ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం
స్లోవేకియా లేక సొవక్ రిపబ్లిక్ మధ్య యూరప్ లో పోలాండ్ ,యుక్రెయిన్ హంగేరి ,ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న దేశం .49వేల చదరపుకిలోమీటర్ల భూభాగం .రాజధాని బ్రస్టి స్లావా .కరెన్సీ –యూరో .భాష –స్లోవక్.యూరో జోన్ లో రెండవ బీద దేశం .ఎత్తైన తాత్రార్ పర్వతాలు 2500 మీటర్ల శిఖరాలు, గుహలు ,పచ్చని లోయలు ,మౌంటెన్ బైకింగ్ యాత్రిక ఆకర్షణ .ఇక్కడి ప్రజలు అద్భుత అ౦ద౦ తో ఉంటారు –కారణం ఆర్యన్ బేబీల సంతానం అవటమే .హిట్లర్ ఆర్యన్ బేబీలు రెం ప్ర యు.తర్వాత జర్మనీకి దగ్గరలో ఉన్న దేశాలలో స్థిరపడ్డారు .ఈబ్రీడ్ చాలా పెర్ఫెక్ట్ అని హిట్లర్ భావన .కేధలిక్ మతస్తులు .
స్లోవేకియా దేశ సాహిత్యాన్ని స్లోవక్ సాహిత్యం అంటారు .మొదటి తరం అంటే గ్రేట్ మొరేవియాకాలం-8-10శతాబ్డులమధ్య రచయితలలో సెయింట్ సిరిల్ ,సెయింట్ మేథోడియస్,క్లెమెంట్ ఆఫ్ ఆక్రిడ్ ముఖ్యులు .ప్రోగ్లాస్ కవిత్వం తో సహా క్రిస్టియన్ మత విషయరచనలే అన్నీ.11-15 శతాబ్దాల సాహిత్యం మధ్యయుగ సాహిత్యం .ఇదంతా లాటిన్ ,జెక్ ,స్లోవకైజ్డ్ జెక్ భాషలలో రాయబడినదే .లిరిక్ కవిత్వం పై ఇంకాచర్చి ప్రభావం పోలేదు .ఎపిక్ కవిత్వం లెజెండ్స్ ఆధారితం .జోహేన్నేస్ డీ థురోజ్ కవి –క్రానికా హన్గరోరం ,మారస్ రాశాడు .సెక్యులర్ రచనలుకూడా పురుడుపోసుకోన్నాయి కొన్ని .
16వ శతాబ్దిలో జాతీయభావం మేల్కొన్నది ,అయినా లాటిన్ లోనేగిలికారు .ప్రాచీన గ్రీస్ ,రోమ్ లకు సంబంధిత రచనలుకూడా వచ్చాయి .స్లోవాక్ భాషలో ప్రింట్ అయిన మొదటిపుస్తకం ది బుక్ ఆఫ్ ఓత్స్-1561ను వాసిక్ జేలేస్కి రాశాడు .1560లోనే ‘’సల్లాడి అండ్ హడ్మాజి’’అనే ప్రేమకావ్యం అజ్ఞాతకవి రాసింది వచ్చింది .జురాజ్ ట్రానో విస్కీని ‘’ఫాదర్ ఆఫ్ స్లావాక్ హిమ్నొడి’’అంటారు .ఇతడి సితారా సాన్క్టోరమ్ అంటే లైర్ ఆఫ్ ది సెయింట్స్ జెక్ భాషలో రాయబడి 1636లో లేవోకాలో అచ్చు అయింది .ట్రాన్సో విస్కీ రాసిన స్లోవక్ హైమ్స్ వలన జాతీయభావం ఏర్పడింది .
