సింగపూర్ సావరిన్ రిపబ్లిక్ దేశం ఆగ్నేయ ఆసియాలో ఉన్న సిటి స్టేట్ .జనాభా 56లక్షలు .కరెన్సీ –సింగపూర్ డాలర్ .చాలా ఖర్చు అయ్యే దేశం .ఆగ్నేయ ఆసియాకు సింహద్వారం సింగపూర్ .ఆధునికతకు,పారిశుధ్యానికి ప్లానింగ్ కట్టడాలు రోడ్లకు ఆదర్శం.అన్నిరకాల బహిరంగ విసర్జన నిషేధం .బౌద్ధ హిందూ క్రైస్తవమొదలైన 10మతాలున్నాయి .మత స్వేచ్చ ఉన్నది .జాతీయ భాష –మలై.అన్నిరకాల భాషల వారూ ఉన్నారు .ప్రపంచంలో అఅత్యంత సుస్థిర ఎకానమీ ఉన్న దేశం సింగపూర్ .ఎలెక్ట్రానిక్స్ ,పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఫైనాన్షియల్ సర్వీసెస్, టూరిజం ముఖ్య ఆదాయ వనరులు .
సింగపూర్ సాహిత్యం ముఖ్యంగా మాలే, తమిళ్ ,ఇంగ్లిష్ ,స్టాండర్డ్ మా౦డారియన్ అధికార భాషలలో లభిస్తుంది .ఈమొత్తం సాహిత్యాన్ని’’సింగా ‘’అనే సాహిత్యపత్రికలో ప్రచురించి 1980,1990 లలో ఎడ్విన్ తుంబూ ,కో బాక్ సాంగ్ లు పుస్తకాలుగా ,ఆతర్వాత ‘’ఎ సింగపూరియన్ మిలీనియల్ ఆంధాలజి ఆఫ్ పోయెట్రి ని 2000లో తెచ్చారు .ఇవి మూడుసార్లు మూడు భాషలలో అనువాదం కూడా చేశారు .సింగపూర్ రచయితలు టాన్ స్విహియాన్ ,కువో పావ్ కున్ లు ఒకటికంటే ఎక్కువ భాషలలో రాశారు .సింగపూర్ బిజినెస్ టైం పత్రిక సింగపూర్ రచయితలు హైలీ ఎక్స్ పరిమెంటల్ ‘’అన్నది .అంటే రాసింది వీడియోలుగా ఫోటోగ్రాఫులుగా మారుస్తున్నారు కూడా అని భావం .సొని లేవిస్ రాసిన గ్రాఫిక్ నవల ‘’ది ఆర్ట్ ఆఫ్ చార్లీ చాన్ హాక్ చై ‘’ మూడు ‘’ఐస్నార్ అవార్డ్స్ ‘’అందుకోవటమేకాక ,2017లో బెస్ట్ ఇంటర్నేషనల్ ల్ కామిక్ నవలగా గుర్తింపు పొందింది .
సింగపూర్ చైనాకమ్యూనిటిలోపుట్టిన వారు ఇంగ్లీష్ లో రాయటంతో ఈదేశ సాహిత్యావిర్భావం జరిగింది .టియో పో లెంగ్త్ రాసిన ‘’FMS R’’అనే ఆధునికకవిత 1937లో లండన్ లో ప్రచురితం .తర్వాత వాంగ్ గుంగ్వు 1950లో ‘’పల్స్ ‘’రాశాడు .1965లో స్వతంత్రం పొందాక సింగపూర్ సాహిత్యప్రవాహం పరవళ్ళు తొక్కింది ఎడ్విన్ తుంబోఆర్ధర్ యాప్రోబెరి యియో ,గోపో సెంగ్ .లి జు ఫెంగ్ ,చంద్రన్ నాయర్ ,కృపాల్ సింగ్ లు రచనలు చేశారు .వీళ్ళే మొదటి తరం సింగపూర్ రచయితలు .1980-90కాలం లో సైమన్ టే,లియాంగ్ లియు గేయోక్ కో బక్ సాంగ్ ,హోపో ఫన్ వగైరాలు కవులుగా ప్తసిద్ధి చెందారు .1990సింగపూర్ ఇంగ్లిష్ కవిత్వం వేగం పింజుకోవటమేకాక అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది .వీరిలో బోయే కిం చెంగ్,యాంగ్ షు హూంగ్ ,ఆల్విన్ పాంగ్ ,సిరిల్ వాంగ్ ,గ్రేస్ చియా ,టోపాజ్ వింటర్స్ ,పూజా నాన్సీ ,ఆల్ఫాన్ బిన్ సయాట్ ఉన్నారు
