సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-25
రాక్షస స్త్రీల భీకరకఠినోక్తుల చేత కలత చెందిన సీతాదేవి భయకంపిత గద్గద స్వరంతో ‘’ నేను మానవ స్త్రీని రాక్షసుడికి భార్య కానేరను .కావాలంటే నన్ను చంపి తినేయ్యండి ‘’అని కఠినంగా చెప్పింది .కన్నీరు మున్నీరుగా కారుస్తుంటే ఒళ్ళంతా తడిసిపోయింది. వణికే ఆమె పొడవైన వెడల్పైన జడ కదిలి పాకిపోయే పాములాగా కనిపించింది .’’హా రామా హా లక్ష్మణా అత్తగారూ కౌసల్యా సుమిత్రా ‘’అని రోదించింది .ఎవరికైనా అకాల మృత్యువు దుర్లభం ఇన్నిబాధలుపడుతున్నా నాప్రాణం పోవటం లేదు .ఏదైనా కొద్దిపుణ్యం చేసుకొని ఉంటె నేను సముద్రమధ్య౦ లో సరుకు తో నిండిన ఓడ పెద్దగాలికి ఊగినట్లు ఊగిపోయి అనాధగా చనిపోతాను .నా రామ దర్శనం ధన్యులైనవారికే దక్కుతుంది .పూర్వ జన్మలో నే జేసిన పాపానికి ఫలం ఇక్కడ అనుభవిస్తున్నాను .భర్త అనుమతిలేకుండా ప్రాణాలు ఎలా విడవగలను అనుకొన్నది .
ఇందులో ‘’హా రామేతిచ దుఖార్తా హా పునర్లలక్ష్మణేతి చ –హా శ్వశ్రు మమ కౌసల్యా హా సుమిత్రేతి భామినీ ‘’
శ్లోకం లోక ప్రసిద్ధం .తానూ రామభార్యనే కాని అన్యులకు కాదు అని తెగేసి చెప్పింది అన్ని బాధలు అనుభవిస్తున్నా,. వాళ్ళు తనని చంపెసితినేస్తారని తెలిసినా.అదీ సీతా సాధ్వి మనో నిబ్బరం అంటే .ఉడత ఊపులకు జడిసేదికాదు ,నిశ్చయ మనో రధం ఆమెది .
ఇది 20 శ్లోకాల 25వ సర్గ.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-20-ఉయ్యూరు