బక దాల్భ్యుడు -5
జైమినేయ ఉపనిషత్ బ్రాహ్మణం 3.29-31ప్రకారం కేశి దాల్భ్యునికి తనమేనమామ ‘’ఉచ్చ్శ్రైస్వవస కౌపాయేయ ‘’మరణం తర్వాత కస్టాలు మొదలయ్యాయి.దుఖోప శమనం కోసం వేటకు అరణ్యాలకు వెళ్లి,అక్కడ మేనమామ ప్రేతాత్మను చూశాడు .ఆయన మేనల్లుడి విచారం పోగొట్టి అదృశ్య మంత్ర శక్తిని బోధించి దేవలోకానికి పంపటానికి వచ్చాడు.అందుకోసం సోమయాగం చేసి మంచి ఉద్గాతను ఎంచుకోమన్నాడు .అలాగే 12రోజుల యాగం మొదలుపెట్టి ‘’వ్యూధ ఛందస్’’మంత్రాలు ఉచ్చరించటానికి తగిన వాడికోసం తిరిగి స్మశానం లో పడిఉన్న ‘’ప్రాత్రదభాల్ల ‘’ ను చూశాడు –‘’స్మశానే వా వనే వావృతి శయనం ఉపాధవయాం చకార .’’అతడు అదృశ్యమంత్రోచ్చారణ నిర్దుష్టంగా చేయగలడని అతడినే తనయాగానికి ఉద్గాతగా ఎంచుకొన్నాడు కేశి దాల్భ్యుడు .ఈ కొత్తవాడిని కురుపాన్చాల బ్రాహ్మణులు అంగీకరించక ‘’కస్మా ఆయం ఆలం ‘’అంటే ఎవరి మంచికోసం అని ప్రశ్నించారు .కేశి అతడినే ఎంచుకొని ‘’తగినట్లు మంత్రోచ్చారణ చేయగలవాడు ‘’అనే అర్ధం వచ్చేట్లు ‘’ఆలమ్యైలా జ్యోద్గాత ‘’అని పేరుపెట్టాడు .ఆలం మహ్యం – అలమ్మ అయింది –ఆలం ను వై మహ్యం ఇతి తద్ అలమ్మస్యాల మత్వం ‘’.
ఈ కొత్త వాడిని కురుపాన్చాల బ్రాహ్మణులు ఒప్పుకోలేదు .కనుక ఇప్పుడు కర్మకాండ నిష్ణాతులమధ్య పోటీ యే కానిఇక్కడ యజమానులమధ్యకాదు అని తెలుస్తోంది .ఈకథలలో ముఖ్య విషయం అలాంటి నిష్ణాతుడు స్మశానం ,సుదూర సముద్ర దీవి లలో సోమ రధం ప్రక్కన ఉన్న గొడ్డలి దగ్గర కనపడటం సామాన్య విషయం . వీళ్ళు అచేతన స్థితిలో కనపడటం కూడా గుర్తించదగిన విషయం .బకుడు కళ్ళు మూసుకొని ధ్యానం లో ఉంటె ప్రత్రాడ ,అలమ్మలు నేలపై పడి ఉన్నారు .
కేశి దాల్భ్యుని వృత్తాంతం బంగారు పక్షి కథలో కూడా వస్తుంది .కౌశీతకి బ్రాహ్మణం 7.4జైమిని బ్రాహ్మణం 2.53-54,వాధూలస 37లో కూడా ఉన్నది .కౌశికతమ్ లో ‘’హిరణ్మయ శకునం ‘’అంటే బంగారుపక్షి ఎగురుకొంటూ కేశి దాల్భ్యుని దగ్గరకు వచ్చి తనకు పవిత్రీకరించుకోవటం ఎలాగో తెలియదు అని చెప్పింది –‘’అదీక్షితో వా అసి ‘’.తనకు ఆ రహస్యం తెలుసుకాని ఆహూతులను పాడైపోకుండా ఉంచటం ఎలాగో తెలీదన్నది .అప్పుడు ఇద్దరూ ఒకరికి తెలిసిన రహస్యజ్ఞానం మరొకరికి తెలుపుకొన్నారు .ఈ రహస్యాన్ని తాను శిఖండియజ్ఞాసేన రుషి నుంచి గ్రహించానని స్వర్ణపక్షి చెప్పింది .కౌశిక బ్రాహ్మణం 7.4.1.దీక్షలోఉన్న సాంకేతికత ,తర్వాత ఇచ్చిన ఆహూతులు పాడుకాకుండా కాపాడుకోవటం చెప్పింది -‘’సక్రదిస్టస్యా క్షితిః’’.జైమినేయం లో ‘’ఇస్టాపూర్తస్యాక్షితిం’’అని ఉన్నది.
ఇదే కథవేరొక చోట మరో రక౦గా ఉంది .జే.బీ .2.53లో కేశి దాల్భ్యుడికి ప్రతిష్ట జ్ఞానం తెలీక దర్బలు ,ఆకులు మధ్య కూర్చుని దీక్ష చేశాడు –‘’కేశిహా దాల్భ్యో దర్భ పర్ణ యోర్ దిదీక్షే’.అప్పుడు పక్షి వచ్చి తాను పూర్వ పా౦చాలరాజు కేశికి ముందు ,ఇప్పటిరాజు సుత యజ్ఞసేన అని చెప్పింది –‘’అహం ఏతస్యై విషస్త్వత్పూర్వో రాజాసం ;.ఆపక్షి మొదలుపెడుతూనే కేశిని ‘’శూని ‘’అంటే వ్యభిచారి,తిరుగుబోతు గా సంబోధించగా మండి తాను పూర్వం పంచాలరాజు నని ,వయసులో పెద్దవాడినని ,దీక్షలో ఉన్నాననిచెప్పాడు తర్వాత విషయం అంతా ఇది వరకుకథల్లోలాగానే .
వాధూలస 37లో సుత్వ యజ్ఞసేన తాను పూర్వ శ్రంజ రాజు నని,దీక్ష విధానం తెలుసునని ,నాశనం కాకుండా ఉండే విధానం తెలియదని చెప్పి బంగారు పక్షిగా మారి ఆహూతులను తినటానికి కేశి దగ్గరకు వచ్చి పాన్చాలయువరాజా –‘’కేశి పాన్చాలరాజో యువతారా ‘’అని పిలిచి,ఇద్దరూ ఒకరికి తెలిసిన రహస్యజ్ఞానం మరొకరికి అందజేసుకొన్నారు .ఇప్పటిదాకా చెప్పుకొన్న కేశి దాల్భ్యుడు క్షత్రియరాజు అని అర్ధమౌతోంది .
బకదాల్భ్యుడు మాత్రం- యాగ నిష్ణాతుడైన బ్రాహ్మణుడు .మరొక చోట బకుని వ్యతిరేకులు అజకేశినుల బృందం .ఇక్కడ జరిగిన క్విజ్ లో బకలేక గాలవ గ్లావ్యమైత్రేయ ఓడిపోతాడు .వేదకాలం తర్వాత బక,కేశి లపేర్లు రాక్షసుల లో కనిపిస్తాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-20-ఉయ్యూరు