ప్రపంచ దేశాలసారస్వతం
87-బ్రూనీ దేశ సాహిత్యం
బ్రూనీ దేశం బోర్నియా ఐలాండ్ లో ఉన్న చిన్నఆసియా దేశం .దీని చుట్టూ మలేసియా దక్షిణ చైనా సముద్రం ఉంటాయి .అందమైన బీచ్ లకు ,బయో డైవర్సిటికి ప్రసిద్ధి .రాజధాని –బందర్ సే బెగవాన్.బాల్కిష్ మసీదులు ,వాటి 29బంగారు డోమ్స్ ప్రత్యెక ఆకర్షణ .కరెన్సీ –బ్రూనీడాలర్ .జనాభా 4లక్షల 30వేలు.ఆయిల్ రిచ్ కంట్రీ.సూపర్ సేఫ్ దేశం .అసాంఘిక సెక్స్ నిషిద్ధం .ఆల్కహాల్ దొరకదు, అమ్మరు .మతం-సున్నీ ఇస్లాం .బన్నీ భాష ,మలే,ఇంగ్లిష్ మాట్లాడుతారు .
బ్రూనీ దేశ సాహిత్యం మాలే జాతీయ భాషగా వర్ధిల్లింది .1980లో బ్రూనీ భాష నవలా రచన పోటీలు నిర్వహించారు .2011లో కౌలాలంపూర్ లో జరిగిన సదస్సులో అబ్దుల్లా మాట్లాడుతూ అభి వృద్ధి చెందుతున్న దేశాలు ఒక మిలియన్ జనాభాకు కేవలం వెయ్యి పుస్తకాలు మాత్రమె పాఠ్య పుస్తకాలు అనువాదాలతో సహా వస్తున్నాయని ఆవేదన చెందాడు .
ఆ దేశ పుస్తకాలు రచయితలు –ది వైల్డ్ మెన్ ఆఫ్ దిఈస్ట్-సేలామాట్ మనప్-2009,ఫర్ కింగ్స్ –కిస్ట ఫర్ సన్-2011,ఫర్ లార్న్ అడ్వెంచర్ –అమీర్ ఫలేఖ్ -2013,రిటెన్ ఇన్ బ్లాక్ –కే హెచ్ లిం -2014
నాటకం -2012-ఇన్ ది స్పాట్ లైట్ –యాన్ అంథాలజి ఆఫ్ బ్రూనియన్ ప్లేయ్-గ్రేస్ చిన్
కవిత్వం -1998-అండర్ ది కనోపి అండ్ ఆదర్ పోయెమ్స్-వాగ్హన్ రపతహానా ,2009-ది స్వాన్ స్క్రిప్ట్స్ –షాహీ ఓమరాలి ,2009-యాంగ్ డ్రీమ్స్ –ఇజ్జాటిజమిల్ ,2012-ట్రిబ్యూట్ టు బ్రూనీ అండ్ ఆదర్ పోయెమ్స్-జాన్ ఒడు ఒదిహి,2015-ముమెంట్స్ ఆఫ్ నిల్-ఫ్లోరా టవు
88-బహరైన్ దేశ సాహిత్యం
బహరేన్ కింగ్డం ఆసియాలో పెర్షియన్ గల్ఫ్ లో సావరిన్ స్టేట్.33స్వయం సిద్ధ ఆర్చిపేలగో దీవుల ,మరో 51 కృత్రిమదీవుల సముదాయం .రాజధాని –మనామా .కరెన్సీ –బహ్రేనియాన్ దీనార్ .జనాభా 18లక్షలు .సురక్షిత దేశం .ఆయిల్ ,పెరల్స్ హెరిటేజ్ ల కేంద్రం .పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం. మాస్క్ లను చూడాలంటే సంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి .బీచెస్ కు షార్ట్స్ తో వెళ్ళచ్చు .హోటల్స్ లో మాత్రమె మద్యం దొరుకుతుంది .దుబాయ్ లో కంటే హాయిగా ఉండచ్చు .డ్రగ్ నేరాలకు మరణశిక్ష ఖాయం .ముస్లిం క్రిస్టియన్ హిందూ బుద్ధిజం లు ఉన్నాయి .అన్నిటికీ అరెబిక్ భాష వాడుతారు ఇంగ్లీష్ కూడా వచ్చు
బహరేన్ సాహిత్యం అంతా మొదటి నుంచి ఆరేబిక్ లోనే ఉన్నది .క్లాసిక్ అరబిక్ లోనే ఖ్వాసిం అడ్డాద్ ,ఇబ్రహీం ఆల్అర్రఎద్,అహ్మద్ మొహమ్మదాలి రాశారు .యువకవులపై పాశ్చాత్య ప్రభావం పడి వచనకవిత్వం వచనం రాస్తున్నారు .ఏదిరాసినా అరెబిక్ లోనే .ఆలి అల్సర్క్వావి ని లిటరరీ ఐకాన్ అంటారు
2004ఆగస్ట్ లో సూపర్ నేచురల్ ధ్రిల్లర్’’క్విక్సోటిక్’’ను బహ్రేని జర్నలిస్ట్ ఆలీ అల్ సయీద్ ఇంగ్లీష్ లో రాసి ప్రచురించి మొదటి నవలా రచయిత అయ్యాడు .2011లో ఈదేశ రచయితలూ ఈజిప్షియన్ రివల్యూషనరి ఉద్యమానికి మద్దతు పలికారు .20వ శతాబ్దిలో మహిళలు కూడా రాయటం మొదలుపెట్టారు .1925-85కాలం లోకవులలో ఆరవవంతు స్త్రీలే .వీరిలో ఫాతిమా అల్ టాయ్ టున్,ఫతియా అజిజాన్ ,హమ్డా కామిస్ ,ఫజిలా అల్సింది ప్రముఖులు.
20వ శతాబ్ది ఉత్తరార్ధం లో వచనకవిత్వం ,వచనం ముఖ్యంగా మహిళలలో ప్రాముఖ్యమైనాయి .అయినా 1969తర్వాతే మహిళా కవులు విజ్రుమ్భించారు .హమ్డా కంసి –షార్ప్ నెల్,మొదటికవితా సంపుటి తెచ్చింది .ఇమాన్ అసిరి మొదటి వచనకవితా సంపుటి రాసి ప్రచురించి రికార్డ్ స్థాపించింది .
ఈ దేశం గురించి ఎపిక్ ఆఫ్ గిల్మేష్ లో ఇక్కడే గార్డెన్ ఆఫ్ ఈడెన్ ప్రస్తావన ఉన్నది .జేమ్స్ జాయిస్ ఫిన్నేగన్స్ వేక్ లో ,లూసి కాల్డ్వెల్ అవార్డ్ విన్నింగ్ నవల –ది మీటింగ్ పాయింట్ కు నేపధ్యం ఈ దేశమే .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-20-ఉయ్యూరు