ప్రపంచ దేశాల సారస్వతం 73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

73-లక్సెం బర్గ్ దేశ సాహిత్యం

యూరప్ లో బెల్జియం ఫ్రాన్స్ జర్మనీలమధ్య లక్సెం బర్గ్ చిన్న దేశం ,దట్టమైన అడవులున్న గ్రామీణ వాతావరణం .రాజధాని లక్సెం బర్గ్ సిటి .జనాభా 6లక్షలు .కరెన్సీ యూరో .అత్యధిక జిడిపి ఉన్న ధనిక దేశం .ప్రాచీన కోటలు మాన్యుమెంట్లు ఉన్న యాత్రాస్థలం .నల్లబంగారం అంటే బొగ్గు గనులు ఇక్కడి అధికాదాయానికి కారణం .న్యూయార్క్ లండన్ పారిస్ లకంటే జీవనవ్యయం తక్కువ .సేఫెస్ట్ ప్లేస్.హత్యలు తక్కువ .

  లక్సెం బెర్గ్ సాహిత్యం ‘’కోరియాస్ మరీండ లేనిస్ ‘’అనే 14శతాబ్ది ఆరంభపు వ్రాత ప్రతి తో మొదలు .ఇది యోలండా ఆఫ్  వయాండేన్ కథ.ఈ ప్రతి 1999 నవంబర్ లో వెలుగు చూసింది .దీన్ని బ్రదర్ హెర్మన్ వాన్ వెల్డె౦జ్ ,1283లో యోలండా అనే ఆమె మరణం తర్వాత రాశాడు .దీనిలో 5,963 రైమింగ్ కప్లేట్లున్నాయి.ఈమె సన్యాసినుల అధికారిణి .

   19వ శతాబ్దం లోదేశం స్థిరరూపంపొందాక సాహిత్యం వచ్చింది .1829లో లక్సెంబర్గిష్ భాషలో ఆంటోని మేయర్ తనకవితా సంపుటి ‘’ఎ స్టెప్ అప్ టు లక్సెం బర్గ్ పమాస్సేస్ ‘’ప్రచురించాడు .ఇందులో 12కవితలున్నాయి .ప్రేయసి, రాత్రి మొదలైన వాటి వర్ణన ఉంది .ఇనానిమేట్ ఆబ్జెక్ట్ లతో ఫ్రెంచ్ విప్లవాన్ని అడ్డుకొన్న అరిస్టాక్రసి వైఫల్యాన్ని ఎత్తి చూపాడు .లీగ్ యూనివర్సిటిలో ఉంటూ గణితం బోధిస్తూ చాలా రచనలు చేశాడు .

  తర్వాత తరం రచయితలను క్లాసిక్ రచయితలన్నారు .ఎడ్మండ్ డీ లా ఫా౦ టిన్-1823-91 ‘’డిక్స్’’కలం పేరుతొ నాటకరచన బాగా చేశాడు .అతడి కామెడి ‘’డీ షోలిట్సోసిన్ ‘’1855లో లక్సెం బర్గ్ మొదటి సారి ప్రదర్శన జరిగింది .దీని తర్వాత మరిమూడు ప్రసిద్ధ నాటకాలు ,కొన్నికవితలు మరికొన్ని వచనరచనలు రాశాడు .ఇతడి సమకాలీనుడు మైకేల్లెన్జ్ కవి రాసిన ‘’ఆన్స్ హేమేక్ట్ ‘’ఆ దేశ జాతీయగీతం అయింది భాషా వ్యాప్తికీ బాగా కృషి చేశాడు .మైకేల్ రోడాంగి-1827-1876  ఆ దేశ జాతీయ ఎపిక్ ‘’రినేర్ట్ ఆడ్డడీ ఫస్ అం ఫ్రాక్ అన్ ఎమానస్ గ్రిసిస్ట్  ‘’సింపుల్ గా రీనేట్ ది ఫాక్స్ ‘’1872లో పబ్లిష్ చేశాడు .ఇది సెటైరికల్ రచన .స్థానికప్రజల అంతరాన్తరాలను శోధించి రాసిన మహాకావ్యం .ఫీలిక్స్ తైయస్-1830-55 ఫ్రెంచ్ భాషలో ‘’మార్క్ బ్రూనో ప్రాఫిల్  డర్టిస్టే మొదటి నవల రాశాడు .

