కిర్జిస్తాన్ అనే కిర్జి రిపబ్లిక్ దేశం మధ్య ఆసియాలో పర్వతాల నడుమ ఉన్నదేశం .ఉత్తరాన కజకిస్తాన్ పడమర ఉజ్బెకిస్తాన్ ఉంటాయి .రాజధాని –బిష్ కెక్.కరెన్సీ –కిర్జిస్తాన్ సోం.జనాభా 63లక్షలు .అధికారభాషలు –కిర్జిగ్ ,రష్యన్ .సున్ని ముస్లిం దేశం .వ్యవసాయం మినరల్స్ వనరులున్న మధ్యతరగతి దేశం .ఇక్కడి లేక్ ఇస్సికుల్ ను ‘’ది పెరల్ ఆఫ్ సెంట్రల్ ఏసియా ‘’అంటారు .
కిర్జి సాహిత్యం 19వ శతాబ్దిలోనే ప్రారంభమైంది .మోల్డో నియాజ్ ఇక్కడి ప్రాచీన కవిత్వం ఓల్డ్ క్రీజ్ లో రాయబడింది .ఇందులోంచే మౌఖిక సాహిత్యం తరతరాలుగా వ్యాప్తి చెందింది .కొన్ని ముఖ్య రచనలు రచయితలగురించి తెలుసుకొందాం
1-ది ఎపిక్ ఆఫ్ మనస్ 2-ఖోజో జష్ లఘు ఎపిక్
3-ది డే లాస్ట్స్ మోర్ దాన్ ఎ హండ్రెడ్ యియర్స్ నవలను ను చిన్గిజ్ అట్మ టోవ్ 1980లోరాశాడు .దీనికి ప్రేరణ బోరిస్ పాస్టర్ నాక్ కవిత ‘’యునిక్ డేస్’’.ఇందులో ప్లాట్లు సబ్ ప్లాట్లు ఉన్నాయి .ఒక అమెరికన్ మరొక రష్యన్ వ్యోమగాముల అనుభవాల గురించి సైన్స్ ఫిక్షన్ .
ప్రముఖ రచయితలు-చిన్గిజ్ అల్మటోవ్-రష్యన్ నుంచి ఈ భాషలోకి అనువాదాలు చేశాడు .పోస్ట్ వార్ జనరేషన్ వాడు. ది డే లాస్ట్స్ మోర్ దాన్ ఎ హండ్రెడ్ ఇయర్స్ ను పోఎటిక్ లెజెండ్ అంటారు .ఇందులో రష్యన్ సామ్రాజ్యం నుంచి దేశం రిపబ్లిక్ గా మారటం విషయం .నక్కలతో సావాసం పై అనేక కథలున్న సంపుటి .దిప్లోమాట్ అయిన ఈయన ఏ డిఫికల్ట్ పాసేజ్ ,ఫేస్ టు ఫేస్,జమిలా టేల్స్ ఆఫ్ మౌన్ టెన్స్ అండ్ స్టెప్పర్స్ ,ది వైట్ స్టీం షిప్ వగైరా రాశాడు .
జాన్ మమిటోవ్ –లవ్ సాంగ్స్ బాగా రాశాడు .సోవియెట్ అవార్డ్ ,జాతీయ అవార్డ్ పొందాడు .10దాకా కవితా సంపుటులు ఫిక్షన్ రాశాడు .అనువాద పుస్తకాలు ఏడు రాశాడు .
అలికిల్ ఒస్మనోవ్ –కవి కవిత్వాన్ని ఆధునీకరించాడు .సెక్యులర్ ధీమ్స్ ఎక్కువగా రాశాడు .స్టాలిన్ ప్రైజ్ విన్నర్ .
ఒక కవిత – Issyk-Kul, Kyrgyzstan, wave-lapped lake
Young girls on our shore much merriment make
Coral bracelets, lost long centuries since
Seem to shine in your depths, and brilliance wake.
