ప్రపంచదేశాలసారస్వతం62- క్రోషియన్ సాహిత్యం
క్రోషియాప్రజలభాష క్రోషియన్. ఆసాహిత్యమే క్రోషియన్ సాహిత్యం .మధ్యయుగ వచనం యూరోపియన్ మధ్యయుగ వచనంలాగానే ఉండేది .మధ్యయుగ సాహిత్యం 11నుండి 16శతాబ్ది వరకు ఉన్నది .మొదట్లోవ్రాత రాతి పలకలమీద ,తర్వాత పత్రాలమీద ఉంటూ ఆతర్వాత ముద్రణ పొందింది .ఈయుగ క్రోషియన్ సెగ్మెంట్ లాటిన్ లో రాయబడింది .హాజియోగ్రఫీ ,చర్చి చరిత్ర లను డాల్మాషియన్ తీర ప్రాంత నగరాలలో రాయబడింది .ఉదాహరణకు 6-7శతాబ్దం ‘’స్ప్లిట్ లిస్కి ఎవాండ లిస్టర్’’మొదలైన లర్జికల్ ,నాన్ లర్జికల్ రచనలు .తొలితరపు క్రోషియన్ సాహిత్యం డాల్మాటిన్,ఇస్త్రియన్ అమర వీరుల చరిత్రలు ,సెయింట్ డుజే,సెయింట్ అనస్టా షియస్ మొదలైనవారు క్రిస్టియన్ ఆచారవ్యవహారాలు గురించి రాసినవి .ఇవన్నీ లాటిన్ హిజియోగ్రఫిలోనే రాయబడినవి .
14వ శతాబ్దిలో పాశ్చాత్య ప్రభావం క్రోషియన్ సాహిత్యం పై పడి మూడు విధాల మిళిత భాషలో రచనలు వచ్చాయి .సామాజిక దృష్టి పెరిగింది .ఉత్తమశైలీ నిర్మాణంతో వివిధవిషయాలపై రచనలు వచ్చాయి .క్రోషియన్ భాషలో 1483లో ముద్రణ పొందిన మొదటి పుస్తకం ‘’మిస్సేల్ రోమానియం గ్లగోలిటిస్ ‘’.ఇదే మొదటి నాన్ లాటిన్ పుస్తకంగా రికార్డ్ కెక్కింది.డాల్మేషియన్ హ్యూమనిస్ట్ –మార్కో మారులిక్ లాటిన్ భాషలో దున్నేస్తూ యూరప్ అంతా ప్రసిద్ధి పొందాడు .కాని ఆయన రాసిన క్రోషియన్ రచనలే కీర్తికి కారణమయ్యాయి .ఇతని ‘’జుడితా ‘’అనే ఎపిక్ పోయెం 1501లో రాస్తే ,1521లో వెనిస్ లో ముద్రణ పొందింది .హవార్ ఐలాండ్ కు చెందిన పీటర్ హెక్టో రోవిక్’’ఫిషింగ్ అండ్ ఫిషర్ మెన్స్ టాక్ ‘’అనేది క్రోషియన్ భాషలో వచ్చిన మొదటి కవిత .ఇందులో అన్యాపదేశంగా ప్రకృతి అందాలను తన పుట్టిన ఊరును వర్ణించాడు.హేక్త్రో విక్ జాలర్లపాటలు రికార్డ్ చేశాడు .ఈ కాలం లోనే హ్వార్హనిబాల్ లూసిక్ లు ఒవిడ్ రచనలను అనువాదం చేశారు.
వచన రచనలు నాటకాలు రాసినవారిలో జింకోజ్లటారిక్,మావ్రో వెట్ర నోవిక్,మార్టిన్ డ్రిజిక్.మొదటి క్రోషియన్ నవల ‘’ప్లనైన్ ‘’అంటే పర్వతాలు ను పీటర్ జోరానిక్ రాశాడు .అతని మరణానంతరం వెనిస్ లో 1569లో పబ్లిష్ అయింది .ఇందులో అతని ప్రకృతిఆరాధన ,సాహసాలు ,,పల్లెటూరిపిల్లపై ప్రేమ వున్నాయి .17వ శతాబ్దిలో క్రోషియా లో ‘’బరాక్ సంస్కృతి ‘’వచ్చింది .ఇది కౌంటర్ రిఫార్మేషన్ ఉద్యమం .పవిత్రవంతమైన అర్ధవంతమైన లలిత కవిత్వం ఉద్భవించింది .ఒజాలి స్లావిక్ మొదలైన ప్రాంతీయ సాహిత్య సర్కిల్స్ ఏర్పడ్డాయి.క్రోషియన్ భాషలో ‘’ఓ లీపా ,ఓ డ్రాగా ఓ స్లాటికా స్లోబోడో’’అంటే హాయైన స్వేచ్చ , ప్రేమమయ స్వతంత్రం ,కమ్మటి అనుబంధ స్వేచ్చ కవిత బహుళ ప్రశస్తిపొందింది .అతని ఒస్మాన్ ,గుండిలిక్ రచనలలో ఇస్లాంకు క్రిష్టియానిటికి ఉన్న భేదం ,యూరప్ కు టర్కీలకు,పాశ్చాత్య తూర్పులకు ఉన్న భేదాలను చక్కగా విశ్లేషించాడు బానిసత్వానికి స్వేచ్చకు ఉన్న తేడాను వివరించాడు .గొప్ప సాహిత్య విలువలున్న రచనలుగా ఇవి గుర్తి౦పు పొందాయి .ఇతర ప్రసిద్ధ రచయితలలో –ఉంజి పాల్మోటిక్,ఇవాన్ బూనిక్ ఉక్కి ,పీటర్కనవేలిక్.లాటిన్ ,ఇటాలియన్ భాషా రచనలు ఈకాలం లో స్థానిక భాషలలోనికి అనువాదం పొందాయి .మొదటి క్రోషియన్ వ్యాకరణం బార్టోల్ కాసిక్ రాశాడు .క్రోషియా చరిత్రను లాటిన్ లో శాస్త్రీయంగా ఇవాన్ లుసికి రాశాడు .క్రోషియన్-ఇటాలియన్-లాటిన్ నిఘంటు రచన జాకోవ్ మికల్జా కూర్చాడు .
18వ శతాబ్దిలో అట్టోవాసామ్రాజ్య కబంధ హస్తాలనుంచి డాల్మేషియా,స్లావోనియా విముక్తిపొందాయి .యూరప్ లోని ఎన్ లైటేన్ ఉద్యమప్రభావం పడింది .మేరియా ధేరేసా,జోసెఫ్ -2ప్రేరణబాగా ఉండేది.జాతీయతా భావాలు పెరిగి ఆయా దేశాలు స్వాతంత్ర్యాన్ని 19వ శతాబ్దిలో పొందాయి .జ్ఞానోదయ భావ స్పూర్తితో పావాయో రిట్టార్ విటేజోవిక్ అనే చరిత్రకారుడు ‘’ఆధునిక పాన్ స్లావిక్ ఐడియాలజీ’’స్థాపించి స్టెమ్మటో గ్రాఫియా అంటే చరిత్ర గ్ర౦థాలు,ఓడిల్జెంజి సిజేట్సో -ఎపిక్ రాశాడు .ఈ శతాబ్ది చివరలో ప్రసిద్ధ స్కాలర్స్ ,ఫిలాసఫర్స్,రచయితలు క్రోషియన్ ,లాటిన్ ,ఇటాలియన్ భాషలలో రాశారు.డుబ్రోవినిక్ డిక్షనరీ రాసినవాడు జోకిం స్టులిక్.
రోమాన్టిజం కూడా వ్యాపించి రచనలు చేశారు .1848లో రోమా౦టిజం ,రియలిజం లమధ్య సేతువు’’ ప్రోటో రియలిజం’’ వచ్చింది .అగస్టస్ సేనోవా దీనిలో ప్రసిద్ధుడు .జెంస్లేవ్ నోవాక్ రియలిజం లో ప్రసిద్ధుడు .ఇతనిప్రసిద్ధ నవల –ది లాస్ట్ సిపానిక్ .జెన్కో లోస్కోవార్ సైకలాజికల్ నవలారచయిత .ఇతని మిసావో న జేక్నోస్ట్ నవల ఆధునిక రచనకు నాంది .సిల్వజే స్ట్రాహిమిర్క్రాన్జ్ సేవక్19వ శతాబ్ది గొప్పకవి .ఇతని బుజర్కేంజే కవితా సంపుటి జానపద గీతాలు .కవి నాటక ,నవలాకారుడు జోసిఫ్ డ్రాజేనోవిక్ తీరప్రాంతప్రజలు వారిమధ్య సంబందాలపై రాశాడు .ఆన్ద్రె ట్రెసిక్పవికిక్ క్రోషియన్ కవిత్వంలో ఇటాలియన్ భావజాలాన్ని నింపాడు .ఇతని ‘’ట్విలైట్ సాంగ్స్ ‘’బాగా ప్రచారం పొందాయి .
ఆధునిక భావ ఉద్యమం సాహిత్యంలోనేకాక కళలలోనూ ప్రవేశించి ప్రభావితం చేసింది .అంటున్ గుస్టావ్ టొస్,దడిన్కోసిముయోవిక్ లు ఈ ఉద్యమంలోనూ లేరు .వ్లాడిమిర్ నజార్ఆధునికయుగ రచయితలలో మేటి –స్లావిక్ లెజెండ్ .మిలాన్ ఒర్జినోవిక్ ,జోసెఫ్ కోసోర్ జానపదాలనుంచి విషయాలు తీసుకొని ప్రముఖనాటకాలురాశారు .అంటున్ గుస్టావ్ మాటొస్ కదానికా ప్రక్రియలో సుప్రసిద్ధుడు .సాహిత్య పత్రికలూ విరివిగానే వచ్చి సాహిత్యవ్యాప్తికి దోహదం చేశాయి
ప్రసిద్ధ క్రోషియన్ రచనలు –నాగర్బ్ నాయిర్ –క్రోషియన్ రచయితల జీవిత విశేషాలు,ఫేర్వెల్ కౌబాయ్ –ఇవాన్సేవిక్ ,జగ్రెన్ ఎక్సిట్స్ సౌత్ –ఈడో ప్రపోవిక్ ,హెడ్జి హాగ్స్ హోమ్-బ్రాన్కో కోపిక్ ,ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ రీజన్ –మిరోస్లోవ్ క్రేల్జా ,ది కల్చర్ ఆఫ్ లైస్-డార్కీ హూమరస్ ఎస్సేస్ ,కేఫ్ యూరోపా –వ్యాస సంపుటి-జర్నలిస్ట్ స్లేవెంకా డ్రాకులిక్ ,జగ్రేబ్-సీలియా హాకేస్ వర్త్ ,చేజింగ్ క్రోషియన్ గర్ల్ –కోడీ బ్రౌన్ ,గర్ల్ ఎట్ వార్ –సారానోవిక్
నోబెల్ ప్రైజ్ లు ఇద్దరు సైంటిస్ట్ లకు కెమిస్ట్రిలో వచ్చింది కాని సాహిత్యంలో రాలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-20-ఉయ్యూరు