారి కలలో కనిపించి ‘’మూడవ తరమ్మునను –వదలని కీర్తి మీ వంశంబు నందు –పరమ భాగవతుండు ,ప్రభవించు శౌరి –వరమున జగదేక వల్లభుం డతడు’’అని చెప్పింది ఆ వర ఫలమే అన్నమయ్య.ఇంతకు  ముందు వారి వంశం లో ఎవరికీ ఈ పేరు లేదు ఈయన తోటే ప్రారంభమైంది. ఒక రోజు స్వామి ‘’పంచాస్త్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు పసిడి మువ్వల యందెలు ,పైడి వలువలు మొదలైన వస్త్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై పదరచన ము అల్లుము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు .సందేహాలన్నీ తీరాయని ,బ్రహ్మానందం పొందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక తీరుస్తానని పదం చెప్పాడు.తాళ్ళపాకలో ఆయనక కుటుంబం వ్యవసాయంచేసేది .ఒకరోజు గడ్డికోయ్యటానికి పొలం వెళ్ళాడు ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి రక్తం కారింది . .ఏదో అశాంతి మనసులో జొరబడింది . ఆ భావాలనే పదం గా రాశాడు .అప్పుడే వెంకటాద్రి ఉత్సవాలు జరుగుతుంటే భక్తజనం వెంట వెళ్ళాడు

2-తిరుమలేశుడు కనిపించాడా బావగారూ

1-.దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల పడగల మయం –అఖిలోన్నతం  ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి నిత్య నివాసం గా ,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా భాసించింది .ఆ కొండ వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి .బ్రహ్మాది లోకాల కొనల కొండ .సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే నిట్ట చరులు .తపసులే తరువులు .పొడుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి అలాంటి చోట కొండపై శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపోయాడు .ఒక చెట్టుకింద నిద్రపోయాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ మందలించి స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది. మెలకువ వచ్చి అమ్మపై ‘’శతకం’’ చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు .మకుటమే స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య పదారేళ్ళ పడుచు అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి .వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపోయాడు .లేచి పెద్ద గోపురాన్ని ,చింత చెట్టును చూసి ప్రదక్షిణాలు  చేశాడు .ఆ వృక్షాన్ని’’ శేషాంకం’’ అన్నాడు .గరుడ ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకి౦చి పోయాడు .అక్కడి చిలుకలు స్వామిని కీర్తిస్తున్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది .ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తిన వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక ,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం ,బలమైన కండలు .’’విఠలాని’’కి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ ‘’విఠలం ‘’అంటే అన్నమయ్య భావనలో ‘’వెంకటాద్రియే ‘’.అంటే కొంత దృష్టి భేదాన్ని తగ్గించుకొన్నాడన్న మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డల వాళ్ళు పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపోయాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తోంది . ‘’..జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపోయాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తోంది .

2-చాలా గొప్పగా చూపించారు బావగారు తిరుమలేశునిచూసి  ఊరుకున్నాడా అన్నమయ్య

1-ఊరుకుంటే మనం చెప్పుకోవాల్సింది ఏముంటుంది ? స్వామి పాదాలు ‘’బ్రహ్మ కడిగినవే .బ్రహ్మమే ఈ పాదం .బలి తలను తన్నింది ,గగనాన్ని తన్నింది ,భూమిపై మోపిందీ ఈపాదమే .బలికి మొక్షాన్నిచ్చిందీ ఈపాదమే ’’అని కీర్తించాడు .ప్రాచీనులు స్వామిని త్రివిక్రమావతారం గానే భావింఛి ‘’అడియోన్’’అన్నారు .స్వామి చేయిని పొగడుతూ ‘’అందరికి అభయమిచ్చినదని, వేదాలని వెతికి తెచ్చిందని ,భూదేవిని కౌగిలించిందని ,నాగేలును ధరించినదని ,మొక్షాన్నిచ్చే చేయి అని కీర్తించాడు .అక్కడ జరిగే సేవలన్నీ తనివి తీరా వీక్షించాడు .శుక్రువారప్పూజకు పరవశుడయ్యాడు .’’సొమ్ములన్నీ కడ బెట్టి ,సొంపుతో గోణము గట్టి –కమ్మని కదంబము ,కప్పు పన్నీరు –చెమ్మతోన’’వేష్టువలు ‘’రొమ్ముతల మొల చుట్టి ‘’అని పదం పాడాడు .ఇక్కడ ‘’వేష్టువం ‘’అనే మాట అన్నమయ్య వాడాడు .అంటే అప్పటికే కొంత వైష్ణవం ,సంప్రదాయం అన్నమయ్యకు అర్ధమైంది  .నైవేద్యాల వైభోహాన్ని కన్నులార గాంచాడు .’’మేరు మందారాలలాగా మెరిసే ఇద్దేనలు ,సూర్య చంద్రుల్లాంటి గుండ్రనిపళ్ళాలు ,చుక్కలు రాసి పోసినట్లు ఆరని రాజనాల అన్నం ,అనేక సముద్రాల్లాంటి వెండి గిన్నెలు ,మంచుకొందల్లాంటి వెన్న ముద్దలు ,వెన్నెల రసమా అన్నట్లు పంచదార కుప్పెలు ,తేనెల గిన్నెలు ,టెంకాయ పాలు ,ఆనవాలు ,వెన్నట్లు ,అరిసెలు ,గారెలు  కరిజి కాయలు (కజ్జికాయలు ),కండ మండేలు,పూర్ణపు కుడుములు (ప్పూర్నబ్బూరెలు )ఇలా ఎన్నెన్నో నైవేద్యాలు .స్వామి తిన్నాడో లేదోకాని మనకు మాత్రం నోరూరించాడుఅన్నమయ్య.కదా బావగారూ

2పరవశమే కలిగించారు మీరు .

1-ఇవన్నీ నేను చెప్పినవికాదు బావగారూ –సరస్వతీపుత్ర డా పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అమోఘ విశ్లేషణ.నాకు అందింది మీకు అందించాను పోస్టాఫీస్ బిజినెస్ గా అంతే.అన్నమయ్య రాసిన 32వేల పదాలలో మొదటిదీ ఛివరిదీ ఎవరికీ ఇప్పటి వరకు తెలియదట

2-అసలు స్వామి ఎలాకనిపించాడు అన్నమయ్యకు బావగారూ

1-     పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి రాయడా –‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన నిదానం .చేతికందిన పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి .చెడిపోకుండా కాపేడే సిద్ధమంత్రానివి ,రోగాలను పోగొట్టే  దివ్య  ఔషదానివి,బడి వాయక తిరిగే ప్రాణ బంధువువి నీ అభయ హస్తం తో చేదుకో ‘’ అని ఆర్తిగా వేడుకొన్నాడు .ఇన్ని చేసిన శ్రీనివాసుని అభయ హస్తం మాత్రం అన్నమయ్యకు ఇంకా దక్కలేదు

2-     తర్వాత ?

1-ఇంటికి తిరిగివచ్చాడు కాని ధ్యాస అంతా  శ్రీనివాసుడిపైనే ఇంట్లో చెప్పకుండా మళ్ళీ వెళ్లి దర్శించాడు .స్వామి దివ్యగాధలు ఊళ్లోనూ ఇక్కడా వింటూనే ఉన్నాడు .ఏమైనా స్వామిని పట్టుకోవాల్సిందే అనే నిశ్చయానికి వచ్చాడు .’’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తాడనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకోన్నాడు .ఆ హరి ధ్యానాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పోతున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని  కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన ప్రాణమే .వేదరక్షకుడైన విష్ణువే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా ఈతనినినే ‘’సుత్తి ‘’చేస్తుంది అని పాడాడు .

