ప్రపంచ దేశాలసారస్వతం
63-సైప్రస్ సాహిత్యం
సైప్రస్ దేశ సాహిత్యాన్ని సైప్రియట్ సాహిత్యం అంటారు .గ్రీక్ టర్కి ఇంగ్లిష్ ,ఫ్రెంచ్ ఆధునిక భాషలలో ఆ సాహిత్యం ఉంటుంది .ఆధునిక క్రిప్టాలిక్ భాష -ఆధునిక గ్రీకు ఆగ్నేయ మాండలికం లా ఉంటుంది .సైప్రియట్ సాహిత్యం క్రీ.పూ 7వ శతాబ్దిలో స్ట్రాన్షియస్ రాసిన ఎపిక్ .స్టావోయిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ని క్రిప్రియట్ జీనో స్థాపించాడు .దీన్ని పెరూషియాస్ అనే శిష్యుడు అనుసరించాడు . అపోజిల్స్ కు చెందిన వృత్తాంతాలున్నాయి .బైజాన్టిక్ మధ్యయుగ రచయితలలో లియో నిటోస్,ఆల్ధేడియస్ పేట్రియార్క్ గ్రిగరి ఉన్నారు ‘’ఆక్రిటిక్ సాంగ్స్ ‘’ఆయుగ ప్రధాన సాహిత్యం.
మధ్యయుగ సైప్రస్ రాజ్య లెజిస్లేష ను అసిజేస్ ఆఫ్ జెరూసలెం అంటారు .దీన్ని స్థానిక మాండలికం లో,ఫ్రెంచ్ భాషలో రాశారు .1531లో ఇది ఇటాలియన్ లోకి అనువాదం చెందింది .ఇదే ప్రస్తుతం లభిస్తున్న సైప్రస్ మధ్యయుగ సాహిత్యం.లియాన్ టాయిస్ మఖేరియాస్ ,జార్జి బూస్టోనియస్ ల క్రానికల్స్ ఫ్రాన్కిష్ రాజ్యం లోనివి -1191-1489.ఇవి ఫ్రెంచ్ ప్రేరనున్న స్థానిక మాండలిక రచనలు .ఫ్రాన్సేస్కో పెట్రి యార్కారాసిన ‘’పోయెమ్స్ డీ మోర్’’16వ శతాబ్ది గ్రీక్- సైప్రటిక్ లో సైప్రస్ వెనిస్ రిపబ్లిక్ లో ఉన్నప్పుడు రాసినవి .వీటిలో కొన్ని పెట్రి యార్క్ బెమ్బో ,అరిస్టో ,సంనజారో ల సృజన కవితలూ ఉన్నాయి .షేక్పియర్ ఒథెల్లో నాటకంలో చాలాభాగం వెనిషియన్ సైప్రస్ లో రాసిందే .
ఆధునిక సైప్రస్ రచయితలలో కవి రచయిత కోస్టాస్ మొన్టిస్ ,కవి కిరియాకో స్, చారలంబెడిస్,నవలాకారుడు పానోస్ లోన్నిడస్,కవి మైకేలిస్ పాసియార్డిస్ ,కవి ,అనువాదకుడు స్టెఫెనోస్ స్టెఫెన్డిస్,రచయితనికోస్ నికల్డేస్,హారర్ రచయితలుఫివోస్ క్రిప్రియానో,లూకిస్ అక్రిటాస్ మొదలైనవారు ,జానపద రచనలో పావ్లోస్ లియాసేడెస్,మైకేల్ డిస్ ఉన్నారు .సైప్రస్ కు చెందిన టర్కిష్ కవులు ,రచయితలలో ఒస్మాన్ టర్కే,ఓజ్ కెర్ యాసిన్ ,నేసె యాసిన్ నేరిమన్ కాహిట్.నేసె యాసిన్ కవయత్రి రచయిత్రి .ఈమె రచనలు గ్రీక్ ,ఇంగ్లిష్ లలోకి అనువాదం పొంది ప్రఖ్యాతురాలైంది .2002లో ఆమె నవల సీక్రెట్ హిస్టరీ ఆఫ్ శాడ్ గర్ల్స్ నిషేధానికి గురై ఆమెకు టర్కిష్ జాతీయవాదులనుంచి బెదిరింపులు వచ్చాయి .