ప్రపంచ దేశాలసారస్వతం
70- లాట్వియా దేశ సాహిత్యం
లాట్వియా దేశం బాల్టిక్ సీ పై లిదువేనియా ఎస్టేనియా దేశాలమధ్య ఉన్నది .వైల్డ్ బీచెస్ ,దట్టమైన అరణ్యాల దేశం .రాజధాని వుడెన్,నోవియు ఆర్కి టేక్చర్ కు ప్రసిద్ధమైన రిగా..కరెన్సీ –యూరో .జనాభా 19లక్షలు .అతి బీద దేశం .అధికార భాష లాట్వియన్ .
లాట్వియా దేశ సాహిత్యాన్ని లాట్వియన్ సాహిత్యం అంటారు .లాట్వియన్ భాషలో పాటలు తరతరాలుగా వ్యాప్తి చెందాయి .19శతాబ్ది ముందు కొందరు రచయితలు రాయటం మొదలు పెట్టారు .గోథార్డ్ ఫ్రీద్రిక్ స్టెండర్ వంటి వారు కవిత్వం, వచనం రాశారు .అసలైన ఆదేశ సాహిత్యం 19వ శతాబ్దిలో జురిస్ అలునాస్ పాటలపుస్తకం తో ప్రారంభమైంది .లాట్విన్ భాష రైతు భాష అని బాల్టిక్ –జర్మన్ మేధావులు తక్కువగా భావిస్తే కాదు అద్భుతవాహిక అని తన రచనలతో నిరూపించాడు .1856లో ఈపుస్తకం ముద్రణ పొందింది .అదే ఏడాది చార్లెస్ బాడలేర్ ‘’లెస్ ఫ్లుఎర్స్ డు మాయ్’’ అంటే ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్స్కవితా సంపుటి ‘’రాసి ఆధునిక యూరప్ కవిత్వానికి నాంది పలికాడు .ఎందరినో ప్రభావితం చేశాడు .ఆ దేశ ఎపిక్ ‘’లాక్ ప్లేసిస్ ‘’1888లో ఆన్డ్రేజేర్స్ పంపర్స్ రాశాడు .
20వ శతాబ్దిలో దేశానికి జర్మన్, రష్యన్ సంబందాలేర్పడటం వలన సింబాలిజం ,డేక డేన్స్.సోషలిజం మార్క్సిజం ఉద్యమాలు ఉవ్వెత్తున వచ్చి 1905రివల్యూషన్ లో దేశం ఓడిపోవటంతో అండర్ గ్రౌండ్ చేరాయి .జారిస్ట్ ప్రతీకార తీవ్రత తో లాట్వియానుంచి మొదటి బాచ్ మేధావులు వలసపోయారు .రైనిస్ కవి ,నాటకరచయిత అనువాదకుడు ,రాజకీయనాయకుడు ఆ శతాబ్దాన్ని ‘’ఫైర్అండ్ నైట్ ‘’-1905,ఇండులిస్ అండ్ ఆర్జా-1921 నాటకాలతో ,మలుపుతిప్పి చాలామంది యితలపై ప్రభావం చూపాడు .అతనిస్థానిక సింబాలిజం ఆదేశ జాతీయ ఉద్యమానికి దారి తీసింది .అతడే ఆదేశం రష్యా సామ్రాజ్యంలో భాగంగా ఉండరాదని ,వేరుపడి రిపబ్లిక్ దేశం అవ్వాలని కోరాడు .అస్పాజియా అనే స్త్రీవాద రచయిత్రిని పెళ్ళాడి ,దేశ బహిష్కారం తో ఇన్నర్ రష్యాకు ,ఆతర్వాత స్విట్జర్ లాండ్ కు చేరి మళ్ళీ లాట్వియా స్వాతంత్ర్యం పొందాక తిరిగి వచ్చారు .భార్య సోషల్ డెమాక్రటిక్ వర్కర్స్ పార్టీలో చేరి ,పార్లమెంట్ లో అని సెషన్లలో 1920-34వరకు పాల్గొన్నది
విక్టార్ ఎజిలిటిస్ రష్యన్ సింబాలిజం కు ఆకర్షితుడై డేకడేన్స్ ఉద్యమం నడిపాడు .చాలా తీవ్రంగా మోడర్నిస్ట్ పోయేటిక్స్ రాసి ,తర్వాత దేశభక్త చారిత్రిక ఫిక్షన్ రచయిత అయ్యాడు .రిపబ్లిక్ లాట్వియాలో అలేగ్జాండర్ కాక్స్ రిగానగర పేదరికం వ్యభిచారం లపై అంతకు ముందు ఎవరూ రాయని గొప్ప కవిత్వం రాశాడు .అతని ఎపిక్ పొయెం’’ముజిబస్ స్కార్టీ’’ ఆదేశ రైఫిల్ వీరులకు అంకితమిచ్చాడు .ఆ దేశం సోవియట్ లో భాగంగా ఉండగా అతని రచనలు రాజకీయ వ్యతిరేకమని దాడి చేస్తే ఆరోగ్యం దెబ్బతిని గుండెపోటుతో 8-2-1950న చనిపోయాడు .జర్మని స్వాధీనం చేసుకోన్నాక ఎరిక్ ఆడం సన్వాలిస్ సేంద్రింస్ పుస్తకాలు ముద్రించటం మొదలెట్టి తర్వాత ఇతరదేశాలకు వలసపోయారు .1991లో దేశం స్వతంత్రం పొందాక మళ్ళీ వచ్చి రాసినవారిలో మార్గారిటా గుర్మేన్ ,రాబర్ట్ మాక్స్ జానిస్ సోడుమ్స్ ఉన్నారు .
రెండవ ప్రప౦చయుద్ధం తర్వాత కొందరు పడమటి దేశాలకు వెళ్ళిపోయారు కొందరు లేబర్ కాంప్ లకు తరలి౦ప బడ్డారు ‘కృశ్చెవ్ వచ్చి స్టాలిన్ దురంతాలు బయట పెట్టాక 56వ జనరేషన్ సాహిత్యావిర్భావం జరిగి ఒజర్స్ వాసిటిస్,విజ్మా బెలేస్వికా ,ఇమాన్స్ జేల్డోని సాహిత్యానికి కొత్త ఊపిరులూదారు .అన్నా రాన్కేన్,ఆస్కార్స్ సీక్ సైట్స్,ఇంగ్రిడా టరౌడా మొదలైనవారు రెండు మూడు భాషలలో రాస్తున్నారు. కల్చర్ సెంటర్ ఆఫ్ లాట్ గేల్ అనేక పుస్తకాలు ప్రచురిస్తోంది .కవి నావలిస్ట్ ,డ్రమటిస్ట్ ఇంగా ఎబెలి ,కవులు ఎద్విన్స్ రౌప్స్ ,పీటరిస్ డ్రాగన్స్,లియానాలాంగా అన్నా ఔజ్న,వచనరచనలో పాలిస్ బాంకో విస్కీ ,జాన్స్ ఈన్ ఫీల్డ్స్ ,నారా ఇక్స్టేనా వంటి కొత్తతరం రచయితలు స్వేచ్చగా లాట్వియా సాహిత్యాన్ని ఘనంగా పండిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-20-ఉయ్యూరు