ప్రపంచదేశాలసారస్వతం71 – లీ చెస్టీన్ సాహిత్యం
జర్మన్ భాష మాట్లాడే లీ చెస్టీన్ 25కిలోమీటర్ల పొడవైన ప్రిన్సిపాలిటిఅనబడే అతి చిన్న దేశం . ఆస్ట్రియా-స్విట్జ ర్లాండ్ల మధ్య ఉంటుంది .మధ్యయుగ రాజభవనాలు ఆల్పైన్ పర్వత శ్రేణులు దీని ఆకర్షణ .రాజధాని వాడుజ్ .జనాభా 39వేలు .కరెన్సీ –స్విస్ ఫ్రాంక్ .
ఈ దేశ సాహిత్యం జర్మన్ భాషలోనే ఉన్నది .ఇక్కడి రచయితలు ఒంటరి రితనం ఫీలవుతారు .గ్రూప్ ఆఫ్ రైటర్స్ కనిపించరు .సీగ్లిండే సోహిఅనే రచయత్రి ట్రేడ్ పాలిసి ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ,రిలక్ట౦ట్ యూరోపియన్స్ వంటి 7పుస్తకాలురాసిన ఎకనామిక్ మేధావి .ఇరెన్ నిగ్గ్ యాత్రికురాలు, జర్నలిస్ట్ మొదటిపుస్తకం –ఫీబెర్ జీట్ ను 1988లో రెండవది –మాన్ వోర్తర్ సిచ్ డైఓర్తే సేల్బిస్ట్ 2006లో రాసింది .యూరోపియన్ యూనియన్ ప్రైజ్ పొందింది .చిన్న చిన్నవి చాలారాసింది .ఆర్మిన్ ఓహ్రి-2014లో తన ‘’డార్క్ మ్యూజ్ ‘’అనే క్రైం ఫిక్షన్ కు యూరోపియన్ యూనియన్ ప్రైజ్ గెల్చిన రచయిత .ఇతరరచనలు-డాస్నచ్టిక్ ఓక్ ,డై ఎన్దోఫంగ్ ఏర్జాహ్లుంగ్ ,ప్రొఫెసర్ హార్పర్స్ ఎక్ష్పెడిషన్ మొదలైన 10పుస్తకాలు .హాన్స్ జోర్గ్ రీయిన్ బర్గర్ –సైన్స్ హిస్టోరియన్ .బెర్లిన్ లో మాక్స్ ప్లాంక్ ఇన్ స్టి ట్యూట్ ఫర్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్ ‘’కు డైరెక్టర్.హిస్టరీ అండ్ ఎపిస్టమాలజి ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్,ది హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ బయాలజీ ,ప్రోటీన్ బయో సింథసిస్ రాశాడు కవిత్వం ఎన్నో సాహిత్యవ్యాసాలురాశాడు ,కోజిటో అవార్డ్ , దడిస్టిన్గ్విషడ్ లెక్చరర్ అవార్డ్ వంటివి చాలా అందుకొన్నాడు .ఈ దేశం పైనా ఇక్కడి విశేషాలమీదా 35దాకా పుస్తకాలొచ్చాయి .ఇంతకంటే నాకు ఏమీ దొరకలేదు .
72-లిథూనియా దేశ సాహిత్యం
లిధూనియారిపబ్లిక్ దేశం యూరప్ లోబాల్టిక్ ప్రాంతంలో ఉంటుంది .బాల్టిక్ దేశాలలో ఇదీ ఒకటి .తూర్పున స్వీడెన్ ,డెన్మార్క్ ఉంటాయి .రాజధాని –వినియస్ .కరెన్సీ-యూరో .జనాభా 28లక్షలు .భాష లిధూనియన్.
