ప్రపంచ దేశాల సారస్వతం
60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం
బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యపితామహుడుగా మాటిజా డీవ్ కో విక్ ను భావిస్తారు .ఇతనితోపాటు హసనా జినికా కూడా జానపద సాహిత్యం లో ప్రసిద్ధుడు .20వ శతాబ్ది మహిళా రచయితలలో బిసేరా అలీ కెడిక్ లార్వా అండ్ క్రుగ్ రచనతో ప్రసిద్ధురాలు .గ్రాడ్ హిరాబ్రాస్ట్ –అంటే దిసిటి ఆఫ్ కరేజ్ ,దినిగా వేర్మేనా అంటే బుక్ ఆఫ్ టైం నవలలు 1900లో జరిగిన బోస్నియా యద్ద నేపధ్యంగా వచ్చినవి .ఈమె కవిత్వం ఇతర రచనలు ఇంగ్లిష్ ,జర్మన్ ఫ్రెంచ్ టర్కిష్ ఇటాలియన్ మొదలైనభాషలలోకి అనువాదం చెందాయి .12కవితా సంపుటులు వెలువరించింది .5వచన సంపుటులు రాసి ముద్రించింది .ఆర్డర్ ఆఫ్ లేబర్ విత్ గోల్డెన్ రీత్ అవార్డ్ ,గోల్డెన్ బ్రూక్ ఫర్ ఆర్ట్ అవార్డ్ ,స్కేండర్ కులోనోవిక్ అవార్డ్ పొందింది
నూనా బెజడుల్జి -కవయిత్రి రచయిత్రి .బాలసాహిత్యం యువసాహిత్యం ,నవలలు నాటకాలు సుమారు 20రాసింది .vbzఅవార్డ్ గ్రహీత .అలెక్జాండ్రావోరోవిక్ –జర్నలిస్ట్ .బాలల విద్యావ్యాప్తికి రాసింది ,కృషి చేసింది .జుప్కో రేస్సిక్ అవార్డ్ ,స్టాంకో రకిటా అవార్డ్ ,స్లోవో ప్రడ్గేమికా అవార్డ్ లు పొందింది ఆమె రచనలు మాజిక్ రోజ్ నవల ,ఓవర్ కమింగ్ కవితా సంపుటి ప్రసిద్ధాలు నసిహా కపిడిక్హడ్జిక్-బాలసాహిత్యంరాసింది .కాస్ట్యూమ్ బాల్ ఇన్ ది వుడ్స్ఆమెరాసిన మొదటి పిల్లలపుస్తకం ఏమ్బ్రాయిదార్డ్ బ్రిడ్జ్ ,హిడెన్ టేల్ ,దిడ్రీం అబౌట్ మీడోస్,లిల్లిపుట్ ,మై లాంబ్ స్లీప్స్ అండర్ దిబ్లాసమ్స్ మొదలైన రచనలెన్నో చేసింది .వేసేలిన్ మాసలీస ఓడలైన వార్డ్ లగ్రహీత .జెంజికా ములికవిక్ లుకాక్ –ప్రొఫెసర్ .రష్యా భాషనుంచి సెర్బియాకు చాలారచనలు అనువాదం చేసింది .చాలా మోనోగ్రాఫ్ లకు ఎడిటర్ .నేషనల్ ధియేటర్ స్థాపకురాలు నటి నిర్మాత డైరెక్టర్ కూడా .ఎన్నో అవార్డ్ లు పొందింది .లిజుబికా ఓస్టో జిక్-నాటకాలురాసింది .కవిత్వం రాసింది .ఈమె రాసిన స్వేజిటి లొస్ట్ బెస్ట్ బుక్ అవార్డ్ పొందింది .నఫీజా సరజలిక్ –మొదటి బోస్నియా ముస్లిం వచనరచయిత్రి .ఆస్ట్రో హంగేరియన్ కాలం నాటి విషయాలెన్నో రచనలలో త్రవ్వి తలకేత్తిందిది .