  20వ శతాబ్దిలో బాట్టీ వెబర్ 1860-1940 జర్నలిస్ట్ చిన్నకదల రచయిత.అతని ‘’కాలెండర్ చి౦పెయ్యండి ‘’అనే డైలీకాలం 1913నుంచి 40దాకా27ఏళ్ళు ‘’లక్సెం బర్గ్ జీ టుంగ్ ‘’ లో  సుదీర్ఘంగాస్థానిక సంస్కృతీ విశేషాలను అత్యంత ఉత్కంఠ తో రాశాడు  ,నికోలస్ వెల్టర్-1871-1951 దేశీయ సమస్యలను జర్మన్ భాష నాటకాలలో  రాశాడు .వీటిలో డీ సోహినే డెస్ ఒసింగ్స్ ప్రసిద్ధం .ఆదేశ చరిత్ర కూడా రాసిన మొదటివాడు ..రెం.ప్ర.యు.తర్వాత అనిసె కోల్త్జ్ ఫైరీ టేల్స్ ను రెండు భాషల్లో రాసింది .1970లో భర్త నాజీల హింసకు మరణి౦చాక  ఫ్రెంచ్ భాషలోనే కవిత్వం రాసింది  .ఈమె రచనలు పలుభాషలలోకి అనువాదం పొంది ఆమెకు 1988లో ప్రిక్స్ గుల్లెయం  అవార్డ్  వచ్చింది.ఈమె రచనలు ఎందరినో ప్రభావితం చేసి ఆ దేశ సమకాలీన రచయితలలో సాటి లేని మేటి అని పించింది .జీన్ పొర్తంటే కవి నావలిస్ట్ ,నాటక,కథా స్క్రీన్ ప్లే రచయిత  .ఈ దేశ సాహిత్యాన్ని ఫ్రెంచ్ లోకి అనువదించాడు .జీన్ క్రయర్ ‘’హీర్జెంస్ లస్ట్ స్పీలే ‘’కవితా సంపుటికి చాలా ప్రైజులుపొందాడు .గే రేవేనింగ్ ,రోజర్ మాన్దర్స్ షెల్డ్ స్థానిక భాషలో నవలలురాశారు వీధులు ఊడిచే వారి గురించి ,కుటుంబ సమస్యలుగురించి ,నిత్యజీవిత సమస్యలగురించి విశ్లేషణాత్మక నవలలు రాశారు  .మాండర్ షీల్డ్ చైల్డ్ హుడ్ ట్రయాలజి రాసి 1988లో ముద్రించాడు .ఇందులూకటి అతని ఆటో బయాగ్రఫి 3వేలకాపీలు అమ్ముడయింది .దీనితో కాకపుట్టి గొప్పనవలలు రాశారు .నీకో హేల్మింజర్ ,జీన్ మైకేల్ ట్రెనిన్ జార్జ్ ఆస్మార్ ,జొసీ బృవాన్ లు చాలా నవలలు రాశారు ఆ దేశభాషలో .ఆ దేశం రెండు ప్రైజులు -1-సేర్వాయిస్ ప్రైజ్ 2-బాట్టీ వేబెర్ ప్రైజ్ లను అందిస్తోంది ప్రతిభా రచయితలకు

74-నార్త్ మాసిడోనియా సాహిత్యం

రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా బాల్కన్ పెనిన్సులలో ఆగ్నేయ యూరప్ లో ఉన్న దేశం .రాజధాని-స్కోప్జే .కరెన్సీ –మాసిడోనియన్ డెనార్.20లక్షలజనాభా .మూడవవంతు ప్రజలు పేదవారు .రాజకీయ కక్షా కార్పణ్యాలు ,నిరుద్యోగం దీనికి ముఖ్యకారణం .

మాసిడోనియన్ సాహిత్యం ఆర్కిడ్ లిటరరీ స్కూల్ తో ప్రారంభం .ఆభాషలో మొదటి రచనలు మతసంబంధమైనవే .ఆ భాషను అధికారికంగా రిపబ్లిక్ అయ్యేదాకా గుర్తింపబడలేదు .సాహిత్య పత్రిక వర్దార్ 1950లో పుట్టి సాహిత్యాన్నికాపుకాసింది .మొ .ప్ర .యు .తర్వాత కోస్టా రేసిన్ కవిత్వం మాత్రమె రాసి ,సాహిత్య పత్రికలద్వారా వ్యాప్తి చేశాడు .ఇతడి’’బెల్లి ముర్గి అంటే  ‘’వైట్ డాన్స్’’జానపద కవితలు నిషేధానికి గురైంది.కోడె నెడల్కో విస్కీ తనరచనలు స్థానిక ఒత్తిడులఫలిటంగా ఇతర దేశాలలో ముద్రించాడు  .ఈ దేశ సాహిత్యం 1-ఓల్డ్ మాసిడోనియన్ లిటరేచర్ -8-18శతాబ్దాలు 2-న్యు మాసి డోనియన్ లిటరేచర్ -1802-1944 3-మోడరన్ మాసిడోనియన్ లిటరేచర్-1944నుండి ఇప్పటివరకు గా విభజించారు .

  ఆధునిక సాహిత్యం రెం.ప్ర.యు.తర్వాత  బ్లేజ్ కేనేస్కి మొదలైనవారు ఆ భాషను అధికార భాష చేయటానికి స్థాయి పెంచారు .ఆకో సోపోవ్ ,స్లావ్కో జనేవిస్కి గానే తోడోర విస్కీ  ఆభాషలో గొప్పకవిత్వం రాశారు .సెలో జాడ్ మొదటిసారిగా వచనప్రక్రియలో నవల ది విలేజ్ బియాండ్ ది యాష్ ట్రీమొదలైన’’సైకిల్ ఆఫ్ సిక్స్ నావేల్స్ ‘’నవలలు రాశాడు .ప్లేవార్ వాసిల్ ఇలిజోస్కి నాటకాలు రాశాడు .కోలే కాసూల్ గోరన్ స్టేఫెనో విస్కీ మొదలైనవారు నవలలురాశారు .కాలే ఐడియలిజం వైఫల్యం నవలాకారుడు .అతనినాటకం ‘’క్రిమిలా అంటే నల్లవస్తువులు -1960 లో 20శతాబ్ది ప్రారంభం లో ఇమ్రో లీడర్ హత్యపై రాసింది .ప్రోజ్ రైటర్స్ లో జీవకో కిన్గో -పాస్కో విలిజా కథా సంపుటి మనో వీధిలో సంప్రదాయం ,విప్లవభావాల సంఘర్షణ ప్రత్యేకత .బాల్య దురదృష్టం కూడా ఉంటుంది. వ్లాడా ఉరోసవిక్ –డ్రీమర్ అండ్ ది ఎంప్టి నెస్,జొవాన్ పావ్లోస్కి –ప్రోస్ట్రేట్ గ్లాండ్ జూస్-1991 గొప్ప రచనలు .

  ,సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-20-ఉయ్యూరు

  ’

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.