2-శృంగారం రంగ రించాడా

1-అమ్మవారి అయ్యవారి అన్నిరకాల శృంగారం కొంతమితిమీరినా బాగా రాశాడు .తాదాత్మ్యంలో ఒళ్ళూ పైనా తెలీవుకదా బావగారు ,కాంతలో 12రాసుల ఉనికిని పరమాద్భుతంగా గుర్తించి రాసి చరిత్ర సృష్టించాడు .

2-సాల్వ నరసింహుడి విషయం ఏమిటి

1-ఒకరోజు సాల్వుడు అన్నమయ్యను దర్శించాడు ‘’నువ్వు చక్రవర్తివి అవుతావు ‘’అని దీవించాడు .ఆ ప్రయత్నం లో ఉంటె గజపతులు దండెత్తారు అన్నమయ్య అప్పుడు ఓఢ్ర భాషకూడా నేర్చాడట .తురుష్కుల దండయాత్రకూడా సాగి ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తుంటే ‘’అయ్యోయ్యోకలికాలము ‘’అని వాపోయాడు ఆ వాగ్గేయకారుడు .ఆయన పూజావిగ్రహాలు ఎవరో దొంగలించారు .ఆంజనేయుడు తో సహా అందరికీ మొరపెట్టుకున్నాడు ,దొరక్కపోతే తానె వెదకటం మొదలుపెట్టాడు .దొరికినట్లు లేదు

2-వైష్ణవం ఎప్పుడు స్వీకరించాడు

1-శఠ కోప యతీంద్రుల వారి దర్శనభాగ్యం కలిగి క్రమంగా వైష్ణవానికి దగ్గరై,ఆచారాలు వంటబట్టించుకొని వాటిపై కీర్తనలు రాశాడు .శిష్యుడు సింహాసనం దక్కించుకొని గురువుగారిని పెనుగొండ కు  ఆహ్వానించి కొలువులో ఉంచి సంగీతగోస్టులు చేశాడునిత్యం ఒకరోజు శృంగార కీర్తన చెప్పమని అడిగితె ,పాతవాసన గుర్తుకొచ్చి  ‘’ఏమొకో చిగురుటధరమున ఎదఎడ కస్తూరి నిండెను ‘’చెప్పాడు .తనపై పదం చెప్పమంటే చెప్పను అంటే గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టాడు .రాజు కండకావరాన్ని పోగొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి వేళల ,నలపైన వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు  ,-కొరమాలి యున్న వేళ ,కులము చెడిన వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే గతి గాక – సంకెల బెట్టిన వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-వేంకటేశు నామమే విడిపించ గతి గాక –మంకు బుద్ధి బొదలిన మరి లేదు తెరగు ‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు..రాయలకు భయం వేసి ఆయన జోలికి మళ్ళీ వెళ్ళలేదు

2-తర్వాత ఏమైంది బావగారూ

1-తాళ్లపాకకో తిరుమలకో చేరి ఉంటాడు .కొందరు సాహితీకారులు అన్నమయ్య జాతీయాలను ‘’దొబ్బేసి ‘’తమవిగా ప్రచారం చేసుకొన్న సంగతి చేవినబడి తన మనోభావాలను ‘’రామ క్రియ ‘’లో ఇలా తెలియ జేసుకొన్నాడు .’’వెర్రు లారా!మీరు వేరుక కలిగి తేను –అర్రు వంచి తడుకల ల్లంగ రాదా!ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు –కుడిచి వేసిన పుల్లె కుడువ గా రాదు –బడి నొకరు చెప్పిన ప్రతి చెప్ప బోతేను –అదరు శ్రీహరికిది అరుహము కాదు’’అని అంటూ ‘’చిబికి వేసిన గింజ చేత బట్టగ నేల-కబుక కెంగిలి బూరె గడు గంగ మరినేల?-మించు చద్ది కూటి మీద నుమిసినట్లు –మంచిదొకటి చెప్పి మరి చెప్పనేరక –పుచ్చి నట్టి పండు బూజు లోననె యుండు –బచ్చెన కవితలు బ్రాతిగావెందు-‘’అని చివరికి ‘’ఎన్నగ శ్రీ వేంకటేశు తాళ్ళపాక –అన్నమాచార్యులు అఖిల దిక్కులు మెచ్చ –ఉన్నతితో బాడిరాక డేవ్వ డను –సన్న నోరాసు నట సమ్మతా హరికి?అని ఏకి పారేసి శ్రీహరినే నమ్మాడు .