పార్టింగ్ ,ఎ ఫ్యు పేజెస్ ,వన్ క్లాస్ మొదలైనవి బాగా పేరుపొందాయి .స్టాంజా స్టుపార్ట్రిఫు నో విక్-యుగోస్లేవియా యుద్ధ కాలపు సంఘటనలపై ఎక్కువగా రాసింది .కవిత్వం కధలు చాలారాసింది .కూకా ఓడి స్లోవా ,అడోర్నా స్వరకా ,గాల్వని జునేక్ కే జోవేజ్ కోజి సే జల్జుబ్జూజి యునేస్రే బాగా ప్రసిద్ధాలు .యూరోపియన్ యూనియన్ ప్రైజ్ జ్లాన్టోసోవా అవార్డ్ ,మార్టి క్ లిటరరీ అవార్డ్ లు అందుకొన్నది .జగోడా తుహేల్కా –స్త్రీవాద రచయిత్రి ,బాలసాహిత్యమూ రాసింది .వీరంతా 20,21శతాబ్ది లబ్ధ ప్రతిష్ట రచయిత్రులే
పురుష రచయితలలో –ఐవో ఆన్ద్రిక్ ,బెనోబెనిక్ ,బ్రాన్కో కోపిక్ ,ఒస్మాన్ డి కిక్ ,డేర్విక్ సుసిక్ ,నెనాద్ విల్క్కోవిక్ ,కరీం జల్మోవిక్ వంటి వారెందరో ఉన్నారు
11మంది ప్రసిద్ధ రచయితలు-సెమెజ్ డిన్ మెహ్మనోదిక్,బిసేరా అలికాదిక్ ,ఒట్టో లాంగ్ ,కరీం జేమో విక్,జ్లాటా ఫిల్లిపోవిక్,మిల్జేంకో జెర్గోవిక్,అలిజా ఇజేట్ బెవిక్,సాఫ్వెట్ బెగ్ బసాజిక్ , అబ్దుల్లా సిడ్రాన్,ఐవో ఆన్డ్రిక్
యుగోస్లేవియా గురించి తెలిపే 5పుస్తకాలు –ది ఫాల్ ఆఫ్ యుగోస్లేవియా –మిషా గ్లేన్ని ,జ్లాటా డైరి –జ్లాటా ఫిలి కో విక్,ది బ్రిడ్జి ఆన్ ది డ్రినా-ఇవోఆన్డ్రిక్.దిసేల్లిస్ట్ ఆఫ్ సర్జేవో-స్టీవెన్ గలోవే,గుడ్ బై సర్జేవో-ఎట్రూ స్టోరి ఆఫ్ కరేజ్ ,లవ్అండ్ సర్వైవల్ –అటకా రీడ్అండ్ హానా స్కోఫీల్ద్ .
బోస్నియాను ‘’వేర్ ది ఈస్ట్ మీట్స్ దివెస్ట్ అంటారు మనహైదరాబాద్ ను వేర్ నార్త్ మీట్స్ సౌత్ అన్నట్లు .అట్టో మాన్ మరియు ఆస్ట్రో హంగేరియన్ ల ప్రాచీన సంస్కృతుల మేళవింపు ఇక్కడ కనిపిస్తుంది .38లక్షలజనాభాలో బీదరికంలో మగ్గేవారు 7లక్షలు. 25శాతం పిల్లలు పేద కుటుంబాల వారే.స్త్రీ విద్య ఉద్యోగాలుతక్కువే .నిరుద్యోగం శాతం ఎక్కువే .దేశం చిన్నది జనాభాఎక్కువ .రాజధాని- సరజెవో అధికార బోస్నియాభాషలేదు .సెర్బియన్ భాషలు మాట్లాడుతారు .
బోస్నియాలో పుట్టిన రచయిత-ఇవో అన్డ్రిక్ కు 1961లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అప్పుడాయన యుగోస్లేవియాలో ఉన్నాడు .1967బోస్నియా దేశ అవార్డ్ పొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-20-ఉయ్యూరు