బక దాల్భ్యుడు -2
బక దాల్భ్యుని ఇలాంటి అహంకార ధోరణి ఇతరగ్రంథాలలో కూడా కనిపిస్తుంది .పంచ వింశ బ్రాహ్మణం-25-15-,3,షడ్వింశ బ్రాహ్మణం –1-4-6,గోపథ బ్రాహ్మణం -1-1-31లలో అతడి ఆహ౦కార౦ కనిపిస్తుంది .పంచ వింశ లో సర్పయాగం లో గ్లావుడు(గాలవుడు ?) ఉద్గాతకు సహాయకుడు .ఈ సర్ప సత్తా వలన సర్పాలకు ప్రపంచంలో గట్టి పునాది ఏర్పడింది -25-15-2-‘ఏషు లోకేషుప్రత్య తిస్టన్’’.వాటికి మృతువు తప్పి, రహస్యంగా పుట్టల్లో దాక్కొనే బాధా తప్పి,స్వేచ్చగా ప్రాకుతున్నాయి -25-15-4-‘’ఏతేన వై సర్పాఅపమృత్యుం జయంతి-తే హిత్వా జీర్ణం త్వచం అతి సర్పంతి అపహితే మృత్యుం అజయన్ ‘’ఈ సందర్భంలో అనేక పాములపేర్లు వస్తాయి .మహాభారతం లో పాములపై ద్వేషమున్న జనమేజయుడు సర్ప సత్రం చేసినట్లున్నది .ఈ యాగానికి ఇద్దరు ఆధ్వర్యులున్నట్లున్నది .ధృత రాష్ట్ర ఐరావత అనే బ్రాహ్మణుడు కూడా సర్పయాగం చేసినట్లున్నది .ధృతరాష్ట్ర విచిత్ర వీర్య 10-6.
షడ్వింశ బ్రాహ్మణం 1-4-6లో గ్లావ మైత్రేయ సోమగానం ముందు రోజు ఉదయం జ్యోతిస్టో మం మొదలైన కర్మకాండ చేసినట్లున్నది .గ్లావుడు సదస్సులో విశ్వ రూప మంత్రాలు చదివినట్లు ,యాగానికి ముందురోజు రాత్రి ,యాగం రోజు ఉదయాన ఛందస్సులో మంచి చెడు లను వేరుచేశాడు .కనుక ఉద్గాతగా ఉన్నాడను కోవాలి .
గోపథ బ్రాహ్మణం 1.1.31-38 లో మైత్రేయుడికి,సామవేద అనుయాయి గ్లావ మైత్రేయుడికి మధ్య పండిత చర్చ జరిగినట్లు చెప్పింది .ఇందులో గ్లావుడు ఓడిపోయాడు కారణం సావిత్రి ,గాయత్రి ఛందస్సుల ఆధారం చెప్పలేకపోవటమే ,వాటికి స్వర్గం సమానమైనవాటిని వివరించలేక పోవటమే ఓటమికి కారణం .ఈ రహస్యాలన్నీ మౌద్గల్యుడు చెప్పి గెలిచాడు .
ఇప్పడు మనం చెప్పుకున్నవాటన్నిటిలో బక దాల్భ్యుని ఆసక్తికర సమాచారం ఎమీలేదుకాని .కురుపా౦చాల ,నైమిశ సత్ర కూటమిలో ఉన్నాడని సామవేద నిష్ణాతుడు అనీ తెలుస్తోంది .ఛాందోగ్య ఉపనిషత్ 1-2-13ప్రకారం బక దాల్భ్యునికి ఉద్గాత సామర్ధ్యం పుష్కలం గా ఉండి,నైమిశారణ్యంలో ముఖ్య కర్మకాండ మంత్రం గాయకుడుగా ఉండేవాడు –‘’సహా నైమిశీయనాం ఉద్గాత బభూవ ‘’.తర్వాత మంత్రం 1.2.14లో ఓంఅక్షర ప్రాముఖ్యం ,ఉద్గీత ను పరిపుష్టం చేయటం లో దాని పాత్ర వివరణ ఉన్నది .