డేనియల్ సినపియస్ హార్కికాలాటిన్ కవిత్వం, స్కూల్ డ్రామాలు,సామెతలు స్లావాక్ ఆధ్యాత్మిక గీతాలు, వచనం రాశాడు .ఇతని వచనరచన జాతీయభావాన్ని ,దేశభక్తిని మరింత ఉద్దీపిత౦ చేసింది హుగోలిన్ గావ్‌లో విక్-నైతిక, విద్యా సంబంధ రచనలను పడమటి స్లోవక్ మాండలికం లో రాశాడు.ఇతని ప్రముఖ వలస్కా స్కోల, మ్రావువ్ స్టోడోలా కావ్యాలలో 17,862 పద్యాలున్నాయి .వీటిలో ఎక్కువగా కప్లేట్స్ ఉండటం విశేషం .
తర్వాత వచ్చిన క్లాసిజంకవిత్వంలో ఆంటాన్ బెర్నోలాక్ రాసిన గ్రమాటికా స్లావికా లో వెస్ట్ స్లోవాక్ డయలేక్ట్ వాడాడు .1879లోజురాజ్ ఫ్లండిల్’’యాన్ ఇంటిమేట్ ట్రీటిబిట్వీన్ ది మాంక్ అండ్ డెవిల్’’ను బెర్నోలాక్ స్టాండర్డ్ లో ముద్రించాడు .మొదటి హంగేరియన్ పత్రిక మాగిర్ హిర్మండో1780లో ,మొదటి స్లావిక్ న్యూస్ పేపర్ 1783లో వచ్చాయి .జోజేఫ్ ఇగ్నక్ బజరా మొదటినవల-రీనీ మేడిన్ కా ప్రిహోది అ స్కుసేనోస్టి రాశాడు .జాన్ కల్లార్ 150కవితల సంపుటి ‘’గ్లోరీస్ పాన్ స్లోవిక్ ఐడియల్స్1883లో వెలువరించాడు .ఇదే ఈయుగపు అత్యంత విలువైందిగా భావిస్తారు
లోడోవిట్ స్టర్ చాలాపుస్తకాలురాసి 19వ శతాబ్ది జాతీయోద్యమానికి కారకుడయ్యాడు .అతడు ‘’స్లోవక్ డయలేక్ట్అండ్ ది నేసెసిటి టు రైట్ ఇన్ ఇట్’’రాసి జాతీయ చట్ట క్రోడీకరణకు తోడ్పడ్డాడు.1853లో సింగింగ్ అండ్ సాంగ్స్ అనే ఏకైక సంపుటి రాశాడు .జంకో క్రాఫ్ ఆధునిక స్లోవిక్ భాషలో రాసిన మొదటి కవి .జాన్ చౌలూప్కా మొదట జెక్ లో రాసినా తర్వాత స్లావిక్ లో రాసిజేక్ రచనలు చాలా స్లోవాక్ లోకి అనువదించాడు .
పావోల్ ఆర్సజేగ్ 1860దాకా హంగేరియన్ లో రాసి ,1871లో వచ్చిన అల్మనాక్ కు స్లావాక్ లో ముందుమాట రాశాడు .స్లావిక్ కవిత్వం లో సిలబిక్ టోనిక్ ప్రవేశపెట్టాడు .రియలిజం కు ఆద్యుడయ్యాడు మార్టిన్ కుకుసిన్ .