లిధూనియన్ పూర్వ సాహిత్యం లాటిన్ లో రచింపబడి ఉన్నది .దీనికి కారణం రాజు మిండాగస్.జేడిమనాస్ అక్షరాలవాడకం ఇక్కడ మరో వింత .లాటిన్ లో రాసిన మొదటి ఈదేశరచయిత నికోలస్ హస్సోవినాస్ కవి 1440-1533రాసిన కామేన్ డీస్టాతురాలో ఆదేశ లాండ్ స్కేప్ వర్ణన ,ఆచారాలు రాజకీయాలు ,పాగనిజం క్రిస్టియానిటి తగాదాలు ఉంటాయి .ఇది 1523ప్రచురణ .జోఎన్నేస్ విసిలియాస్ -1485-1560’’ప్రష్యన్ వార్ ‘’అనే గొప్ప కవిత్వం రాశాడు .మైకులో లిటూనస్ ‘’ది కస్టమ్స్ ఆఫ్ తార్తార్స్’’ను 16శాతాబ్దిమధ్యలో రాశాడు .ఇది 1615లో ప్రచురితం .స్పెయిన్ లో పుట్టినలాయర్ కవి పెట్రస్ రాయ్ సుయస్ 1505-1571-సాంస్కృతిక రంగం లో ప్రసిద్ధుడు .అన్గిస్టినస్ రోటు౦ డస్ ఈ దేశ చరిత్ర లాటిన్ లో రాశాడు .రాడ్ వాన్స్ హ్యూమనిస్ట్ కవి ఆ దేశ జాతీయ ఎపిక్ ‘’రడివిలియస్’’1588లో రాశాడు .బోలేరాస్ లారంటి యస్ కవి స్వీడెన్ పై తన దేశం గెలిచిన చారిత్రిక సంఘటన1650లో రాసి తన దేశ జవాన్లకు అంకితమిచ్చాడు .మధియస్సర్బీవియస్ తన ‘’త్రీ బుక్స్ ఆఫ్ లిరిక్స్’’1625లో పబ్లిష్ చేశాడు .అతని గాడ్స్ ఆఫ్ ది నేషన్స్ లో రోమన్ దేవతలను తనదేశ మైదాలజి దేవతలను వర్ణించాడు .
17వ శతాబ్దిలో స్కాలర్స్ కూడా లాటిన్ లోనే రాశారు .విజూకాస్ 20కిపైగా పుస్తకాలు రాశాడు .లిదూనియన్ స్కాలర్స్ అబ్రమాస్ కుల్వేరేటిస్ స్టాన్సిస్లోవాస్ రేపోలియనిస్ లిధూనియన్ భాషలో రాసిన ప్రధములు .క్రిస్టి జోన్స్ డొనేలాటిస్1714-1780 అసలైన లిధూనియన్ కవిత్వం ‘’హెక్సా మిటర్ మెటాయ్’’అంటే సీజన్స్ రాసి ఆదేశ కవిత్వానికి నాందిపలికాడు .జర్గిస్ పబ్రేజా 1771-1849 కవి ఫిజిషియన్ బోటనిస్ట్ బాటనిపై ఎన్సైక్లోపీడియా రాశాడు .ఆభాష లో బాటని టెర్మినాలజి రాశాడు .250స్వీయ సేర్మన్స్,డైరి ‘’రిజ్టా’’అంటే డిటేర్మి నేషన్స్ రాశాడు .సిమోనాస్ డకాంటస్-1793-1864 దేశీయ సాహిత్యం సంస్కృతీ ,ఆచారవ్యవహారాలు పూర్తిగా పాటింపబడిన ఆకాలాన్ని ‘’గోల్డెన్ ఏజ్’’ అన్నాడు .ఆదేశ చరిత్రను ఆభాషలోనే రాశాడు 1857లో మిఖాల్ బాలన్స్కి ‘’ We should lift up the Lithuanian language, wrest away from scorn that language which has the Sanskrit greatness, the Latin force, the Greek refinement, and the Italian melodiousness.”
అని ఎలుగెత్తి చాటాడు .ఆదేశ భాష ,ప్రకృతి ని వర్ణిస్తూ ‘’అనిక్సిస్ సిలేసిస్ ‘’అంటే పైన్వుడ్ అరణ్యాలు రాసి మురిశాడు అంటానాబరనాస్కస్.ఇదే ఆభాషలో అత్యుత్తమ కవిత్వం అన్నారు ,గణిత శాస్త్రవేత్తకూడా కనుక ఆ భాషలో ఎన్నో గణిత పదాలను సృష్టించాడు .వాస్కో వాస్ బిర్జిస్కా -1884-1965లో 3భాగాల మాన్యుమెంట్ ఎన్సైక్లో పీడియక్ బయాగ్రఫీస్ ,బిబ్లియోగ్రఫీస్ ,బయో బిబ్లిగ్రఫీస్ ఆఫ్ లిధూనియన్ రైటర్స్ 1475నుంచి 1865వరకు ఆభాషలో రాసిన 370మంది ప్రముఖ రచయితల వివరాలన్నీ అందుబాటులోకి తెచ్చి చిరస్మరణీయ భాషా సేవ చేశాడు.