ఏషియన్ సిరీస్ పేరిట అనేక ఆ౦థాలజీలూ వచ్చాయి .హిస్టారికల్ ఆంథా లజి ఆఫ్ సింగపూర్ 2009లో ఆన్జేలియా పూన్ ఫిలిప్ హాల్డేన్,షి ర్లి గియోక్ లిన్ లిం ల సంపాదకత్వం లో వచ్చింది .ఇటీవల బాలసాహిత్యమూ వేగంగా వస్తో౦ది .దిడైరీ ఆఫ్ ఆమోస్ లీ ను ఎదేలిన్ ఫూ ,ది ఎలేలిఫెంట్ అండ్ ది ట్రీ –జిన్ పిన్ ,థోర్ దిగ్రేటెస్ట్ –డాన్ బాస్కో ,ప్రిన్స్ బేర్అండ్ పాపర్ బేర్ –ఎమిలి లిం రాశారు .జెస్సీ వీ ను పయనీర్ ఆఫ్ చిల్డ్రెన్ లిటరేచర్ అంటారు .ఈమె రాసిన ‘’మూటీ మౌస్ ‘’సిరీస్ ప్రసిద్ధమైనది .పాట్రీషియ మేరియా, టాన్చియా హీర్న్ చెక్ ,హో మైన ఫాంగ్ లూ బాల సాహిత్యం పండించారు
కవి గో పో సెంగ్ నాటక,నవలా రచయితకూడా .రాబర్ట్ యియో ఆరు నాటకాలు రాశాడు .కువో ఆర్టిస్టిక్ డైరెక్టర్ దియేటర్ పునరుజ్జీవనం చేశాడు.ఇతని నాటకాలు –ది కాఫిన్ ఈజ్ టూ బిగ్ ఫర్ ది హోల్ ,లావోజు లు క్లాసిక్ నాటకాలు .ఎమిలి ఆఫ్ ఎమరాల్డ్ హిల్ నాటకం రాసిన స్టెల్లా కాంగ్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.టాన్ హౌ పొలిటికల్ సెటైర్ పండించాడు .
గో పో సెంగ్ నవలలలకు ఆద్యుడు .ఇతని ఇఫ్ వుయ్ డ్రీం టూలాంగ్ నవల అచ్చమైన మొదటి సింగపూర్ నవల .కేధరిన్ లిం షార్ట్ స్టోరీలతోలతో బాగా పేరు తెచ్చుకొన్నది -స్టోరీస్ ఆఫ్ సింగపూర్ ,దిలైట్నింగ్ గాడ్ కథా సంపుటులు పాఠ్యాంశాలు గా కూడా చేరాయి .ఈమె నవలలు ది బాండ్ మెయిడ్ ,రాంగ్ గాడ్ హోం లు ప్రపంచ ప్రసిద్ధాలు .జోన్ హాన్ సైన్స్ ఫిక్షన్ రాసింది .స్టార్ సఫైర్ కు హై కమండేషన్ అవార్డ్ లభించింది .రెక్స్ షెల్లీ మొదటినవల –ది ష్రిమ్ప్ పీపుల్ కు నేషనల్ బుక్ ప్రైజ్ వచ్చింది .ఈమె ఐలాండ్ ఇన్ దిసెంటర్ ,రివర్ ఆఫ్ రోజెస్ నవలలో సౌతీస్ట్ ఆసియాలో యురేషియన్ కమ్యూనిటి గురించి రాసింది దీనికీ అవార్డ్ వచ్చింది .హ్వీహ్వీ టాన్ తన కాస్మోపాలిటన్ అనుభవాలను హ్యూమరస్ గా రాసింది .స్టాండ్ ఎలోన్ ,సిటి ఆఫ్ స్మాల్ బ్లెస్సింగ్స్ ఇటీవలవచ్చిన కథాసంపుటాలు .నవనాటకకర్తలలో ఫిత్ నెగ్ ,జోయెల్ టాన్లుకాస్ హో వగైరా ఉన్నారు .2010లో సెరీన్ టియో,క్రిస్టిన్ చెన్,బల్లి కౌల్ జస్వాల్ ,రాఖేల్ యంగ్,జింగ్ జింగ్ లీ మొదలైన మహిళా నవలాకారులున్నారు.గొప్ప ప్లానింగ్ లకు సింగ పూర్ ఆడర్శమైనట్లే అక్కడి రచనలూ ఆదర్శం గా ఉండటం విశేషం .
