సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23
సీత మాట్లాడినమాటలకు ఎక్కడోకాలి రావణుడు ఆమెతో ‘’మగాడు అనునయి౦చిన కొద్దీ స్త్రీ వశపడుతుంది .గుర్రం పెడత్రోవ పడితే సమర్ధుడైన సారధి దాన్ని దారిలోపెడతాడు .నీపై ఉన్నకామాన్ని నా కోపం అడ్డగిస్తోంది .కామం ఏర్పడితే దయ ప్రేమకూడా కలగటం సహజం .నిన్ను అవమానించవచ్చు చంపచ్చు,వానప్రస్త వేషం లో ఉన్న రాముడిపై ప్రేమింకా నీకున్నా నిన్ను చంపటానికి ఆజ్ఞ ఇవ్వలేకపోతున్నా.కాని నన్ను చాలానిర్దాక్షిణ్యంగా దూషించావు దీనికి ప్రతీకారంగా నిన్ను చంపటం న్యాయం ‘’అని అక్కసు అంతా వెళ్ళగ్రక్కి మళ్ళీ తమాయించుకొని ‘’నీకు ఇచ్చిన 12నెలలగడువులో 10నెలలు అయిపోయి రెండు నెలలు మాత్రమె మిగిలాయి .ఇప్పటికైనా నాతో రమించు .ఈ రెండు నెలలు దాటితే నిన్ను చంపి ఉదయ భోజనానికి వండుతారు ‘’అన్నాడు ఈమాటలకు సీతకు మాత్రమేకాదు దేవ గ౦ధర్వ కన్యలు కూడా కన్నీరు కార్చారు .కళ్ళతో ,పెదవుల చలనాలతో ,ముఖ భంగిమలతో వారు సీతను ఓదార్చారు .
వాళ్ళ ఓదార్పులకు కాస్త తెప్పరిల్లి సీత రావణుడితో ఇలా చెప్పింది –తుచ్చుడా ! ఇంద్రుడికి శచీదేవిలాగా రాముడికి నేనుభార్యను . పరాక్రమశాలి రాముని భార్యనైననన్ను నీచపు మాటలతో బాధించావు. దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు.మదపుటేనుగు రాముడికి ,చెవులపిల్లి నీకూ సాపత్యమా .మాయా మృగ వ్యాజం తో నన్ను దండకారణ్యం నుంచి ఎత్తుకోచ్చావు సిగ్గులేదా .ఇంకా రాముడి కంట బడ లేదు కనుక బతికి ఉన్నావు .అనార్యుడా !క్రూరమైన నీ నల్ల వికృతమైన కళ్ళు నేలపడి రాలిపోనూ. పతివ్రతనైన నన్ను నీచంగా మాట్లాడిన నీ నాలుక వెయ్యి వ్రక్కలుకానూ.నిన్ను శపించటానికి నా భర్త అనుమతి నాకు లేనందున నిన్ను బూడిద చేయాల్సి ఉన్నా దయతో వదిలిపెడుతున్నా .నీ మృత్యువు కోసం దేవుడే నీతో ఈ అకృత్యం చేయించి ఉంటాడేమో .కుబేరుడిఅన్నవు, సైన్యమున్నా రాముడిని దూరం చేసి నన్ను అపహరించిన పిరికి పందవు ‘’అనగానే రావణుడు కోపం కన్నులతో పాములాగా నిట్టూరుస్తూ ‘’నిర్ధనుడిని నమ్మావు .నిన్ను ఇప్పుడే సూర్యుడు సంధ్యను లాగా నా తేజంతో నాశనం చేస్తా ‘’అని భయంకరంగా గర్జించి కావలి కాస్తున్న అక్కడి రక్కసి స్త్రీలతో ‘’ఈమెను సామదాన భేదాది ఉపాయాలతో నాకు వశమయ్యేట్లు చేయండి .అవసరం వస్తే దండోపాయమైనా ప్రయోగించి నా వశం చేయండి ‘’అని కోపంతో ఆజ్ఞాపించగా ,దాన్యమాలి అతడిని కౌగిలించి’’సీత ఎందుకు నాతో సుఖించు రా .తన్ను ప్రేమించని స్త్రీని కామించే వాడి దేహం బాగా కాలిన కొలిమిలాఉంటుంది .నిన్నుమనసారా ప్రేమించే నన్నుపొంది ఆ తాపం తీర్చుకో ‘’అని వాడి మనసుమార్చగా వాడు ఆవు వెంట వెళ్ళే ఆబోతులాగా అంతః పురానికి బయల్దేరి వెళ్ళాడు .
ఇది 46శ్లోకాల 22వ సర్గ
రావణ ,సీత లు ఒకరినొకరు తీవ్రంగా తీవ్రంగా దూషించుకొన్నారు .రావణుడు ఏదో బలమైన కారణం వల్ల సీత ను ఏమీచేయలేకపోయాడు .సీత రాముని ఆజ్ఞ లేనందున వాడిని భస్మం చేయకుండా వదిలిపెట్టానని బుద్ధి కూడా చెప్పింది . రావణుడు సీతను దారిలో పెట్టె బాధ్యత కావలి స్త్రీలకు అప్పగిస్తే ,సీత తనదైవమే రావణుడికి యుద్ధం లో జయించి బుద్ధి చెబుతాడని చెప్పింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-20-ఉయ్యూరు