ప్రపంచ దేశాలసారస్వతం
93-మాల్దీవుల సాహిత్యం
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ దక్షణ ఆసియాలో చిన్న ఐలాండ్ .శ్రీలంక ,ఇండియాలకు ఆగ్నేయంలో ఉంటుంది .రాజధాని –మాలె.కరెన్సీ –మాల్దీవియన్ రుఫ్ఫియ .జనాభా సుమారు 5లక్షల 16వేలు .సున్ని ముస్లిం దేశం .భాషలు –ధివేహి జాతీయ భాష .అరెబిక్ ,ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .ఆదాయ వనరులు –ఫిష్ ప్రాసెసింగ్ ,టూరిజం ,బోట్ బిల్డింగ్ ,కొబ్బరి ప్రాసెసింగ్ ,దుస్తులు చేతిపరిశ్రమాలు .
మాల్దీవియాన్ సాహిత్యం మొదట్లో రాగిరేకులపైన 12వ శతాబ్ది నుంచి ఉన్నది .లోమఫాను అనేది అత్యంత ప్రాచీన గ్రంథం .
ఆధునికకాలం లో హుసేన్ సలాఉద్దీన్’’షియా రతున్నభవియ్యాయ ‘’ మత గ్రంథం రాశాడు .కవి అడ్డూ బండేరిహసన్ మలికుఫాన్ ను ఆదేశ అత్యున్నత కవిగా భావిస్తారు .ఇతని గ్రంథం –దియోగే రైవారు.ఇతర ప్రముఖ కవులలో ఏదుర్ ఉమ్రావ్ మాఫైకలి గేఫాను ,మహమ్మద్ అమిన్ ,అసయ్యిదు బోడు ఫెన్ వాల్తుగే సీధీ .
మరి కొందరు రచయితలలు -]
- H. Salahuddin
- Bodufenvalhuge Sidi
- Saikuraa Ibrahim Naeem
- Maulavi M.I. Umari
- U. Easa
- A. Sadiq
- H.H. Habeeb
- F. Nahula
- A. Husain
- A. Faiza
- Ali Musthafa
- Ibrahim Shihab
- Mohamed Amin Didi
నౌషాద్ వహీద్ ,ఇబ్రహీం హుసేన్ ,సైకురా ఇబ్రహీం నయీం లు 20వ శతాబ్ది వారు .
21వ శతాబ్దం లో –జెన్నిఫర్ లతీఫ్ ,అలీ రఫీక్, ఇస్మాయిల్ ఖిలత్ రషీద్
94-సైప్రస్ దేశ సాహిత్యం
రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తూర్పు మధ్యధరాలో చిన్న ఐలాండ్ .రాజధాని –నికోషియా .కరెన్సీ .–యూరో .జనాభా -12లక్షలు మతం .ఆర్ధడాక్స్ చర్చి మతం .అధికారభాషలు –గ్రీక్ టర్కిష్ .సామాన్యులు సైప్రియాటిక్ టర్కిష్ మాట్లాడుతారు .టూరిజం సిమెంట్ జిప్సియం కెమికల్స్ కలప వగైరా ఆదాయ వనరులు .గ్రీకులున్న ప్రాంతం బాగా సంపన్నం ..
సైప్రస్ దేశ సాహిత్యం ను సైప్రియట్ సాహిత్యం అంటారు మొదట అంతా గ్రీక్ లోనే రాయబడింది .తర్వాత టర్కిష్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ లోనూ వచ్చింది .ఎపిక్ ‘’సిప్రియా ‘’క్రీ.పూ 7వ శతాబ్ది ది .దీన్ని స్టాన్సి నస్ రాసినట్లు భావిస్తారు .మధ్యయుగంలో అస్సైజెస్ ఆఫ్ జెరూసలెం స్థానిక మాండలికం లో రాయబడింది .ఇది 1531లో ఇటాలియన్ లోకి తర్జుమా అయింది .ఇతర దేశాలో లాగానే చరిత్ర అంతా క్రానికల్స్ లోనే ఉన్నది .16వ శతాబ్దిలో ఫ్రాన్సిస్కో పెట్రార్కా ‘’’పోయెమ్స్ డి అమర్ ‘’ను మధ్యయుగ గ్రీకులో రాశాడు .
ఆధునిక సైప్రస్ కవులుగ్రీక్ లోనే రాశారు వీరిలో ఒస్మాన్ టర్కే,ఒజ్కేర్ యాసిన్ ,నేసె యాసిన్ వగైరాలు .నారా నడ్జారియాన్ సైప్రస్ లో పుట్టినకవి .సేవ్ గుల్ ఉలు డగ్ – ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ ,రొమాంటిక్ కవిత్వం లో దిట్ట .ఆండ్రియాస్ కౌమి,మిరండా హోప్లరోస్ ,స్టీఫెన్ లాటన్ ,క్రిష్టిలేఫ్టేరి,స్టెల్ ప్రోవియస్ మొదలైనవారు ఇంగ్లిష్ లోనూ రాశారు .ఇతర’ రాశాడు దేశీయులూ రచనలు చేశారు .లారెన్స్ డూరెల్ సైప్రస్ లో 1952-56కాలం లో ఉంటూ ‘’బిట్టర్ లె’మన్స్’’నవలరాసి సెకండ్ డఫ్ కూపర్ ప్రైజ్1957లో పొందాడు .గ్రీస్ దేశ నోబెల్ ప్రైజ్ విన్నర్ గ్లోర్గాస్ సెఫెరిస్సైప్రస్ దేశం పై విపరీతమైన అభిమానం తో ‘’సైప్రస్ వేర్ ఐ ఆర్డైన్డ్’’నవల ఇక్కడ డిప్లొమాటిక్ పనిలో ఉంటూ రాశాడు .ఇక్కడి విక్టోరియా హిస్లావ్ 2015లో ‘’ది సన్ రైజ్ ‘’నవల రాశాడు .
సోడి జోన్స్ ‘’అవుట్ కాస్ట్’’నవల గొప్ప విజయం సాధించి ఆరంజ్ ప్రైజ్ పొందింది .కోస్టా ఫస్ట్ నవల అవార్డ్ కూడా పొందింది .ఈమె ‘’స్మాల్ వార్స్ ‘’నవల సంచలనమే సృష్టించింది .ప్రేమ ఫామిలి సెంటిమెంట్ ,డ్యూటీ వగైరాలు ఉంటాయి .నికి మరంగౌ –‘’ఎజౌల్ ‘’నవల రాసింది .ఇది ఇతరభాషానువాద౦ కూడాపొందింది .ఆ దేశ చరిత్రలోమరుగునపడిన సగం విషయాలు బయటకు తెచ్చిన నవల .దిఐలాండర్ అండ్ గర్ల్ నవలారచయిత్రి నారా నోద్జరాన్ తన ఆర్టిస్టిక్ టేలెంట్ పుష్కలంగా చూపింది .ది డైరీ ఆఫ్ ఇన్ ఫిడిలిటి నవలాకారిణి-ఏమిలోస్ సొలోమో ఒక అబ్బాయి ముగ్గురమ్మాయిల ప్రేమకథ ఉత్సుకత కలిగేట్లు రాసింది
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-20-ఉయ్యూరు