20వ శతాబ్దంలో మైరోనియాస్ క్లాసిక్ కవి .డ్రమాటిక్ లిరిక్ తోపాటు రొమాంటిక్ కవిత్వమూ రాశాడు .ఆయన్ను ‘’పోయేట్ ప్రాఫెట్ ఆఫ్ లిధూనియన్ నేషనల్ రివైవల్ ‘’అంటారు గౌరవంగా .ఆధునిక కవిత్వానికి శంకుస్థాపన చేశాడుకూడా .ఆదేశ ప్రకృతి,సంస్కృతిలకు పరవశుడై అద్భుత కవిత్వం రాశాడు .1895లో వచ్చిన అతని ‘’వాయిసెస్ ఆఫ్ స్ప్రింగ్ ‘’అతని కీర్తికిరీటంలో కలికితురాయి .విన్కాస్ క్రెవి మైఖే విషస్ నవల నాటక కారుడు .అతని గొప్పరచనలలో ఓల్డ్ ఫోక్ టేల్స్ ఆఫ్ డైన్వా,స్క్రిగిల్లా ,ది డెత్ ఆఫ్ మండగస్ఉన్నాయి .పెట్రాస్ వాసినియుస్ ఏడాదికి ఒకనాటకం వంతున పదేళ్ళు 10నాటాకాలు రాశాడు .సర్జిస్ సవక్కిస్ విత్ అండ్ ఐరనీ తో చాలా కధలురాశాడు .జేమలైట్ స్వయంగా చదువుకొని ఆ దేశ గ్రామీణ జీవితంపై అనేక కధలురాశాడు .వైడునస్-ఫిలాసఫర్ రచయిత .దేశీయతను నిలబెట్టే రచనలెన్నో చేశాడు .1940లో నోబెల్ కు నామినేట్ అయ్యాడు .అస్కరాస్ మిలేషియస్ ఆదేశపు 26పాటలురాశాడు ,టేల్స్ స్టోరీస్ కూడా రాశాడు .ఇతనిమిస్టిసిజం పై స్వీడెన్ బోర్గ్ ప్రభావం ఉన్నది .బాలిస్ సృయోగా డ్రామా హిస్టరీ మైదాలజి రాశాడు.లేమాసిమోనటైల్ రాసిన ‘’ది ఫేట్ ఆఫ్ సిమోనియ ఫ్రం అక్టూజియా’’ విశ్లేషకులమన్ననలు పొంది ఆమెపేరు విఖ్యాతమైంది .
21వ శతాబ్దిలో అల్విడాస్ సేపికాస్ కవి నాటక నవలాకర్త .అతని ‘’ఇన్ ది షాడో ఆఫ్ వుల్వ్స్’’6పునర్ముద్రణలు పొంది ప్రైజులు అందుకొని పలుభాషలలో అనువాదం పొందింది .అగ్రే జగ్రకలేట్ కవయిత్రి వ్యాసకర్త క్రిటిక్ .ఆమె మొదటి కవితా సంపుటి ‘’ఐ యాం గెటింగ్ మారీడ్ ‘’ 2003లో ,రెండవది ఆల్ ది ట్రూత్ అబౌట్ ఆలీసా అండ్ మ మిలర్ 2008లో పబ్లిష్ అయ్యాయి .గబిజా గ్రుసైట్ మొదటినవల ‘’అన్ ఫుల్ ఫిల్డ్’,రెండవది మిస్టర్ కోల్డర్’’బాగా పాప్యులర్ అయ్యాయి .లిధూనియన్ సాహిత్యం ఒకబంగారు గని .తవ్విన కొద్దీ అమూల్యాలు లభిస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-20-ఉయ్యూరు