సెవ్ గుల్ డాగ్ –ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ . అంతుచిక్కని వేలాది మంది సైప్రస్ వాసుల ఆచూకీ వెలికి తీసింది .చాలాపుస్తకాలు రాసింది .ఉర్కే మైన్ బెల్మాన్ వివిధ ప్రక్రియలలో రాసిన రచయిత.వీటిలో రొమాంటిక్ కవితలు ,ఒంటరి పల్లెపిల్ల లపై గొప్ప కవితలు రాసింది .అర్మేనియన్ సైప్రియట్ కవి నోడానడ్జారిన్ మొదలైనవారు రెండు, మూడు తరాలవారు .కొందరు ఇతరదేశాలలో ఉంటున్నా రచనలు చేస్తున్నవారిలో మిరండా హోప్లరోస్ ,స్టీఫెన్ లాఫ్ట న్,క్రిస్టి లెఫ్రేరి,పాల్ స్టెల్లింగ్ వంటివారు చాలామంది .20వ శతాబ్దిలో సైప్రస్ నాన్ లోకల్ సాహిత్య సృష్టిని ప్రోత్సహించింది .గ్రీస్ రచయిత ,నోబెల్ లారిఎట్ –జార్జి సేఫరిస్ ను సైప్రస్ విపరీతంగా ప్రేరణకలిగించింది .ఇతని ప్రముఖ రచన –లాగ్ బుక్ 3 సైప్రస్ నేపధ్యంగా రాసిందే
గొప్ప ,డోలాయమాన సాంఘిక సంస్కృతీ ఉన్న సైప్రస్ చిన్నదేశం .మిలియన్ జనాభా అయినా సాహిత్య సంపద ఇక్కడ బాగా ఎక్కువే .కాని కొందరు రచయితలు గుర్తింపు పొందలేకపోయారు .అలాటి వారిలో –1-ఒస్మాన్ టర్కే 30భాషలలో రచనలు చేశాడు .అంతర్జాతీయ కీర్తి ఉన్నవాడు .రెండుసార్లు నోబెల్ కు నామినేట్ అయినవాడు .ఇలియట్ ,డిలాన్ ధామస్ ప్రేరణతో అవ౦ట్ గార్డె అంటే ప్రేరణాత్మక మార్గదర్శక కవిత్వం రాశాడు .ప్రకృతికి విరుద్ధంగా సాంకేతిక మార్పులు పెనునస్టం కలిగిస్తాయని ఎలుగెత్తి చాటాడు .
2-టెనార్ బెబార్స్ –అనువాదకుడు నవలా రచయితా కవి .1950లో లండన్ లో స్థిరపడ్డాడు .అక్కడి గ్రూప్ ఆఫ్ పోఎట్స్ లో సభ్యుడు ‘’ఇమేజెస్ ఇన్ సెల్ఫ్ బయాగ్రఫి ‘’ను సైప్రస్ గ్రామీణ నేపధ్యంగా రాశాడు
3-కిరియా కోస్ చారలం బిడెస్-ప్రముఖ గ్రీక్-సైప్రోటిక్ కవి .ఫస్ట్ సోర్స్ కవితాసంపుటి ప్రచురించాడు .ఇతనికవిత్వాన్ని యేట్స్ కవి కవిత్వంతో పోలుస్తారు ‘
4-యా౦డ్రియస్ కౌమి-ది సైప్రియట్ నవలలో 1950-70కాలం నాటి రోమాన్స్ ను ఎపిక్ గా రాయబడింది .క్రిస్టియన్ –ముస్లిం సంబంధాలు ,రాజకీయ సరిహద్దులు 1979 సైప్రస్ ఐలాండ్ విభజన జరగటానికి పరిస్టితులను అందమైన ప్రేమ కధ ఆధారంగా రచి౦ప బడిన గొప్పరచన .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-20-ఉయ్యూరు