ప్రపంచదేశాలసారస్వతం64- అల్బేనియన్ సాహిత్యం
మధ్యయుగాలలోనే అల్బేనియన్ సాహిత్యం ఆ భాషలోనే వృద్ధి అయింది .అల్బేనియా ,కొసావో ,ఇటలీలోని అల్బెనియన్లు రాసినదే ఈసాహిత్యం .ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినభాష .అసలు దీని ఆవిర్భావం ఎప్పుడు ఎక్కడో తెలియకపోయినా ప్లిరియన్ భాషా జన్యం అంటారు 1332లో ఆర్చిబిషప్ ఆన్టివారి గులౌమే ఆడం ఒక రిపోర్ట్ రాస్తూ అల్బెనియన్లుపుస్తకరచనలో తమ భాషకు భిన్నమైన లాటిన్ అక్షరాలూ వాడుతున్నారని చెప్పాడు .అల్బేనియన్ సాహిత్యంలో అత్యంత పురాతనమైనది ‘’ఫార్ములా ఈ పెజిమేట్ ‘’అంటే బాప్టి స్మల్ ఫార్ముల .దీన్ని డురెస్ బిషప్ పాల్ ఇంగ జేల్లి 1462లో ఘేజ్ మాండలికం లో రికార్డ్ చేశాడు.దీనితో పాటు న్యు టెస్టమెంట్ గీతాలుకూడా చేశాడు .ఇంతకుపూర్వమే 1210లో ధియోదర్ ఆఫ్ స్కోడ్రా 208పేజీల ప్రాచీన రచన భద్రపరచాడు .
15వ శతాబ్దిలో అట్టో వాన్ సామ్రాజ్యం అల్బెనియన్లను చాలామందిని దేశంనుంచి తరిమికోట్టింది .ఈ విషయం సభ్యప్రపంచానికి చరిత్రకారుడు మారిన్ బర్లేటి – 1460-1513రోమ్ చరిత్రలో భాగంగా ‘’హిస్టరీ ఆఫ్ స్కాన్దేన్ బెర్గ్ ‘’లో రాసి 1510లో ముద్రించాడు .ఇది అనేక యూరోపియన్ భాషలలోకి అనువాదం పొందింది .16వ శతాబ్దిలో అల్బేనియన్ భాష కోసం ఉద్యమం వచ్చి ఆతర్వాత ప్రొటేస్టంట్ లు బలపడ్డాకభాషా రచన మొదలైంది .మతగ్రందాలతోపాటు చారిత్రిక క్రానికల్ రచనా సాగింది .క్రిస్టియన్ టీచింగ్ ,రిట్యువల్స్ కే ప్రాధాన్యం .1621లో దీన్ని పిజేటార్ బుడి అల్బేనియన్ వచనంలో రాశాడు .బొగ్దాని అల్బేనియన్ సంస్కృతీ మానవీయ దృక్పధం తో రాశాడు .ఇదే ఆ సాహిత్యానికి గొప్ప మలుపు .జుట్ వేరిబోబా కూడా ఈదోరణే అవలంబించి రాశాడు .
17,18శతాబ్దులలో బైబిల్ లో కొన్ని భాగాలు అల్బేనియన్ భాషలోకి తర్జుమా అయ్యాయి .కోస్టాన్డిన్ క్రిస్టో ఫోర్బిది -1830-95రెండుమా౦డలికాలనుకలిపి ఒకే అల్బేనియన్ భాషగా మార్చాడు .ఒసోక్టో పొజా సంస్కృతి 17వ శతాబ్దిలో బాల్కిన్ పెనిన్సులాలో గొప్ప నాగరకతను పె౦చింది .అకాడెమి ,ప్రింటింగ్ ప్రెస్ వచ్చాయి టి.కవిల్ జోటి.డిహెచ్ హాక్స్ హియు ల కృషివలన .వీరంతా తమతమ క్షేత్రాలలో అద్భుత రచనలు చేసి సాహిత్య స౦పద పెంచారు ,కల్జోటి రచనలలో ఎక్కువభాగం ముద్రణకు నోచుకోలేదు కాని ఆయన అన్ని శాఖల వేదాంతాన్నీ రచనలో చొప్పించాడు అతని పై ప్లేటో ,డేస్కార్టేజ్,లీబ్నిజ్ లప్రభావం ఉన్నది .
