ప్రపంచ దేశాల సారస్వతం
79-రొమేనియా దేశ సాహిత్యం
రొమేనియా ఆగ్నేయ ఐరోపాలో కార్పాడియన్ పర్వత శ్రేణి సమీపం లో ఉన్న దేశం .డ్రాకులా లెజెండ్ కు ఆవాసభూమి .రాజధాని –బుఖారెస్ట్ .కరెన్సీ-రొమేనియా లేయు .అధికార భాష రొమేనియన్ .అత్యధిక మానవాభి వృద్ధి ఉన్న దేశం .యాత్రకు ప్రమాదం లేదు .ముఖ్యమతం క్రైస్తవం . .జనాభా సుమారు 2కోట్లు .
రొమేనియన్ సాహిత్యం 16వ శతాబ్ది వరకు స్లావోనిక్ భాషలో ఉంటుంది .రొమేనియన్ భాషలో మొదట రాయబడిన గ్రంథం ప్రశ్నోత్తర రూపం లో డీకన్ కోరేసిఅనేపేరుతో ప్రొటెస్టెంట్ మతానికి చెందినది .1559లో ఫిలిప్ మోల్డో వెనుల్ ముద్రించాడు .1673లోరొమేనియన్ లో మొదటి చందోరూప సాల్టర్ .వచ్చింది .17వశతాబ్దిదాకా బైబిల్ పూర్తి అనువాదం రాలేదు .యూరోపియన్ హ్యూమనిజం పోలాండ్ నుంచి ఇక్కడికి చేరింది .మిరాన్ కోస్టిన్ మోల్డావియ చరిత్ర రాశాడు .18వ శతాబ్దిలొఅట్టోమన్ సామ్రాజ్యం చేత ఈదేశం అణగ ద్రోక్కబడింది.గ్రీకు ప్రభావం పెరిగింది .అలేకు వకారేస్కు ప్రేమ గీతాలు రాశాడు .తండ్రి లేనా చిటా రొమేనియన్ గ్రామర్ రాస్తే .కొడుకు లంకు మహాకవిగా గుర్తింపు పొందాడు .ఆంటన్ పాన్ హ్యూమన్ కామెడి ,జానపదం పండి౦చాడు.తర్వాతి తరం కవులు ఘేర్ఘే అనాఖి ఇయాన్ బుడాల్ డేలాను ,డోనికు గెలేస్కు ‘’యూరోపియన్ ఇల్ల్యూమినిజం ‘’కవిత్వం అల్లారు .
జాతీయ ఉద్యమం ప్రారంభమై కవులు రచయితలూ విప్లవ వాదులతో చేతులు కలిపారు .స్కోలా ఆర్దేలీనా రోమానిక్ అస్తిత్వ వాదం మేల్కొల్పి ,ఆభాషా విద్యాలయ స్థాపనకు తోడ్పడ్డాడు .బుఖారెస్ట్ లో నేషనల్ ధియేటర్ ఏర్పడింది. అసిలి అలేక్జాన్డ్రి.మిహై ఏమినేస్కు లు రొమేనియా సాహిత్యాన్ని ఆదేశ కవిత్వంతో ముంచెత్తారు.జానపద సాహిత్య సంపుటులు వెలువరించారు .1863లో లిటరరీ సర్కిల్ ఏర్పడి ఆ దేశ సాహిత్యానికి వెన్నెముకగా కవులు రచయితలూ నిలబడ్డారు .ఇయాన్ లూకా కారగిగేల్ అద్భుత కామెడీలు రాశాడు .ఇయాన్ క్రియాంగా సంప్రదాయ కధలు రాశాడు .జార్జి కాస్బుక్ కవి అనువాదకుడు టీచర్ జర్నలిస్ట్ పల్లె జీవన సౌందర్యాన్ని వర్ణించాడు .అలాగే అలేకు రుస్సో , లోన్ స్లావికి ,హస్డేయు వంటి చాలామంది ఈతరం రచయితలున్నారు