ఆస్ట్రో –హంగేరియన్ సామ్రాజ్యం కూలిపోయి జెకోస్లోవేకియా ఏర్పడ్డాక భాషా సంకుచిత్వం పోయింది .మొదటి యుద్ధకాలంలో కవిత్వ స్థానం వచనం ఆక్రమించింది .1927లో మిలో అర్బన్ రాసిన ‘’ది లివింగ్ విప్’’,జోజేఫ్ సిగేర్ హోనోస్కి 1933లో రాసిన ‘’జోజేఫ్ మాక్ ‘’నవల పల్లెజీవితం ,ప్రకృతికి గొప్ప స్థానం కల్పించింది .స్లోవాక్, జెక్ ల పునరుద్ధరణలో రెండు సాహిత్య ధోరణులతో ఉద్యమాలు వచ్చాయి .హోనోస్కి ,ఫ్రాంటి సెక్స్వాన్టేనేర్,చోరోబాక్ఒండ్రే జోవ్,మార్గిటా ఫిగులి లు లిరికల్ ప్రోజ్ తోనూ ,స్టీఫన్ జేరి రుడాల్ఫ్ ఫాబ్రి, పావెల్ బంకాక్ మొ దలైనవారు సర్రియలిజం లోనూ దూసుకు పోయారు
83-స్లోవేనియా దేశ సాహిత్యం
స్లోవేనియా దేశం మధ్యయూరప్ లో పర్వతాలు స్కి రిసార్ట్స్,సరస్సులతో ఆకర్షణీయంగా ఉంటుంది .మధ్యయుగ దుర్గాలు కోటల కు నిలయం.రాజధాని –లుబ్లిజాన .కరెన్సీ-యూరో .అధికారభాష –స్లోవేనియన్ .జనాభా 21లక్షలు .మతం –క్రిస్టియానిటి.యాత్రికులకు ఖర్చు తక్కువ .సేఫ్టి దేశం .
స్లోవేన్ సాహిత్యం మొదట్లో అంతా ఓరల్ సాహిత్యమే .జానపద గీతాలే .మొదటి వ్రాతప్రతి ఓల్డ్ స్లోవెన్ లో రాయబడిన 972-1022కాలపు ఫ్రీజింగ్ మాన్యు స్క్రిప్ట్ ను 1803లో జర్మనీలో కనుగొన్నారు .క్రైస్తవ మతవ్యాప్తికోసం రాయబడింది .ప్రోటే స్ట౦ట్ రిఫార్మర్లు ‘’కేటా కిస్మాస్ ,అబ్సె డేరియం లు 1550లో రాసి స్క్వాబిక్ హాల్లో ప్రింట్ చేశారు .ట్రూబర్ దీన్ని స్లోవెన్ లోకి తర్జుమా చేశాడు .తర్వాత న్యు టెస్టమెంట్ అనువాదం చేశారు .16వ శతాబ్ది ఉత్తరార్ధం లో ఈ భాష యూరోపియన్ దేశాలకు తెలిసింది .వివిధ భాషా నిఘంటు ను హిరోనమస్ మేగిసేర్ తయారు చేశాడు .దీనితో ఈభాషలో రాయటానికి రచయితలూ బాగా ము౦దుకొచ్చిరాశారు .
ప్రక్క దేశాలతో పాటు ఇక్కడా అన్నిరకాల సాహిత్య ఉద్యమాలూ వచ్చి వివిధకవులు అందులో రాయటం జరిగింది .నియో రియలిజం లో సిరిల్ కోస్మాక్, టోన్ సీస్కర్ మొదలైనవారు రాశారు .ఇంటిమిజంలో లోజ్కే క్రాకర్ మొదలుపెడితే క్లైమాక్స్ కు చేర్చి౦ది మాత్రం ‘’పోయెమ్స్ ఆఫ్ ది ఫోర్’’తో జేనేజ్ మేనార్ట్ .అడా స్కేరి –పోస్ట్ వార్ రివల్యూషన్ కు వ్యతిరేకంగా సబ్జెక్టివ్ ,పెసిమిస్టిక్ కవిత్వం రాసింది .
ఆధునిక కవులలో ఎద్వార్డ్కోకేక్ ,వితోమిల్ జుపాన్ వగైరా ప్రసిద్ధులు .పోస్ట్ మోడర్నిజం లో బోరిస్ నోవాక్ ,మార్కో క్రవోస్,జా౦కో ఫెర్క్,ఒవేట్కా లిపస్వగైతాలు గొప్పగా రాశారు .1990తర్వాత రాసినవారిలో అలేస్ డేబెజక్,జోస్సిప్ ఓస్టి ,జానీ విర్క్,బాంకో పుల్కో ఉన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-20-ఉయ్యూరు