ఆధునిక యుగారంభం లో ఇస్లాంలోని సూఫీయిజం ఇక్కడ ప్రభావం చూపింది దండయాత్రలప్రభావం వలన .అప్పుడు ఆల్బనీ భాషలో రాసినా ఆరబిక్ అక్షరాలూ వాడారు .నేజిమ్ఫ్రాకుల్లా ,మొహమ్మేట్ కికికు ,సులేమాన్ నైబి ,హసన్ జికో కంబెరి ,షె మాలా ఇలారాశారు .బెట్జేక్స్ హింజ్ కవిత్వం పై పెర్షియన్ ,టర్కిష్ అరెబిక్ ప్రభావం జాస్తి .సున్నీ మతభావాలే రచనలలో వ్యాప్తి అయ్యాయి .నేజిమ్ ఫ్రాకుల్లా -1680-1760 మొదట్లో కవిత్వం పర్షియన్ అరెబిక్ లలో రాసి ,1731నుంచి 35వరకు అల్బేనియన్ భాషలో రాశాడు .హసన్ జైకొ కంబెరి ముస్లిం సంప్రదాయం తుచ తప్పనికవి .అల్బేనియన్ భాషలో చాలా సెక్యులర్ గీతాలు కూడా రాశాడు .
19వ శతాబ్దిలో జాతీయ రినైసేన్స్ వచ్చిమిలిటరీ, లిటరరీ ఉద్యమాలు సాగాయి .అల్బేనియన్ రోమాన్టిజం ఊపు వచ్చి స్వాతంత్ర్య కాంక్ష పెరిగి౦ది .జేరోనిం డీ రాడా-1814-1903,నయీం ఫ్రషేరి-1846-1900లు రొమా౦టిక్ కవులు రాడారాసిన కవిత్వం కమనీయం .గ్రామీణ జీవిత సౌందర్యాన్ని నయి కవిత్వంలో దించేశాడు . కజూపి ని రస్టిక్ పోయెట్ అంటారు .రచనలలో కామెడి ఆఫ్ కస్టమ్స్ ,ట్రాజేడి ఆఫ్ హిస్టారికల్ ధీమ్స్ఉంటాయి .శామి ఫ్రాశేరి ,వాసో పాషా, జెఫ్ సెరేమ్బి,స్తావ్రే ద్రేనోవా వంటివారెందరో ఆధునికకవులున్నారు .ఫాన్ స్టిల్లాన్ నోలి కవి నాటకకర్త మ్యూజికాలజిస్ట్ .ఇతనినాటకాలు దిఎవేకేనింగ్ ,ఇజ్రలైట్స్ అండ్ ఫిలస్టైన్స్ ఫ్రెంచ్ రివల్యూషన్ బాగా పేరుపొందాయి
రెండు ప్రపంచయుద్దాలంధ్యా రోమా౦ టిజం డామినేట్ చేసింది .ఫాక్ కొనిట్జా ఆధునిక వచనరచన పితామహుడు .వ్యంగ్యం పండించాడు.రష్యాలో స్టాలిన్ కమ్యూనిస్ట్ పాలన సిద్ధాంతాలను అల్బెనియాలో అమలు జరిపారు .సోషలిస్ట్ రియలిజం లో రచనలు చేశారు చిన్నకథలూ అదే దారిపట్టాయి .
సమకాలీన అల్బేనియన్ నవలా రచయిత ఇస్మాయిల్ కదరే నవలలు 45భాషలలోకి అనువాదం పొందాయి .ఇందులో జనరల్ ఆఫ్ ది డెడ్ ఆర్మీ ,దిసీజ్ ,క్రానికల్ ఇన్ స్టోన్,దిత్రీఆర్చేడ్ బ్రిడ్జ్ వంటివి అత్యద్భుతాలు .నిరంకుశత్వం ,యాత్రీకరణ నేపధ్యంగా రాసినవి.ఆధునిక ప్రసిద్ధకవయిత్రి – లుజెటాలేషనాకు.ఎన్నోకవితా సంపుటులు రాసి ముద్రించింది .సృజనకు పట్టం కట్టి అనేక అంతర్జాతీయ బహుమతులు పొండింది.ఫోర్స్ ఫుల్ అండ్ కన్విన్సింగ్ రచయితగా గురింపు పొందినవాడు ఫటోస్ కొంగోలి .స్టాలిన్ నిరంకుశ పాలన లో అసలు కలం ముట్టుకోలేదు .స్టాలిన్ పతనం తర్వాత ‘’ది లూజర్ ‘’అనే గొప్పనవల-1992లోరాసి జగత్ ప్రసిద్ధుడయ్యాడు ఈ నవలలో హోక్సా పాలన తదనంతర పరిణామాలు వస్తువు . కా౦టేమ్పరి రైటర్ –బెన్ బ్లుషి రాసిన లివింగ్ ఆన్ యాన్ ఐలాండ్ ,ఒటెల్లో ప్రముఖమైనవి .యూరోపియన్ యూనియన్ ప్రైజ్ పొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-20-ఉయ్యూరు