ప్రపంచ దేశాల సారస్వతం
75-మాల్టా దేశ సాహిత్యం
మాల్టా దేశం ఆర్చిపిలగో సెంట్రల్ మెడిటరేనియన్ లో సిసిలి ,ఉత్తర ఆఫ్రికా మధ్య ఉంది .రోమాన్స్ ,మూర్స్ ,క్రీ.పూ 4 వేలఏళ్ళ క్రిందటి ఫ్రెంచ్ ,బ్రిటిష్ సెయింట్ జాన్ యోధుల అనేక చారిత్రాత్మక కట్టడాలు ,దేవాలయాలున్న దేశం .ఆనాటి పెద్దపెద్ద హాల్స్ ,బరియల్ చేమ్బర్స్ చూస్తె దిమ్మ తిరిగిపోతుంది .రాజధాని –వాలెట్టా .కరెన్సీ-యూరో .జనాభా -5లక్షలు .భయం లేకు౦డాహాయిగా సందర్శించతగిన దేశం.అత్యంత సంపన్న దేశాలలో ఒకటి .ఖర్చు తక్కువ .ఎలెక్ట్రానిక్స్ ,ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి తో గొప్ప ఆదాయం వస్తుంది .
మాల్టా సాహిత్యాన్ని మాల్టీస్ సాహిత్యం అంటారు .11వ శతాబ్దం చివర్లో సిసిలిరాజు కౌంట్ రోజర్ 1 ఆరబ్ పాలనకు స్వస్తి చెప్పిన తర్వాత కొద్దిగా సాహిత్య జిజ్ఞాస పెరిగింది .శతాబ్దాలుగా వస్తున్నా మాల్టేస్ భాషకు అవరోదాలుకలిగి లాటిన్ ను తలకెత్తుకొన్నారు.సెయింట్ జాన్ పాలనలో ఫ్రెంచ్ ,ఇటాలియన్ లకే ప్రాముఖ్యం .బ్రిటిష్ కాలని ప్రభుత్వం లో ఇంగ్లిష్ పెత్తనం చేసింది .1936లో మాల్టేస్ భాష అధికార భాషగా గుర్తింపు పొందింది . మాట్లాడేభాషను వ్రాతభాషగా మైకేల్ ఆంటన్ వస్సాలి19వ శతాబ్దిలో మార్పు చెందించాడు .
చరిత్ర పూర్వకాలం నున్చిఈ దేశ సంస్కృతిని ‘’డిగ్లోస్సియ ‘’ఆటంకపరుస్తూనే ఉన్నది.శతాబ్దాలుగా ఈదేశభాష ‘’వంటింటి ,వర్క షాప్ భాష ‘’గా ముద్ర వేసి,చదువులో పాలనలో రాజకీయంగా న్యాయస్థానాలలో ఇటాలియన్ భాషకే ప్రాముఖ్యమిచ్చారు .అందుకే ఈ దేశీయులుకూడా20వ శతాబ్ది వరకు అదే భాషలో రాసేవారు గత్యంతరం లేక .
మాల్టేస్ భా షలో ఉన్న అతి ప్రాచీన రచన పెట్రు కాస్గరో కవిత ‘’2కాన్టినా-1470-1485.తర్వాత గియాన్ ఫ్రాన్సేస్కో బోనమికో తన గ్రాండ్ మాస్టర్ నికోలస్ కోటోనర్ ను పొగుడుతూ1672లో రాసిన ‘’మేజ్జుగి బ్లేర్ ఉ జహార్ ‘’అంటే మే చంద్రుడు ఆరంజ్ పూల వికాసం తో వచ్చాడు . లార్డ్స్ ప్రేయర్ కు అనువాదం 1780లో జోహేన్నెస్హీన్రిచ్ మాలు రాశాడు .ఐ యాం టాకింగ్ టు యు మాల్టా గేయాన్ని 1749లో అజ్ఞాతకవి రాశాడు .ఇది బానిసల కుట్రకు సంబంధించింది .1752లో డాన్ ఫ్రాన్సేస్కో టీచింగ్స్ ప్రచురింప బడ్డాయి .తర్వాత బర్లుస్కు కవితలు గా ‘’మారేజ్ ఇన్ దిమాల్టీస్ స్టైల్ ‘’మొదలైనవి డన్ ఫెలిక్ డిమార్కోరాశాడు A child of the Romantic movement, Maltese patriot Mikiel Anton Vassalli (1764–1829) hailed the emergence of literary Maltese as “one of the ancient patrimonies…of the new emerging nation” and saw this nascent trend as: (1) the affirmation of the singular and collective identity, and (2) the cultivation and diffusion of the national speech medium as the most sacred component in the definition of the patria and as the most effective justification both for a dominated community’s claim to be a nation and for the subsequent struggle against foreign rulers.
