చైనా భాష –దాదాపు 3వేల ఏళ్ళపై నుండి వాడుకలో ఉన్నది .లిపి పూర్తిగా ధ్వన్యాత్మకం కాక ,భావాత్మకంగా నూ ఉంటుంది .ఇప్పుడు చైనాలో చాలా మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి .అవి ఇతర ప్రాంతాలవారికి అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది .భాష కాలక్రమంలో వివిధ వికృతులు పొందింది .అలాంటి మా౦డనలీకాలలో వూ , ,యోహ్ ,మీన్ ,క్వాన్హ్వా ముఖ్యమైంవి .. క్వాన్హ్వా కు ‘’మండారిన్ ‘’పేరు పాశ్చాత్యులు పెట్టారు .దీనినే 30కోట్లకు పైగా చైనీయులు మాట్లాడుతున్నారు .అయిదింట నాలుగు ప్రాంతాలభాష ఇదే .ఉత్తర ప్రాంత మాండలికం ‘’క్వోయూ ‘’అనే జాతీయభాష ను ఇప్పుడు చైనా అంతటా జాతీయ భాషగా వాడుతున్నారు .అడునికకాలం లోనూ దీనిలోనే రాస్తున్నారు .అంతకు ముందు ‘’వెన్ -లీ ‘’అనే భాష ప్రామాణిక భాషగా గుర్తింపు పొంది అందులోనే రచనలు చేసేవారు .
చైనా భాషలో పొట్టి అచ్చులు ,వాటి దీర్ఘాలు కాకుండా ,మూడు అచ్చులు కలిగిన మిశ్రమ ధ్వనులున్నాయి మొత్తం మీద 21అచ్చులు ,23హల్లులు ఉన్నాయి డ,ద,బ,త,గ హల్లులు లేవు .హల్లుమీద స్ట్రెస్ ఎక్కువైతే అవి ప్రత్యేకాక్షరాలుగా భావిస్తారు భారతీయ ఒత్తు అక్షరాలలాగా ఉచ్చరించరు.
ఇండో –యూరోపియన్ ,సెమెటిక్ ,ద్రావిడ మొదలైన భాషా కుటుంబాలకు ఉన్న వ్యాకరణం ఈ భాషకు లేనేలేదు .వాక్యంలో స్థానాన్ని బట్టి ఒకసారి ఒక భాషా భాగంగా మరో సారి ఇంకొకభాషాభాగంగా గుర్తిస్తారు.సంబంధ వాచక సర్వనామాలు లేవు .కాలాన్ని బట్టి క్రియలో మార్పులూ రావు .క్రియకు ముందు గతకాలం లేక గతదినం పదాన్ని కలిపి భూతకాలం గుర్తిస్తారు .మర్నాడు రాబోయే కాలం క్రియ ముందు పెట్టటం వలన భవిష్యత్కాలం గుర్తిస్తారు .
చైనా లిపి ‘’చిత్ర లిపి వర్గం ‘’కు చెందింది .రోజు వారీ వ్యవహారాలలో ఉండే కొన్ని వస్తువులకు ,భావాలకు మౌలిక సంకేతాలు ఇచ్చారు .వీటిని కలిపి కొత్త పదాలకు గుర్తులు ఏర్పాటు చేస్తారు .దాదాపు 5వేల గుర్తులను గుర్తు ఉంచుకు౦టేనేకాని చైనాభాష కొరుకుడు పడదు .ఈ లిపి ధ్వన్యాత్మకం కాదు కాబట్టి ఉద్దేశించబడిన భావం విశాల చైనాలో ఏ మూల మాండలికం మాట్లాడే వాళ్ళకైనా అర్ధమౌతుంది .ఇల ఈ లిపి చైనా జాతి ఐక్యతను ఘనంగా కాపాడుతోంది .ఇంతకస్టమైనా చైనీయులు ఇష్టంగా నేర్వటం విశేషమే .ఈ లిపి కుడి వైపు నుంచి కిందికి రాయటం ప్రత్యేకత కూడా .