కేశి దాల్భ్యుడు
వేద గ్రంథాలలో ఇతర దాల్భ్యుల పేర్లు కూడా కనిపిస్తాయి .అందులో కేశి దాల్భ్యుడు ఒకడు .ఈయనపాత్రా కురు పా౦చాల నేపధ్యం ఉన్నదే .కేశి దాల్భ్యుడు పా౦చాలుడు ,బ్రాహ్మణుడు కాదు యాగ యజమాని,క్షత్రియుడు .ఒక్కో సారి రాజుగా కనిపిస్తాడు .ఈయనకు సంబంధించిన గాథలు వేద మంత్రఉచ్చారణ ,శాపాలు గురించే .కర్మకాండలో యదార్ధ కర్మకాండ గురించిన చర్చలలో ఈయన ఉంటాడు .అందులోని రహస్యం స్పష్టంగా విప్పి చెప్పినవారిదే గెలుపు .
జైమినేయ బ్రాహ్మణం 3.312లో కేశి దాల్భ్యుడు తనకు 12రోజుల కర్మకాండ నేర్పిన కబంధ ఆధర్వణుడి మధ్య చర్చ ఛందస్సు మార్పు పై జరిగింది –‘’వ్యూఢ ఛందసం ద్వాదశాహం ప్రవాచ ‘’.ఈ విజ్ఞాన పరీక్షలో పాంచాలురకే విజయం దక్కింది .వారు బీదవారైనా ,వారి జీవన విధానం మిగిలినవారికి బాగా నచ్చింది –తస్మద్ అనాధ్యయామపి ,సారం పాంచాలనాం అభ్యేఏవాన్యేజీవితం ధన్యంతి ‘’.
కబంధ అథర్వణ౦ కేశి ని కర్మకాండ విషయగ్రాహిగా,దాల్భ్యుని అధర్వ వేదం అనుయాయిగా కలిపింది . అథర్వ వేదం లోని మూడు మంత్రాలు 6.75-77 కబంధుని పేర ఉన్నాయి.అంతేకాక ఉపనిషత్ ద్రష్ట గా బృహదారణ్య ఉపనిషత్ చెప్పింది-3.7.1ప్రకారం కబంధ ఏవిధంగా పాంచాల ఆరుణి భార్యను స్వంత౦ చేసుకోన్నాడో చెప్పింది. గ౦ధర్వ రూపంలో ఆమెద్వారా శ్రోతలకు కర్మజ్ఞాన బోధ చేసినట్లున్నది .దీనివలన గంధర్వులకు శక్తివంతమైన కర్మకాండ రహస్యాలు తెలుసు అని అర్ధమౌతుంది .ఇందులో ముఖ్యవిషయం రెండు ప్రపంచాలను వాటిలోని సకల జీవరాసులను సూత్రం చేత ఒకదానితో ఒకటి బంధించటం ఉన్నది .నిర్దేశికుడైన అంతర్యామి ఈ మూడు సత్తామాత్రాలను నియంత్రిస్తాడనీ తెలుస్తుంది .
గోపథ బ్రాహ్మణం లో కబంధుని కొడుకు విచారి పేరు రెండు సార్లు వస్తుంది .మొదటి అధ్యాయం 1.2.10లో కొడుకుఆకలి గొన్నవాడిగా చెప్పింది .రెండవ చోట 1.2.18 విచారిని కర్మకాండ నిష్ణాతుడిగా ,మదించి పొగరుతో ఉన్న పెంకె గుర్రాన్నిశాంత్యుదక పవిత్ర జలం తో సాధువుగా మార్చినవాడి గా చెప్పింది –.ఆ గుర్రమే అగ్నాధ్యేయం కు అవసరమైనది .ఈ గుర్రాన్నే భయంకర జలంనుంచి వాక్ ద్వారా సృష్టించారు .ఇందులో బక దాల్భ్య కథకు జైమినేయ అశ్వమేధ కథకు దూరపు సంబంధం కనిపిస్తుంది .ఒక అహంకార బ్రాహ్మణుడు పాండవులకు అలవికాని యాగాశ్వాలను శాంతిపరచటం ,పోయిన ఆ యాగాశ్వాలు తిరిగిలభించటం సమానమైన కథలు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-20-ఉయ్యూరు