మనవి – 11-12-19న ‘’ప్రపంచ దేశాల సారస్వతం ‘’శీర్షికతో ఆస్ట్రియా దేశ సాహిత్యం రాయటం మొదలు పెట్టాను .వీలైనప్పుడల్లా ఒక్కో దేశ సాహిత్యం రాశాను .20దేశాలవరకు ఏదో ఆషా మాషీగా రా రాశానేమో .12-3-20 వరకు ఆ ఇర్వి దేశాలగురించే రాయగలిగా .ఆతర్వాత గాప్ వచ్చి 12-3-20 న 21వ ఆర్టికల్ అరబ్బీ దేశ సాహిత్యం మొదలుపెట్టి 30 వ దేశం చిలీ దేశ సాహిత్యం దాకా రాశాను . కొంచెం నిదానంగా రాస్తున్నానేమోఅనిపించింది ..తర్వాత కరోనా,లాక్ డౌన్ హడావిడి రావటం తో 4-4-20న 31వ ఆర్టికల్ గా నికారుగ్వా దేశ సాహిత్యం రాసి ,వేగం పెంచి 42 దేశాల సాహిత్యం రాసి ,అప్పుడు కొంత ఆలోచనవచ్చి కనీసం 100 దేశాల సాహిత్యమైనా రాద్దాము అనే నిశ్చయం కలిగి మరింత వేగం పెంచి రోజుకు మూడు నాలుగు దేశాలను కవర్ చేసి ఇవాళ 100 వ దేశం సింగ పూర్ దగ్గర కామా పెట్టాను .ఇప్పటికి లాటిన్ అమెరికా పూర్తిగా, ఐరోపాలో బ్రిటన్ తప్ప మిగిలిన దేశాలు, ఆసియాలో చైనా తప్ప చాలాదేశాలు రాయటం పూర్తయింది .ఇంకాకొన్ని రాయాలి. అక్కడో గంతు,ఇక్కడో గంతుగా ఆస్ట్రేలియా ,ఆఫ్రికాలో కొన్ని దేశాలగురించీ రాశాను .
అసలుఇలా ఈ దేశాల సాహిత్యం రాయాలని అనుకోని వాడిని, రాయటం ప్రారంభించి ,రాయటం మానుకోలేని స్థితికి వచ్చాను .ఇది నా అదృష్టం .సంస్కృత కవుల ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణ౦’’ తర్వాత మేజర్ రచన ఇది .ఇదేదో రిసెర్చ్ వర్క్ అని నేను అస్సలు అనుకోను .నాకు తెలిసిన, తెలుసుకొన్న సమస్త విషయాలు పొందు పరచటమే నేను చేశాను .ఇంకా రాయాల్సింది ఎంతగానో ఉంటుంది .అయితే ఆ దేశాలలో ఆధునిక కాలం లోనూ వచ్చిన రచనలు రచయితలగురించి కూడా రాయగలిగాను .నోబెల్ అవార్డ్ వచ్చిన వారి గురించీ వాకబు చేసి రాశాను.ఒక్కోదేశం లో సమాచారం అత్యల్పం గాదోరికింది అనుకోకుండా అక్కడేదో లింకు దొరికి నాకు ఒకగని లభించినట్లు విషయ సంపద లభించి రాశాను .అంటే ప్రయత్న లోపం ఏమీచేయలేదని మనవి .ఎక్కువ భాగం ‘’గూగుల్ సూతముని ‘’చెప్పిందే వేద వాక్కుగా గ్రహించాను .అవసరమైన చోట్ల మన విజ్ఞాసర్వస్వం నాకు అమితంగా తోడ్పడింది . ప్రతి దేశం జనాభా, భాషలు,అధికార భాష ,మతం , కరెన్సీ ,ఆదాయ వనరులు ,టూరిజానికి ఆకర్షణలు ,రక్షణ ఉందా లేదా కూడా రాశా .ఆ దేశ చిత్రం ,అక్కడి ఒకటిరెండు ముఖ్య ప్రదేశాలు రచయితల ఫోటోలు కూడా జత చేశాను ,ఏతా వాతా నేను చెప్పేది ఏమిటి అంటే – ప్రపంచ దేశాల సాహిత్యం పై అభిరుచి ఉన్నవారికి ప్రాధమిక సమాచారం అందించాను అని మాత్రమే. కావాల్సినవారు దీనిపై ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు ..
ఈ లాక్ డౌన్ కాలం లో ఉదయం 9-30కి కంప్యూటర్ ఎక్కితే మధ్యాహ్నం 1గంటకు దిగి భోజనాదులు ,నిద్ర పూర్తి చేసి మళ్ళీ సాయంత్రం 3లేక 4కు ఎక్కి రాత్రి 7-30దాకా వాయించి ,మధ్యలోసంధ్య పూర్తి చేసి ,రాత్రి భోజనం, కాసేపు టివి అనుభవించి 8లేక 8-30కు మళ్ళీ లాప్ టాప్ఎక్కి సుందరకాండ లో హనుమ వ్యక్తిత్వం రాసి రాత్రి 9-30లేక 10కి మంచం ఎక్కటం బిజీ షెడ్యూల్ అయింది .
అనుకొన్న ‘’శతమానం ‘’పూర్తి చేశానుకనుక ఈరోజు నుంచి ప్రపంచ దేశాల సాహిత్యాన్ని కొ౦చెం స్పీడ్ తగ్గించి రాస్తాను .నా వెంట నడచిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-20-ఉయ్యూరు