చైనీయ సాహిత్యం –సజీవ ప్రపంచ భాషలలో అత్య౦త ప్రాచీన సాహిత్యం చైనీయ సాహిత్యానికి ఉన్నది .ఒక్కో యుగం లో వచ్చిన సాహిత్య ప్రక్రియలను బట్టి యుగ విభజన చేశారు .ఆదియుగం ,కన్ఫ్యూషియన్ యుగం ,బౌద్ధ టావో మతప్రభావ యుగం ,కావ్యోల్లాస యుగం ,సారస్వత సంపన్నతా యుగం, నవలారూపక యుగం ,ప్రామాణిక గ్రంథ యుగం ,ఆధునిక యుగం
1- ఆదిమ యుగం –క్రీ.పూ .1523-క్రీశ 1027-కాలం లో చైనాపాలకులు షాంగ్ –ఇన్ వంశ రాజుల కాలం లో మొదటి సారిగా రెండు రచనలు –హిష్ చింగ్ –గీతాలు,షూచింగ్ –ఇతిహాస పత్రాలు లలో గేయాలు, నీతులు ఉన్నాయి. ఈ వంశం తర్వాత చౌ రాజవంశ౦ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసింది. సుస్థిర పాలనా అందించింది .ఈ కాల సాహిత్యం లో ఎక్కువ భాగం ‘ఇ-చింగ్ ‘’అనే మార్పులకూర్పు సంకలన గ్రంథంలో దొరుకుతుంది .క్రీపూ 771నుంచి రాజవంశప్రతిభతగ్గి కొన ఊపిరితో కొట్టుకొంటూ క్రీపూ 3వ శాతాబ్దిదాకా దేకింది .ఈ క్షీణ యుగం లో దేశం అనేక సామంత రాజ్యాలుగా విభజింపబడింది .పేరుకు చౌ సామ్రాట్టులు ఉన్నా ,అధికారమంతా సామంత ప్రభువులదే .వీరు భోగలాలస ,ద్వేషాలతో ఉన్న్నాసాహిత్య వ్యాప్తికి తోడ్పడ్డారు .ఈయుగ తాత్విక గ్రంథ రచయితలుగా లావ్ జూ ,కన్ఫ్యూ షియస్,మోజూ ,మెంగ్ జూ ,షూన్ జూ లు ప్రసిద్ధులు .తాత్విక పితామహుడు అని పేరు పొందిన ‘’లావ్ జు ‘’రచించిన ‘’లావ్ జూ టావ్-టే చింగ్ ‘’గ్రంథంలో మంచి మార్గాలలో నడవటం దానివలన కలిగే మేళ్ళు చక్కగా వివరించాడు .ఇతనికంటే చిన్నవాడు కన్ ఫ్యూషి యస్ హేతువాదనలో ఉన్న గొప్పతనాన్ని మానవులకు నచ్చ చెప్పిన మహనీయుడు .ఈయన రాసిన –లూన్ యూ –ప్రవచనాలు ,టాశ్యూహ్-మహా విద్య ,చుంగ్ యుంగ్ –మధ్యే మార్గం లలో ఆయన ఉపదేశాలన్నీ దర్శించవచ్చు .మోజూ’’విశ్వ ప్రేమ ‘’బోధించాడు .మెంగ్ జూ కన్ఫ్యూ షియస్ మార్గం లో నడిచాడు .తనపేరుతో రాసిన ‘’మెంగ్ జూ’’గ్రంథం కన్ఫ్యూ షియస్ రచనలతోపాటు ప్రజాదరణ పొందటం విశేషం .ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ,నిర౦కుశ రాజులను కూల ద్రోయటం ,ప్రజలకున్న సర్వహక్కులు గురించి ఇందులో వివరంగా రాశాడు .వీరికి భిన్నమైన వాడు –శూన్ జూ.తాత్విక కవి. తనపేరు మీదనే ఒక పుస్తకం రాసి వాస్తవికతకు ,నీతి తో జీవన విధానం మొదలైనవి పొందుపరచాడు .చక్కని శైలితో మహా ఆకర్షణీయంగా రాయటం ఇతడి నేర్పు .ఇంతటి ప్రతిభ లేకపోయినా ,షాంగ్ యాంగ్ ,హాన్ ఫై లు కూడా గుర్తింపదగిన వారే .రాజనీతి గురించి రాసిన వీరి పుస్తకాలు ప్రజలను ఆకర్షించాయి .వీరంతా క్రీపూ -500-200కాలం వారు .ఎల్లో రివర్ (పీతనది )ప్రాంతవాసులు .అప్పుడే యాంగ్ ఛీ నదీ ప్రాంతం మరొక సాహిత్య కేంద్రంగా వికశించింది .ఈ కేంద్రకవులలో –చూయ్వాన్ ,చాంగ్ చౌ లు ప్రసిద్ధులు .వీళ్ళు ‘’ఫూ ‘’అనే వృత్త గ్రంధి గద్యం లో రాశాడు పాడటానికి వీలుగా ఛందస్సు ఉండటం దీనికి ఆకర్షణ .చూయ్వాన్ రాసిన ‘’లీ చావ్’’లో దుఖానుభూతి రమ్యంగా ఉంటుంది .చ్యాంగ్ చౌ ఆధ్యాత్మికస్వేచ్చా ప్రచారానికి ,చమత్కార హాస్యాలకు కవిత్వాన్ని బాగా ఉపయోగించాడు .
క్రీ.పూ .200నాటికి సామంతరాజుల హవా తగ్గి చిన్ రాజ్య వంశీకుడు ఒకడు ఐక్యత సాధించి ఏకత్వ సామ్రాజ్యాన్నిస్థాపించాడు .’’షిహ్ హ్వాంగ్ టీ’’అంటే’’ ప్రథమ సార్వ భౌముడు ‘’అనే బిరుదు పొంది నా, సాహిత్యానికి ఆమడ దూరం .పైగా కన్ఫ్యూషియస్ మతవాదం పై ఒంటి కాలిమీద లేచేవాడు .ఆరచనలన్నీ ద్వంస౦ చేసిన త్రాస్డుడు..వీడుచాచ్చాక అరాజకమేర్పడి ‘’ల్యూపాంగ్ ‘’అనే సామాన్య పౌరుడు తిరుగుబాటు చేసి ,శాంతినెలకొల్పి చివరికి తానే చక్రవర్తి అయ్యాడు .ఈ వంశమే ‘’ హ్యాన్ వంశం’’ .క్రీపూ 200నుంచి దాదాపు నాలుగు శతాబ్దాలకాలం రాజ్యమేలింది .వీరికాలం లో మళ్ళీ చైనీస్ సాహిత్యం వికసి౦చింద.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు .