సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-30
ఎర్రని పగడపుకాంతి ముఖం తో మహా తేజశ్శాలి వాయునందన హనుమాన్ వినయంతో ప్రణమిల్లి శిరస్సుతో అంజలి ఘటించి మధురాతి మధురవాక్కులతో ‘’అనింద్య సౌశీల్యవతీ ఈ చెట్టుకొమ్మను పట్టుకొని వ్రేలాడే నువ్వెవరు తల్లీ .నీ కంటినుండి ఆ సతత బాష్పదారఎందుకు .దేవ యక్షకిన్నెర కిపురు షులలావులలో ఏ జాతి స్త్రీ రత్నానివి నువ్వు ?నాకుమాత్రం దేవతలాగా కన్పిస్తున్నావు .దివిను౦డిజారిన వసిస్ట మహర్షి ధర్మపత్ని అరు౦ధతివా ?ఎవరి గురించి నీ శోకం ?నీలో రాజలక్షణాలు కన్పిస్తున్నాయి .నీ సాముద్రిక లక్షణాలను బట్టి ఎవరో గొప్పమహారాజు పట్ట మహిషివి అనిపిస్తోంది .ఒకవేళ జనస్థానం నుంచి రావణుడు అపహరించి తెచ్చిన సీతమ తల్లివా? .అలా ఐతే చెప్పు నీకు శుభం కలుగుగాక .నీ దైన్యం మానవాకారం తాపస వేషం చూస్తె శ్రీరామ ధర్మపత్ని సీత నువ్వే అనిపిస్తోంది ‘’అన్నాడు హనుమ .
హనుమపలుకులకు ఆమె మనసు ఊరట చెంది పైకి చూస్తూ ‘’రాజ శ్రేష్టుడు ఆత్మ విదుదు దశరధ మహారాజు కోడలిని నేను .విదేహరాజు జనకుని కుమార్తె జానకిని సీతను .దీమంతుడైన రాముని భార్యను .అత్తవారింట్లో పన్నెండేళ్ళు సర్వ సుఖాలు అనుభవించి ,13ఏట మామగారు శ్రీరామపట్టాభి షేకం చేసే ఏర్పాటు చేస్తే ,ఆయనభార్యకైకేయి ఆయనతో ‘’రాముడికి పట్టాభి షేకం చేస్తే ఇక రోజనుంచి నేను భోజనం నీరు త్రాగటం మానేసి ఉపవసాలతో ప్రాణాలు వదుల్తాను .నాకిచ్చిన వరదానం ప్రకారం రాముడిని అడవికి పంపు ‘’అనగానే ఊహించని దశరధుడు తట్టుకోలేక మూర్ఛ పోయాడు .తెప్పరిల్లి రాముని పిలిపించి ‘’నీకిస్తానన్న రాజ్యం మళ్ళీ నాకు ఇచ్చెయ్యి ‘’అని కోరాడు –
‘’తటస్త స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః –జ్యేష్టం యశస్వినం పుత్రం రుదన్ రాజ్య మయా చత’’
రాముడు రాజ్యం కంటే తండ్రిమాటకే విలువ ఇచ్చి అమూల్య ఆభరణ వస్త్రాదులు విసర్జించి ,మనస్పూర్తిగా రాజ్యత్యాగం చేసి, నన్ను అత్తగారు కౌసల్యవద్ద ఉండమని చెప్పాడు .నేనూరుకొంటానా ఆయనకన్నా ముందే అడవికి బయల్దేరాను .ఆయన లేనిది స్వర్గం కూడా నాకు రుచించదు –
‘’సాహం తస్యాగ్రత స్తూర్ణంప్రస్థితా వానచారిణీ‘’నహి మే తేన హీనాయా వాసః స్వర్గే ఫై రోచతే ‘’
ఇంతలో ఈ విషయం తెలిసి రామానుజుడు లక్ష్మణుడు నార బట్టలు కట్టుకొని అన్నతో వెళ్ళటానికి సిద్ధమయ్యాడు .ఇలామేముముగ్గురం ఇది వరకు ఎప్పుడూ చూడని ఘోరారణ్యం లోకి ప్రవేశించాం .మేము దండకారణ్యం లో ఉండగా దుర్మార్గరాక్షసప్రభువు రావణుడు నన్ను అపహరించాడు .వాడు నా ప్రాణం తీయటానికి ఇంకా రెండు నెలలు మాత్రమె గడువు పెట్టాడు .ఆ రెండు నెలలు అయిన మరుక్షణం నేను తప్పక ప్రాణాలు విడుస్తాను ‘’అని చెప్పింది .
ఇది 31 శ్లోకాల 33వ సర్గ .
హనుమ సీతకు యెంత టూకీగాజరిగిన రామ చరిత్ర చెప్పాడో అంతే టూకీ గా సీత హనుమకు అప్పటివరకు జరిగిన తన కథ చెప్పింది .రెండు నెలలో ఏదో మార్పు రాకపోతే తనప్రాణాలు నిలవవు అని గట్టిగానే చెప్పింది .సూక్ష్మ గ్రాహులు సీతా ,హనుమలు .ఒకరు చెప్పింది ఇంకొకరు స్పష్టంగా అర్ధం చేసుకో గలరు .ఇక కాగలకార్యం ఫలవంతంగా తీర్చాలి ఎవరు యెట్లా అనేది సస్పెన్స్.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-20-ఉయ్యూరు