కటార్ దేశం ఆసియాలో అరబ్ పెనేన్సులా దేశం .ఇసుక ఎడారులు ,పెర్షియన్ గల్ఫ్ ఉన్న దేశం .బీచెస్ ,డ్యూన్స్-ఇసుక దిబ్బలు ఆకర్షణ .రాజధాని –దోహా ఆకాశ హర్మ్యాలకు ,ఆధునిక ఆర్కిటెక్చర్ కు లైం స్టోన్ మ్యూజియం ల నిలయం .కరెన్సీ –కటార్ రియల్ .28లక్షల జనాభా .సున్నీలు 90శాతం .సేఫ్ దేశం .అత్యధిక వ్యక్తిగత ఆదాయమున్న దేశం .మద్య నిషేధం ఉన్నది .అరబిక్ భాష అన్నిటికీ .
కటార్ దేశ సాహిత్యం 7వ శతాబ్ది ఐబాన్ అల్ ఫూజా అనే జానపద హీరో ,రచయితబడౌనిలో రాసిందే ప్రారంభం .1950లో సాధారణ విద్య అమలు అయ్యాక చిన్నకథలు ,తర్వాత నవలలు వచ్చాయి .స్త్రీలు కూడా రచనలు చేయటం ఆధునికకాలం లో వచ్చింది .18వ శతాబ్దిలో అబ్దుల్ జల్లి అల్ తబటబాయ్,మహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ ఉతెయమీన్ కవిత్వం రాశారు తబతబాయ్ రాసిన కవిత – For you God will suffice against
the pangs of separation from your dead ones,
Your longing and pining is like a fire burning
in your heart
Your longing is not hidden,
A longing for the southern wind.
తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చి ముద్రణ జరిగింది .19వ శతాబ్దిలో అహ్మద్ బిన్ యూసఫ్ అల్ జబెర్ ,అబ్దుల్ రహ్మాన్ బిన్ కసామి అల్ మావ్డా లు మత రాజకీయ కవిత్వం రాశారు .ఆరబ్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ ను స్తుతిస్తూ కూడా రాశారు .1950లో దేశం లో మోడరన్ ఆర్ట్ ఉద్యమం వచ్చి ,ఆయిల్ డబ్బు పిచ్చగా పెరిగి జీవిత ,జీవన విధానం మారి విద్యా సక్తి కలిగింది .జాతీయ అస్తిత్వ స్పృహ వచ్చింది .స్త్రీల సాంఘిక ఉన్నతి జరిగింది .సాహిత్య సంస్థలు జర్నల్స్ వచ్చాయి .ఇతర దేశాల సాహిత్య సంపద ఇక్కడా వ్యాపించింది .1969మొదటి మేగజైన్ ‘’దోహా మేగజైన్ ‘’వచ్చింది .అబ్దుల్లా ఆల్ నిమ వారపత్రిక తెచ్చాడు .సంస్కృతీ వ్యాప్తికోసం ‘’అల్ అరుబా ‘’పత్రిక వచ్చింది .ఇప్పటికి సుమారు 20పీరియాడికల్స్ ఉన్నాయి ‘
21వ శతాబ్దం లో కూడా కవిత్వం రాసి మెప్పించినవారిలో షేక్ ముబారక్ బిన్ సైఫ్ అల్ధాని,అసల హల్నామా ,అజర్ అహ్మద్ అజర్ .స్త్రీలలో కలితాం జబెర్ ,హెస్స అల్ అవధి ,జకియా మాల్ అలా ఉన్నారు .తాని రాసిన కవిత దేశ జాతీయ గీతం గా 1966లో గౌరవం పొందింది .1970లో యూసఫ్ నిమా కథా సంపుటి ‘’డాటర్ ఆఫ్ ది గల్ఫ్ ‘’ ,’’మీటింగ్ ఇన్ బయ్రుట్ తెచ్చాడు .కల్తం జబెర్ మొదటి కదా సంపుటి 1978లో రాసిన మహిళ.ఈ కథలలో కటార్ మహిళలు సాంఘిక సాంస్కృతిక వ్యాప్తికి తోడు పడటం ఉంటుంది .ఫాతిమా టర్కీ’’ఉమ్ అక్థం’’మారుపేరుతో మహిళా హక్కు ఉద్యమం నిర్వహించి రచనలతో చైతన్యం తెచ్చింది .దేశం మహిళల పట్ల చూపుతున్న ఉదాసీనతను ఎండగట్టింది .
