ప్రపంచ దేశాలసారస్వతం
66- బెలారస్ దేశ సాహిత్యం
బెలారస్ దేశం ఉత్తర యూరప్ లో రష్యా ,ఉక్రెయిన్ లిదువేనియా ల మధ్య యన్నది .రాజధాని –మిన్స్క్ .బెలారసియన్ రూబుల్ .జనాభా సుమారు కోటి బెలారస్ సాహిత్యాన్ని బెలారసియన్ సాహిత్యం అంటారు .17వ శతాబ్దికి ముందు క్లేవెన్ రస్ ఆధార సాహిత్యం ఉండేది .ఇదే రష్యన్ ఉక్రేనియన్ సాహిత్యాలకూ మూలం .బెలారస్ సాహిత్యం కు 16-17శతాబ్దాలు స్వర్ణయుగం .పాట బెలూశియన్ భాష అధికార భాష అయింది .ప్లేమిక్ సాహిత్యమన్తాఏ కాలం లోనే వచ్చి సుసంపన్నం చేసింది .16శతాబ్దిలో సాహిత్యం ముద్రణపొందింది .మొదటిపుస్తకం ‘’సాలిర్ ‘’ను 1517లో ఫ్రాన్సిస్క్ కర్యానా ప్రేగ్ లో ప్రింట్ చేశాడు .తర్వాత ఈస్ట్ సాల్వికన్ భాషలో పునర్ముద్రణ పొందింది .16,17శాతాబ్దాలలో కవిత్వం కూడా బాగా వచ్చింది .దీనిపై పోలిష్ సాహిత్య ప్రభావం ఎక్కువ .
పోలిష్ ,లిథువేనియన్ కామన్ వెళ్త లో పోలిష్ ,రష్యన్ భాషల భాష పెత్తనం వల్ల నామమాత్ర రచనలే వచ్చాయి .నాటక కారుడు కజేటాన్ మొరాజిస్కి ,మిఖల్ క్లేసీరేస్కిలు పోలిష్ బెలారస్ భాషలు మాట్లాడే కామిక్ పాత్రలు సృష్టించారు .19వ శతాబ్దిలో రినైజన్స్ ఉద్యమప్రభావంతో అజ్నాతకవులు ఇన్సైడ్ అవుట్ అనీడ్-1820,టారస్ ఆన్పర్నాస్సస్-1855లు వాడకం లోకి వచ్చి తర్వాత పబ్లిష్ అయ్యాయి .స్థానిక రచయితలూ జాన్ జేజ్కోక్ ,విన్సెంట్ డునిన్,అంద్రేజ్ రిపిన్స్కి పోలిష్ భాషలో రాశారు .ఉత్తరార్ధం లో రియలిజం వచ్చి ఆడం హరినోవిక్ ,జన్కాలుసియాన లు ఆ ధోరణిలో రాశారు చాలామంది జానపదాలు నెత్తికేత్తుకొన్నారు.ఎమడోకిన్ రోమనోవ్ బృహత్ జానపద గేయ సంపుటి రాసి ప్రచురించాడు .ఈకాలం లో బెలారసియన్ లాటిన్ ఆల్ఫబేట్ సిరిల్లిక్ ఆల్ఫబేట్ లు ఉపయోగించారు రచయితలూ
రష్యన్ రివల్యూషన్ తర్వాత 1905లో ఈ భాషలో వార్తాపత్రికలు వచ్చాయి .వీటితో రచయితల సర్కిల్స్ ఏర్పడి తమభాష అభివృద్ధికి అందులో రచనలకు ఆలోచన వచ్చింది .యాన్కాకుపాలా ,మాస్కిం బహానోవిచ్ మిత్రోక్ బ్లాడులియామొదలైన వారు రోమాన్టిజం,రియలిజం మోడర్నిజం భావాలతో గొప్ప రచనలే చేశారు .మొదటి ప్రపంచ యుద్ధం లో ఈదేశం స్వతంత్రం ప్రకతిన్చుకొని రిపబ్లిక్ అయింది 1918లో .