1918లో జాతీయ సమైక్యత ఏర్పడి సాహిత్యానికి స్వర్ణయుగం తెచ్చింది .రొమేనియన్ నవల ఆవిర్భావమైంది .లివియు రెబ్రేనుస్రాస్కోలా 1932లో ది అప్రైజింగ్ నవల రైతు తిరుగు బాటుకు దారిచూపింది .ఫారేస్ట్ ఆఫ్ దిహాన్గ్ద్ నవల ఆదేశం మొదటి ప్రపంచయుద్ధం లో పాల్గొనటానికి ప్రోత్సహించింది. ఆధునిక నవల –హార్టేసియా పపడట్, బెంగేస్కు రాసిన ‘’బాచ్ కన్సేర్ట్ ‘’.కామిల్ పెట్రేస్కు-ది లాస్ట్ నైట్ ఆఫ్ లవ్ ,ది ఫస్ట్ నైట్ ఆఫ్ వార్ రాశాడు .జార్జ్ కోలేనేస్కు నాటక నవలా రచయిత ,కవి ,క్రిటిక్ ,జర్నలిస్ట్ సాధికార మోనోగ్రాఫ్ ను ఎమేనేస్కు ,క్రిఎంగా లపై రాశాడు .వెయ్యిపెజీల రొమేనియన్ సాహిత్య చరిత్ర రాసి మహోపకారం చేశాడు .మిహైల్ సాడోవినా రియలిస్ట్ రైటర్ .అనేక కాలాల మాల్డోవాచరిత్రరాశాడు .ఎమేనేస్కు తర్వాత మళ్ళీ 50ఏళ్ళకు టుడర్ అర్గేజి కవిఆధునిక రొమేనియన్ కవిత్వం రాసి మార్గ దర్శకుడయ్యాడు.లుసియన్ బ్లాగా –కాంప్లెక్స్ ఫిలసాఫిక్ సిస్టం లో రచనలుచేశాడు ఇప్పటికీ ఇదేమిటో అర్ధంకాక బుర్రలు బద్దల కొట్టుకొంటున్నారు .మిర్సియా ఎలేడే ను గ్రేటెస్ట్ హిస్టోరియన్ అంటారు .మిస్టిక్ నవలలు రాశాడు .
ట్రిస్టాన్ జారా డాడాయిజం కారకుడు .ఆభాషలో ‘’అవును అవును’’ అన్నదానికి సంకేతమే డాడాయిజం.తర్వాత దీన్ని వదిలేసి సర్రియలిజం,మార్క్సిజం ను కావలించుకొని రచనలు చేశాడు .దీనితో ఈ దేశం పాశ్చాత్య సంస్కృతికి కవాటాలు తెరిచినట్లయింది .డాడాయిజం సర్రయిలిజం లు అవంట్ గార్డే అంటేవిప్లవాత్మక అత్యాధునిక కవిత్వానికి తెరలేపింది .ఈ ధోరణి లో రాసినకవులలో ఇయాన్ మినిలేస్కు ,ఘేరాసిం లూకా,ఉర్ముజ్,గెలలు నౌమ్ మొదలైనవారు .జార్జి బకోవియా సింబలిస్ట్ కవి స్థానిక సింబాలిక్ ఉద్యమానికి దోహదపడ్డాడు .ఇతనికవిత్వం ఇక్కడి రోమానియన్ మోడర్నిజానికి పూర్వగామి అంటారు .వాసిల్ వోకిలేస్కు కవి నాటక కథాకర్త ,ఫిజిషియన్.సెజెర్పెట్రేస్కు అన్నిటితోపాటు బాలసాహిత్యంకూడా రాశాడు .ఇతని ‘’ఫ్రార్ ది పోలార్ బేర్’’ అనేది సర్కస్ జంతువు గురించి .ఎలెన ఫెరాగో కూడా బాలలకోసం రాశాడు .
కమ్యూనిస్ట్ కాలం లో మారిన్ ప్రేడ పోస్ట్ వార్ రొమాంటిక్ నావలిస్ట్ .అతని మొరోమేటే ఫామిలి నవల యుద్ధం ముందు ఆతర్వాత కమ్యూనిస్ట్ కాలం లో ఇబ్బందులుపడిన రైతు కుటుంబ గాధ.కమ్యూనిస్ట్ క్రూర పాలనపై రాసిన నవల ‘’ది మోస్ట్ బిలవ్డ్ఆఫ్ ఎర్త్ లింగ్స్ ‘’.జహారిన స్టంకు 1948లో ప్రసిద్ధ ‘’బేర్ ఫుట్’’నవల రాశాడు .ఆధునిక కవులు –నికితా స్టెనెస్కు,మారిన్ సోరెకస్,లేనాయిడ్డిమోవ్.
సమకాలీన రచయితలలో కొందరు –గేబ్రిలా ఆడామెన్ స్టావ్ , స్టీఫెన్ అగోపియాన్,గ్రిడ్మోడార్సియ,ఇయాన్ స్ట్రాటన్,డోనియా రుస్టి.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు