బక దాల్భ్యుడు
బక దాల్భ్యుడు -1
వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లున్నాయి కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తాడు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’ ,ధృత రాష్ట్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తాడు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి ఎపిక్ గ్రంథం ధృత రాస్ట్రుని గురించి చెప్పింది కనుక .దీన్ని ఆల్బర్ట్ వెబర్ చాలా కాలం క్రితమే గుర్తించాడు .ఈ కథ మహాభారతం లో ఆ ఆతర్వాత ఇతర పురాణాల లోనూ పేర్కొన బడింది.
పై సంహిత ప్రకారం వక దాల్భ్యుడు నైమిశీయ బృందానికి చెందిన వాడు నైమిశారణ్యం లో యజ్ఞయాగాలు చేసే మహర్షి .ఒక సారి సత్రయాగం చేశాక ,తన వద్ద దక్షణ గా కురు పాంచాలురు ఇచ్చిన 27 యువ వృషభాలను తన బృందం వారికి వారిలో వారిని పంచుకోమని చెప్పి ,ఆ బృందాన్ని వదిలి ,ధృత రాష్ట్ర ,విచిత్ర వీర్యుల వద్దకు అమిత ఆశతో వెళ్ళాడు .రాజు ఏమీ దక్షణ ఇవ్వకుండా, రుద్ర పశుపతి చేత జబ్బు పొందిన ఆవులను ఇచ్చి వెళ్లి పొమ్మన్నాడు .పిచ్చి బాపనయ్య ఆవులు కోల్పోయానే అని బాధపడుతాడు అనుకొన్నాడు రాజు .కాని ‘’వక’’ ఆ పశువులను వండి,అమర్యాదగా ప్రవర్తించిన రాజుకు వ్యతిరేకంగా హోమంలో ఆహుతిచ్చాడు .మర్నాడు ధృత రాష్ట్ర సామ్రాజ్య వైభవం అంతా నశించింది .రాజపురోహిత మంత్రి గూఢచారులు దానికి కారణం వక చేసిన యాగమే అని రాజుకు చెప్పారు .ఆ మర్నాడే అత్యంత ధనరాసులతో వక మునిని సందర్శించి సమర్పించగా .’’నైమిశీయ వక’’, రాజు కోసం మళ్ళీ యాగం చేసి ఒక అన్నం ముద్దను అగ్ని సురభి మత్ కు సమర్పించాడు.రాజు రక్షింప బడ్డాడు .
రెండవ ప్రాచీన గ్రంథాలు ‘’జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణం ‘’లోఛాందోగ్య ఉపనిషత్ లో బక దాల్భ్య ప్రస్తావన కనిపిస్తుంది .రెండిటిలోనూ రెండుసార్లు ప్రస్తావన ఉంటుంది .జాబాలి బ్రాహ్మణం4-6-1 లో’’ రాజాకామ ప్రేణ యజ్ఞేనయక్ష్యమానసా ‘’ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరధుడు తనకోరిక తీరటానికి యాగం చేశాడు.యాగ సమయంలో కురు,పా౦చాల బ్రాహ్మణులకు కర్మకాండ గురించి నాలుగు ప్రశ్నలు సంధించాడు .అందులో మహా వేదవేత్త బక దాల్భ్యుడు కూడా ఉన్నాడు -4-7-2.-‘’కురు పాన్చాలన౦ బకో దాల్భ్యో ఔచణస ‘’ వాటికి అవలీలగా ఆయన సమాధానాలు చెప్పాడు .సంతృప్తి చెందిన భగీరధుడు బక దాల్భ్యుడినే తన యాగానికి నిర్వాహకుడు గా ఎంచుకొని ప్రకటించాడు ,బకుడు ఉద్గీత ను గాయత్ర ఉద్గీత ఆధారం గా గానం చేయగా ,రాజు స్వర్గం చేరాడు -4-8-5’’స హైకరాద్ ఏవ భూత్వా స్వర్గం లోకం ఇయాయ ‘’. బక దాల్భ్యుడు మూడవసారి జాబాలిఉపనిషత్ బ్రాహ్మణం మొదటి పుస్తకం1-3-9 లో వస్తాడు .ఒకేసారి రెండు సోమయాగాలు చేసే సందర్బం అది ,బకుడు ఇంద్రుని బలవంతంగా విరోధి ఐన ఆజకేశినుల నుంచి నెట్టేసి ,తానె ప్రణవం ఉచ్చరించాడు .దీనితో బకా దాల్భ్యుడు సామవేద గానం చేసినవాడు అంటే ఉద్గాత అయ్యాడు .
ఛాందోగ్య ఉపనిషత్ లో 1-12లో కూడా బక దాల్భ్యుడు సామ వేద ఉద్గాత గా కనిపిస్తాడు .ఉద్గాత శునకాల వ్యంగ్య ప్రదర్శనలోనూ ఉన్నాడు .ఒకప్పుడు ఈయన వేద విద్యార్ధిగా ఉంటూ సంచారం చేస్తుంటే కుక్కల బృందాన్ని చూశాడు .అక్కడ ఒక తెల్లకుక్క వద్దకు మిగిలిన కుక్కలుపరిగెత్తుకు రావటం చూశాడు .ఆకుక్కలు తెల్లకుక్కను ఆహారం కోసం పాడమని అడిగాయి -1-12-2-‘’అన్నం నో భగవాన్ ఆగాయతు’’.అప్పుడా తెల్ల శునకం వాటిని మర్నాడు ఉదయం రమ్మని చెప్పింది .బక అక్కడే ఆ రాత్రి అంతా నిరీక్షిస్తూ తెల్లారే వరకు కూర్చుని ఉన్నాడు .మర్నాటి ఉదయం ఆ కుక్కలు వరుసగా వచ్చిఒకదాని తోక ఒకటి పట్టుకొని బ్రాహ్మణులు ‘’బాహిస్పవామన సూత్రం ‘’ఉచ్చరిస్తున్నట్లు గా ఉన్నాయి -1-12-4-‘’తే హ యథై వేదం బహిస్ప వామనేన స్తోస్య మానః సంరబ్ధాః సర్పంతిత్యే ఏవంఆసస్పృహ’’
ఆకుక్కలు కూర్చుని’’ హిం ‘’అనే శబ్దం చేస్తూ అన్నం,నీళ్ళ కోసం ప్రార్ధన గీతం పాడాయి .ఇక్కడే బక దాల్భ్యుని ‘’గ్లవ మైత్రేయ ‘’గా కూడా చెప్పింది -1-12-1 మరియు 1-12-3-తద్ ధ బకోదాల్భ్యో గ్లవవామైత్రేయః ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-5-20-ఉయ్యూరు