తర్వాత బిలో రష్యన్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పడి ,ఈ దేశారచయితలచేత రెండు పత్రికలూ స్థాపించబడి సాహితీ సేవ చేశారు .1960లో వచనం లో మొరాలిటి భావ వ్యాప్తి వచ్చింది .కొందరు రచయితలు విసిల్ బైకావ్ ,కారత్కవిచ్ మొదలైనవారు వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు .చాలామంది రచయితలు బెలారస్ నుంచి వలస వెళ్ళిపోయారు .ఇక్కడి లీడింగ్ మేగజైన్ –లిటరేటురా ఇ మస్తస్క .స్వెత్లానా అలెక్సీ విచ్ ఇన్వెస్టి గేటివ్ జర్నలిజంలో మేటి .2015లో నోబెల్ పురస్కారం పొందాడు
బెలారస్ ప్రముఖ రచయితలలో కొందరిపెర్లు –మిఖాస్ కారత్ కుజ్మాకోర్ని ,ఫ్రాన్సియాస్ ఉమెస్తౌస్కి,జన్కాబ్రిల్ ,షా కత్ యనోవిస్కి,రైసా బరావికోవా ,ఎడ్యుర్డ్ స్కొబిలు ,సైమన్ బుడ్ని ,జాన్ జేజ్కాట్
67-జెక్ సాహిత్యం
జేకోస్లోవేకియాను జెక్ లేక జెక్ రిపబ్లిక్ అంటారు .1918 స్వాత౦త్ర్య౦ ప్రకటించుకొని ఆస్ట్రియా-హంగేరియన్ సామ్రాజ్యం నుంచి వేరై సావరిన్ రిపబ్లిక్ అయింది .ఒకటిన్నర కోటి జనాభా. ప్రేగ్ రాజధాని .జెక్ స్లోవేక్ భాషలు .కరెన్సీ-జెక్ కొరున.
ఇప్పుడు జెక్ భాష అమలులో ఉన్నా పూర్వం లాటిన్ జర్మన్ భాషల్లో రాసేవారు .13వ శతాబ్ది సాహిత్యంక్రానికల్స్ మాత్రమె .వీటిలో కాస్మాస్ రాసిన క్రానికల్ ను అందరూ గౌరవించి అనువాదం చేశారు .13వ శతాబ్దిలో ‘’మేన్నేసాంగ్ ‘’అనే జర్మన్ రాజ భాష కవిత్వం ఉండేది .ఆర్టిస్టిక్ ప్రోజ్ ను స్మిల్ ఫ్లాస్కా ,జోహేనెస్ వాన్ సాజ్ లు రాశారు
15వ శతాబ్దిలో వచ్చిన ‘’హుస్సైట్ రివల్యూషన్ ‘’తో జెక్ భాష జీవం పోసుకోన్నది .థియాలజిస్ట్ జాన్ హుస్ మొదట్లో లాటిన్ లో తర్వాత జెక్ లో రాశాడు .ఈకాలం లోనేజేక్ రేలియజియాస్ సాంగ్స్ కూడా వచ్చాయి .సాహిత్యంలో సాంఘిక సమస్యలకు చోటు దొరికింది .హుస్సేట్ యుద్దాల తర్వాత జార్జి ప్రోదేర్బరి జెక్ సింహాసనం ఎక్కి జెక్ భాషను అభి వృద్ధిచేశాడు .లాటిన్ లో రాసే కేధలిక్కులకు జెక్ లో రాసే ప్రొటెస్టెంట్ లకు మధ్య పోరాటాలు జరిగి స్వతంత్ర జెక్ భాషను కొన్నిలాటిన్ పదజాలంతో అభి వృద్ధి పరచుకొన్నారు .బోరోక్ ,ఎన్లైటేన్ పీరియడ్లలో చరిత్రరచన డ్రామారచన వచ్చాయి .
19వ శతాబ్ది అనువాదాలు ఎక్కువై జాతీయ సాహిత్యానికి దారి చూపింది .జోసెఫ్ జంగ్ మాన్ ప్రపంచ క్లాసిక్ సాహిత్యాన్ని జెక్ భాషలోకి అనువాదం చేశాడు .ఫ్రాంటి సేక్ పలాకి ,పావెల్ జోజేఫ్ లు జెక్ హిస్టరీ పునర్నిర్మాణం చేశారు .రచయితలూ ఆర్టిస్టిక్ లిటరేచర్ పై దృష్టిపెట్టి సీరియస్ గా రాశారు .సాంస్కృతిక వైభవానికి కారకులయ్యారు .మాచా ను కొత్త పంచాంగం అనుసరించి చాలామందిరాశారు .జాతీయ పరిధి దాటి అంతర్జాతీయంగా ఆలోచించి యూరప్ లోని నూతన ప్రక్రియల్లో రాశారు .దీన్ని ‘’మేజెనరేషన్’’ అన్నారు .దీనితర్వాత నియో రొమాంటిజం ,రియలిజం సింబాలిజం ,డేకడేన్స్ కొత్త శైలీ విధానం వచ్చాయి .సమకాలీన సమస్యలపై రాశారు .జాన్ హీర్బెన్ ,కారెల్ వాక్లోవ్ ,ఇజ్ఞాట్ హెర్మన్ కేపక్ కోడ్ వంటివారు పేదరిక జీవులపై సానుభూతితో రాశారు.జేరస్లావ్ వ్రిచిలిస్కి ఈకాలపు గొప్పకవి .వచనరచయితలలో విలెం మ్రిత్సేకి ,రుజేనాస్వబోద్వా ,జోసెఫ్ కేరెల్ స్లేజ్హార్ ఉన్నారు
20వశతాబ్దిలో అన్ని ఇజాలు దూరమై కాంక్రీట్ రియాలిటి ఏర్పడి ,దుఖం నుంచి విముక్తిపొంది కారెల్ టోమాన్ ,ఫ్రానా స్మరేక్ ,విక్టర్ డైక్,పీటర్ బెజురిక్ లు గొప్పగా రాశారు .శైలీ వైవిధ్యం బాగా కనిపించింది .తిస్చోవా నేచరిజంలో ,స్రమేక్ ,గేల్నియర్,జాన్ ఒపలస్కి లు ఇమ్ప్రేషనలిజ౦ ధోరణిలో రాశారు .కేధలిక్ ఆధర్స్ కు మళ్ళీ ఊపిరి వచ్చింది .నియోక్లాసిజం స్థానం క్యూబిజం ఫ్యూచరిజం సివిలిజం ఆక్రమించాయి .ఇవన్నీ వెనకబడ్డాక,ప్రేరణాత్మక మార్గదర్శక సాహిత్యం ఊపులోకి వచ్చింది .జిరివోకర్ ,దేనేక్ కాలిస్టా ఇలారాశారు .తర్వాత ఫన్టాస్టిక్,ఉటోపియాలు ప్రవేశించాయి .1920-30లోని ఎకనామిక్ క్రైసిస్ వచ్చి ఆధ్యాత్మికతపై దృష్టిపెరిగి ఆతరహా రచనలు గుప్పించారు .ఇందులో చావు భయం ,ఇమేజేస్ ,చీకటి భయపెట్టాయి .సర్రియలిజం వచ్చి వెళ్ళిపోయింది .జర్నలిజ౦ ఎపిక్ రచనపై మమకారం పెరిగింది .జానపదం ఆకర్షించి బాలడ్ రచన పెరిగింది .సాంఘిక ఇతివృత్త నవలలు వచ్చాయి .పోలాకేక్ ,మేరిన్ మేజేరోవా ఇలారాస్తే ,సైకలాజికల్ నవలలు జేర్మిల్లా గజరోవాఈగన్ హాస్టో విస్కీ రాశారు .రాజకీయ నాటకాలు కరెల్ కేపాక్ రాసి ఫాసిజం డిక్టేటర్ షిప్ దుమ్ము దులిపాడు
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత సాంఘిక రాజకీయ సమస్యలపై రచనలు రాయాల్సిన అవసరం కలిగింది .ఎమికోల్పోయామో ఏమి సాధించామో అన్న ఆలోచనతో రచనలు చేశారు .1989లో కమ్యూనిజం పతనం తర్వాత జెక్ నాటకరంగానికి సంపూర్ణ స్వేచ్చ లభించింది .నిషేధ రచయితలైన ఇవాన్ బ్లాంటి ,జాన్ క్రేసేల్డో సాహిత్యం ముద్రణకు నోచుకొన్నది .సమకాలీన జెక్ సాహిత్యం జెక్ సినిమా సాహిత్య స్థాయి పొ౦ద లేక పొయి౦ది అనె విమర్శ ఉన్నది .పేటర్ సబోక్ ,ఇవాన్ మార్టిన్ జిరోస్ మొదలైనవారి రచనలు విస్తృతంగా వస్తున్నాయి జనమూ ఉత్సాహంగా చదువుతున్నారు .జెక్ లిటరరీ అవార్డ్ లుకూడా ఏర్పాటయ్యాయి .
జెక్ రిపబ్లిక్ రచయిత-జేరోస్లోవ్ సీఫర్ట్ 1984లో సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-20-ఉయ్యూరు