తర్వాత ఫ్రెంచ్ ఆక్రమణలో దేశం ఉండగా ‘’ఓడ్ టు ది ట్రయంఫ్ ఆఫ్ లిబర్టి ‘’ను సిటిజన్ లా కోరేట్టేరీ ని రాసి బాస్టేల్లి డే న పబ్లిష్ చేశాడు .మాల్టేస్ భాషలో ఎపిక్ పోయెం ‘’ది టర్కిష్ కారవెల్’’ను వాసిల్లి రాసి 1842లో ముద్రించాడు .లెజెండ్స్ అండ్ జోక్స్ కూడా రాశాడు .ఆదేశ భాష లో మొదటి చరిత్రపుస్తక౦ ‘’పీపుల్స్ హిస్టరీ ఆఫ్ మాల్టా ‘’ ఆయనే1862లో రాశాడు.1863లో ఆ భాషలో మొదటి నవల ‘’ది లవ్ ఆఫ్ ఎ టిరంట్’’గుసేప్పీ ఫోలేరియో డీ లూనా ఆన్టన్ 1889లో రాశాడు
కొందరు ముఖ్య మల్టేస్ రచయితలు-క్లేర్ అజ్జో పార్డి,జాన్ బెనేల్లో ,డేనియల్ మస్సా ,రోజర్ బుఫ్ఫా ,విక్టర్ ఫెనేక్ ,గార్గ్ పిసాని ,త్రేవోర్ జెహ్రా మొదలైనవారు
76-మాల్డోవా దేశ సాహిత్యం
మాల్డోవా తూర్పు ఐరోపాలో ఉన్న దేశం .రాకీహిల్స్ ఫారేస్ట్స్ ,వైన్ యార్డ్స్ కు ప్రసిద్ధి ప్రపంచ ప్రసిద్ధ సెల్లార్ లకు నిలయం .రాజధాని –సిసునవు .కరెన్సీ –మల్డో వియన్ లేయు .జనాభా 36లక్షలు. అధికారభాష రొమేనియన్ .స్వంత కాళ్ళమీద నిలబడుతున్న దేశం .ప్రయాణం కష్టం .బోర్ కొట్టేదేశం .అద్భుతనాణ్య మైన వైన్ కి కేంద్రం .దేశ సంస్కృతిలోనే ఆనందం సంతోషాలు లేవు .నిరాశ రాజ్యమేలే దేశం .బీదాతిబీద దేశం .
మాల్డోవా సాహిత్యం లో 10,11శతాబ్దాలనాటి గొప్ప జానపద గీతాలు,ఫైరీ టేల్స్,కుటుంబ కర్మకాండ కవిత్వం కు ప్రసిద్ధం .సామెతలు నుడులు నానుడులూ ఎక్కువ .మియోరిటా అ దేశ ఎపిక్ లిరిక్ .మధ్యయుగాలలో ‘’ది లైఫ్ ఆఫ్ సేయి౦ట్ జాన్ ,న్యు ప్రీచిన్గ్స్ ఆఫ్ గ్రెగరీ సంబాక్ రాసిన క్రానికల్స్ .15వ శతాబ్ది ఉత్తరార్ధం లో దేశ చరిత్రలు ఆభాషలో వచ్చాయి .16వ శతాబ్దంలోనూ క్రానికల్స్ వల్లనే చరిత్ర తెలిసింది .14నుంచి 18శాతాబ్దిదాకా రాజులు,వారిగగొప్పలు స్మృతిచిహ్నాలు అన్నీ వచ్చాయి .గ్రిగేర్ యురోకి ,మిరాన్ కోస్టిన్,ఇయాన్ నుకుల్సి ల క్రానికల్స్ ది బెస్ట్ అనిపించుకోన్నాయి .డిమిత్రి కాన్టిమేర్ టర్కుల చరిత్రసమగ్రంగా రాశాడు .