కీర్తి,కనకాలు వర్షిస్తూనే ఉన్నాయి .పదకవితా పితామహుడని పించుకొన్నాడు ఆ తర్వాత ‘’ ‘’సంకీర్తనా చార్యుడు’’అని పేరొందాడు .ఇక ఇక్కడి నుండి అన్నమయ్య సాధన ప్రారంభం అయింది.అప్పటిదాకా సంసారం ‘’అమృతపు నడబావి’’అనిపించి ఇప్పుడు ‘’జలధి లోపలి ఈత ,జము నోటిలో బతుకు ,చమురు తీసిన దివ్వె’’ ,’’అన్న ఎరుకకలిగి,అప్పుడెప్పుడో స్వామి కనిపించాడు కానీ మళ్ళీ కనిపి౦చ లేదన్నబాద పెరిగి అది తనతప్పే అని గ్రహించి ‘’  యెంత మాత్రమున ఎవ్వరు తలచిన అతడు అంతమాత్రమే .ఘన బుద్ధులకు ఘనుడు .అల్ప బుద్ధులకు అల్పుడు .నీటికొలది తామర ‘’అని స్వామి వెంటబడ్డాడు . శ్రీరాగం లో ‘’నిత్యాత్ముడై యుండి నిత్యమై వెలుగొందు –సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు –ప్రత్యక్షమై యుండి ,బ్రహ్మమై యుండు ‘’అని స్వామి అసలు రహస్యం అర్ధం చేసుకొన్నాడు .’’ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత-డేమూర్తి నిజ మోక్ష మియ్య జాలెడు నాత-డే మూర్తి లోకైక హితుడూ –ఏ మూర్తి నిజ మూర్తి  నే మూర్తి యును గాడు ,-ఏ మూర్తి త్రై మూర్తు లేకమై యాత-డేమూర్తి సర్వాత్ముడైన మూర్తి –ఆ మూర్తి తిరు వెంకటాద్రి విభుడు ‘’అని స్వామి సర్వాన్తర్యాన్ని ,త్రిమూర్తి స్వరూపాన్ని మనసులో దర్శించాడు .’ ఏ వేల్పు పాదయుగ మిలయు నాకాశంబు –ఏ వేల్పు పదమీ శాన్తంబనంతంబు –ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతం-బే వేల్పు నిజ దాసు లీ పుణ్యులూ –ఏ వేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు –డేవేల్పు భువనైక హిత మనో భావకుడు –ఏ వేల్పు కడుసూక్ష్మమే వేల్పు కడు ఘనము-ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడూ ‘’అని అలౌకిక ప్పారవశ్యం తో వొడలు తెలియక పాడాడు.

2-ఇదే  భక్తరామదాసు సినిమాలో  కబీరు,రామదాసు కలిసిపాడుతారు .దీనికి మూలం అన్నమయ్య రచనే అన్నమాట

1-అవును యదార్ధం బావగారూ రచయిత భారవి అన్నగారు వేదవ్యాస రాసిన మహా గొప్ప పాట అది .చివరికి శరణాగతికి వచ్చి ‘’నీ నామం భవహరం ‘’అంటూ శ్రీనివాసునిపై భారం వేసి నిశ్చింతగా కూర్చుని ఆయన దయతో పరమపద సోపానం చేరాడు సంకీర్తనాచార్య ,పదకవితా పితామహ తాళ్ళపాక అన్నమాచార్య <span style=”font-size:9pt;font-family:Arial,sans-serif;color:rgb(51,51,51);background-image:initial;background-position:initial;background-size:initial;background

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.