ఆలీ టోకో౦ బేవ్-కవి నవలాకారుడు .లెనిన్ ,ఫ్లవర్స్ ఆఫ్ లేబర్ ఎర్లి పోయెమ్స్ ,కవితా సంపుటులు తెచ్చాడు .దినైపార్ ఎంటర్స్ ఇంటూ ది డీప్ సి ,దివూ౦డెడ్ హార్ట్ నవలికలు రాశాడు .1941-45యుద్ధం లో దేశభక్తి సందేశాత్మక కవితలెన్నో గుప్పించాడు .జారిజం –సోవియెట్ పాలన మధ్య కాలం లో బిఫోర్ దిడాన్- 2భాగాలుగా రాసి తన దేశం పడిన దుర్భర జీవితాన్ని చిత్రించాడు .మొత్తం 16పుస్తకాలు రాశాడు .ఆర్డర్ ఆఫ్ లెనిన్ ,ఆర్దరాఫ్ రెడ్ బానర్ ఆఫ్ లేబర్ ,ఆర్డర్ ఆఫ్ బాడ్జ్ ఆఫ్ ఆనర్ పొందాడు
99- కంబోడియా దేశ సాహిత్యం
కంబోడియా ఆగ్నేయ ఆసియాలో గోప్పమైదానాలు ,మెకాంగ్ డెల్టా,పర్వతాలు గల్ఫ్ ఆఫ్ ధాయ్ లాండ్ ఉన్న దేశం.రాజధాని –హోనోం పెన్.కరెన్సీ –కంబోడియా రియల్ .జనాభా –ఒకకోటి 62లక్షలు .బౌద్ధం అధికారభాష .తెరవాద బౌద్ధం అనుసరిస్తారు .టెక్స్టైల్స్,టూరిజం ఆర్ధిక ఆధారాలు .చాలా బీద దేశం .ఒకప్పుడు రక్తపాతం తో తడిసిన దేశం. ఇపుడు ప్రశాంతతకు నిలయం .సోషల్ ఎన్విరాన్ మెంట్ సమస్యలు ఎక్కువ.కుక్క మాంస భక్షకులు .దేశం లో వందకు పైగా డాగ్ మీట్ రెస్టారెంట్స్ ఉన్నాయి .టిషర్ట్ లకు అనుమతి లేదు .బ్లాక్ మార్కెట్ ,దొంగ సారా ,డ్రగ్ నిషేధాలు .
కంబోడియా సాహిత్యం లేక ఖ్మేర్ సాహిత్యంపురాతనమైండి .బౌద్ధ సన్యాసుల అనుమతి తోనే రచనలు చేశారు .కొందరు స్థానిక జానపదాలు రాశారు .ఇవీ బౌద్ధ ప్రభావితాలే .భారతీయ రామాయణ ,మహాభారతాలకు ఆదరణ ఎక్కువ .పూర్వ సాహిత్యం రాళ్ళమీద రాసిందే .ఖ్మేర్ వంశ చరిత్ర వీటి ఆధారంగానే రాయబడింది.పాళీబౌద్ధ గ్రంథాలు ఎక్కువ.వీటిని షుగర్ పాం లీవ్స్ పై సన్యాసులు రాశారు .దేశం లో అనేక ఆరామాలు క్షేత్రాలు ఉన్నాయి .ఖ్మేర్ రోగ్స్ వీటిని నాశనం చేశారు .
రాం కేర్ అంటే రామాయణం ను16వ శతాబ్దిలో కాంబోడియన్ భాషలో రాశారు. దీనినుంచి ‘’రోబన్ శోబన్ మచ ‘’ అనే నాట్య సంప్రదాయం ఏర్పాటు చేసుకొన్నారు .వీటిని బాగా ఆచరిస్తారు .హనుమాన్ దేవాలయాలున్నాయి .రెండవ తోరమచ రాజు -1629-1634 యువత కోసం సాంప్రదాయ కవిత్వం రాస్తే ఇప్పటికీ అనుసరిస్తున్నారు .అనగ్ డువాంగ్ రాజు-1841-60పాలనలోనేకాక గద్యపద్య కవిత్వం లోనూ ప్రసిద్ధుడు .ఇతని ‘కా కేయి ‘’నవలను ధాయ్ లాండ్ లోని సియాం లో చదువుతుండగా రాశాడు సంస్కృతంలో దీని అర్ధం స్త్రీ కాకి .భర్తపట్ల అవిదేయతకల భార్య జానపద కథ ఇది .ఈరాజు రాసిన ‘’పుథిసేన్నియాంగ్ కాంగ్ రెజ్ నవల జాతకకథ ఆధారగా రాసింది .
ఆధునిక సాహిత్యం క్లాసికల్ టెక్స్ట్ ఆన్ విస్డం తో మొదలైంది .1911లో దిడాన్సింగ్ వాటర్ అండ్ ది డాన్సింగ్ ఫ్లవర్ వచ్చాయి .బిమ్బాస్ లామెన్టేషన్ నవల సౌ సేథ్ రాసింది .డావ్ ఎక్ ను 1942 లో నౌ కన్ రాసింది .సమకాలీనం లో సొమాలి మాం ‘’దిరోడ్ టు లాస్ట్ ‘’నవలలో హ్యూమన్ సెక్స్ ట్రాఫికింగ్ నిరసించి,అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఈమెను అనుసరించి చాలామంది రాశారు .ఇతర దేశ సాహిత్య భాషానువాదాలు జరిగాయి .దిఖ్మేర్ రైటర్స్ అసోసియేషన్ పునరుద్ధరించి సాహిత్య పోషణ చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-20-ఉయ్యూరు