ఘేర్గే సిన్కాయ్ ,పెట్రు మేజర్ లుజాతీయభావానికి దోహద పడ్డారు .మిడీవల్ నేషనల్ మ్యూజికల్ స్టైల్ ‘’డోనియా ‘’ప్రాచుర్యం పొందింది .లేనాచితావకారేస్కు ,కొడుకు అలుకు వచారిస్కు లు ప్రాచీన గ్రీక్ శైలిలో లవ్ సాంగ్స్ రాశారు .దీనిలో దిమాపింగ్ డవ్ ప్రసిద్ధమైంది .19వ శతాబ్దిలో మొదటి న్యూస్ పేపెర్ ‘’రోమానియన్ బీ ‘’ని ఘియోర్గే అసాచి1829లో స్థాపించగా అందులో రాసి అలేకు దోనిసి , అలేకు రుస్సో ,మిహలి కోగాల్సినావు లుబాగా పాప్యులర్ అయ్యారు . లిటరరీ డేసియ జర్నల్ హిస్టారికల్ జర్నల్ పెట్టి కోగాల్సినావు చాలామందికి ప్రోత్సాహం కల్పించాడు .ఆధునిక వచనానికి నేగ్రుజ్జి సంస్థాపకుడు .తర్వాత దేశం వదిలి పుష్కిన్ ప్రభావానికి లోనయ్యాడు .జాతీయ ఉద్యమనాయకకవి నాటకకారుడు వసిలే అలేక్సాన్డ్రి మాల్డోవా –వలాచియా ఐక్యత కోసం కృషి చేశాడు .1848విప్లవం లో పాల్గొన్నాడు .ఎలెనా సేవస్టోస్-మాల్దోవాసాన్గ్స్ రాసి ప్రచురించింది .
యుద్ధానంతర కాలం లో అనేక సాహిత్యప్రక్రియలలో రచనలు వచ్చాయి .స్పీకింగ్ టు చిల్డ్రన్ ,స్టోరిఆఫ్ ఫోర్ బాన్షిస్,సాంగ్ ఆఫ్ ది డాన్.ఇయాన్ డ్రుటారాసిన ‘’లీవ్స్ ఆఫ్ సారో ‘’వ్లాడిమిర్బెసేలీగా బ్రోకెన్ ఫ్లైట్ ,అనడనా స్లాలార్ రాసిన పీపుల్ అండ్ డేస్టినీస్1958.ఫ్లైట్ లెస్ బర్డ్స్ ,దిబిట్టర్ నెస్ ఆఫ్ లవ్,చిల్ద్రెన్ అండ్ ఆపిల్స్ ,బర్డ్స్ ఆఫ్ అవర్ యూత్ వంటివి చెప్పుకో దగ్గవి డ్రుటా రాసిన ‘’బాలడ్స్ ఆఫ్ ది స్టేప్పీస్,బుకోవో కవితా సంపుటి ప్రెసెంట్ డే,ఫ్యూచర్ డే,లుపాన్ రచన లాస్ ఆఫ్ హాస్పిటాలిటి,డామియన్ సాసిన -రూట్స్ ,విక్టర్ టేలేకువా – డీర్ఐలాండ్ ,1966అన్నీ లేటెస్ట్ రచనలే .
ఆధునికంగా నికోలే పోపా –దిప్లేన్ స్మేల్స్ఆఫ్ ఫిష్ నవల పోస్ట్ మోడరన్ సింబాలిక్ రచన .తన దేశప్రజలు పడిన కస్టాలు కన్నీళ్లు పోయిజీవిస్తున్న ప్రశాన్తజీవనంఉంది. డుమిట్రు క్రుడు రచన –మాసకర్ ఇన్ జార్జియా –ఐరానిక్ రిఫ్లెక్షన్ ఆన్ అన్ చేంజింగ్ నేచర్ ఆఫ్ హిస్ కంట్రీ.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-20-ఉయ్యూరు
’