శు ఆ ఖలీఫా ఆమె సోదరి దలాల్ ఖలీఫా మొదటి నవలా రచయితలు .1933లో మూడు నవలలు పాసేజ్ టు ట్రూత్ ,దిఓల్డ్ డ్రీమ్స్ ఆఫ్ ది సి ,దిమిత్ ఆఫ్ దిమాన్ అండ్ దిలేక్రాసి ముద్రించారు .తర్వాత 2000లో మరో నాలుగు రాశారు .వీటిలో ఆడవారు ఎదుర్కొనే సాంఘిక పరిమితులు ,పాత సంప్రదాయాలలో రావాల్సిన మార్పులు ,ఆయిల్ గనుల రాకతో సొసైటీ లో వచ్చిన గణనీయమైన మార్పులు చర్చించారు .తర్వాతకాలం లో స్వీయ చరిత్రలు వచ్చాయి .అందులో తమగురించే కాక సమాజం దేశం విషయాలుకూడా రాసుకొన్నారు .రాచాకీయనవలలు కూడా రాసినవారిలో ఆహ్దాన్ అల్మనాఫీ-ది ఏమ్బ్రేసేస్ ఆఫ్ ఎక్సైల్ ,ఫాజి షహీద్ అల ఇస్లయ ఫై అల్ఖలీజ్ –దిమార్టీర్ ఆఫ్ రిఫార్మ్ ఇన్ గల్ఫ్ ,జమాల్ ఫిజి 2013లో రాసిన ‘’మడ్ ఫోం’’కొన్ని పుస్తకాలు నిషేధానికి గుఅరయ్యాయి .
చారిత్రాత్మక కటార్ నవలా రచయితలు –అబ్డులజీజ్ మహమోద్ ,ఇస్సా అబ్దుల్లా .మొదటి ఆయన 2011లో రాసిన ‘’అల్ కర్సన్ ‘’కనకవర్షం కురిపించింది .ఇందులో పర్షియన్ గల్ఫ్ లో బ్రిటిష్ ప్రభుత్వ రాజకీయ పైరసీ ఉంటుంది ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డ్ అయింది .ఈసా అబ్దుల్లా 2013లో రాసిన ‘’సజిరాన్స్ ట్రెజర్ ‘’చారిత్రిక నవల వచ్చింది .కటార్ ప్రభుత్వం ‘’కటారా ప్రైజ్ ఫర్ అరెబిక్ నావెల్ ‘’2014లో ఏర్పాటు చేసి 2లక్షల డాలర్ల డబ్బు అందిస్తోంది .2015జూన్ లో 12మంది కటారి మహిళలు ,8మంది పురుషులు కలిసి 39నవలలు రాసి ప్రచురించారు .దేశం లో నవలలకే అగ్రస్థానం .మరో 6గురు నవలామణులూ నవలలు రాశారు .చాలా సాహిత్య సంస్థలు ఏర్పడి సాహిత్య పోషణ చేస్తూ విలువైన బహుమతులతో ఉత్సాహం కలిగిస్తున్నాయి .
92-టిమోర్ –లెస్ట్ దేశ సాహిత్యం
టిమోర్ లెస్ట్ లేక ఈస్ట్ టిమోర్ దేశం ఆగ్నేయ ఆసియాలో కోరల్ రీఫ్ లతో ఉంటుంది రాజధాని-డిలి.జనాభా 13లక్షలు .కరెన్సీ –అమెరికా డాలర్. పోర్చు గీస్ ,టేటున్ లు అధికారభాష లు. నేరాలు బీదరికం ఎక్కువ .సేఫ్ కాదు ,వర్జిన్ మేరీ విగ్రహం ఆకర్షణ .కేధలిక్ మతం .
టిమోర్ సాహిత్యం క్సనానా గుస్మావో అనే టిమోరీ నాయకుడు రాసిందే .రిపబ్లిక్ అయ్యాక కవిత్వం రాయటం మొదలైంది ‘’పోయెట్రి ఈజ్ ఎ సీరియస్ మాటర్ ‘’అన్నాడు ఆదేశ కవి ఏబ్ బెరెటో. అక్షరాస్యత 50శాతం ఉండటం వలన రచయితలు నెట్ లో బ్లాగ్స్ ఏర్పాటు చేసి రాయమని కోరాడు Words can heal and also can hurt people’’అన్నాడు .సమాజగాయాలను మాన్పటానికి ,ఉపశమనం కలిగించటానికి రాయమని కోరాడు .సమస్య పరిష్కారంగా ఉండాలేకాని సమస్యలను సృస్టించేవిగా రచనలు ఉండకూడదు ఆన్నాడు .రచయితలు ‘’సోల్ కీపర్స్ ‘’గా ఉండాలి .కనుక ఆదేశ హృదయానికి మనసుకు హాయి కలిగించేవి రాయమని కోరాడు .ఇది లాండ్ ఆఫ్ క్రోకడైల్స్ .కనుక జాగ్రత్తగా లేకపోతెరచయితలకు ప్రమాదమే అనీ హెచ్చరించాడు
ఈదేశపు కొన్ని ముఖ్య పుస్తకాలు ,రచయితలు –ది క్రాసి౦గ్-లూయీ కార్డోసో,,ఫును-జోస్ రామోస్ ,’’ఈఫ్ యు లీవ్ అజ్ హియర్ వుయ్ విల్ డై—జియోఫ్రి బోహింసన్ ,యాన్ ఎ క్స్త్రే మెస్-లింద్సి హిలూసం ,ది బ్రేవో వన్స్ –జాన్ బర్మింగ్ హాం ,బిలవ్డ్ ల్యాండ్ –గార్డెన్ పీక్
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-20ఉయ్యూరు –