బక దాల్భ్యుడు -4
పై పేర్లలో కేశి సత్యకామి పేరు కేశి దాల్భ్య విషయంలో చాలా సార్లు వస్తుంది .కథక సంహిత -30.2ప్రకారం ద్వాదశాహం ,గురించి అందులోని ప్రతి ని గురించిన చర్చల్లో ఉన్నాడు .అందులో చివర ‘’వంశ వ్రశ్చన’’అంటే వేణువుకు గాట్లు పెట్టటం ఉన్నది .దీన్ని కేశి దాల్భ్యుడు చేశాడు .లుసాకపి ఖార్గలి ఏవిధంగా కేశి ‘’వంశ వ్రశ్చన’’పాంచాలుర ను మూడు రెట్లు పెంపు చేసింది వివరించాడు.పంచ వింశ బ్రాహ్మణం -17.4లో కూడా లుసాకపి పేరు వ్రాత్యఖండం లో వస్తుంది.ఇందులో అతడు జ్యేష్ట వ్రాత్య నిపుణ బృందాన్ని శపించినట్లున్నది . కేశి సత్యకామి పేరు కేశిదాల్భ్య విషయంలో తరచుగా వస్తుంది .తైత్తిరీయసంహిత 2.6.2.3ప్రకారం కేశి దాల్భ్యుని యాగానికి సత్యకామి ముఖ్య నిర్వాహకుడు .ఇతడు కేశి దాల్భ్యుని వ్యతిరేకులను జయించటానికి 7పాదాల ప్రత్యేక ‘’శక్వారి ‘’మంత్రాలు చదువుతానని వాగ్దానం చేశాడు .మైత్రేయ సంహిత -1.6.5.ప్రకారం అగ్ని హోత్రం, అగ్జ్న్యా ధ్యేయం విషయం లో మళ్ళీ ఈ ఇద్దరూ కనిపిస్తారు.కాని వారిపాత్రలు నిర్దుష్టంగా లేవు.కాని సత్యకామి ,కేశి తో తామిద్దరూ కలిసి ఒకప్పుడు అగ్ని హోత్రుని భోజన శక్తిని అగ్న్యా ధ్యేయం ద్వారా తగ్గించిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు .
ఈ ఇద్దరితో పాటు ఆశ్వత్తి పేరుకూడా వస్తుంది .జైమిని బ్రాహ్మణం -1.285 ఆశ్చర్యంగా ఇద్దరు కేశి ల పాత్రలు మారుతాయి .కేశి ,ఆహీనస్ ఆశ్వత్తిలు క్షత్రియ సత్యకామతో పోటీపడతారు .వీరిలో కేశి చిన్నవాడు ,ఆశ్వత్తి పెద్దవాడు .ఇద్దరూ బ్రాహ్మణులే .ఆహీనసుడు సత్యకామికి పురోహితుడు .అయినా అనుష్టుప్ ఛందస్సులో తనకున్న పరిజ్ఞానం బట్టి కేశి దాల్భ్యుడు క్షత్రియ హృదయం ఆకర్షించి ఆహీనసుడి నుండి లాగేసుకొన్నాడు .పాత్రలు మారినా కేశి చిన్నవాడైనా మొదట్లో విజయం సాధించాడు -3.312.కర్మకాండ పరిజ్ఞానమే విజయ నిర్ణయం కనుక కేశి దాల్భ్యుడు విజేత అయ్యాడు .
బృహత్ సార సంహిత 18.26లో పాంచాలుర యాగానికి కురు బ్రాహ్మణ కుమారులు వ్రాత్య దాడి గా వెళ్ళారు .పెద్దలకు అగ్నిస్టోమం ,చిన్నవారికి ‘’ఉఖ్త్యా ‘’చెప్పబడినాయి .కథ ప్రారంభానికి ముందు దేవతలు, దేవ వ్రాత్యులు రెండు యాగాలకు పేర్కొనబడ్డారు. కురు బృందం తమ స్తపతి ‘’ఔపోదితి గౌపాలాయన ‘వైయాఘ్ర పద్య కేశి దాల్భ్యుని ఉపవసత అగ్ని వద్దకు ఎలా వచ్చాడో భూ వ్రాత్యుడు వివరించాడు .మర్నాడు వారు పాంచాలురు అప్పటికే చేస్తున్న యాగం లో జోక్యం కలిగించుకొని ‘’బహిస్పవమాన ‘’తో పవిత్రులమౌదామనుకొన్నారు .చివరికి వ్రాత్య చెప్పిన దానికి ఆధార విషయం చెప్పలేక కురు బృందం ఓడిపోయింది .ఈ ప్రశ్న సంధించిన వాడు పా౦చాల బ్రాహ్మణ కుమారుడు .దీనితో ఈ యాగ నిష్ణాతుడు’’ గంధర్వాయన వాలేయ అగ్ని వేస్య’’ కురు బృందాన్ని శపించి ,వారి దండయాత్రకు అనుమతించిన పెద్దలను హెచ్చరించాడు .వీళ్ళు ఊరుకొంటారా వీళ్ళూ గంధర్వాయన ను శపించారు .ఈ వృత్తాంతం లో కేశి పాత్ర ముఖ్యమైనదికాదు.కాని వ్రాత్యబృందం కార్యకలాపాలు మళ్ళీ పాంచాలురు,ఒకరిపై ఒకరు పోటీగా చేసిన యాగాలలో తెలుస్తాయి .ఏతా వాతా తెలిందేమిటిఅంటే కేశిదాల్భ్యుడు వ్రాత్య బృందాలతో కూడా సంబంధమున్నవాడు అని .
ఇవేకాక కేశి విషయం లో అనేక ఆసక్తికర విషయాలున్నాయి .కేశిదాల్భ్యుని ఎక్కడా బకదాల్భ్యునిలాగా సామవేద నిష్ణాతుడు అని ప్రత్యేకించి చెప్పలేదు .కొన్ని సందర్భాలలో వేదగానం పోటీ పడటానికే కాక ప్రత్యేకత కూడా ఉన్నది .పంచ వింశ బ్రాహ్మణం 10.8.లో ‘’వార వంత్య సామం ‘’సోమ పురుష రూపంతో కేశి దాల్భ్యునికి దర్శనమిచ్చింది .కాని మంత్రోచ్చారణ లో నిర్దుస్టత లోపించింది అని చెప్పగా కేశి తనప్రక్కనే హవిర్ధాన బండిలో ఉన్న’’ఆలమ్మ పరిజ్ఞాత’’ ను ‘’వార వంత్య’’సామ గానానికి తన ఉద్గాత గా ఎంచుకొన్నాడు –‘’అలమ్మ పరిజ్ఞాతమ్ పశ్చా దక్షం సాయనం’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు